ramanarao
-
ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే ఎంసెట్ పరీక్షా కేంద్రాలు
హైదరాబాద్ : ప్రైవేట్ విద్యాసంస్థలు నిరాకరించడంతోనే తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్ష వాయిదా పడిందని ఆ పరీక్ష కన్వీనర్ రమణారావు వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లో సాక్షి విలేకరితో ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు. ఎంసెట్ పరీక్ష నిర్వహణ కోసం ఇంజినీరింగ్‌కు 1, 45, 000 మెడికల్‌కు 105,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే ఎంసెట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. -
సినీనటి జమున భర్తకు ప్రముఖుల నివాళి
-
జమున భర్త జూలూరి కన్నుమూత
నేడు పంజాగుట్టలో అంత్యక్రియలు పక్షి శాస్త్ర నిపుణుడిగా ప్రసిద్ధుడు కృష్ణ జింకను కాపాడేందుకు అవిరళ కృషి జువాలజీ ప్రొఫెసర్‌గా విశేష పరిశోధనలు హైదరాబాద్: వన్యప్రాణులు, పక్షుల సంరక్షణ కోసం విశేష కృషి చేసిన ప్రముఖ పక్షి శాస్త్ర నిపుణుడు, అలనాటి సినీనటి జమున భర్త జూలూరి వెంకటరమణారావు (87) ఇక లేరు. సోమవారం సాయంత్రం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని తన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య జమునతోపాటు కుమారుడు వంశీ, కూతురు స్రవంతి ఉన్నారు. బాబు అమెరికాలో, స్రవంతి తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. జూలూరి అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం పంజాగుట్ట శ్మశానవాటికలో జరుగుతాయని ఆయన శిష్యులు, బంధువులు తెలిపారు. జువాలజీ ప్రొఫెసర్‌గా విశేష పరిశోధనలు చేసిన ఘనత జూలూరి సొంతం. ఆయన తండ్రి జూలూరి శేషగిరిరావు బ్రిటిష్ హయాంలో విజయనగరం జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. 1940లో హైదరాబాద్‌కు వచ్చిన జూలూరి, ఉన్నత విద్య అనంతరం ఉస్మానియాలో అధ్యాపకులుగా చేరారు. 1964లో జమునను పెళ్లాడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం జువాలజీ విభాగం ఆచార్యులుగా సుదీర్ఘకాలం పనిచేశారు. అంతరించిపోతున్న కృష్ణ జింకను కాపాడుకునేందుకు చివరి క్షణం వరకు కృషి చేశారు. తన ఆర్థిక సాయంతో ఎంతోమందిని ఉన్నత చదువులు చదివించి గొప్ప ప్రతిభావంతులుగా తీర్చిదిద్దారు. అప్పట్లో తనకొచ్చే రూ.3,500 వేతనంలోనే శిష్యులకు రూ.800 చొప్పున ఫెలోషిప్ ఇచ్చి చదివించారు. కృష్ణా, గోదావరి తీరంలో అంతరించిపోతున్న కృష్ణ జింకలపై 30 మంది విద్యార్థులు ఆయన వద్ద పరిశోధనలు చేసి పీహెచ్డీ పట్టాలు అందుకున్నారు. కృష్ణజింకపై తాను రాసిన కవితలను పుస్తకంగా తేవాలని చివరి క్షణంలోనూ పరితపిం చారు. ఆ రంగం లో పలు పుస్తకాలు, వ్యాసాలు రాశారు. కృష్ణజింక, గూడబాతు, నీటి పిల్లులపైనా పుస్తకాలు రాశారు. నవంబర్ 16వ తేదీన జూలూరి 87వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండిందని ఆయన శిష్యుడు డాక్టర్ వాసుదేవరావు కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం సాయంత్రం 4.30 దాకా ఆరోగ్యంగానే ఉన్నారని, 6.30 సమయంలో ఆకస్మికంగా చనిపోయారని చెప్పారు. -
బాబు హయాంలో వర్షాభావమే
హైదరాబాద్ : చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్‌కు వర్షాభావం తప్పదని ప్రముఖ జ్యోతిష్య పండితుడు రమణారావు గురూజీ పేర్కొన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలోనూ ఇది నిరూపితమైందన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రహస్థితిని అంచనా వేసే తాను ఈ విషయాన్ని చెబుతున్నానని రమణారావు ప్రకటించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు మహర్దశ పట్టనుందని, త్వరలో ఆయన ఉప ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పారు. కేసీఆర్‌కు అంతా మంచే : తెలంగాణలో వర్షపాతం కొంత మెరుగ్గా ఉంటుందని రమణారావు తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉన్నంత కాలం అంతా మంచే జరుగుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ అంతర్జాతీయంగా ఓ వెలుగు వెలుగుతుందని చెప్పారు. ప్రధాని మోడీ చాలా అద్భుతాలు చేస్తారు. కానీ, ఆయన్ను పదవి నుంచి దించడానికి వ్యతిరేక శక్తులు బలంగా పనిచేస్తాయన్నారు. -
ఎంసెట్‌ను పకడ్బందీగా నిర్వహించాలి
- ఈ నెల 8వ తేదీ నుంచి హాల్‌టికెట్లు పొందవచ్చు - గంట ముందే సెంటర్‌కు చేరుకోవాలి - నిమిషం ఆలస్యమైనా అనుమతించరు - ఎంసెట్ - 2014 కన్వీనర్ ప్రొఫెసర్ రమణారావు నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్, ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, మెడిసిన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంసెట్)ను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని ఎంసెట్ - 2014 కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు సూచించారు. నల్లగొం డలో ఎంసెట్ నిర్వహణపై సోమవారం స్థానిక ఎన్జీ కాలేజీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంసెట్ నిర్వహణకు జిల్లా కేంద్రంలో 17 ఇంజినీరింగ్ సెం టర్లు, 8 అగ్రికల్చర్, మెడిసిన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 8,500 మంది ఇంజినీరింగ్ అభ్యర్థులు, 4050 అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. ఈ నెల 22వ తేదీన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, అగ్రికల్చర్, మెడిసిన్ మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల న్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించబోరని తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఎంసెట్ వెబ్సైట్ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. నిర్వహణలో ఏలాంటి అక్రమాలకు తావు లేకుండా అన్నిజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీ సుల సహకారం తీసుకుంటామన్నారు. సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి అభ్యర్థులు ఎలాంటి అక్రమాలకు పాల్పడిన కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా మూడుసార్లు, ఆపైన ఎంసెట్‌కు హాజరయ్యే అభ్యర్థులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. హైటెక్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్, ప్రత్యేక అబ్జర్వర్లను నియమించడంతో పాటు, పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.నాగేందర్‌రెడ్డి, 17 మంది పరి శీలకులు, 17మంది చీఫ్ సూపరింటెండెంట్లు, పోలీసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.