బాబు హయాంలో వర్షాభావమే | Babu govt during the monsoon | Sakshi
Sakshi News home page

బాబు హయాంలో వర్షాభావమే

Published Mon, Jul 14 2014 2:52 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

బాబు హయాంలో వర్షాభావమే - Sakshi

బాబు హయాంలో వర్షాభావమే

హైదరాబాద్ : చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్‌కు వర్షాభావం తప్పదని ప్రముఖ జ్యోతిష్య పండితుడు రమణారావు గురూజీ పేర్కొన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలోనూ ఇది నిరూపితమైందన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రహస్థితిని అంచనా వేసే తాను ఈ విషయాన్ని చెబుతున్నానని రమణారావు ప్రకటించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు మహర్దశ పట్టనుందని, త్వరలో ఆయన  ఉప ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

 కేసీఆర్‌కు అంతా మంచే : తెలంగాణలో వర్షపాతం కొంత మెరుగ్గా ఉంటుందని రమణారావు తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉన్నంత కాలం అంతా మంచే జరుగుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ అంతర్జాతీయంగా ఓ వెలుగు వెలుగుతుందని చెప్పారు. ప్రధాని మోడీ చాలా అద్భుతాలు చేస్తారు. కానీ, ఆయన్ను పదవి నుంచి దించడానికి వ్యతిరేక శక్తులు బలంగా పనిచేస్తాయన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement