EAMCET - 2014
-
58 శాతం మేము భరిస్తాం:చంద్రబాబు
-
58 శాతం మేము భరిస్తాం:చంద్రబాబునాయుడు
ఫీజు రీరుుంబర్స్‌మెంట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఏపీకి తానే బ్రాండ్ అంబాసిడర్‌నని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌లో కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థుల మొత్తం ఫీజులో తమ ప్రభుత్వం 58 శాతం ఫీజును రీయింబర్స్ చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం అన్నింటినీ జనాభా ప్రాతిపదికన విభజించిందని, ఆ ప్రకారమే తాము 58 శాతం ఫీజును రీయింబర్స్ చేస్తామని పేర్కొన్నారు. మిగిలిన 42 శాతం ఫీజులను తెలంగాణ ప్రభుత్వం భరించాలని అన్నారు. ఈ ప్రకారం చేస్తే ఏపీ ఖజానాపై రూ.4 వేల కోట్ల భారం పడుతుందని చెప్పారు. మానవ వనరుల అభివృద్ధిపై చంద్రబాబు గురువారం తన నివాసంలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఫీజు రీయింబర్స్మెంట్, స్థానికత.. ప్రతి అంశాన్నీ వివాదం చేయటం సరికాదు. వీటిపై తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నా. త్వరలో సీఎంకు లేఖ రాస్తా. స్థానికత నిర్ధారించేందుకు చట్టాలున్నాయి. 1956కు ముందు తెలంగాణలో ఉన్న వారే స్థానికులనటం సరికాదు. 10ఏళ్లు విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలు జరపాలని విభజన చట్టంలో ఉంది. దాన్ని.. అమలు చేయాలి.. ఏపీకి ప్రత్యేకంగా బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎవరు లేరు. నేనే బ్రాండ్ అంబాసిడర్‌ను’ అని వ్యాఖ్యానించారు. -
మెడిసిన్‌లో మెరికలు
వారు లక్ష్యం పెట్టుకున్నారు. ఇందుకు రాత్రి పగలు కష్టపడి చదివారు.అనుకున్నది సాధించారు.ఎంసెట్ (మెడిసిన్‌విభాగం)లో ప్రతిభ చాటి ఉత్తమ ర్యాంకులు తెచ్చుకొని కలలను సాకారం చేసుకోబోతున్న జిల్లాకు చెందిన పేద, మధ్యతర గతి విద్యార్థులు. నంద్యాలరూరల్.. పట్టణంలోని డేనియల్ పురంకు చెందిన పి.సాయినాగరక్షిత్ ఎంసెట్ మెడిసిన్ విభాగంలో 154 మార్కులతో రాష్ట్రస్థాయి 64వ ర్యాంకు సాధించాడు. ఉపాధ్యాయులైన విజయశేఖర్, నాగకుమారిల మొదటి సంతానమైన సాయిరక్షిత్ 10వ తరగతి స్థానిక బాలాజీ కాంప్లెక్స్‌లోని కేశవరెడ్డి స్కూల్లో చదివాడు. విజయవాడలోని శ్రీచైతన్య నారాయణలో ఇంటర్ విద్యను పూర్తి చేశాడు. పదవ తరగతిలో పదికి పది జీపీఏ, ఇంటర్లో 967మార్కులు సాధించాడు. అదే విధంగా ఎంసెట్‌లో 154 మార్కులు సాధించి 64వ ర్యాంకు సాధించి నంద్యాలకు గర్వకారణంగా నిలిచాడు. డాక్టర్ కావాలనే పట్టుదలతో చదివానని సాయినాగ రక్షిత్ తెలిపాడు.ఈ విద్యార్థికి పలువురు పట్టణ ప్రముఖులు మంగళవారం అభినందించారు. కర్నూలు(విద్య).. మాది కోడుమూరు. నాన్న వి. శ్రీనివాసులు ఓ ప్రైవేటు సంస్థలో వాటర్‌ట్యాంక్స్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. అమ్మ రాజేశ్వరి గృహిణి. నాకు అక్క, తమ్ముడు ఉన్నారు. నేను పదవ తరగతిలో 560 మార్కులు, ఇంటర్లో 976 మార్కులు తెచ్చుకున్నాను. మొదటి ప్రయత్నంలో ఎంసెట్‌లో 6,500 ర్యాంకు రావడంతో లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. ఇప్పుడు 142 మార్కులతో 455వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. మెడిసిన్ పూర్తి చేసి న్యూరాలజిస్టు కావాలన్నదే నా లక్ష్యం. వెలుగోడు.. మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంసెట్ ఫలితాల్లో సత్తాచాటారు. ఇందులో వెలుగోడు పట్టణానికి చెందిన జె.సుంకన్న, జె.లుథియా దంపతుల కుమారుడు జె. సుమియోన్ మెడిసిన్‌లో 757 ర్యాంకు సాధించాడు. ఈ విద్యార్థి 1 నుంచి 5వ తరగతి వరకు వెలుగోడు పట్టణంలోని లిటిల్ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు నవోదయ పాఠశాలలో విద్యను అభ్యసించాడు. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని శ్రీగాయిత్రి కళాశాలలో చదివి 962 మార్కులు తెచ్చుకున్నాడు. మొదటి ప్రయత్నంలోనే ఎంసెట్‌లో 757ర్యాంకు సాధించడంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుమియోన్ తండ్రి బోయరేవుల గ్రామ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. అలాగే అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన వంగాల వెంకటకృష్ణారెడ్డి, నాగేశ్వరమ్మ దంపతుల కుమారుడు వంగాల సతీష్‌కుమార్‌రెడ్డి ఎంసెట్‌లో 1491ర్యాంకు సాధించాడు. ఈ విద్యార్థి 1 నుంచి 10వ తరగతి వరకు నంద్యాలలో శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివాడు. ఇంటర్మీడియట్ విజయవాడ చైతన్య కళాశాలలో చదివి 960 మార్కులు సాధించాడు. తర్వాత ఎంసెట్ రాసి మెడిసిన్‌లో మంచి ర్యాంకు తెచ్చుకున్న ఈ విద్యార్థి పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. మెడికల్‌లో డెరైక్టర్స్ అకాడమీ విజయకేతనం కర్నూలు(విద్య): ఎంసెట్-2014 ఫలితాల్లో కర్నూలులోని డెరైక్టర్స్ అకాడమీ విజయకేతనం ఎగురవేసినట్లు సంస్థ డెరైక్టర్లు చంద్రశేఖర్, భోగేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. మంగళవారం స్థానిక కొత్తబస్టాండ్ వద్ద ఉన్న డెరైక్టర్స్ అకాడమీలో మెడికల్ సీట్లకు ఎంపికైన విద్యార్థులను వారు అభినందించారు. ప్రారంభించిన మొదటి బ్యాచ్‌లో మొత్తం 68 మంది విద్యార్థుల్లో 12 మంది మెడికల్ సీట్లు సాధించారని తెలిపారు. సురేఖ అనే విద్యార్థిని 142 మార్కులతో 455 ర్యాంకు తెచ్చుకుందని చెప్పారు. అలాగే కీర్తి 1110, ఉషశ్రీ 1134, జె. సుమన్ 1916, రామ్‌రాజేష్ 2618, పాల్గిడియాన్ 2920, ఎ. దివ్య 4215, బీకే మల్లీశ్వరి 5782, కె. సునీత 6638, సాయిశిరీష 5469, శ్రీలత 11,179 ర్యాంకులు సాధించినట్లు వివరించారు. -
జూన్ 9న ర్యాంకులు
* ఎంసెట్ కన్వీనర్ వెల్లడి * పరీక్షకు 94 శాతం విద్యార్థుల హాజరు * 24న ప్రాథమిక కీ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2014 ర్యాంకులను జూన్ 9న వెల్లడిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమణరావు తెలిపారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో ప్రవేశాల కోసం గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు మొత్తంగా 94.34 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్ష రాసేందుకు 3,95,670 మంది దరఖాస్తు చేసుకోగా 3,73,286 మంది హాజరయ్యారని వెల్లడించారు. ఒక్క ఇంజనీరింగ్‌లోనే 2,82,815 దరఖాస్తు చేసుకోగా 2,66,895 (94.37 శాతం) మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో 1,12,855 మంది దరఖాస్తు చేసుకోగా 1,06,391 (94.27 శాతం) మంది హాజరయ్యారని వివరించారు. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని ఈనెల 24న విడుదల చేస్తామని పేర్కొన్నారు. దానిపై ఈనెల 31 వరకు అభ్యంతరాలు స్వీకరించి జూన్ 9న ర్యాంకులను వెల్లడిస్తామని తెలిపారు. విజయవాడలో అత్యధికంగా హాజరు: ఎంసెట్‌లో మెడికల్ పరీక్షకు విజయవాడలో ఎక్కువ మంది విద్యార్థులు (98.25 శాతం) హాజరయ్యారు. ఇంజనీరింగ్‌లోనూ విజయవాడలో 96.26 శాతం మంది పరీక్ష రాశారు. ఇంజనీరింగ్‌లో తక్కువ హాజరు శాతం ఆదిలాబాద్‌లో (88.31%) నమోదైంది. అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో తక్కువ హాజరు శాతం విజయనగరంలో (88.09%)నమోదైంది. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌లో 91.67%, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో 95.09% హాజరు నమోదైంది. కఠినంగా మ్యాథ్స్ పేపర్..: ఎంసెట్ ఇంజనీరింగ్ సబ్జెక్టులో మ్యాథ్స్ ప్రశ్నలు కొంత కఠినంగా వచ్చాయని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. గురువారం జరిగిన ఎంసెట్ పరీక్ష అనంతరం ఇంజనీరింగ్ రాసిన విద్యార్థులు తమకు సమయం సరిపోలేదని తెలిపారు. మ్యాథ్స్‌లో సమస్యలు పెద్దవి ఇవ్వడం.. ఫార్ములా ప్రకారం వాటిని లెక్కించి రాసేందుకు సమయం సరిపోలేదని వెల్లడించారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ అభ్యర్థులకు మ్యాథ్స్ ఉండదు కనుక ఇంజనీరింగ్‌కు ఎక్కువ సమయం ఇవ్వాల్సిందన్నారు. మ్యాథ్స్‌లో సమస్యలు పెద్దవి ఇవ ్వడం వల్ల ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లకు టైం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎంసెట్ ప్రశాంతం
ఇంజినీరింగ్‌లో 95.86శాతం అభ్యర్థులు.. మెడిసిన్, అగ్రికల్చర్‌కు 94.87శాతం అభ్యర్థుల హాజరు నిమిషం నిబంధనతో ఉరుకులు పరుగులతో పరీక్షా కేంద్రాలకు.. కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం నిర్వహించిన ఎంసెట్- 2014 వరంగల్ రీజియన్‌లో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన ఇంజి నీరింగ్ ప్రవేశ పరీక్షకు 14,321 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 13,728మంది అభ్యర్థులు(95.86శాతం) హాజరయ్యారు. 593మంది గైర్హాజరయ్యారు. మొత్తం 23 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 36మంది అబ్జర్వర్లుగా విధులు నిర్వర్తించారు. మధ్యాహ్నం 2:30గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పది పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సు ప్రవేశ పరీక్షకు మొత్తం 6,664 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. 6,322మంది (94.87శాతం)హాజరయ్యారు. 342మంది గైర్హాజరయ్యారు. పరీక్షకు 18మంది అబ్జర్వర్లుగా విధులు నిర్వర్తించారు. ఒక్క నిమిషం నిబంధన ఉండడంతో చాలామంది అభ్యర్థులు సమయానికంటే ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. మరికొందరు అభ్యర్థులు ఉరుకులు పరుగులతో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. హాల్‌టికెట్లతోపాటు అప్లికేషన్‌ను కూడా డౌన్లోడు చేసుకుని ఫోటో పెట్టుకుని రావాలని కొన్ని పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు చెప్పడంతో కొందరు అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. చివరికి హాల్‌టికెట్‌తోనే అభ్యర్థులను అనుమతించారు. కుల ధ్రువీకరణ పత్రాలను కూడా తీసుకున్నారు. వీటిని వెంట తీసుకురాని అభ్యర్థులు ఆ తర్వాత ఎంసెట్ కన్వీనర్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్ కాలేజీ పరీక్షా కేంద్రంలో కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు, ఎంసెట్ రీజనల్ కోఆర్డినేటర్ కేయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ టి.శ్రీనివాసులు తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. వీరివెంట ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.భద్రునాయక్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామానుజరావు ఉన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సాయిలు మాట్లాడుతూ ఎంసెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపినట్టు చెప్పారు. ఉదయం, మధ్యాహ్నం వివిధ పరీక్షా కేంద్రాలను ప్రత్యేక అబ్జర్వర్లు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, కలెక్టర్ జి. కిషన్ పర్యవేక్షించారు. -
ప్రశాంతంగా ఎంసెట్
విజయనగరం రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో గురువారం నిర్వహించిన ఎంసెట్-2014 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు జిల్లాలో 5,228 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 4,712 మంది హాజరయ్యా రు. 516 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదు. విజయనగరం జేఎన్టీయూకే కళాశాలతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీతం ఇంజినీరింగ్ కళాశాల, డెంకాడ మండలం చింతలవలసలో ఉన్న ఎంవీజీఆర్, మోదవలసలోని ప్రావీణ్య ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం ఆరు కేంద్రాల్లో నిర్వహించిన ఇంజినీరింగ్ పరీక్షకు 3,834 మంది హాజరు కావాల్సి ఉండగా 3,484 మంది హాజరై 350 మంది గైర్హాజరయ్యారు. ఇంజినీరింగ్‌లో 90.87 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం నిర్వహించిన అగ్రికల్చరల్, మెడిసన్ పరీక్షకు 1,394 మంది హాజరు కావాల్సి ఉండగా 1228 మంది హాజరై, 166 మంది గైర్హాజరయ్యారు. మెడి సిన్ విభాగంలో 88.09 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు ఎంసెట్ రీజినల్ కోఆర్డినేటర్ జి.యేసురత్నం తెలిపారు. ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్షకు ఒక్క నిమిషమైనా ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు ముందుగా ప్రకటించడంతో అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. జగిత్యాల జేఎన్టీయూ ప్రొఫెసర్ మధుసూదనరావు, జేఎన్టీయూ హైదరాబాద్ ప్రొఫెసర్ ఇంద్రాణి ప్రత్యేక అబ్జర్వర్లుగా వ్యవహరించారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడంతో అభ్యర్థులు బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కొంతమంది అభ్యర్థులు ఆటోలు, మోటారు సైకిళ్లపై పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అభ్యర్థులతో పాటు వచ్చిన తల్లిదండ్రులు, ఇతరులను పరీక్షా కేంద్రాలకు దూరంగా నిలిపివేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ను అమలు చేయడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు ప్రశాంతగా జరిగాయి. అయితే అభ్యర్థులకు తోడుగా వచ్చిన వారు పరీక్ష జరుగుతున్న సమయమంతా ఎండలో ఇబ్బందులు పడ్డారు. అనేక మంది పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉన్న చెట్లు నీడనే ఆశ్రయించారు. అభ్యర్థుల తల్లిదండ్రులు మంచినీటికి ఇబ్బందులు పడకుండా స్వచ్ఛంద సంస్థలు పరీక్షా కేంద్రాల సమీపంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు, మజ్జిగను అందించారు. విజయనగరం పట్టణానికి చెందిన ఉడాకాల నీ సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో ఉచితంగా మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు. -
ఎంసెట్ ప్రశాంతం
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం గురువారం జరిగిన ఎంసెట్-2014 పరీక్ష జిల్లాలో ప్రశాం తంగా ముగిసింది. జిల్లా కేంద్రంతోపాటు శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 కేంద్రాల్లో జరిగిన ఇంజినీరింగ్ విభాగానికి 4,801 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 4,291 (89.38 శాతం) మంది హాజరయ్యారు. 510 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు నాలుగు కేంద్రాల్లో జరిగిన మెడిసిన్ పరీ క్షకు 1658 మందికిగాను 1503 (91.65 శాతం) మంది హాజరయ్యారు. 155 మంది డుమ్మా కొట్టారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేయడంతో విద్యార్థులు ఉరుకులు, పరుగులు తీశారు. పలాస, ఇచ్ఛాపురం, కవిటి, టెక్కలి, సీతంపేట, రాజాం, నందిగాం, హిరమండలం, కొత్తూరు, పాతపట్నం తదితర సుదూర ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి విద్యార్థులు ఆపసోపాలు పడ్డారు. కాగా పరీక్ష ముగిసిన తర్వాత జవాబుపత్రాలను, ఇతర మెటీరియల్‌ను పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ ఇక్కడ నుంచి తరలించారు. 144వ సెక్షన్, పటిష్ట బందోబస్తు ఎంసెట్ పరీక్ష జరిగిన అన్ని కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ను పటిష్టంగా అమలు చేశారు. ముఖ్యంగా మెడిసిన్ పరీక్ష జరిగిన నాలుగు కేంద్రాల వద్ద రెట్టింపు బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రం వద్ద కనీసం ముగ్గురు పోలీసులతోపాటు స్పెషల్ పార్టీకి చెందిన బృందాలు కూడా నిఘా పెట్టాయి. పరీక్ష కేంద్రాల లోపలికి ఆయా కళాశాలలకు చెంది, గుర్తింపు కార్డు చూపించిన సిబ్బందిని మినహా మిగిలిన వారిని పోలీసులు అనుమతించలేదు. గురువారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు చెమటతో తడిసిముద్దయ్యారు. కిక్కిరిసిన హోటళ్లు, బస్సులు సుదూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు భోజనాలు చేసేందుకు ఎగబడటంతో స్థానికం గా హోటళ్లు, రెస్టారెంటులు, టిఫిన్ షాపులు కిటకిటలాడాయి. బస్సులు, ఆటోలు, మాక్సీక్యాబ్‌లు కిక్కిరిపోయాయి. కాగా విద్యార్థులను తరలించేందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను కేటాయించింది. వీటితోపాటు శ్రీ శివానీ, వెంకటేశ్వర, శారద, వైష్ణవి, గురజాడ కళాశాలల యాజమాన్యాలు వివిధ కేంద్రాల వద్ద ఉచిత బస్సులను ఏర్పాటు చేశాయి. ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, డిగ్రీ తదితర కోర్సులను అందిస్తున్న ప్రైవేటు కళాశాలలు తమ కరపత్రా లు (బ్రోచర్లు)ను విద్యార్థులకు అందజేసేం దుకు ఎగబడ్డాయి. హాట్ కేకుల్లా అమ్ముడైన ‘సాక్షి ఎంసెట్’ బుక్లెట్స్ మరోవైపు పరీక్ష కేంద్రాల వద్ద ‘సాక్షి’ ఎంసెట్ ఇంజినీరింగ్, మెడికల్ కౌన్సెలింగ్ పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇంజినీరింగ్, మెడికల్ కౌన్సిలింగ్ సమగ్ర సమాచారాన్ని కేవలం రూ.75తో బుక్లెట్స్ రూపంలో అందించడంతో కోనుగోలు చేసేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎగబడ్డారు. -
ఎంసెట్‌ను పకడ్బందీగా నిర్వహించాలి
- ఈ నెల 8వ తేదీ నుంచి హాల్‌టికెట్లు పొందవచ్చు - గంట ముందే సెంటర్‌కు చేరుకోవాలి - నిమిషం ఆలస్యమైనా అనుమతించరు - ఎంసెట్ - 2014 కన్వీనర్ ప్రొఫెసర్ రమణారావు నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్, ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, మెడిసిన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంసెట్)ను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని ఎంసెట్ - 2014 కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు సూచించారు. నల్లగొం డలో ఎంసెట్ నిర్వహణపై సోమవారం స్థానిక ఎన్జీ కాలేజీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంసెట్ నిర్వహణకు జిల్లా కేంద్రంలో 17 ఇంజినీరింగ్ సెం టర్లు, 8 అగ్రికల్చర్, మెడిసిన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 8,500 మంది ఇంజినీరింగ్ అభ్యర్థులు, 4050 అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. ఈ నెల 22వ తేదీన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, అగ్రికల్చర్, మెడిసిన్ మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల న్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించబోరని తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఎంసెట్ వెబ్సైట్ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. నిర్వహణలో ఏలాంటి అక్రమాలకు తావు లేకుండా అన్నిజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీ సుల సహకారం తీసుకుంటామన్నారు. సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి అభ్యర్థులు ఎలాంటి అక్రమాలకు పాల్పడిన కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా మూడుసార్లు, ఆపైన ఎంసెట్‌కు హాజరయ్యే అభ్యర్థులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. హైటెక్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్, ప్రత్యేక అబ్జర్వర్లను నియమించడంతో పాటు, పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.నాగేందర్‌రెడ్డి, 17 మంది పరి శీలకులు, 17మంది చీఫ్ సూపరింటెండెంట్లు, పోలీసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.