ఇది జిల్లా ఉష్ణోగ్రత కాదు.. ఆయన సాధించిన డిగ్రీల సంఖ్య. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చునేమో గానీ ఆయన సాధనలో అన్నీ హెచ్చులే.
22 డిగ్రీస్
Published Wed, Jan 1 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM
సీటీఆర్‌ఐ (రాజమండ్రి), న్యూస్‌లైన్ : ఇది జిల్లా ఉష్ణోగ్రత కాదు.. ఆయన సాధించిన డిగ్రీల సంఖ్య. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చునేమో గానీ ఆయన సాధనలో అన్నీ హెచ్చులే. నిత్యం వందలమంది రోగులకు వైద్యసేవలందిస్తూ క్షణం తీరికలేకపోయినా చదువుపై మమకారంతో విజయం సాధిస్తున్నారు. వైద్యరంగంలో ఆయన చేసిన సేవలకుగాను ఇటీవల చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రొఫెసర్ వైద్యలింగం జాతీయ సత్కారం అందుకున్నారు. రాజమండ్రిలోని దానవాయిపేటలోని మానస ఆస్పత్రి వైద్యుడు కర్రి రామారెడ్డి లాయరు..జర్నలిస్టు..డాక్టర్..ఇంజనీరు..ఉపాధ్యాయుడు..ఇలా అనేక రంగాల్లో ఎన్నో డిగ్రీలు సాధించారు. ఆయన సాధిం చిన డిగ్రీలు..అవార్డులు..విశిష్టసేవలపై ప్రత్యేక క థనం.
జిల్లాలోని అనపర్తి గ్రామంలో 1954లో రామారెడ్డి జన్మిం చారు. కర్రి వెంకటరెడ్డి, కర్రి మంగాయమ్మ తల్లిదండ్రులు. నాలుగో తరగతి చదువుతున్న సమయంలోనే ఆయన గ్రాహకశక్తిని ప్రదర్శించారు. 1975లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఆయన 1976లో హౌస్‌సర్జన్ పూర్తిచేసి, 1980లో రాజమండ్రిలో మానసిక రోగుల వైద్యాలయం ప్రారంభించారు. 1987 లో యం.ఏ (మాస్టర్ ఆఫ్‌సైన్స్), 1989లో యం.ఏ (పొలిటికల్ సైన్స్), డీసీఈ, 1991లో యంఏ (ఇంగ్లిషు లిటరేచర్), డీఎఫ్‌ఈ, 1994లో యంబీఏ, 2003లో డీఎఫ్‌ఎమ్, 2004లో యంసీఏ, 2007లో ఎల్‌ఎల్‌బీ, 2008లో ఎంటెక్, 2009లో మాస్టర్ ఆ్‌ఫ్ జర్నలిజం, 2009లో మరో ఎల్‌ఎల్‌ఎం, 2010 సైబర్‌లా, 2011లో ఎల్‌ఎల్‌ఎమ్ కానిస్ట్యూషనల్ లా, 2010 బీఈడీ, 2012లో ఎంఈడీ, 2013లో బీఎల్‌ఐఎస్‌సీ, వీటితో పాటు ఎంటెక్, ఎల్‌ఎల్‌బీలలోనూ పట్టాలు పొందారు.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం
వైద్యుడిగా ఆయన సేవలు చేస్తునే పలు డిగ్రీలు సాధించడంతో ఆయన 2009లో లిమ్కాబుక్‌ఆఫ్ రికార్డ్‌లో స్థానం సంపాదించారు. అంతేకాక వైద్య సంఘాలు, వివిధ స్వచ్చం ద సంస్థలు, విద్యాలయాల్లో గౌరవ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇండియన్ మెడికల్ కౌన్సిల్‌లో మెంబర్‌గా కొనసాగుతున్నారు. వీటితో పాటు మరో 25 సంఘాల్లో కర్రి రామారెడ్డి పలుహోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇష్టంతో చదువుతా
ఎంత బిజీగా ఉన్నా విద్యపై మక్కువతో ఇన్ని డిగ్రీలు సాధించగలిగాను. వైద్యసేవల అనంతరం ఎంతో ఇష్టపడి చదువుకుంటాను. ప్రస్తుతం మరో రెండు డిగ్రీలు చదువుతున్నాను. అవి త్వరలోనే పూర్తవుతాయి.
- డాక్టర్ కర్రి రామారెడ్డి,
మానసిక వైద్యులు
Advertisement
Advertisement