ప్రమాదానికి కారణమైన కారు
శివాజీనగర: నగరంలో ఓ విద్యాలయం ఆవరణలో ప్రొఫెసర్ కారు అదుపుతప్పి విద్యార్థుల మీదకు దూసుకెళ్లింది. శనివారం మహారాణి క్లస్టర్ కాలేజీ ఆవరణలో వద్ద ఈ దుర్ఘటన జరిగింది. వివరాలు... ఇంగ్లిష్ ప్రొఫెసర్ హెచ్.నాగరాజు కారు తీసుకొని వర్సిటీకి వచ్చారు, కారును పార్క్ చేస్తూ బ్రేక్‌కి బదులుగా యాక్సిలేటర్‌ను నొక్కడంతో కారు వేగంగా దూసుకెళ్లి దారిలో వెళ్తున్న ఇద్దరు యువతులను ఢీకొట్టింది, అలాగే మరో రెండు కార్లను ఢీకొని నిలిచిపోయింది.
మొత్తం మూడు వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. అశ్విని (19) అనే బీకాం విద్యార్థినికి తీవ్రగాయాలై పరిస్థితి విషమంగా ఉంది, మరో యువతి నందుప్రియకు స్వల్ప గాయాలు తగిలాయి, నాగరాజుకు కూడా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరాడు. డీసీపీ ఘోర్పడే ఘటనాస్థలిని పరిశీలించి మాట్లాడుతూ, నిందితుడు నాగరాజుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ ప్రమాదంలో మరో ప్రొఫెసర్‌కు కూడా స్వల్ప గాయాలైనట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment