సాక్షి, బళ్లారి: సరదాగా విహారయాత్రకని బయల్దేరినవారిని మృత్యుదేవత వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదు మంది మృతి చెందిన హృదయ విదారక ఘటన చిత్రదుర్గం జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం విజయపుర (బీజాపూర్) జిల్లాకు చెందిన సంగన బసప్ప (36), భార్య రేఖ(29), వీరి కుమారుడు బసప్ప (8), బంధువులు భీమంకర్ (26) మధుసూదన్ (24) అనే ఐదుమంది మృతులు.
ఎలా జరిగిందంటే..
బీజాపుర్ ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్న సంగనబసప్ప కుటుంబ సభ్యులతో కలిసి చిక్కమగళూరు టూర్ కోసం కేఏ–28,జడ్8572 కారులో వెళుతున్నారు. చిత్రదుర్గం సమీపంలోని మల్లాపూర్ వంతెన వద్ద ప్రయాణిస్తుండగా ముందు వెళ్తున్న లారీని ఢీకొన్నారు. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు.
ఈ ఘటనలో అనితా (6) ఆదర్శ (4) అనే చిన్నారులకు తీవ్రగాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లా ఎస్పీ పరుశురాం, స్థానిక పోలీసులు అధికారుల ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించి గాయపడిన వారికి మైరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment