ప్రొఫెసర్ గుంట తులసీరావు
ఏపీ స్టేట్ లెవల్ రిక్రూట్‌మెంట్ పోలీస్ బోర్డు ప్రాంతీయ సమన్వయ కర్తగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కో ఆర్డినేటర్, కాకినాడ జేఎన్‌టీయూ రిజస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబా ఉత్తర్వులు జారీచేశారు.
ఎచ్చెర్ల: ఏపీ స్టేట్ లెవల్ రిక్రూట్‌మెంట్ పోలీస్ బోర్డు ప్రాంతీయ సమన్వయ కర్తగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కో ఆర్డినేటర్, కాకినాడ జేఎన్‌టీయూ రిజస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబా ఉత్తర్వులు జారీచేశారు. తులసీరావు జిల్లాలోని పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణను సమీక్షించనున్నారు. నవంబర్ 6న జరిగే కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు జిల్లా నుంచి 10,380 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. శ్రీకాకుళం డివిజన్‌లోని 22 విద్యాసంస్థల్లో పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పోలీస్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తామని తులసీరావు తెలిపారు. ప్రయాణానికి వీలైన, మౌలిక సౌకర్యాలు ఉన్న విద్యాసంస్థలను మాత్రమే పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసినట్లు ఆయన చెప్పారు.