కరోనా కొమ్ముల్లోని కొద్దిభాగమే వ్యాధికి కారణం | Coronavirus Horn cause of disease said HCU Professor | Sakshi
Sakshi News home page

కరోనా కొమ్ముల్లోని కొద్దిభాగమే వ్యాధి వ్యాప్తికి కారణం

May 7 2020 7:52 AM | Updated on May 7 2020 7:52 AM

Coronavirus Horn cause of disease said HCU Professor - Sakshi

రాయదుర్గం: శ్యాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందిని కల్గించండం కరోనా ప్రధాన లక్షణమని హెచ్‌సీయూ విభాగం ప్రొ. లలితా గురుప్రసాద్‌ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ఆమె చేస్తున్న పరిశోధనలను  బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.  ఒకజాతికి చెందిన గబ్బిలాలు ఈ వైరస్‌లకు కేంద్రస్థానాలని భావిస్తున్నామన్నారు. తరచుగా పొందుతున్న ఉత్పరివర్తనలతో ఈ వైరస్‌ ఇతర జంతువులకి వ్యాప్తిస్తోందన్నారు. కరోనా వైరస్‌ కొమ్ములాంటి ప్రోటీను నిర్మాణం ఉంటుందన్నారు. ఈ వైరస్‌ మనుషులలో రక్తపోటు కలిగించే ఎంజైమ్‌–2 గ్రాహకంగా మారుతోందన్నారు. అమెరికాలోని లాస్‌ ఆల్మాస్‌ జాతీయ ప్రయోగశాల పరిశోధకులు కూడా ఇలాంటి అభిప్రాయలనే వెలిబుచ్చారని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement