
న్యూఢిల్లీ: విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) ప్రొఫెసర్ ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. జేఎన్‌యూ లైఫ్ సైన్సెస్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ అతుల్ జోహ్రి(54)తమను వేధిస్తున్నారంటూ సోమవారం కొందరు విద్యార్థినులు వసంత్‌కుంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
వివిధ సంఘాలు, విద్యార్థులు, 54 మంది జేఎన్‌యూ ప్రొఫెసర్లు బాధితులకు మద్దతుగా పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. బాధితుల ఫిర్యాదులపై వేర్వేరుగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేయాలంటూ మంగళవారం కూడా వారు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ప్రొఫెసర్‌పై ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయటంతోపాటు అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టారు. అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా బెయిల్ మంజూరు చేశారు.