ముదిరిన శాతవాహన వివాదం | satavahana university struggle goes to high | Sakshi
Sakshi News home page

ముదిరిన శాతవాహన వివాదం

Published Sat, Mar 28 2015 8:17 AM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

satavahana university struggle goes to high

కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో రగలిన వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడ్డ 23 మంది విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ సుజాత శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమను సస్పెండ్ చేయడం సరికాదంటూ కళాశాల భవనం ఎదుట వారు ధర్నాకు దిగారు. తమపై పోలీస్ కేసులు పెట్టి మళ్లీ సస్పెండ్ చేయడం ఏంటని విద్యార్థులు ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. బాలకృష్ణ అనే విద్యార్థి పరిపాలన భవనంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి యత్నించాడు. విద్యార్థులకు, ఆధ్యాపకులకు మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో  ఆర్ట్స్ కళాశాల, వసతిగృహాలకు రిజిస్ట్రార్లు సెలవులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement