డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్కు చెందిన ఓ ప్రొఫెసర్ ప్రపంచ రికార్డు సృష్టించారు. గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న 26 ఏళ్ల అరవింద్ మిశ్రా ఏకధాటిగా అత్యధిక సమయం బోధించిన టీచర్గా ఘనత సాధించారు. మెకానికల్ ఇంజనీరింగ్ బోధించే మిశ్రా.. ఇదే అంశంలో ఏకధాటిగా 130 గంటలకు పైగా ఉపన్యాసం ఇచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటలకు ఆయన రికార్డు నెలకొల్పారు. ఇంతకుముందు ఈ రికార్డు పోలెండ్ టీచర్ ఎరోల్ ముజవాజి పేరిట నమోదైంది. ఆయన 2009లో వరుసగా 121 గంటల పాటు బోధించారు.