సాక్షి, హైదరాబాద్: ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మాసబ్ ట్యాంక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) పెయింటింగ్ విద్యార్థులు సోమవారం కళాశాల ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. పెయింటింగ్ విభాగం అధిపతి స్టాన్లీ సురేష్ లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వర్సిటీ పక్కనే ఉన్న ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్ జయప్రకాశ్‌రావుకు ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు వినతిపత్రం ఇచ్చారు. ఇదిలావుండగా, మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షను బహిష్కరించి ఆందోళనకు దిగిన విద్యార్థులను ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి మూడు రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు మద్దతు ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నారు.
కావాలనే ఆరోపణలు: స్టాన్లీ సురేష్
ఈ విషయమై ప్రొఫెసర్ స్టాన్లీ సురేష్‌ను వివరణ కోరగా.. ‘ఇప్పుడు పరీక్షల సమయం. విద్యార్థులకు మార్కులు, హాజరు శాతం వంటివి నా చేతుల్లో ఉన్నాయి. అందుకే నా మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. నేనంటే పడని తోటి ఉపాధ్యాయులు విద్యార్థులను ఎగదోస్తున్నార’ని పేర్కొన్నారు.
జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో విద్యార్థుల ఆందోళన
Published Tue, Aug 6 2013 1:18 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement