Jnafau
-
జేఎన్ఏఎఫ్ఏయూ ఇన్చార్జి వీసీగా చిత్రా రామచంద్రన్
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్‌గా (వీసీ) విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల కిందటే రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఇన్చార్జి వీసీలను నియమించిన ప్రభుత్వం జేఎన్‌ఏఎఫ్‌ఏయూకు నియమించలేదు. ఎట్టకేలకు ఆ వర్సిటీకి కూడా ఇన్చార్జి వీసీని నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. -
జేఎన్ఏఎఫ్ఏయూ సర్టిఫికెట్ కోర్సులు
సాక్షి,హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్సిటీ ( జేఎన్ఏఎఫ్ఏయూ) రెండు సర్టిఫికెట్ కోర్సులను ప్రకటించింది. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ స్టూడియో ప్రాక్టీస్( ఎగ్ టెంపిరా), సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ప్రాక్టీస్( ఆయిల్ ఆన్ క్యాన్వాస్)లను మే 14 నుంచి ప్రారంభించనుంది. ఆసక్తి గల వారు మే 6 లోగా దరఖాస్తు చేసుకోవాలి. కనీస అర్హతను ఇంటర్‌గా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు 9849661555 నంబర్‌ను సంప్రదించవచ్చు. -
జేఎన్ఏఎఫ్ఏయూలో కొనసాగుతున్న విద్యార్ధుల ఆందోళన
మాసబ్ ట్యాంక్ వద్ద గల జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ)లో అనర్హులైన ఫ్యాకల్టీని తొలగించాలంటూ విద్యార్థులు చేపట్టిన నిరసన 19వ రోజుకు చేరుకుంది. బుధవారం వర్సిటీ ఆవరణలో టెంట్‌వేసి విద్యార్థులు నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఫ్యాకల్టీ కన్నా గూగుల్, యూట్యూబ్ మిన్న అంటూ నినాదాలు చేశారు. యూనివర్శిటీ యాజమాన్యం దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇప్పుడున్న యానిమేషన్ ఫ్యాకల్టీని తొలగించి అనుభవం ఉన్న వారిని తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఈ విషయంపై వైస్ ఛాన్సలర్ పద్మావతి మాట్లాడుతూ.. విచారణ కమిటీ నివేదిక చర్యలు చేపడతామన్నారు. విద్యార్థుల అందోళన నేపథ్యంలో ఈ నెల 31వరకు (10 రోజులు) సెలవు ప్రకటించినట్లు తెలిపారు. -
జేఎన్ఏఎఫ్ఏయూలో విద్యార్థుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మాసబ్ ట్యాంక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం (జేఎన్ఏఎఫ్ఏయూ) పెయింటింగ్ విద్యార్థులు సోమవారం కళాశాల ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. పెయింటింగ్ విభాగం అధిపతి స్టాన్లీ సురేష్ లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వర్సిటీ పక్కనే ఉన్న ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్ జయప్రకాశ్రావుకు ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు వినతిపత్రం ఇచ్చారు. ఇదిలావుండగా, మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షను బహిష్కరించి ఆందోళనకు దిగిన విద్యార్థులను ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి మూడు రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు మద్దతు ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నారు. కావాలనే ఆరోపణలు: స్టాన్లీ సురేష్ ఈ విషయమై ప్రొఫెసర్ స్టాన్లీ సురేష్‌ను వివరణ కోరగా.. ‘ఇప్పుడు పరీక్షల సమయం. విద్యార్థులకు మార్కులు, హాజరు శాతం వంటివి నా చేతుల్లో ఉన్నాయి. అందుకే నా మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. నేనంటే పడని తోటి ఉపాధ్యాయులు విద్యార్థులను ఎగదోస్తున్నార’ని పేర్కొన్నారు.