జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో కొనసాగుతున్న విద్యార్ధుల ఆందోళన
మాసబ్ ట్యాంక్ వద్ద గల జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ)లో అనర్హులైన ఫ్యాకల్టీని తొలగించాలంటూ విద్యార్థులు చేపట్టిన నిరసన 19వ రోజుకు చేరుకుంది. బుధవారం వర్సిటీ ఆవరణలో టెంట్‌వేసి విద్యార్థులు నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఫ్యాకల్టీ కన్నా గూగుల్, యూట్యూబ్ మిన్న అంటూ నినాదాలు చేశారు.
యూనివర్శిటీ యాజమాన్యం దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇప్పుడున్న యానిమేషన్ ఫ్యాకల్టీని తొలగించి అనుభవం ఉన్న వారిని తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఈ విషయంపై వైస్ ఛాన్సలర్ పద్మావతి మాట్లాడుతూ.. విచారణ కమిటీ నివేదిక చర్యలు చేపడతామన్నారు. విద్యార్థుల అందోళన నేపథ్యంలో ఈ నెల 31వరకు (10 రోజులు) సెలవు ప్రకటించినట్లు తెలిపారు.