ఆమె ఓ ప్రొఫెసర్. పేరు సవితా సురభి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్న ఓ వర్సిటీ న్యాయ కళాశాల..
నోయిడా: ఆమె ఓ ప్రొఫెసర్. పేరు సవితా సురభి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్న ఓ వర్సిటీ న్యాయ కళాశాలలో 2007 నుంచి 2013 వరకూ పనిచేశారు. అనంతరం తనకు రావాల్సిన గ్రాట్యుటీ రూ. 40 వేల కోసం ఏడాదిపాటు చెప్పులు అరిగేలా కళాశాల చుట్టూ తిరిగారు. ఫలితం లేకపోవడంతో చివరి యత్నంగా ప్రధాని కార్యాలయం(పీఎంవో) తలుపు తట్టారు.
జూలైలో ప్రధాని మోదీకి విజ్ఞాపన పత్రం పంపారు. వెంటనే ఆమె ఈ-మెయిల్‌కు పీఎంవో నుంచి సమాధానం వచ్చింది. లేబర్ కమిషనర్‌ను కలసి సమస్యను చెప్పుకోవాల్సిందిగా పీఎంవో సూచించింది.ఈ-మెయిల్ ప్రతిని యూనివర్సిటీ వ్యవస్థాపక సభ్యుడికి పంపింది. దీంతో వెంటనే ఆమె సమస్య పరిష్కారమైంది. ఆమెకు రావాల్సిన రూ. 40 వేల గ్రాట్యుటీని వర్సిటీ ఏకంగా రూ. 1.6 లక్షలకు పెంచడంతోపాటు సొమ్మును సత్వరమే చెల్లించింది.