రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో 1093 ఫ్రొపెసర్ పోస్టులను భర్తీ చేసేం దుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పయణియప్పన్ అన్నారు
ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు
Published Sun, Sep 29 2013 12:50 AM | Last Updated on Wed, Apr 3 2019 8:54 PM
వేలూరు, న్యూస్‌లైన్:రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో 1093 ఫ్రొపెసర్ పోస్టులను భర్తీ చేసేం దుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పయణియప్పన్ అన్నారు. వేలూరులోని ముత్తురం గం ఆర్ట్స్ కళాశాలలో అనకట్టు నియోజ క వర్గం నిధులు రూ. 30లక్షల వ్యయంతో నిర్మించిన భవనాన్ని మం త్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 69 ప్రభుత్వ కళాశాలలు మాత్రమే ఉండేవని, అమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతనంగా 12 కళాశాలలను ప్రారంభించామన్నారు. పాఠశాల విద్య పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్య అందించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమం త్రి జయలలిత ఉన్నత విద్యాశాఖకు రూ. 100 కోట్లు కేటాయించారన్నారు.
ఇండియాలో 9.2 శాతం విద్యార్థినులు, 12.4 శాతం విద్యార్థులు ఉన్నత విద్యకు చదువుతున్నారన్నారు. ఈ సంఖ్యను పెంచేం దుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నా రు. వేలూరు జిల్లాలో మాత్రం జోలార్‌పేట, తిరుపత్తూరు, అరక్కోణం వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు నిర్మిం చేందుకు ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారన్నారు. ఉన్నత విద్యను అభ్యసించే వారందరికీ ఉచితంగా లాప్‌టాప్‌లను అందజేస్తున్న ఘనత అన్నాడీఎంకే ప్రభుత్వంలోనే మాత్రమే అన్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేసి వీరమణి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను గుర్తించి ముఖ్యమంత్రి అనేక పథకాలను ప్రవేశ పెడుతున్నారని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వేలూరులో క్రీడా మైదానం ఏర్పాటు చేసే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ. 30 లక్షల వ్యయంతో నూతన భవనం నిర్మించేందుకు అనకట్టు ఎమ్మె ల్యే కలైఅరసన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం కళాశాలలో నూతనంగా చేరే విద్యార్థులకు మంత్రులు అనుమతి పత్రాలను అందజేశారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ శంక ర్, ఎమ్మెల్యేలు కలైఅరసన్, మహ్మద్‌జాన్, మేయర్ కార్తియాయిని, డెప్యూటీ మేయర్ ధర్మలింగం, ఉన్నత విద్య అసిస్టెంట్ డెరైక్టర్ సదాశివం, కళాశాల ప్రిన్సిపాల్ జయపాల్, కౌన్సిలర్ చొక్కలింగం, కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement