కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ ప్రొఫెసర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కన్యత్వం కోల్పోయిన అమ్మాయిలు సీల్‌లేని బాటిళ్ల వంటివారని ప్రొ.కనక్ సర్కార్ వ్యాఖ్యానించారు. సీల్ తీసిన కూల్‌డ్రింక్ బాటిల్‌ను, బిస్కెట్ ప్యాకెట్‌ను కొనుగోలు చేసేందుకు మీరు ఇష్టపడతారా? అని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేశారు. అంతేకాకుండా చాలామంది యువకులకు కన్యత్వం ఉన్న అమ్మాయిలు దేవకన్యల వంటివారని సెలవిచ్చారు.
ప్రొ.కనక్ సర్కార్ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ వివాదాస్పదం కావడంతో భావప్రకటన స్వేచ్ఛ కింద అభిప్రాయాలను వెల్లడించానని స్పష్టం చేశారు. ఈ విషయం మీడియాలో వైరల్‌కావడంతో సర్కార్ తన పోస్టింగ్‌ను తొలగించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కనక్ సర్కార్‌ను తక్షణం విధుల్లోంచి తప్పించడంతో పాటు వర్సిటీ ప్రాంగణంలో అడుగుపెట్టకుండా వైస్ ఛాన్స్‌లర్ సురంజన్‌దాస్ ఆదేశాలు జారీచేశారు. జాతీయ మహిళా హక్కుల కమిషన్, పశ్చిమబెంగాల్ మహిళా హక్కుల కమిషన్ ఆయనకు నోటీసులు జారీచేశాయి. కమిషన్ల విచారణ పూర్తయ్యేవరకూ సర్కార్‌ను విధుల్లోకి తీసుకోబోమని వీసీ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment