ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: పాఠాలు బోధిస్తూ మార్గదర్శకంగా ఉండాల్సిన ప్రొఫెసర్ పాడుబుద్ధితో విద్యార్థినిపై కన్నేశాడు. తన కోరిక తీర్చాలని బాలికను హింసించేవాడు. చివరికి విద్యార్థిని వాటిని తట్టుకోలేక ఫ్రోఫెసర్‌పై కళాశాల అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఉదాంతం తమిళనాడులో చోటు చోసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... తమిళనాడులో కన్యాకుమారి కళాశాలో ఓ యువతి చదువుతోంది. ఆ కళశాలలోనే ప్రొఫెసర్‌గా పని చేస్తున్న వాసుదేవన్ విద్యార్థినిపై కన్నేశాడు. ఎలాగో ఒకలా ఆమె ఫోన్ నంబర్ సంపాదించాడు. ఇక ఆ రోజు నుంచి ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు, వీడియోలను పంపుతూ తరచూ వేధించేవాడు. అతని కోరికలని తీర్చాలని సదరు విద్యార్థినిని శారీరకంగా, మానసికంగానూ తీవ్ర ఇబ్బందులు పెట్టేవాడు. ఈ విషయాన్ని ఎవరికైన చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. దీంతో భయపడిపోయిన బాధితురాలు.. ఆమె తన సోదరుడిని ఈ దారుణాన్ని చెప్పుకుంది.
అనంతరం ఆమె సోదరుడు కళాశాలకు వచ్చి ప్రొఫెసర్ ను నిలదీయడంతో వారు బాధితులపైనే దాడి చేశారు. ఇక చేసేదేమి లేక చివరికి యువతి తన సోదరుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ విషయం బయటకు రావడంతో ప్రొఫెసర్ ను సస్పెండ్ చేయాలని కళాశాలలో నిరసనలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment