
ప్రతీకాత్మక చిత్రం
అన్నానగర్(చెన్నై): ఆత్మహత్యకు యత్నించిన నవవధువు చికిత్స పొందుతూ మృతిచెందింది. తిరుపూర్ జిల్లా ఉడుమలైపేటకు చెందిన మయిలత్తాల్ (65) మనవరాలు భూమిక (20). తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ సంరక్షణలో పెరిగింది. భూమిక, అదేప్రాంతానికి చెందిన అబ్బాయి సహజీవనం చేశారు. ఈ క్రమంలో తిరుచ్చికి చెందిన రఘు(25) భూమికకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యారు.
తల్లిదండ్రుల అంగీకారంతో జూలై 5న అతడితో వివాహం జరిగింది. భూమిక రఘుతో కలిసి తిరుచ్చిలో నివసిస్తూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఉడుమలైపేటకు వెళ్లి వచ్చింది. ఈ క్రమంలో ఈనెల 6న ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడికి అమ్మమ్మ రాగా సహజీవనం చేసిన వ్యక్తి చనిపోయాడిని తెలిసి ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పింది. భూమిక చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.
చదవండి: Viral Video: 36 కిలోమీటర్లు సముద్రాన్ని ఈదిన మహిళ.. మామూలు విషయం కాదు!