
మైరా.. పాటరీ వర్క్‌షాప్
ఆర్ట్ లవర్స్ కోసం ఏప్రిల్ 6 వరకూ నిర్వహణ
సాక్షి, సిటీబ్యూరో: గ్రామీణ మహిళల సాధికారత కోసం పనిచేసే నాస్కామ్ ఫౌండేషన్ మహిళలకు డిజిటల్ స్కిల్స్‌లో శిక్షణ అందించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. హెచ్‌ఎస్‌బీసీతో కలిసి 4వేల మంది మహిళలకు ఆర్థిక అక్షరాస్యత, వ్యాపార దక్షత, ఇ-గవర్నెన్స్.. తదితర విషయాల్లో అవగాహన కల్పించనున్నామని, రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగుతోందని వివరించింది. ‘డిజిటల్ ఎకానమీలో మహిళల పాత్ర విస్తరణ, మహిళా వ్యాపారుల సామర్థ్యాలను పెంపొందించడం’ పేరిట ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొంది.

పాటరీ వర్క్‌షాప్
నగరంలోని ఆర్ట్ లవర్స్ కోసం ప్రత్యేకంగా పాటరీ వర్క్‌షాప్ ప్రారంభించింది మైరా స్టూడియో. బంజారాహిల్స్‌లోని స్టూడియో మైరా వేదికగా నేటి నుంచి ప్రారంభమయ్యే పాటరీ వర్క్‌షాపులో రంగులతో ప్రత్యేక కళాఖండాలను సృష్టించడానికి శిక్షణ అందించనున్నారు. ఈ వర్క్‌షాప్‌కు అవసరమైన మేకింగ్ మెటీరియల్ నిర్వాహకులే అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ వరకూ కొనసాగనున్న ఈ వర్క్‌షాపులో ఐదేళ్లపైబడిన ఆర్ట్ లవర్స్ ఎవరైనా భాగస్వాములు కావచ్చని నిర్వాహకులు తెలిపారు. బుక్ మై షో ద్వారా నమోదు చేసుకోవచ్చని వివరించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉండే ఈ వర్క్‌షాపు వారంలోనూ, వారాంతాల్లోనూ ఉంటుంది.