
ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా అనూహ్యంగా ఉంటాయో.. అలాగే అత్యంత విభిన్నంగా ఉండే ఆయన వ్యవహారతీరు ఎవ్వరినైనా కట్టిపడేస్తుంది. అయితే మోదీ ఏడుపదుల వయసులోనూ అంతే ఫిట్‌గా, చలాకీగా ఉంటారు. ఎక్కడ అలసటను దరిచేరనీయరు. ఏ కార్యక్రమంలోనైన ముఖంపై రచిరునవ్వు, ఉత్సాహం చెరగనివ్వరు. మోదీ ఈ ఏజ్‌లో కూడా యువకుల మాదిరి నూతనోత్సహాంతో పనులు చక్కబెట్టుకుంటారు. అలా చలాకీగా ఉండేందుకు తాను పాటించే ఆ దినచర్యేనంటూ తన ఆహార నియమాల గురించి సవివరంగా వివరించారు. అవేంటో చూద్దామా..!.
24 గంటల్లో ఒక్కసారే భోజనం..
అమెరికాకు చెందిన పాడ్‌కాస్టర్ ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో జరిగిన సంభాషణలో మోదీ తన ఉపవాస షెడ్యూల్ గురించి, జీవనశైలి గురించి వివరించారు. జూన్ మధ్యలో ప్రారంభమైన దీపావళి నుంచి 4 నెలలు పాటు భారత వైదిక ఆచారమైన చాతుర్మాస్ దీక్షను అవలంభిస్తారట. ఆ రోజుల్లో 24 గంటల్లో కేవలం ఒక్కసారి మాత్రమే ఏమైనా తీసుకోవడం జరుగుతుందని చెప్పారు మోదీ. సరిగ్గా అది వర్షాకాలం ఆ టైంలో మనిషి జీర్ణక్రియ ఎలా మందగిస్తుందో వివరించారు.
అంతేకాదు తాను పాటించే నవరాత్రి ఉపవాస దీక్ష గురించి కూడా మాట్లాడారు. ఆ సమయంలో మోదీ పూర్తిగా ఆహారం తీసుకోకుండా తొమ్మిది రోజులు కేవలం వేడినీరు మాత్రమే తీసుకుంటానని అన్నారు. అయితే వేడినీరు ఎల్లప్పుడూ తన దినచర్యలో ఒక భాగమేనని చెప్పారు.
అది తనకు ఒక అలవాటుగా మారిపోయిందన్నారు. అలాగే మోదీ మార్చి లేదా ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే చైత్ర నవరాత్రి ఉపవాసాన్ని కూడా అనుసరిస్తానన్నారు. అంతేగాదు తన దృష్టిలో ఉపవాసం అనేది ఒక రకమైన స్వీయ-క్రమశిక్షణగా పేర్కొన్నారు. ఇది భక్తితో కూడిన దినచర్య. నెమ్మదించేలా చేయదు. మరింత చురుకుగా ఉండేలా చేస్తుంది.
ఉపవాసం శక్తి..
ఉపవాసం శరీరాన్ని బలహీనపరస్తుందనే సాధారణ నమ్మకాన్ని సవాలు చేస్తూ..మనస్సు, ఆత్మ రెండింటిని రీచార్జ్ చేసుకునే ఓ గొప్ప మార్గంగా అభివర్ణించారు. ఆ టైంలో వాసన, స్పర్శ, రుచి వంటి జ్ఞానేంద్రియాలు సున్నితంగా మారడాన్ని గమనించొచ్చన్నారు. ఉపవాసం అంటే భోజనం దాటవేయడం మాత్రమే కాదు. శరీరాన్ని తిరిగి సమతుల్యం చేసుకోవడం, సంకల్ప శక్తిని బలోపేతం చేయడం, అంతర్గత సామరస్యాన్ని సాధించడం అని ఆయన వివరించారు.
(చదవండి: Coconut Water Vs Sugarcane Juice: భగభగమండే ఈ ఎండలకు ఏ పానీయం మేలు అంటే..?)