
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో గర్భస్థ శిశువులు, ప్రసూతి మరణాల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ ఈ మరణాల రేటు మాత్రం ఇంకా ఆందోళనకరంగానే కనిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (World Health Day) అందరికీ సమానమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను నిర్ధారించాల్సిన అత్యవసర అవసరాన్ని గుర్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే హెల్దీ బిగినింగ్స్ అండ్ హోప్ ఫుల్ ఫ్యూచర్స్ (“Healthy Beginnings, Hopeful Futures”) అనేది ఈ ఏడాది థీమ్‌గా నిర్ణయించింది. ఈ విషయంలో తల్లి, నవజాత శిశువుల ఆరోగ్యం కీలక పాత్రను ఇది హైలైట్ చేస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం ఆరోగ్యకరమైన శిశువు బాల్యం ఆరోగ్యంగా ఉంటే ఆ చిన్నారి భవిష్యత్తు కూడా డా ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన గర్భధారణ, బాల్యం ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది వేస్తాయి, పోషకాహార లోపం, రక్తహీనత, తక్కువ జనన బరువు, సరైన ప్రసూతి ఆరోగ్య సంరక్షణ పద్ధతులు లింగ అసమానతలు వంటి సవాళ్లను అధిగమించడం చాలా కీలకం.
ప్రసూతి పోషకాహార ప్రాముఖ్యత, రక్తహీనత, బరువు తక్కుతో సంభవించే శిశు జననాలను తగ్గింసే ఆరోగ్య సంరక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
ఈ సందర్భంగా కొన్ని గణాంకాలు
ప్రసూతి మరణాలు: గర్భధారణ లేదా ప్రసవ సమస్యల కారణంగా సంవత్సరానికి సుమారు 3లక్షల మంది మహిళలు మరణిస్తున్నారు.
నవజాత శిశు మరణాలు: ప్రతి సంవత్సరం 2 మిలియన్లకు పైగా శిశువులు వారి మొదటి నెలలోనే మరణిస్తున్నారు.
ప్రసవాలు: సంవత్సరానికి సుమారు 2 మిలియన్ల ప్రసవాలు జరుగుతున్నాయి.
మరణాలు : దురదృష్టవశాత్తు, ప్రతి 7 సెకనకు పుట్టకముందే లేదా పుట్టిన తరువాత ఒక శిశు మరణం సంభవిస్తుంది.
ప్రపంచ ఆరోగ్య లక్ష్యాలు: 2030 నాటికి ప్రసూతి మనుగడ లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది కానీ ఈ బాటలో 5 దేశాలలో 4 దేశాలు లేకపోవడం గమనార్హం.
మానసిక ఆరోగ్యం: మానసిక ఆరోగ్య పరిస్థితులు మాతా మరియు నవజాత శిశువుల ఆరోగ్యానికి గణనీయమైన ఆందోళన కలిగిస్తాయి.
నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్: ఈ వ్యాధులు మాతాశిశు ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.
కుటుంబ నియంత్రణ: ప్రసూతి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కుటుంబ నియంత్రణ సేవల అందుబాటులోకి రావడం చాలా కీలకం.
ఆరోగ్య సంరక్షణ ప్రాప్యత: మరణాల రేటును తగ్గించడానికి జననానికి ముందు, ప్రసవ సమయంలోనూ , ఆ తరువాత అధిక-నాణ్యమైన సంరక్షణ అవసరం.
గ్లోబల్ క్యాంపెయిన్స్: తల్లీ బిడ్డలశిశువులకు ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి ప్రపంచ దేశాల ప్రయత్నాల ప్రాముఖ్యతను డబ్ల్యూహెచ్ఓ నొక్కి చెప్పింది