
ఉత్తర కొరియాను సందర్శించాలనుకునే విదేశీ టూరిస్టులకు ఇది శుభవార్తే.. దాదాపు ఐదేళ్ల తర్వాత తొలిసారిగా విదేశీ పర్యాటకులకు ఆ దేశం తలుపులు తెరిచింది.
ఉత్తర కొరియాను సందర్శించాలనుకునే విదేశీ టూరిస్టులకు ఇది శుభవార్తే.. దాదాపు ఐదేళ్ల తర్వాత తొలిసారిగా విదేశీ పర్యాటకులకు ఆ దేశం తలుపులు తెరవబోతోంది. పర్యాటక రంగంపై ఫోకస్ పెట్టిన కిమ్ ప్రభుత్వం తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.. పర్యాటకాన్ని పునరుద్ధరించేందుకు సిద్ధమైనట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
కొన్ని వారాల క్రితం విదేశీయులు ఉత్తర కొరియాలో పర్యటించారని.. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కిమ్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి విదేశీ మారక నిల్వలను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం.
ఉత్తర కొరియా నిర్ణయంతో కెనడా, యూకే, న్యూజిలాండ్, చైనా వంటి దేశాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు ఉత్తర కొరియా వచ్చే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా 2020 నుంచి ఉత్తర కొరియా పర్యాటకంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లుకు మళ్లీ విదేశీయులను అనుమతిస్తోంది.
ఇదీ చదవండి: USA: ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..