
తూము ఏర్పాటు చేయాలి
అడ్డరోడ్డుకు వెళ్లేదారిలో వరదకాలువకు తూము ఏర్పాటు చేసేందుకు గతంలో ప్రతిపాదనలు పంపినా కార్యరూపం దాల్చలేదు. మల్యాల గ్రామం చుట్టూ నీరున్నా.. చెరువుల్లోకి మాత్రం నీరు చేరడం లేదు. చెరువులు నింపాలని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నాం. తూము ఏర్పాటు చేసి చెరువులు నింపాలి.
– గడ్డం రాజేశ్వర్ రెడ్డి, రైతు, మల్యాల
చెరువులు నింపాలి
సూరప్ప చెరువు, రావి చెరువులతోపాటు శివారులోని అన్ని చెరువులను నింపాలి. వేసవిలో చెరువులన్నీ ఎండిపోతున్నాయి. ఏటా వర్షం నీరు మినహా వరద వచ్చే అవకాశం లేక వేసవిలో భూగర్భజలాలు తగ్గిపోయి, బావుల్లో ఊట మళ్లిపోతున్నాయి. మల్యాలలోని చెరువులు అన్ని నింపేందుకు చర్యలు చేపట్టాలి.
నేరెళ్ల భూమారెడ్డి, రైతు నాయకులు

తూము ఏర్పాటు చేయాలి