సుందరీకరణ.. కళావిహీనం | - | Sakshi
Sakshi News home page

సుందరీకరణ.. కళావిహీనం

Published Thu, Apr 3 2025 1:04 AM | Last Updated on Thu, Apr 3 2025 1:04 AM

సుందర

సుందరీకరణ.. కళావిహీనం

జగిత్యాల: రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న చందంగా జగిత్యాల మున్సిపాలిటీ తీరు తయారైంది. జి ల్లాకేంద్రంగా ఏర్పడి తొమ్మిదేళ్లు గడుస్తోంది. అయినా అభివృద్ధి మాత్రం నత్తనడకన సాగుతోంది. గ తంలో సుందరీకరణ పేరుతో డివైడర్ల మధ్య మొక్కలు నాటడంతోపాటు, జంక్షన్ల వద్ద వివిధ రకాల అ త్యంత ఖరీదైన బొమ్మలు, లాన్‌లు, మంచి మొక్కలు నాటారు. అవి కొద్దిరోజులు మాత్రమే పనిచేశా యి. గత పాలకవర్గంగానీ, అధికారులు గానీ పట్టించుకోకపోవడంతో జంక్షన్లు కళాహీనంగా మారుతున్నాయి. బొమ్మలు దుమ్ముపట్టిపోవడం, లాన్‌ ఎండిపోవడం, మొక్కలు పిచ్చిమొక్కలుగా తయారవుతున్నాయి. సుందరీకరణ కాస్తా కళావిహీనంగా మారింది.

ప్రజల సొమ్ము దుర్వినియోగం

జిల్లా కేంద్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. వేలాది మంది ప్రజలు నిత్యం రాకపోకలు సాగి స్తుంటారు. రోడ్లు, జంక్షన్లు గ్రీనరీతో ఉండాలన్న ఉద్దేశంతో సుందరీకరణ పేరుతో ఈ జంక్షన్లకు గ తంలో రూ.35 లక్షలు ఖర్చు చేశారు. అందులో నె మలి, కొంగలు, మనిషి ఆకారం పోలే బొమ్మలు ఏ ర్పాటు చేయడంతోపాటు ఫౌంటేన్‌, లాన్‌ ఏర్పాటు చేసి కొన్ని మొక్కలు నాటారు. ఇంత చేసీ.. కనీసం రెండునెలలైనా ఫౌంటేన్ల నిర్వహణ కొనసాగలేదు. అధికారులుగానీ, ప్రజాప్రతినిధులుగానీ పట్టించుకోకపోవడంతో జంక్షన్లు కాస్త కళావిహీనంగా మా రుతున్నాయి. రూ.35 లక్షల నిధులు వృథా అవుతున్నాయి. జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన ఫౌంటేన్లు పని చేయాలంటే మోటార్లు ఉండాలి. అవి కాస్త చెడిపోవడంతో బాగు చేయించడాన్ని అధికారులు ప ట్టించుకోవడం లేదు. దీంతో ఏదో మొక్కుబడిగా అ ప్పుడప్పుడు ట్యాంకర్ల ద్వారా పచ్చదనం ఎండిపోకుండా నీరు పడుతున్నారే తప్ప మోటార్లు బాగుచే సి ఫౌంటేన్‌ పనిచేసేలా చర్యలు మాత్రం తీసుకో వ డం లేదు. గతంలో ఫౌంటేన్‌తోపాటు వివిధ రంగుల్లో నీరు పోసేలా లైట్లను ఏర్పాటు చేశారు. ఆ లైట్లు కూ డా పనిచేయడం లేదు. అధికారులు స్పందించి జంక్షన్ల వద్ద అభివృద్ధి చేపట్టాలని ప్రజలు కో రుతున్నా రు. జగిత్యాలలో జంక్షన్లు రెండు ఉన్నా.. కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురిలో జంక్షన్ల ఊసే ఎత్త డం లేదు. అన్ని బల్దియాల్లో జంక్షన్లు ఏర్పాటు చేసే లా చూడాలని ఆయా పట్టణ ప్రజలు కోరుతున్నారు.

పనిచేయని ఫౌంటేన్లు ప్రజలకు అందని ఆహ్లాదం రూ.35లక్షల ప్రజాధనం వృథా జిల్లాకేంద్రంలోని జంక్షన్ల దుస్థితి

ఇది జిల్లాకేంద్రంలో అత్యధికంగా రద్దీ ఉండే కొత్తబస్టాండ్‌ చౌరస్తా. ఎలాంటి సమావేశమైనా ఇక్కడే చేపడతారు. ఇక్కడ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం, భారతదేశ చిత్రపటం ఏర్పాటు చేసి దాని చుట్టూ లాన్‌ ఏర్పాటు చేశారు. మంచిగా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి ఫౌంటేన్‌ కూడా పెట్టారు. నిర్వహణ గాలికొదిలేయడంతో ఫౌంటేన్‌ పనిచేయడం లేదు. ఎండకాలం కావడంతో లాన్‌ పూర్తిగా ఎండిపోతోంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని పాతస్టాండ్‌ చౌరస్తా. ఇక్కడ

జంక్షన్‌ ఏర్పాటు చేసి సుందరీకరణ పేరిట అందమైన బొమ్మలు, లాన్‌ ఏర్పాటు చేశారు. నిత్యం ఫౌంటేన్‌ ద్వారా నీరు పోస్తూ ఆహ్లాదం అందించేలా చూస్తామని ప్రకటించారు. కానీ.. అవి ఇప్పటివరకు పనిచేయడం లేదు. సుందరీకరణ చేపడతామన్న అధికారులు, ప్రజాప్రతినిధులు వాటిని గాలికొదిలేశారు. అందులో ఉన్న లాన్‌ పూర్తిగా ఎండిపోయింది. బొమ్మలు శిథిలావస్థకు చేరుతున్నాయి.

సుందరీకరణ.. కళావిహీనం1
1/1

సుందరీకరణ.. కళావిహీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement