
అక్రమాలకు పాల్పడితే చర్యలు
మెట్‌పల్లి: అమ్మకాల్లో వ్యాపారులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ అన్నారు. పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో బుధవారం తనిఖీలు చేశారు. స్టాక్ రిజిస్టర్లు, బిల్‌బుక్‌లను పరిశీలించి వ్యాపారులకు పలు సూచనలు చేశారు. ధరలు, నిల్వలకు సంబంధించిన వివరాలను బోర్డుపై ప్రతిరోజు ప్రదర్శించాలన్నారు. తప్పనిసరిగా ఈ–పాస్ విధానంలోనే అమ్మకాలు జరపాలన్నారు. ఎరువులు, విత్తనాల విషయంలో రైతుల నుంచి అధిక ధరలు వసూలు చేయవద్దన్నారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఏఓ దీపిక ఉన్నారు.