Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Naidu Another Grand Palace At Capital Amaravati1
చంద్రబాబు మరో మహా ప్యాలెస్‌

సాక్షి, అమరావతి: సువిశాల విస్తీర్ణంలో హైదరా­బాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో కళ్లు జిగేల్‌మ­నేలా రూ.వందల కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన రాజభవనం..! నిజాం నవాబు తరహాలో హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున కొండాపూర్‌లో హైటెక్‌ సిటీకి కూతవేటు దూరంలో ఊహకు అందని రీతిలో ఐదెకరాలలో ఓ భారీ ఫాంహౌస్‌..! వీటికి­తోడు అమరావతిలో రూ.వందల కోట్లతో.. మరో ఐదు ఎకరాల్లో ఇంకో రాజభవనాన్ని నిర్మించుకుంటున్నారు సీఎం చంద్రబాబు..! అత్యాధునిక హంగులు.. కనీవిని ఎరుగని అధునాతన రీతిలో.. రాజ­ధాని అమరావతి నడిబొడ్డున.. వెలగపూడిలో తాత్కా­లిక సచివాలయం సమీపంలో చేపట్టే ఈ ప్యాలెస్‌ నిర్మాణ పనులను తనకు అత్యంత సన్నిహితుడికి చెందిన సంస్థకు అప్పగించారు. దీనికి ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు భూమి పూజ చేశారు. కాగా, దీనికోసం వెలగపూడిలో సర్వే నంబర్‌ 111, 112, 113, 122, 150, 152, 239లలోని 5.16 ఎకరాలను (25 వేల చదరపు గజాలు) చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్‌ భార్య నారా బ్రాహ్మణి పేరుతో రూ.18.75 కోట్లకు కొనుగోలు చేయడం గమనార్హం. అంటే గజం రూ.7,500 చొప్పు­న ఖరీదు చేశారు. కాగా, చంద్రబాబు అమరావతి ప్రాంతంలో చదరపు గజం రూ.60 వేలు పలుకుతోందని చెబుతుంటారు. ఈ ప్రకారం చూస్తే నాలుగు వైపులా రోడ్డు ఉన్న వెలగపూడిలోని స్థలం విలువ సుమారు రూ.150 కోట్ల వరకు ఉంటుంది. మరి రాజభవనం నిర్మాణానికి ఇంకెన్ని రూ.వందల కోట్లు వ్యయం చేస్తారోనని రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. బాబుకు ఉన్నవి అన్నీ ప్యాలెస్‌లే..చంద్రబాబుకు ఇప్పటికే హైదరాబాద్‌లో అత్యంత సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ సమీపంలో రూ.వందల కోట్లతో నిర్మించిన భారీ ప్యాలెస్‌ ఉంది. దీనిని పక్కనున్న భవనాలు, స్థలాలు కొనేసి సువిశాల విస్తీర్ణంలో నిర్మించడం గమనార్హం. 2014–19 మధ్య అధికారంలో ఉండగా దీని నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 2019 ఎన్నికలకు ముందు గృహ ప్రవేశం చేశారు. అంతకు­ముందే జూబ్లీహిల్స్‌లో చంద్రబాబుకు సువిశాల విస్తీర్ణంలో ప్యాలెస్‌ ఉండేది. దానిని కూల్చివేసి.. అధునాతన సాంకేతికత, అత్యాధునిక హంగులతో రాజభవనం నిర్మించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అత్యంత ఖరీదైన ఉపకరణాలను దిగుమతి చేసుకుని నిర్మాణంలో వినియోగించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు ఇంద్రభవనం మదీనాగూడలో నిజాం నవాబును తలదన్నేలా..హైదరాబాద్‌లోని కొండాపూర్‌ ప్రాంతం హైటెక్‌ సిటీకి దగ్గరగా ఉంటుంది. చాలా ఖరీదైనదిగా పేరుగాంచింది. అక్కడికి సమీపంలోని మదీనాగూ­డలో చంద్రబాబుకు ఐదు ఎకరాల ఫాంహౌస్‌ ఉంది. దీని విలువ రూ.వందల కోట్లలోనే ఉంటుంది. నిజాం నవాబును తలపించే రీతిలో వైభోగం అన్న­మాట. మరోవైపు హైదరాబాద్‌లో సంపన్న ప్రాంత­మైన జూబ్లీహిల్స్‌లో రాజభవనం లాంటి నివాసం. బహుశా దేశంలో సంపన్నులు ఉండే ప్రాంతంలో రాజభవనం, ఫాంహౌస్‌ చంద్రబాబుకు ఒక్కరికే ఉందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.పదేళ్లుగా అక్రమ ప్యాలెస్‌లో విలాసంచంద్రబాబు.. పదేళ్లుగా ఉండవల్లి సమీపాన కృష్ణా నది కరకట్ట లోపల లింగమనేని రమేష్‌ అక్రమంగా నిర్మించిన విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నారు. రమేష్‌ అత్యాధునిక హంగులతో ఈ భారీ బంగ్లాని నిర్మించారు. కాగా, 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చంద్ర­బాబు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఆడియో టేపుల సాక్షిగా ఆయన బండారం బయటపడింది. అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకుంటుందోనన్న భయంతో హైదరాబాద్‌ను ఉన్నపళంగా వదిలి వచ్చేశారు. లింగమనేని అక్రమ బంగ్లాను నివాసంగా ఎంచుకున్నారు. అప్పటినుంచి.. అంటే పదేళ్లుగా అందులోనే ఉంటున్నారు.ఉండవల్లిలో కృష్ణానది కరకట్ట వెంట చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ భవనం పార్టీ వారికీ ప్రవేశం లేదు..చంద్రబాబు తాజాగా వెలగపూడిలో తలపెట్టిన రాజభవన నిర్మాణం భూమి పూజకు టీడీపీ నేతలను సైతం ఆహ్వానించకపోవడడం గమనార్హం. ఇక జూబ్లీహిల్స్‌లోని రాజభవనం గృహ ప్రవేశ కార్యక్రమానికి పార్టీ నేతలను ఎవరినీ ఆహ్వానించలేదని టీడీపీ సీనియర్‌ నేతలు చెబుతుంటారు. అందులోకి ఇప్పటికీ తమ పార్టీ నేతలకు ప్రవేశం లేదని అంటుంటారు.కొత్త రాజభవనం.. నిర్మాణానికి ఇంకెన్ని కోట్లో..?చంద్రబాబు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఆరేళ్ల కిందట నిర్మించుకున్న రాజ భవనానికే రూ.వందల కోట్లు వ్యయం అయినట్లు చెబుతుంటారు. ఇప్పుడు అమరావతిలో తలపెట్టిన రాజభవనం మరింకెన్ని కోట్లు ఉంటుందోనని అంటున్నారు. భూమి కొనుగోలుకే రూ.18 కోట్లకు పైగా వ్యయం చేసిన నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నారు. పైగా వెలగపూడిలో ఏకంగా 5.16 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుండడాన్ని ప్రస్తావిస్తున్నారు.అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉండగానే..చంద్రబాబు జూబ్లీహిల్స్‌ రాజభవనం నిర్మా­ణాన్ని 2019కి ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే చేపట్టి పూర్తి చేశారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండగానే వెలగ­పూడిలో మరింత భారీఎత్తున రాజభవనం నిర్మాణం చేపట్టడం గమనార్హం.అద్దాల మేడల్లో ఉంటూ అవతలి వారిపై దుష్ప్రచారంతాను 5.16 ఎకరాల్లో రాజభవనం కట్టుకుంటూ పేదవాడిననే బిల్డప్‌లుపార్టీ కార్యాలయం లేకుండానే భారీ విస్తీర్ణంలో నిర్మాణానికి ప్రయత్నంవైఎస్‌ జగన్‌ 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం, ఇల్లు నిర్మించుకుంటే నిందలుతాడేపల్లి ప్యాలెస్‌ అంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు దుష్ప్రచారంవిశాల విస్తీర్ణంలో జూబ్లీహిల్స్‌లో, మదీనాగూ­డలో రాజభవనాలు కలిగి.. ప్రస్తుతం అక్రమంగా కట్టిన విలాసవంతమైన భారీ బంగ్లాలో ఉంటూ.. కొత్తగా మరో భారీ రాజభవనం నిర్మాణా­నికి పూను­కున్న చంద్రబాబు తాను నిరుపేదను.. గుడిసె వాసిని అనే తరహాలో బీద అరుపులు అరుస్తుంటారు. అవతలివారిపై అకారణంగా నిందలు వేస్తుంటారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు. వాటిని చూపుతూ తాడేపల్లి ప్యాలెస్‌ అంటూ తరచూ చంద్రబాబు, ఎల్లో మీడియా, పచ్చ దండు దుష్ప్రచారం చేస్తుంటారు. తాను ఉంటున్న ఇంద్ర భవనాలు మాత్రం పూరి గుడిసెలు అన్నట్లు ప్రజ­లను నమ్మించడానికి చంద్రబాబు ఎప్పటి­కప్పుడు కొత్త కొత్త ప్రచారాలు తెరపైకి తెస్తుంటారు.

Mudragada Padmanabham Letter To YS Jagan Mohan Reddy2
వైఎస్‌ జగన్‌కి ముద్రగడ పద్మనాభం లేఖ

కాకినాడ,సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి.. ఆ పార్టీ సీనియర్‌ నేత ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ముద్రగడ.. వైఎస్‌ జగన్‌కి లేఖ రాశారు. ఆ లేఖలో.. ‘వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమీటీ సభ్యునిగా నియమించడంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నా కృతజ్ఞతలు. నాపై పెట్టిన భాధ్యతను పార్టీ గెలుపు కోసం త్రికరణ శుద్దితో కష్టపడి పని చేస్తాను. పేదలకు మీరే అక్సిజన్. ఈ ధఫా మీరు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి పీఠంపై కన్నెత్తి చూడకుండా పదికాలల పాటు పరిపాలన చేయాలి’ అని పేర్కొన్నారు.

BJP Slams TMC MP Yusuf Pathan Insta Post3
యూసుఫ్‌ పఠాన్‌పై బీజేపీ ఫైర్‌.. కొంచమైనా సిగ్గుగా లేదా? అంటూ..

కోల్‌కతా: వక్ఫ్‌ (సవరణ) చట్టంపై పశ్చిమ బెంగాల్‌లో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పలుచోట్ల హింసాత్మక ఘటనల కారణంగా ముగ్గురు మృతిచెందగా.. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో రెండ్రోజుల ఘటనలకు సంబంధించి 118 మందిని అరెస్టు చేశారు. ఇలాంటి సమయంలో తృణముల్‌ కాంగ్రెస్‌ ఎంపీ యూసుఫ్‌ పఠాన్‌ చేసిన పనిని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. కొంచమైనా సిగ్గు అనిపించడం లేదా? అంటూ ఘాటు విమర్శలు చేసింది.కాగా, మాజీ టీమిండియా క్రికెటర్, టీఎంసీ యూసుఫ్ పఠాన్ ముర్షిదాబాద్ జిల్లాలోని మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటైన బహరంపూర్ నుండి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. జిల్లాలోని సుతి, ధులియా, సంసేర్‌గంజ్ సహా మరికొన్ని ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాల్దా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. నిషేధాజ్ఞలు విధించడంతోపాటు ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేశారు.బెంగాల్‌ దారుణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎంపీ యూసుఫ్‌ పఠాన్‌ Instagram‌ వేదికగా తన ఫొటోలను షేర్‌ చేశారు. ఆయన కాఫీ తాగుతున్న ఫొటో ఒకటి కాగా.. దర్జాగా, ఉల్లాసంగా ఉన్న మరో ఫొటోను షేర్‌ చేశారు. దీంతో, ఎంపీ యూసుఫ్‌ పఠాన్‌పై బీజేపీ విరుచుకుపడింది. రాష్ట్రం, పఠాన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ప్రజలు అల్లాడిపోతుంటే వారి ఆదుకోకుండా, కనీసం పరామర్శించకుండా ఇలాంటి పోస్టులు పెట్టడానికి సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. View this post on Instagram A post shared by Yusuf Pathan (@yusuf_pathan) ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవల్లా ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘బెంగాల్‌ మండిపోతోంది. పోలీసులు మౌనంగా ఉండగా.. మమతా బెనర్జీ హింసను ప్రోత్సహిస్తున్నారు! ఇంతలో యూసుఫ్ పఠాన్.. ఒక ఎంపీగా ఉండి ఎంజాయ్‌ చేస్తున్నారు. తన నియోజకవర్గంలో హిందువులు ఊచకోతకు గురవుతున్న క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది తృణముల్‌ కాంగ్రెస్‌ అంటే అని’ ఘాటు విమర్శలు చేశారు. యూసుఫ్‌ పోస్టుపై అటు నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. హింసాత్మక ఘటనలపై కలకత్తా హైకోర్టులో శాసనసభ విపక్షనేత సువేందు అధికారి పిటిషన్‌ దాఖలు చేశారు. శనివారం సెలవైనా అత్యవసర విచారణ జరపడానికి జస్టిస్‌ సౌమెన్‌ సేన్‌ నేతృత్వంలో ప్రత్యేక ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి నియమించారు. ముర్షిదాబాద్‌ జిల్లాలో కేంద్ర బలగాలను మోహరించాలని ఈ ధర్మాసనం ఆదేశించింది. పరిణామాలపై తాము కళ్లు మూసుకోలేమని జస్టిస్‌ సౌమెన్‌ సేన్‌ వ్యాఖ్యానించారు. వివరాలను నివేదించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. Bengal is burningHC has said it can’t keep eyes closed and deployed centra forcesMamata Banerjee is encouraging such state protected violence as Police stays silent! Meanwhile Yusuf Pathan - MP sips tea and soaks in the moment as Hindus get slaughtered… This is TMC pic.twitter.com/P1Yr7MYjAM— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) April 13, 2025

Still Making Me Laugh Abhishek Was Lucky: Shreyas Iyer On PBKS Loss4
నాకైతే నవ్వొస్తోంది.. అభిషేక్‌ లక్కీ.. అతడుంటే వికెట్లు తీసేవాడు: శ్రేయస్‌

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో పంజాబ్‌ కింగ్స్‌ జైత్రయాత్రకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) అడ్డుకట్ట వేసింది. భారీ స్కోరు సాధించినా.. పంజాబ్‌కు ఆ సంతోషాన్ని మిగలనివ్వలేదు. ఆడుతూ పాడుతూ.. లక్ష్యాన్ని ఛేదించి శ్రేయస్‌ అయ్యర్‌ సేనకు ఊహించని షాకిచ్చింది. విధ్వంసకర బ్యాటింగ్‌లో తమకు తిరుగులేదని మరోసారి చాటుకుని.. పంజాబ్‌ను ఏకంగా ఎనిమిది వికెట్లతో రైజర్స్‌ చిత్తు చేసింది.ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘నిజం చెప్పాలంటే మేము అద్బుతంగా బ్యాటింగ్‌ చేసి భారీ స్కోరు సాధించాము. కానీ వాళ్లు.. మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే దానిని ఛేదించేశారు.నాకైతే నవ్వొస్తోంది.. అభిషేక్‌ లక్కీ..ఇదెలా సాధ్యమైందో!.. నాకైతో నవ్వు వస్తోంది. మేము కొన్ని క్యాచ్‌లు మిస్‌ చేశాం. అభిషేక్‌ అదృష్టవంతుడు. అసాధారణ ఆటగాడు. మేము అంచనాలకు తగ్గట్లుగా బౌలింగ్‌ చేయలేకపోయాం. పొరపాట్లను సమీక్షించుకోవాలి.ఏదేమైనా అభిషేక్‌- ట్రవిస్‌ హెడ్‌ మధ్య ఓపెనింగ్‌ భాగస్వామ్యం అద్భుతం అనే చెప్పాలి. మాకు పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు. ఫెర్గూసన్‌ వరుస విరామాల్లో వికెట్లు తీసేవాడు. కానీ.. అతడు గాయపడ్డాడు.అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటిఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతాం. నేను, వధేరా 230.. మంచి స్కోరు అనుకున్నాం. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపింది. ఇక సన్‌రైజర్స్‌ ఓపెనర్లు బ్యాటింగ్‌ చేసిన తీరును మాటల్లో వర్ణించలేము. ముఖ్యంగా అభిషేక్‌ శర్మ.. నేను ఇంత వరకు చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటి ఇది’’ అని శ్రేయస్‌ అయ్యర్‌ ప్రత్యర్థి జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు.కాగా ఉప్పల్‌లో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ సన్‌రైజర్స్‌తో తలపడింది. టాస్‌ గెలిచిన శ్రేయస్‌ అయ్యర్‌.. ఆతిథ్య జట్టును తొలుత బౌలింగ్‌కు ఆహ్వానించాడు. ఇక బ్యాటింగ్‌ అనుకూలించిన పిచ్‌పై పంజాబ్‌ బ్యాటర్లు దంచికొట్టారు.శ్రేయస్‌ అయ్యర్‌ ధనాధన్‌ఓ‍పెనర్లలో ప్రియాన్ష్‌ ఆర్య (13 బంతుల్లో 36) మెరుపు వేగంతో ఆడగా.. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (23 బంతుల్లో 42) రాణించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ భారీ అర్ధ శతకం (36 బంతుల్లో 82) దుమ్ములేపగా.. ఆఖర్లో మార్కస్‌ స్టొయినిస్‌ (11 బంతుల్లో 34 నాటౌట్‌) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా పంజాబ్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.‘ట్రావిషేక్‌’ జోడీ బీస్ట్‌ మోడ్‌ఇక లక్ష్య ఛేదనను సన్‌రైజర్స్‌ 18.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి పూర్తి చేసింది. చాన్నాళ్ల తర్వాత రైజర్స్‌ ఓపెనింగ్‌ ‘ట్రావిషేక్‌’ జోడీ బీస్ట్‌ మోడ్‌లో బ్యాటింగ్‌ చేసింది. ట్రవిస్‌ హెడ్‌ (37 బంతుల్లో 66) అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. అభిషేక్‌ శర్మ (55 బంతుల్లో 141) భారీ సెంచరీతో మెరిసి.. రైజర్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీరుడికి అదృష్టం కూడా కలిసి వచ్చిందిఅయితే, అభిషేక్‌ శర్మ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత.. రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్‌ చహల్‌ వేశాడు. అతడి బౌలింగ్‌లో అభి ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను చహల్‌ మిస్‌ చేశాడు. అంతకంటే ముందు అంటే మూడో ఓవర్లో అభి రనౌట్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తర్వాత(3.4 ఓ‍వర్‌) నోబాల్‌ ద్వారా లైఫ్‌ పొందాడు. ఆ తర్వాత.. అంటే 12.4 వద్ద అభి శతకం పూర్తి చేసుకుని ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ (40 బంతుల్లో) నమోదు చేసిన బ్యాటర్ల జాబితాలో చేరాడు. మరోవైపు.. పంజాబ్‌ బౌలర్‌ ఫెర్గూసన్‌ రెండు బంతులు వేసిన తర్వాత గాయంతో మైదానం వీడాడు.చదవండి: అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్‌ FORTUNE FAVOURS THE BRAVE, INDEED! 🙌#AbhishekSharma, what an innings 💪#IPLonJioStar 👉 #SRHvPBKS | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/x4FqzXsiWI— Star Sports (@StarSportsIndia) April 12, 2025WHAT. A. MOMENT. 🙌100 reasons to celebrate #AbhishekSharma's knock tonight! PS. Don't miss his special message for #OrangeArmy 🧡Watch the LIVE action ➡ https://t.co/HQTYFKNoGR#IPLonJioStar 👉 #SRHvPBKS | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/DECkzxRYhi— Star Sports (@StarSportsIndia) April 12, 20254, 6, CAUGHT but NO-BALL, 6 on Free-hit! 🔥Stop watch you're doing because it's all happening in Hyderabad 🥶Watch the LIVE action ➡ https://t.co/HQTYFKNoGR#IPLonJioStar 👉 #SRHvPBKS | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/vAEZNA65wD— Star Sports (@StarSportsIndia) April 12, 2025

Adoni BJP MLA Parthasarathi Serious Comments On TDP Leaders5
‘కూటమి విజయంలో బీజేపీదే కీలక పాత్ర.. టీడీపీ ఓవరాక్షన్‌ ఎక్కువైంది’

సాక్షి, అనంతపురం: ఏపీలో అధికార కూటమి పార్టీ మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. తాజాగా టీడీపీ నేతల తీరుపై ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి బీజేపీనే కీలక పాత్ర పోషించింది. అలాంటి బీజేపీ నాయకులపై ఎందుకంత చిన్న చూపు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిలపై బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాడిపత్రిలో బీజేపీ నేతలకు కనీస గౌరవం లేదని అసహనం ప్రదర్శించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ..‘టీడీపీ కూటమి అధికారంలోకి రావడంలో బీజేపీ పాత్ర కీలకం. మేము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో బీజేపీ కార్యకర్తలతో సమానంగా టీడీపీ, జనసేన శ్రేణులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మరి మీరెందుకు బీజేపీ నాయకులపై చిన్నచూపు చూస్తున్నారు?. తాడిపత్రి బీజేపీ నేతల సమస్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు కూడా ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మధ్య మాటల యుద్ధం నడిచింది. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధిపై మీనాక్షి నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత ఒకలా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే పార్థసారధి వైఖరి సరైంది కాదు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కూటమి ఎమ్మెల్యే అని మరచి పోతున్నాడు. ఎమ్మెల్యే పార్థసారథి వాస్తవాలు చెప్పాలి. ఏది పడితే అది చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రభుత్వ కార్యక్రమాలకు నన్ను పిలువకుండా దూరం పెట్టారు. టీడీపీ వారికి ఏ పనులు చేయడం లేదు. ఇలాగే కొనసాగితే మున్ముందు ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడికి ఎమ్మెల్యే పార్థసారధి తిరిగి కౌంటర్ ఇస్తూ.. తాను చెప్పిందే వినాలి అన్నట్లు మీనాక్షి నాయుడు వ్యవహరిస్తున్నారని.. బీజేపీలో, జనసేనలో ఏ వర్గాలు లేవు. కాని టీడీపీలో ఐదు వర్గాలు ఉన్నాయి. పది శాతం తన గురించి ఆలోచిస్తే 90 శాతం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తల గురించే ఆలోచిస్తాను. సమస్య అంతా మీనాక్షినాయుడుతోనే ఉంది. కూటమి కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహంగా ఉన్నారు. కార్యక్రమాలకు నేను పిలుస్తున్నా వాళ్లే రావడం లేదని అన్నారు.

Khushbu Sundar's daughter Avantika Sundar Says Parents Refused To Launch Her6
సినిమాల్లోకి రావాలని చాన్నాళ్లుగా వెయిటింగ్‌.. అమ్మ ఒప్పుకోవట్లే!: ఖుష్బూ కూతురు

కోలీవుడ్‌ జంట ఖుష్బూ - సుందర్‌ (Khushbu - Sundar) కూతురు అవంతిక సినిమాల్లోకి రానుందని ప్రచారం ఊపందుకుంది. ఆమె గ్లామరస్‌గా ముస్తాబైన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్‌ దొరికేసిందని జనాలు ఫీలయ్యారు. తనకు కూడా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని ఆరాటంగా ఉందట.. కానీ ఇంట్లో వాళ్లు తనను లాంచ్‌ చేసేందుకు సిద్ధంగా లేరంటూ బుంగమూతి పెట్టింది అవంతిక.అమ్మానాన్న రెడీగా లేరుతాజాగా ఓ ఇంటర్వ్యూలో అవంతిక సుందర్‌ (Avantika Sundar) మాట్లాడుతూ.. అమ్మానాన్న నన్ను వెండితెరపైకి తీసుకురావడానికి సిద్ధంగా లేరు. ఆ మాటకొస్తే వారి చేతులమీదుగా లాంచ్‌ అవడం నాకూ అంతగా ఇష్టం లేదనుకోండి. కానీ ఎవరో ఒకరు నాకోసం వస్తారు? లేదా నేనే సొంతంగా సినిమాల్లోకి అడుగుపెడతాను అని ఆశిస్తే అది అత్యాశే అవుతుంది. ఎందుకంటే వారి సహాయసహకారాలు లేకుండా ఇవేవీ సాధ్యపడవు.అమ్మను అడుగుతా..నా పేరెంట్స్‌ వల్లే నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టగలను. వారు నన్ను లాంచ్‌ చేయడానికి సుముఖత చూపించడం లేదు. నా అంతట నేను ఎదగాలన్నది వారి ఆలోచన. కానీ అందుకు వారి సహాయం కావాలి. కనీసం చిత్రపరిశ్రమకు చెందినవారిని అయినా పరిచయం చేయమని అమ్మను అడుగుతున్నాను. అలా అయినా పరిచయాలు పెంచుకుని నేనేదైనా సాధించగలను. స్టార్‌ కిడ్‌గా నాపై ఎక్కువ అంచనాలు, ఒత్తిడి ఉంటాయని పేరెంట్స్‌ చెప్పారు. నేను వాటన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రిపరేషన్‌ కోసం లండన్‌లో డ్రామా స్కూల్‌కు కూడా వెళ్లొచ్చాను. వాళ్లకంటే ఎక్కువ సక్సెస్‌?అయితే నా మెదడులో ఒక ఆలోచన ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. నేనేం చేసినా నా పేరెంట్స్‌తో పోల్చకుండా ఉండలేరు. వాళ్ల కన్నా ఎక్కువ సక్సెస్‌ అవుతానని నేను చెప్పలేను కానీ నా శక్తి మేర ప్రయత్నిస్తాను. తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్పనా.. నాకు ఫెయిల్యూర్స్‌ అంటే భయం. ఓటమిని తట్టుకోలేను. నా కుటుంబం, ఫ్రెండ్స్‌ మాత్రం.. ఫలితాన్ని పట్టించుకోకు.. దానికోసం నువ్వెంత కష్టపడ్డావు? అన్నదే ముఖ్యం అని నాకు ధైర్యం చెప్తూ ఉంటారు.చాలాకాలంగా వెయిటింగ్‌సినిమాల్లోకి రావాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. కానీ నా ఎత్తు సమస్యగా మారుతుందేమో అనిపిస్తోంది. నేను 5 అడుగుల 11 అంగుళాల పొడవున్నాను. ఒక నటి ఎలా ఉండాలో అలా లేనేమో అనిపిస్తుంది. ఒకప్పుడైతే లావుగా కూడా ఉన్నాను. అప్పుడు స్క్రీన్‌పై హీరోయిన్లను చూసి నేను కథానాయికగా పనికి రాను అనుకున్నాను. కరోనా సమయంలో ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెట్టి ఇలా మారిపోయాను అని అవంతిక చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by avantika (@avantikasundar)చదవండి: విశ్వంభర గ్రాఫిక్స్‌ వర్క్‌పై 'బన్ని' నిర్మాత కామెంట్లు

KTR Welcomes Supreme Court Stand on Governors7
KTR: ‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా’

హైదరాబాద్‌,సాక్షి: సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. గవర్నర్ల నిర్ణయాలకు కాలపరిమితిని నిర్ధేశించిన సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆదివారం ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. పాలనలో అడ్డంకులు సృష్టించడానికి బీజేపీ,కాంగ్రెస్‌ జాతీయ పార్టీలు లెక్కలేనన్ని సార్లు గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేశాయి. అసెంబ్లీ స్పీకర్లచే రాజ్యాంగ దుర్వినియోగాన్ని కూడా.. సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితి నిర్ణయించాలని ఎక్స్‌లో పేర్కొన్నారు. Welcome the Hon’ble Supreme Court’s decision to set a timeline for decisions of GovernorsCountless times, both BJP and Congress have abused the institution of Governor to create hindrances in Governance Supreme Court should also take into cognisance the rampant abuse of… https://t.co/Oj2hTA2hWd— KTR (@KTRBRS) April 13, 2025

Russian Missile Strikes Indian Pharma Firm In Ukraine8
మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్‌ సీరియస్‌

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను టార్గెట్‌ చేసిన రష్యా దళాలు.. భీకర దాడులు చేశాయి. ఈ క్రమంలో భారతీయ ఔషధ కంపెనీ గోదాముపై రష్యా దాడి చేసింది. దీంతో, పేలుడు సంభవించి దట్టమైన మంటలు చెలరేగాయి. మరోవైపు.. రష్యా దాడులను భారత్‌ తీవ్రంగా ఖండించింది. భారత్‌తో స్నేహం ఉందని చెప్పే రష్యా కావాలనే ఇలా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్‌ అంటూ ప్రశ్నించారు.వివరాల ప్రకారం.. కీవ్‌లోని భారతీయ ఔషధ కంపెనీ కుసుమ్‌ అనే కంపెనీకి చెందిన గోదాముపై శనివారం రష్యా దాడి చేసింది. రష్యాకు చెందిన డ్రోన్ల దాడిలో గోదాం పూర్తిగా ధ్వంసమైంది. ఈ మేరకు గోదాంపై దాడి జరిగిందని ఢిల్లీలోని ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. రష్యా కావాలనే భారతీయ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించింది. పిల్లలు, వృద్ధుల కోసం ఔషధాలు నిల్వ చేసిన గోదాములపై ఇలా దాడులు చేస్తోందని విమర్శించింది. భారత్‌తో స్నేహం ఉందని చెప్పే రష్యా కావాలనే ఇలా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్‌ అంటూ ప్రశ్నించింది.Breaking⚡️ : #Ukraine allege Indian pharmaceutical company godown hit by Russia leading to loss of medicines meant for children and distress people. Still to receive any statement from India or Moscow. #RussiaUkraineWar pic.twitter.com/VfpYND8PNq— Neeraj Rajput (@neeraj_rajput) April 12, 2025ఇక, అంతకుముందు ఉక్రెయిన్‌లోని బ్రిటన్‌ రాయబారి మార్టిన్‌ హారిస్‌ దాడిని ధ్రువీకరించారు. రష్యా డ్రోన్ల దాడిలో ఔషధాల గోదాము పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్‌తోపాటు 29 దేశాల్లో తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కుసుమ్‌ హెల్త్‌కేర్‌ వెబ్‌సైట్‌లో ఉంది. భారతీయ వ్యాపారవేత్త రాజీవ్ గుప్తా యాజమాన్యంలోని కుసుమ్, ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ఫార్మా సంస్థలలో ఒకటి.

Biodegradable Plastics Commonly Produced With Renewable Raw Materials9
Biodegradable Plastics: చేతికి మట్టి అంటాలి..!

ప్రపంచానికి ప్లాస్టిక్‌ దెయ్యం పట్టింది. ఆ దెయ్యాన్ని వదిలించటానికి శాస్త్రవేత్తలు విస్తృత ప్రయోగాలు, పరిశోధనలు చేస్తున్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్నామ్నాయంగా ‘బయోడీగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌’ను సృష్టించి, ప్లాస్టిక్‌ దెయ్యం విశ్వరూపం దాల్చకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బయోడీగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌ అంటే... మట్టిలో కలిసిపోయే ప్లాస్టిక్‌. మనిషంటేనే మట్టి. కానీ, మట్టి అంటకుండా మనిషి తన జీవితాన్ని సాగించటం మొదలు పెట్టాక... మనిషికి–మట్టికి మధ్య బాంధవ్యం తెగిపోతూ వచ్చింది. ఇప్పుడు మనిషి చేతులకు అంటింది మట్టి కాదు, ప్లాస్టిక్‌! మనిషి నిండు నూరేళ్లకు కాలం చేసినా, మనిషి వాడేసిన ప్లాస్టిక్‌ మాత్రం– ఏడేడు జన్మలు కూడా దాటి వెయ్యేళ్లు జీవించే ఉంటుంది. ఈ ప్లాస్టిక్‌ మహమ్మారి భూమిలో శిథిలం కాదు, సముద్రంలో చివికిపోదు. అగ్నిలో వేస్తే అసలుకే మోసం! ఆ కాలుష్య జ్వాలలు భూతాల్లా లేచి, భూతాపాన్నే పెంచేస్తాయి! మట్టిలో కలిసిపోకుండా కొండల్లా పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాల నుండి వెలువడే విషవాయువులు పర్యావరణానికి హాని చేస్తాయి. ప్రాణుల ఆరోగ్యాన్ని హరిస్తాయి. భూసారం క్షీణిస్తుంది. సముద్రగర్భం కలుషితమైపోతుంది. అంతరిక్షంలోనూ అక్కడ ఉండే ప్లాస్టిక్‌ వ్యర్థాలు భవిష్యత్‌ వ్యోమగాముల కార్యకలాపాలకు ముప్పు కలిగిస్తాయి. మొత్తంగా పంచభూతాలనే ప్లాస్టిక్‌ పొట్టన పెట్టుకుంటుంది. ఎంత విషాదం! మనిషిని సృష్టించిన ప్రకృతిని, మనిషి సృష్టించిన ప్లాస్టిక్‌ మింగేస్తోంది. ∙∙ ప్రపంచంలో ప్రతి నిముషానికి 10 లక్షల ప్లాస్టిక్‌ బ్యాగులు వాడకంలోకి వస్తున్నాయి! ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ 98 కోట్ల 35 లక్షల 61 వేల కిలోల ప్లాస్టిక్‌ ఉత్పత్తి అవుతోంది. అత్యంత ప్రమాదకారి అయిన ‘ఒకసారి వాడి పడేసే’ ప్లాస్టిక్‌... వాడకంలో ఉన్న ప్లాస్టిక్‌లో 50 శాతం వరకు ఉంటోంది! ఇక సముద్ర వ్యర్థాల్లో 80 శాతం వరకు ప్లాస్టిక్‌ చెత్తే. ఈ ప్రమాదాన్ని మరింతగా పెరగనివ్వకుండా ఉండేందుకు ప్రపంచ దేశాలు సిద్ధం అయ్యాయి. మనిషి దైనందిన జీవితంలోని అవసరాలకు అనుగుణంగా బయోప్లాస్టిక్‌ (బయోడీగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌) పై పరిశోధనలు జరిపిస్తున్నాయి. మట్టిలో కలిసిపోయే బయోప్లాస్టిక్‌తో బ్యాగులు, వంటింటి పాత్రలు, కప్పులు, సాసర్‌లు, తేలికపాటి గృహోపకరణాలు, ప్యాకింగ్‌ మెటీరియల్‌ వంటివి ఉత్పత్తి చేయటానికి పనికొచ్చే పదార్థాల అన్వేషణపై పెట్టుబడులు పెడుతున్నాయి. బయో–ప్లాస్టిక్‌ పరిశోధనలుచైనా: సూక్ష్మజీవులను ఉపయోగించి బయో ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేసే కొత్త పద్ధతులను చైనా పరిశోధకులు అన్వేషిస్తున్నారు.అమెరికా: ఒక ఏడాది లోపు విచ్ఛిన్నమయ్యే ‘క్లింగ్‌ ఫిల్మ్‌’ వంటి వినూత్నమైన బయో ప్లాస్టిక్‌ను సృష్టించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఆహార పదార్థాలను చాలాకాలం పాటు నిల్వ ఉంచేందుకు వాటి కంటెయినర్‌లకు చుట్టే పల్చటి పారదర్శక మెటీరియలే క్లింగ్‌ ఫిల్మ్‌.ఐరోపా: ఐరోపా దేశాలు బయో ప్లాస్టిక్‌ల పరిశోధనలో చురుగ్గా పాల్గొంటున్నాయి. పర్యావరణ హితమైన ప్లాస్టిక్‌లను కనిపెట్టేందుకు కృషి చేస్తున్నాయి. ఇండియా: బయో ప్లాస్టిక్‌ల ఉత్పత్తిలో వినూత్న విధానాలను ఆవిష్కరించే పరిశోధనల కోసం గువాహటి, మద్రాస్‌ ఐఐటీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. మద్రాస్‌ ఐఐటీ పుట్టగొడుగులు, చెరకుపిప్పి, వరిగడ్డి నుంచి బయోప్లాస్టిక్‌ను తయారు చేసే పనిలో ఉంది.బ్రెజిల్‌: ‘బ్రాస్కెమ్‌’ వంటి పెట్రో కెమికల్‌ కంపెనీలు బయో ప్లాస్టిక్‌పై విస్తృతమైన పరిశోధనలు జరుపుతున్నాయి.దక్షిణాఫ్రికా: వ్యర్థ పదార్థాల నుండి బయో ప్లాస్టిక్‌లను అభివృద్ధి చేయటానికి దక్షిణాఫ్రికా పరిశోధకులు విశేష కృషి సల్పుతున్నారు. ఈ దేశాలే కాక, కొరియా.. బాక్టీరియా నుంచి బయోడీగ్రేడబుల్‌ నైలాన్‌ ఉత్పత్తి చేస్తోంది. నార్వే.. నాచుతో స్ట్రాలు, స్పూన్లు తయారు చేస్తోంది. కెనడా పుట్టగొడుగుల నుండి అత్యంత పటిష్ఠమైన ప్లాస్టిక్‌లను వృద్ధి చేస్తోంది. బయో ప్లాస్టిక్‌ తయారీలో ప్రధానంగా మొక్కజొన్న పిండి, చెరకుపిప్పి, బంగాళదుంపల పిండి, గోధుమ పిండి వంటి పంట వనరుల్ని ఉపయోగిస్తున్నారు. బయో ప్లాస్టిక్‌ ప్రయోజనాలుకార్బన్‌ ఫుట్‌ప్రింట్‌ తగ్గుతుంది: బయో ప్లాస్టిక్‌లు వాతావరణం నుండి కార్బన్‌ డయాక్సైడ్‌ను తొలగించడంలో సహాయపడతాయి. అవి మొక్కల నుండి తయారౌతాయి కనుక మొక్కల పెరుగుదలకు అవసరమైన కార్బన్‌ డైయాకైడ్‌ను వాతావరణం నుండి సంగ్రహిస్తాయి. దీనినే ‘కార్బన్‌ సింక్‌’ అని పిలుస్తారు.తక్కువ శక్తి వినియోగం: మామూలు ప్లాస్టిక్‌లతో పోలిస్తే బయోప్లాస్టిక్‌లను ఉత్పత్తి చేయడానికి తక్కువ శక్తి అవసరం. ఇలా శక్తి వినియోగం తగ్గటం గ్రీన్‌ హౌస్‌ వాయు ఉద్గారాలను తగ్గించడానికి తోడ్పడుతుంది.వేగంగా విచ్ఛిన్నం: బయో ప్లాస్టిక్‌లు తయారీ పద్ధతిని అనుసరించి 18 నుండి 36 నెలల్లో అవి విచ్ఛిన్నమవుతాయి. ఇందుకు భిన్నంగా మామూలు ప్లాస్టిక్‌లు మట్టిలో పూర్తిగా కలిసిపోవటానికి 1,000 సంవత్సరాల పట్టవచ్చు. పర్యావరణానికి మేలు: పరిశోధకులు సూక్ష్మ జీవ బ్యాక్టీరియాతో తయారు చేసిన బయోప్లాస్టిక్‌లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ బయోప్లాస్టిక్‌లను సహజ రబ్బరు, ఇతర పదార్థాలతో కలిపి మరింత పర్యావరణ హిత ప్లాస్టిక్‌లను సృష్టించవచ్చు. అలవాటు మానాలిప్లాస్టిక్‌ను వాడే అలవాటు మనిషి నరనరాన ఎలాగైతే జీర్ణించుకుపోయిందో, అలా – ఆ ప్లాస్టిక్‌లోని విష రసాయనాలు మనిషి రక్తంలో కలిసిపోయి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఒక కొత్త విషయాన్ని కనిపెట్టటం కంటే కూడా ఒక పాత అలవాటును మార్పించటానికే ఒక్కోసారి ప్రపంచ దేశాలకు ఎక్కువ ఖర్చు అవొచ్చు. అయినప్పటికీ తగిన ప్రచారంతో, హెచ్చరికలతో, శిక్షల భయంతో ప్రజా చైతన్యం తెచ్చి, ప్లాస్టిక్‌ నుండి మనిషిని ప్రభుత్వాలే విముక్తం చేయాలి. శాస్త్రవేత్తలు పరిష్కారాన్ని కనిపెట్టినంత మాత్రాన మార్పు రాదు. మార్పువైపు మనిషిని నడిపించటం కూడా ముఖ్యమే.– సాక్షి, స్పెషల్‌ డెస్క్‌(చదవండి: అభినవ శ్రవణుడి ఆధ్యాత్మిక యాత్ర..!)

Yavatmal farmer Keshav Shinde's red sandalwood tree10
రైతు తలరాత మార్చిన రైల్వే లైన్‌.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు

అదృష్టం ఎప్పుడు.. ఎవరిని వరిస్తుందో తెలియదు. నిన్న రోజున బీకరిని.. రేపటి రోజున కోటీశ్వరుడిని చేస్తుంది. ఇదే సమయంలో కోటిశ్వరుడిని.. బీకరిని సైతం చేయగలదు. అలాగని, అదృష్టం కోసం అక్కడే కూర్చుంటే.. అంతకన్నా బిగ్‌ మిస్టేక్‌ మరొకటి ఉండదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే.. ఓ రైతు తన వ్యవసాయ భూమిలో ఉన్న ఓ చెట్టుతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. దీంతో, సోషల్‌ మీడియాలో ఆయన పేరు చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లాలో పుసాద్‌ తాలూకా ఖుర్షి గ్రామంలో కేశవ్‌ షిండే అనే రైతు ఉన్నాడు. తన ఐదుగురు కొడుకులతో కలిసి తమకు ఉన్న ఏడు ఎకరాల భూమి సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, అనుకోని ఓ ఘటన వీరి జీవితాన్ని మలుపు తిప్పింది.కాగా, కేశవ్ షిండే ఊరి మీదుగా వార్దా-నాందేడ్ మధ్య రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే లైన్ ఏర్పాటు కోసం రైల్వే అధికారులు భూ సేకరణ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కేశవ్ షిండే పొలాన్ని కూడా రైల్వే అధికారులు సేకరించారు. షిండే పొలంలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని భావించిన రైల్వే శాఖ.. ఆయన పొలంలో ఎక్కువ భాగాన్ని సేకరించింది. ఈ క్రమంలో షిండే తెలియని కొత్త అంశం బయటకు వచ్చింది.కేశవ్ షిండే పొలంలో ఎర్రచందనం చెట్టు ఉన్న సంగతి అనుకోని విధంగా బయటపడింది. కేశవ్ షిండే పొలంలో మామిడి తోటలు, ఇతర పంటలు ఉండేవి. నిజానికి ఆ చెట్టు వారి పొలంలో ఏళ్ల తరబడిగా ఉన్నా.. వారికి ఆ విషయం తెలియలేదు. రైల్వే లైన్ కోసం భూసేకరణ జరుగుతున్నప్పుడు.. కొంతమంది రైల్వే ఉద్యోగులు సర్వే కోసం కేశవ్ షిండే ఊరికి వచ్చారు. వారిలో ఒక ఉద్యోగి.. ఈ విషయాన్ని గుర్తించి కేశవ్ షిండే కుటుంబానికి చెప్పారు. దీంతో షిండే ఫ్యామిలీ ఆశ్చర్యంతో ఆనందం వ్యక్తం చేసింది. పొలంలో రైల్వే లైన్ వెళ్తుండటంతో కేశవ్ షిండే పొలానికి రైల్వే శాఖ పరిహారం అందించింది. అయితే తమ పొలంతో పాటుగా అందులో ఉన్న ఎర్రచందనం చెట్టు, పంటకు కూడా పరిహారం చెల్లించాలని కేశవ్ షిండే, ఆయన కొడుకులు డిమాండ్ చేశారు. ఎర్రచందనం చెట్టు విలువ లెక్కగట్టాలని అటవీ శాఖకు లేఖ రాశారు. కానీ, అధికారులు ఎర్రచందనం చెట్టుకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. దీంతో కేశవ్ షిండే కుటుంబం.. జిల్లా కలెక్టర్, అటవీ, రైల్వే, నీటి పారుదల శాఖల అధికారులను ఆశ్రయించారు. అయినప్పటికీ, ఎలాంటి పరిహారం అందకపోవటంతో 2024 అక్టోబర్ 7న హైకోర్టులో పిటిషన్ వేశారు.షిండే పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎర్రచందనం చెట్టు పరిహారం కోసం కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని రైల్వే శాఖను బాంబే హైకోర్టు ఆదేశించింది. కోటి రూపాయలను నాగ్‌పూర్ బెంచ్‌లో డిపాజిట్ చేయాలని.. ఇందులో నుంచి రూ.50 లక్షలు కేశవ్ షిండే విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 9న బాంబే హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేయగా.. రైల్వే శాఖ కోటి రూపాయలు డిపాజిట్ చేసింది. దీంతో, ఈ కేసులో కేవలం ఏడాదిలోనే కేశవ్ షిండే కుటుంబం విజయం సాధించింది. కేశవ్ షిండే పొలంలోని ఎర్రచందనం చెట్టు వయసు 100 ఏళ్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ రేటు ప్రకారం కేశవ్ షిండే పొలంలోని ఎర్రచందనం చెట్టు విలువ దాదాపు రూ.5 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement