
విలక్షణమైన నటనతో అబ్బురపరిచే బాలీవుడ్ యంగ్ హీరోల్లో ఆయుష్మాన్ ఖురానా ఒకరు. విక్కీ డోనర్, అంధాదున్, ఆర్టికల్ 15, డ్రీమ్ గర్ల్, బాలా, చంఢీగర్ కరే ఆషికీ వంటి తదితర చిత్రాలతో ఆకట్టుకున్నాడు. తాజాగా ఆయుష్మాన్ ఖురానా నటించిన చిత్రం 'అనేక్'. ఈ చిత్రంలో తొలిసారిగా ఒక సీక్రెట్ పోలీస్ పాత్రలో అలరించనున్నాడు ఆయుష్మాన్ ఖురానా.
Anek Trailer: Ayushmann Khurrana Gripped By Hindi Language Row: విలక్షణమైన నటనతో అబ్బురపరిచే బాలీవుడ్ యంగ్ హీరోల్లో ఆయుష్మాన్ ఖురానా ఒకరు. విక్కీ డోనర్, అంధాదున్, ఆర్టికల్ 15, డ్రీమ్ గర్ల్, బాలా, చంఢీగర్ కరే ఆషికీ వంటి తదితర చిత్రాలతో ఆకట్టుకున్నాడు. తాజాగా ఆయుష్మాన్ ఖురానా నటించిన చిత్రం 'అనేక్'. ఈ చిత్రంలో తొలిసారిగా ఒక సీక్రెట్ పోలీస్ పాత్రలో అలరించనున్నాడు ఆయుష్మాన్ ఖురానా. ఈ మూవీకి ముల్క్, ఆర్టికల్ 15, తప్పడ్ వంటి చిత్రాలను తెరకెక్కించిన అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. నార్త్ ఈస్ట్ ఇండియా బార్డర్‌లో నెలకొన్న రాజకీయ సంఘర్షణల నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
అనేక్ మూవీ ట్రైలర్‌ను గురువారం (మే 5) విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో ఒక మిషన్‌ను జాషవా (ఆయుష్మాన్ ఖురానా) అనే పోలీసు ఎలా చేధించాడో చూపించారు. అంతేకాకుండా ఈ ట్రైలర్‌లో హిందీ భాష గురించి ప్రస్తావించడం విశేషం. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ట్విటర్ వార్ గొడవ కారణంగా హిందీ భాషను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో తెలంగాణ పోలీసుగా జేడీ చక్రవర్తి నటిస్తున్నాడు. ఆయుష్మాన్ ఖురానా, జేడి చక్రవర్తి మధ్య వచ్చిన హిందీ భాషకు సంబధించిన చర్చ ఆకట్టుకుంటుంది.
చదవండి: హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్, సుదీప్ మధ్య ట్వీట్ల వార్
'హిందీ భాషను సరళంగా మాట్లాడటం వల్లే నార్త్ ఇండియన్‌గా నిర్ణయిస్తారా ?' అని ఆయుష్మాన్ అడిగిన ప్రశ్నకు జేడీ చక్రవర్తి 'నో' అని చెబుతాడు. దానికి 'కాబట్టి ఇది హిందీ గురించి కాదు' అని ఆయుష్మాన్ బదులిస్తాడు. తర్వాత 'ఒక మనిషిని ఇండియన్‌గా ఎలా డిసైడ్ చేస్తారు' అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. హిందీ భాష, నార్త్ ఇండియన్ వంటి అంశాలపై ప్రస్తావించిన 'అనేక్' ట్రైలర్ పై సినీ ప్రముఖులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
చదవండి: అజయ్ దేవగణ్, సుదీప్‌ల ట్విటర్ వార్‌పై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు