భయపెట్టే అన్వేషి | Anveshi Movie Pre-Release Event | Sakshi
Sakshi News home page

భయపెట్టే అన్వేషి

Published Thu, Nov 16 2023 4:07 AM | Last Updated on Thu, Nov 16 2023 4:07 AM

Anveshi Movie Pre-Release Event  - Sakshi

గణపతి రెడ్డి, సిమ్రాన్, విజయ్‌ దర్శన్‌

విజయ్‌ ధరణ్, సిమ్రాన్‌ గుప్తా, అనన్యా నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటించిన హారర్‌ అండ్‌ కామెడీ ఫిల్మ్‌ ‘అన్వేషి’. వీజే ఖన్నా దర్శకత్వంలో టి. గణపతి రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు నటులు అశ్విన్‌బాబు, సోహైల్, చైతన్యారావు, సంపూర్ణేశ్‌ బాబు అతిథులుగా హాజరై, ఈ చిత్రం విజయం సాధించాలన్నారు. ఈ వేడుకలో హీరో విజయ్‌ ధరణ్‌ మాట్లాడుతూ–

‘‘హీరో కావాలని ఓ చిన్న పల్లెటూరు నుంచి మొదలైన నా ప్రయాణంలో అవమానాలు, బాధలు ఎదుర్కొన్నాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. ఈ మూవీ నిర్మాణంలోనూ కష్టాలు పడ్డాం. కొంతమంది సపోర్ట్‌ చేయడంతో బయటపడ్డాం. ఈ సినిమా బాగాలేకపోతే నేను గుండు కొట్టించుకుంటాను. వీజే ఖన్నా భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు అవుతారు’’ అన్నారు. ‘‘అనన్యా నాగళ్ల పాత్ర చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది’’ అన్నారు వీజే ఖన్నా. ‘‘ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు గణపతి రెడ్డి. ‘అన్వేషి’ చిత్రం మెప్పిస్తుంది’’ అన్నారు సిమ్రాన్‌ గుప్తా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement