
జెడీ చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతస్య మరణం ధ్రువం’. శ్రవణ్ జొన్నాడ దర్శకత్వం వహించారు. ‘తమ్ముడు, నరసింహనాయుడు, అధిపతి’ చిత్రాల్లో నటించిన ప్రీతీ జంగియాని ‘జాతస్య మరణం ధ్రువం’తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్‌ని లాంచ్ చేశారు.
‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ‘జాతస్య మరణం ధ్రువం’ అన్నది ఒక సంస్కృత పద బంధం. ‘పుట్టినవారికి మరణం తప్పదు’ అని అర్థం. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తాం’’ అని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, రాజ్ ఆషూ, కెమెరా: అర్జున్ రాజా.