
‘లూసిఫర్ 2: ఎంపురాన్’ చిత్రం తర్వాత మరో కొత్త సినిమా పనిలో పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran) ఉన్నారు. మేఘనా గుల్జార్ (Meghna Gulzar) తెరకెక్కిస్తున్న ‘దైరా’ అనే పాన్ ఇండియా చిత్రంలో పృథ్వీరాజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ నటించడం విశేషం. ఇందులో ఆయన శక్తిమంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను మేఘనా గుల్జార్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ఆమెను సరికొత్త అవతారంలో చూపించనున్నారు మేఘనా గుల్జార్.

ముంబైకి చెందిన మేఘనా గుల్జార్ దర్శకురాలిగా బాలీవుడ్‌లో పలు చిత్రాలు నిర్మించింది. రాజీ (అలియాభట్), చపాక్(దీపికా పడుకోణె), సామ్ బహదూర్ (విక్కీ కౌషల్) వంటి సినిమాలతో ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. కాల్‌షీట్స్ కారణంగా ఆయుష్మాన్ ఖురానా, సిద్ధార్థ్ మల్హోత్రా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో.. ఇప్పుడీ చిత్రంలో పృథ్వీరాజ్, కరీనా కపూర్ ఎంట్రీ ఇచ్చేశారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. అయితే, వయసు రిత్యా పృథ్వీరాజ్ సుకుమారన్( 42) కంటే కరీనా కపూర్(44) రెండేళ్లు పెద్ద కావడం గమనార్హం.
Some stories stay with you from the moment you hear them.
DAAYRA is that for me.
Excited to work with @meghnagulzar, the incredible #KareenaKapoorKhan and @JungleePictures! Wish you all a very happy Vishu! 🙂#Daayra@vineetjaintimes #AmritaPandey #YashKeswani #SimaAgarwal… pic.twitter.com/vSHXSVh8vC— Prithviraj Sukumaran (@PrithviOfficial) April 14, 2025