
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్.. ఇప్పుడు హీరోగా మరో మూవీ ఓకే చేశారు. 'కమిటీ కుర్రాళ్లు' మూవీతో నిర్మాతగా తొలి హిట్ అందుకున్న నిహారిక.. ఇప్పుడు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోంది. తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది.
(ఇదీ చదవండి: మరోసారి తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' నటి)
నిహారిక తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రెండో చిత్రాన్ని ప్రారంభించింది. మానస శర్మ అనే కొత్తమ్మాయిని దర్శకురాలిగా పరిచయం చేస్తోంది. గతంలో ఈమె.. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, బెంచ్ లైఫ్ అనే వెబ్ సిరీసులకు దర్శకత్వం వహించింది. ఇప్పుడు సినిమాకు డైరెక్షన్ వహించబోతుంది.
ఇదివరకే నిహారిక నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ లో సంగీత్ శోభన్ నటించాడు. దానికే మానస శర్మ కూడా పనిచేసింది. అప్పుడు ఓటీటీ సిరీస్ కోసం పనిచేసిన ఈ ముగ్గురు.. ఇప్పుడు సినిమా కోసం ఒక్కటయ్యారు. త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ ఏడాదే రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి)
