Sherlyn Chopra Files Molestation Complaint Against Mumbai Business Man, Deets Inside - Sakshi
Sakshi News home page

Sherlyn Chopra: వీడియో వివాదం.. వేధిస్తున్నాడంటూ హీరోయిన్‌ ఫిర్యాదు

Published Sat, Apr 15 2023 1:05 PM | Last Updated on Sat, Apr 15 2023 1:50 PM

Sherlyn Chopra Files Molestation Complaint Against Mumbai Business Man - Sakshi

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్‌ హీరోయిన్లలో షెర్లిన్‌ చోప్రా ఒకరు. ఈ బ్యూటీ చేసిన సినిమాలు తక్కువే అయినా.. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మాత్రం చాలా ఎక్కువ. నాలుగు పదుల వయసుకు వచ్చినా కూడా అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. హాట్‌ హాట్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో పాటు వివాదస్పద విషయాలపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలస్తుంది. తాజాగా ఈ అమ్మడు  తనను వేధిస్తున్నాడంటూ ఓ వ్యాపారవేత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

వివరాల్లోకి వెళి​తే.. కొన్నాళ్ల క్రితం విడియో రికార్డింగ్‌ కోసం ఓ వ్యాపారవేత్తతో ఒప్పందం కుదుర్చుకుంది షెర్లిన్‌ చోప్రా. అయితే కొన్ని కారణాల వల్ల ఆ వీడియోను షూట్ చేయలేకపోయారట. ఆ వీడియో కోసం తీసుకున్న  అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేందుకు ఓకే చెప్పినా కూడా అందుకు ఒప్పుకోకుండా వేదిస్తున్నాడట. వీడియో షూట్‌లో పాల్గొనపోతే తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు నటి తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 354, 506, 509 సెక్షన్ల కింద ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement