
తమిళ హీరో సూర్య కోవిడ్ నుంచి కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకి నెగటివ్ వచ్చింది. ఇటీవల తాను కోవిడ్ బారిన పడిన ట్టు సూర్య తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. కొన్ని రోజులుగా కోవిడ్‌కి సంబంధించిన చికిత్స తీసుకుంటున్న ఆయనకు తాజాగా నెగటివ్ వచ్చింది. ఈ విషయాన్ని సూర్య సన్నిహితుడు రాజశేఖర్ పాండి యన్ తెలిపారు. ‘సూర్య అన్నకు నెగటివ్ వచ్చింది. అందరి ప్రేమకు, ప్రార్థనలకు ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు రాజశేఖర్. ఈ నెలాఖరు నుంచి సినిమా చిత్రీకరణలో పాల్గొంటారట సూర్య. పాండిరాజ్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేస్తున్నారాయన.