ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇద్దరు వృద్ధుల పేర్లు సాలమ్మ, పుష్పవతి. సొంత అక్కాచెల్లెళ్లు. వీరిది పాణ్యం మండలం భూపనపాడు గ్రామం. వీరి తల్లిదండ్రులు భూపనపాడు గ్రామంలో రెండెకరాల భూమిని ఇతరుల నుంచి కొనుగోలు చేశారు. అప్పటికే ఆభూమిని వీరి సోదరుడి కుమారుడు సురేష్ అభుభవిస్తున్నాడు. అక్కాచెల్లెళ్లు కోర్టును ఆశ్రయిస్తే .. రెండెకెరాల భూమిని ముగ్గురికి పంపకాలు చేసింది. ఈప్రకారం పాణ్యం రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌లో పేర్లు చేర్చి పాస్‌బుక్‌లు మంజూరు చేశారు. ప్రస్తుతం ఇద్దరు వృద్ధులు పొలం సాగు కోసం వెళితే ‘‘ఇక్కడ మీభూమి లేదు’’ అంటూ సోదరుడి కుమారుడు బెరిదింపులకు పాల్పడుతున్నాడు. తమను ఇబ్బందులకు గురి చేస్తున్న వారితో పాటు వారికి సహకరిస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని అర్జీలు ఇచ్చారు.