Nandyal District Latest News
-
డ్రైవర్ ఇంట చదువుల తల్లి
పగిడ్యాల: మండల కేంద్రంలోని దేవనగర్ కాలనీకి చెందిన పగడం మద్దిలేటి, సుజాతలు పెద్దగా చదువుకోలేదు. వీరికి నవ్యకళ, జగన్ ఇద్దరు సంతానం. మద్దిలేటి ఆల్విన్ వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి నవ్యకళ చదువు పట్ల ఆసక్తి కనబరుస్తూ వచ్చింది. లక్ష్మాపురం అంచె వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతూ ఉత్తమ మార్కులు సాధించింది. బైపీసీ గ్రూప్‌లో 982 మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుమార్తెను డాక్టర్ చేయాలనే లక్ష్యంతో కర్నూలులో ఎంసెట్ కోచింగ్ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. -
గజ వాహనంపై రంగనాథుడు
● నేడు రథోత్సవంజూపాడుబంగ్లా: తర్తూరు శ్రీలక్ష్మీరంగనాథుడు స్వామివారు శనివారం గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి మూల, ఉత్సవ విగ్రహాలకు అర్చకులు పంచామృతాభిషేకం, పుష్పార్చన, కుంకుమార్చన వంటి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం చెక్కబొమ్మ రూపంలో ఉన్న స్వామివారి ఉత్సవ మూర్తిని పట్టువస్త్రాలతో అలంకరించారు. అనంతరం గజవాహనంతో అలంకరించిన గ్రామోత్సవ వాహనంపైకి చేర్చి పూజలు నిర్వహించారు. ఆతర్వాత భక్తులు గోవింద నామాన్ని స్మరిస్తూ గ్రామోత్సవం నిర్వహించారు. పూజల్లో ఆలయ ఈఓ సాయికుమార్, చైర్మన్ నారాయణరెడ్డి, ప్రధాన అర్చకుడు ఈశ్వరరెడ్డి పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరొందిన తర్తూరు శ్రీలక్ష్మీరంగనాథస్వామి రథోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. -
ఇంజినీర్ కావాలని ఉంది
ఎంపీసీ గ్రూపులో 976 మార్కులు వచ్చాయి. మా తల్లిదండ్రులు కష్టపడి పడి చదివించారు. బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లి వారి ఆశయాన్ని నెరవేరుస్తా. నేను భవిష్యత్తులో ఇంజినీర్ కావాలని ఉంది. – వెన్నెల, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆళ్లగడ్డ డాక్టర్‌గా పేదలకు సేవలు అందిస్తా నీట్లో ప్రతిభ చాటి ఎంబీబీఎస్ సీటు సాధిస్తా. డాక్టర్ వృత్తి చేపట్టాలని ఉంది. పేదలకు ఉచితంగా సేవ చేస్తా. ఇంటర్లో 968 మార్కులు సాధించేందుకు కళాశాల అధ్యాపకులు కృషి, తల్లిదండ్రల ప్రోత్సాహం ఎంతో ఉంది. – దేవరాజ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, నంద్యాల చాలా సంతోషంగా ఉంది మాది శ్రీపతిరావుపేట గ్రామం. నేను ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ చదువుతూ 470 మార్కులకు గానూ 462 మార్కులు సాధించాను. మా నాన్న ఓ ప్రయివేట్ కళాశాలలో పని చేస్తున్నారు. నన్ను ఇంజినీర్‌గా చూడాలన్నదే మా నాన్న లక్ష్యం. కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సెకండియర్‌లో కూడా మంచి మార్కులు తెచ్చుకుంటా. – ఆవుల వెంకటగౌరి, ఆత్మకూరు -
లడ్డూ మాటున దోపిడీ
జూపాడుబంగ్లా: తర్తూరు జాతరలో స్వామివారి ప్రసాదంగా భక్తులు అందించే లడ్డూలో విక్రయదారుడు చేతివాటం ప్రదర్శిస్తున్నాడు. ఈనెల ఒకటోవ తేదీన ఫెస్టివల్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి సమక్షంలో టెంకాయలు, లడ్డూలు, కొబ్బరి చిప్పల వేలాలు నిర్వహించారు. ఈ వేలాల్లో కొణిదేల గ్రామానికి చెందిన రంగస్వామి రూ.1,05,000లకు స్వామివారి ప్రసాదంగా లడ్డూల విక్రయాన్ని దక్కించుకున్నారు. 70గ్రాముల బరువుతో నాణ్యతగా ఉండే ఒక లడ్డూ రూ.15ల చొప్పన విక్రయించాలని, అధిక ధరలకు లడ్డూ విక్రయించినా, నాణ్యతలేకపోయినా వేలం పాటను రద్దుచేస్తామని అధికారులు హెచ్చరించారు. వేలం పాటదారుడు మూడు లడ్డూలను ప్యాక్‌గా చేసి రూ.50 చొప్పున విక్రయిస్తూ అప్పనంగా రూ.5 భక్తుల నుంచి నొక్కేస్తున్నారు. తక్కువ బరువు, నాణ్యత లేని లడ్డూలను విక్రయిస్తున్నాడని, అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
చిరు వ్యాపారి కుమార్తె ప్రతిభ
ఆత్మకూరు: పట్టణంలోని కేజీ రోడ్డులోని ఎస్బీఐ బ్యాంక్ ఎదుట గోనె సంచుల వ్యాపారం చేసే జిలానీ కుమార్తె సబియా ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చాటింది. స్థానిక ఓ ప్రైవేటు కళాశాలలో బైపీసీ చదువుతోంది. శనివారం విడుదలైన ఫలితాల్లో 440 మార్కులకుగానూ 433 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా జిలానీ మాట్లాడుతూ.. ‘నా కుమార్తె బాగా చదువుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రెండో సంవత్సరం కూడా మంచి మార్కులు సాధించి స్టేట్ ర్యాంకు పొందాలని ఆశిస్తున్నాను. సబియా డాక్టర్‌గా స్థిరపడాలన్నదే కోరిక’ అన్నారు. -
ఎర్ర రాళ్ల బావికి పూర్వ వైభవం
రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి. వారి పాలనకు గుర్తుగా చారిత్రక కట్టడాలు, బావులు మాత్రం నేటికి దర్శనమిస్తున్నాయి. చారిత్రక వైభవానికి మెట్ల బావులు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. నందిపాడు గ్రామ శివార్లలోని చౌడేశ్వరిదేవి ఆలయ ఆవరణలో క్రీ.శ 1242లో మెట్ల బావి నిర్మించినట్లు ఇక్కడ లభ్యమైన శిలా శాసనం ద్వారా తెలుస్తోంది. దశాబ్దాలుగా బావి పూడిపోవడంతో గ్రామ పెద్దలు పూడికతీయాలని నిర్ణయించారు. వీరికి వివిధ ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్న యువకులు చేయూత అందించారు. గోవిందపల్లెకు చెందిన కార్మికుల సాయంతో పది రోజుల నుంచి చేపడుతున్న పూడికతీత పనులు ముగిశాయి. ఎర్రటి రాళ్లతో నిర్మించిన మెట్ల బావి కళ్లు చెదిరేలా కనిపిస్తోంది. 783 ఏళ్ల్లు గడిచినా ఒక్క రాయి కూడా చెదిరిపోకుండా ఇప్పటికీ అలాగే ఉంది. 35 అడుగుల మేర బావి లోతు ఉంది. లోపలి భాగంలోని నాలుగు వైపుల గోడల నుంచి నీళ్లు బావిలోకి చేరుతున్నాయి. ఓ వైపు ఇంజిన్ సాయంతో నీళ్లు బయటకు పంపింగ్ చేసి శుభ్రం చేస్తూ వచ్చారు. – కొలిమిగుండ్ల క్రీ.శ 1242లో నిర్మించినట్లు ఆధారాలు గ్రామ పెద్దల చొరవతో పూడికతీత నేటికీ చెక్కు చెదరని నిర్మాణం నలువైపుల నుంచి బావిలోకి నీరు -
పీఎసీ సభ్యులుగా బుగ్గన, హఫీజ్‌ఖాన్
కర్నూలు(టౌన్): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా(పీఎసీ) మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (డోన్), మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్(కర్నూలు) నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 మందికి చోటు లభించగా.. కమిటీలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి వీరిరువురికీ అవకాశం దక్కింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మద్యపాన వ్యసన విముక్తి కేంద్రం ప్రారంభం నందికొట్కూరు: పట్టణంలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయం ఎదుట మద్యపాన వ్యసన విముక్తి కేంద్రాన్ని శనివారం నంద్యాల అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి.రాముడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యపానం, నాటుసారా, మత్తు కలిగించే పదార్థాలను సేవించడం వలన కలిగే నష్టాలను గురించి తెలుసుకోవాలన్నారు. వ్యసనాలను విముక్తి కలిగించేందుకే ఈ కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. మద్యం మత్తుకు బానిసైతే సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ రాజశేఖర్, ఎకై ్సజ్ శాఖ సీఐ రామాంజనేయులు నాయక్, ఎస్ఐలు జప్రూల్లా, శ్రీనివాసులు పాల్గొన్నారు. భ్రామరీకి లక్ష కుంకుమార్చన శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబాదేవికి శనివారం పౌర్ణమిని పురస్కరించుకుని సాయంత్రం లక్ష కుంకుమార్చన సేవను శాస్త్రోక్తంగా జరిపించారు. శ్రీశైలానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో లక్ష కుంకుమార్చనలో భక్తులు పరోక్షసేవగా పాల్గొనే అవకాశం దేవస్థానం కల్పించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పరోక్షసేవలో పాల్గొన్నారు. మంగళకరమైన ద్రవ్యాలలో కుంకుమకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కుంకుమ ద్రవ్యంతో అమ్మవారిని అర్చించడం విశేష ఫలదాయకమని పండితులు వివరించారు. లక్ష కుంకుమార్చన సేవను జరిపించుకోవడం వలన కష్టాలు తొలగిపోతాయని, సర్వశుభాలు కలుగుతాయని, అభీష్టాలు సిద్ధిస్తాయని, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయన్నారు. రేపటి ప్రజా సమస్యలపరిష్కార వేదిక రద్దు నంద్యాల: ఈ నెల 14 తేదీ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ప్రభుత్వ సెలవు కావడంతో కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి నిర్వహించడం లేదన్నారు. నేడు ‘గురుకుల’ ప్రవేశ పరీక్ష కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ( 2025–26 ) 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 13న (నేడు) పరీ క్ష నిర్వహిస్తున్నట్లు గురుకులాల సమన్వయ కర్త డాక్టర్ ఐ.శ్రీదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లాలోని 8, నంద్యాల జిల్లాలోని 6 పరీక్షా కేంద్రాల్లో 5వ తరగతిలో 1,120 సీట్లకు 9340 మంది, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 1,480 సీట్లకు 7,727 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. -
జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించండి
కర్నూలు: జాతీయ లోక్ అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి కోరారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కర్నూలు న్యాయ సేవా సదన్‌లో శుక్రవారం కర్నూలు పోలీసు అధికారులతో కబర్ధి జాతీయ లోక్ అదాలత్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. మే 10వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎకై ్సజ్ మెజిస్ట్రేట్ సరోజమ్మ మాట్లాడుతూ రాజీ అయ్యే కేసులన్నీ ప్రతిరోజూ కోర్టుకు తీసుకురావాలని సూచించారు. ట్రైనీ మెజిస్ట్రేట్లు లక్ష్మి కర్రి హేమ, అపర్ణ, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, ఎకై ్సజ్ సీఐలు రాజేంద్రప్రసాద్, చంద్రహాస్, సివిల్ సీఐలు రామయ్య నాయుడు, నాగరాజరావు, శేషయ్య, మధుసూదన్ గౌడ్, శ్రీధర్‌తో పాటు పలువురు ఎస్ఐలు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న రాజీ అయ్యే సివిల్, క్రిమినల్, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించుకోవాలని కబర్ధి, లీలా వెంకటశేషాద్రి ఈ సందర్భంగా పోలీసు అధికారులకు సూచించారు. కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ కేసులను రాజీ పూర్వకంగా పరిష్కరించుకోవాలన్నారు. -
ఒలింపిక్స్‌లో షేక్ జఫ్రీన్ రాణించాలి
● జాయింట్ కలెక్టర్ నవ్య కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు డివిజన్ కో– ఆపరేటివ్ అధికారిణిగా విధులు నిర్వహిస్తున్న షేక్ జఫ్రీన్ ఈ ఏడాదిలో జరిగే ఒలింపిక్స్ పోటీల్లో బంగారు పతకం సాధించాలని జాయింట్ కలెక్టర్ నవ్య ఆకాంక్షించారు. గత నెల 20 నుంచి 23 వరకు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో జరిగిన నేషనల్ గేమ్స్ (నేషనల్ డెఫ్ సీనియర్ టెన్నిస్ చాంపియన్ షిప్–2025)లో రెండు బంగారు పతకాలు సాధించిన షేక్ జఫ్రీన్ను అభినందించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా సహకార కేంద్రబ్యాంకులో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేసీ, డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్ కమిటీ చైర్పర్సన్ నవ్య హాజరై ప్రసంగించారు. సహకార శాఖలో కర్నూలు డివిజన్ అధికారిగా జఫ్రీన్ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తూనే నేషనల్ గేమ్స్‌లో కూడా ప్రతిభ కనబరచడం హర్షనీయమన్నారు. ఒలింపిక్స్‌లో రాణించేందుకు అన్ని విధాలా సహకరిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి ఎన్.రామాంజనేయులు, డీసీసీబీ సీఈవో విజయకుమార్, జనరల్ మేనేజర్ పి.రామాంజనేయులు, డీజీఎంలు ఉమామహేశ్వరరెడ్డి, సునీల్‌కుమార్, నాగిరెడ్డి, ఏజీఎంలు త్రినాథ్‌రెడ్డి, గీత, షేక్ జాఫ్రిన్ తండ్రి జాకీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
● గిరిజన విద్యార్థులకు నెలకోసారి చికెన్ పెట్టడం లేదు ● రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్‌రెడ్డి
విద్యార్థులకు పౌష్టికాహారం అందించండి శ్రీశైలంప్రాజెక్ట్: గిరిజన గురుకులాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సున్నిపెంటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, పౌరసరఫరాల గోదాము, గిరిజన గురుకుల పాఠశాలలను తనిఖీ చేశారు. ప్రైవేటు కాంట్రాక్టర్ల సరఫరాకు, గిరిజన కో– ఆపరేటివ్ సొసైటీ వస్తువుల సరఫరా ధరలో వ్యత్యాసం ఉండడంతో విద్యార్థులకు అందించే మెనూలో కొంత సర్దుబాట్లు చేసుకోవలసిన అవసరాలు తప్పడం లేదని వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు ఆయన దృష్టికి తెచ్చారు. అలాగే వంట–వార్పునకు తగిన సిబ్బంది లేరని తెలిపారు. సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ జి.ఓ.నెం.8 ప్రకారం విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందజేయకపోతే శాఖా పరమైన చర్యలు తప్పవని విజయప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. గిరిజన గురుకుల పాఠశాలలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని, వీటిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. సున్నిపెంట గిరిజన గురుకుల విద్యాలయాలలో విద్యార్థులకు సరైన భోజనం అందించడం లేదని, చికెన్ వారానికి రెండు సార్లు పెట్టాల్సి ఉండగా, నెలకు ఒకసారి కూడా విద్యార్థులకు అందించడం లేదని, పెరుగు కూడా అందించని దుస్థితిని ఎందుకు ఏర్పడిందని మండిపడ్డారు. విద్యార్థులకు అందించాల్సిన భోజన పరిమాణం, నాణ్యతలో ఏ మాత్రం తేడా వచ్చినా సహించేది లేదన్నారు. ఈ మేరకు రెండు గిరిజన గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, వార్డన్లపై చర్యలకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేసి గర్భిణులు, బాలింతలతో నేరుగా ఆయన ఫోన్లో మాట్లాడి కోడిగుడ్లు, పాలు ఎంత ఇస్తున్నారని ఆరా తీశారు. పౌరసరఫరాల గోదాములను తనిఖీ చేసి స్టాక్ పాయింట్లో డీలర్లకు తూకాలు వేసి నిత్యావసరాలు అందించాలని ఆదేశించారు. -
ఉప్పొంగిన భక్తి భావం
ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం కనుల పండువగా సాగింది. శుక్రవారం తమిళ భక్తులతో పాటు స్థానికులు పాత ఆంజినేయ స్వామి ఆలయంలోని శమీవృక్షం నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వరకు రథోత్సవాన్ని నిర్వహించారు. తమిళ భక్తులు కావళ్లతో, నోటికి శూలాలు గుచ్చుకుని రథోత్సవంలో పాల్గొన్నారు. వీపునకు కొక్కాలు గుచ్చుకుని రథాన్ని లాగి భక్తిని చాటారు. మధ్యాహ్నం స్వామి వారికి అభిషేకం, భస్మపూజ, మహామంగళ హారతి, సహస్త్ర పుష్పార్చన, ప్రసాద వినినియోగ కార్యక్రమాలతో పూజా కార్యక్రమాలు చేశారు. సాయంత్రం స్వామి వారి పల్లకీ సేవతో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త యూజీ కేశవర్ధన ఆధ్వ ర్యంలో నిర్వహించిన ఈ రథోత్సవంలో కార్యనిర్వాహ కులు, తమిళ భక్తులు,పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
జాతీయస్థాయి సైక్లింగ్‌లో విద్యార్థిని ప్రతిభ
ఓర్వకల్లు: మీదివేముల జెడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థిని తంబళ్ల దివ్యశ్రీ జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. ఈ మేరకు శుక్రవారం స్థానిక పాఠశాలలో విద్యార్థిని అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో ప్రథమ స్థానం నిలిచిన దివ్యశ్రీ అండర్ –14 విభాగంలో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచిలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటి ‘స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ వారు ప్రశంసా పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ సర్టిఫికెట్ ద్వారా విద్యార్థినికి ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ ఉంటుందన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
కోడుమూరు రూరల్/గోనెగండ్ల: పులకుర్తి – గూడూ రు రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. గోనెగండ్ల మండలం ఆలువాల గ్రామానికి చెందిన బోయ నాగేంద్ర కుమారుడు హర్షవర్దన్‌నాయుడు (20), ఇదే గ్రామానికి చెందిన జయరాజు(25) సొంత పనుల నిమిత్తం బైక్‌పై గూడూరుకు వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం తమ స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా మార్గమధ్యలో పులకుర్తికి 2 కి.మీ దూరంలో గూడూరు వైపు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హర్షవర్దన్‌నాయుడు అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన జయరాజును చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన నాగేంద్ర, శంకరమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు హర్షవర్దన్ ఉన్నారు. ఈ దంపతులు ఇటీవల కుమారుడితో కలసి వలస వెళ్లారు. కాగా మూడు రోజుల క్రితం హర్షవర్దన్ స్వగ్రామానికి చేరుకుని శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. మృతుడి మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు స్వగ్రా మానికి బయలుదేరారు. అలాగే టిప్పర్ డ్రైవర్‌గా పని చేసే జయరాజుకు భార్య సజ్జీవతో మూడేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఒకే రోజు చనిపోవడంతో ఆలువాల గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన హర్షవర్దన్ నాయుడు, జయరాజు -
మదిరెలో సామూహిక వివాహాలు
కౌతాళం: మదిరె గ్రామంలోని ఉటగనూరు తాత మఠంలో శుక్రవారం 25 సామూహిక వివాహా లను మఠం ధర్మకర్త పంపారెడ్డి తాత, గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన హచ్చోళ్లి మఠం పీఠాధిపతి రుద్రమునిస్వామి మాట్లాడుతూ ఏటా సామూహిక వివాహలు నిర్వహించడంతో పాటు వధూవరులకు దుస్తులు, తాళిబొట్లతో పాటు ముక్కపుడకలు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఉటగనూరు మఠం ధర్మకర్త పంపారెడ్డి తాత మాట్లాడుతూ ఏటా దాతలు, గ్రామస్తుల సహకారంతో పేద జంటలకు వివాహలు జరపడం సంతోషంగా ఉందన్నారు. -
గాలిబుడగ జీవితం.. బతుకు నిత్య పోరాటం!
చంకలో చిన్న పిల్లలు..చేతిలో నీటి బుడగల గన్స్.. ఒకవైపు పిల్లలను ఆడిస్తూ, ఓదారుస్తున్నారు. ఇదే సమయంలో చిరు వ్యాపారం చేస్తూ ఆత్మాభిమానం చాటుతున్నారు. రోజూ నగరంలో ఎంతో మంది అన్ని అవయవాలు బాగున్నా రోడ్లలో బిచ్చమెత్తుకుంటున్న దృశ్యాలు కోకొల్లలు. ఎలాగోలా బతికేస్తున్నామని కాకుండా, ఎంతోకొంత కష్టపడి సంపాదించిన సొమ్ముతో గంజినీళ్లు తాగినా ఆత్మసంతృప్తి ఉంటుందనేందుకు వీళ్లే ఉదాహరణ. రాజస్థాన్‌వాసులు కిలోమీటర్ల దూరం ప్రయాణించి నగరంలోని రద్దీ ప్రాంతాల్లో వాటర్ బబుల్ గన్స్ విక్రయిస్తున్నారు. పెద్ద దుకాణాల్లో జీఎస్టీలు చెల్లించి, నిర్ణయించిన ధరకు కొనుగోలు చేస్తున్న వాళ్లలో సగం మందైనా ఇలాంటి వాళ్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు కుమారుడితో కలిసి విక్రయాలు కుమార్తెను చంకనెత్తుకొని వాటర్ బబుల్ గన్స్ విక్రయిస్తున్న మహిళ గొర్రెల కాపరి ఆత్మహత్య దేవనకొండ: మండల కేంద్రమైన దేవనకొండకు చెందిన గొర్రెల కాపరి తలారి లక్ష్మన్న(41) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు.. రెండు నెలల నుంచి తలారి లక్ష్మన్న విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. అలాగే గొర్రె పిల్లలు కొనేందుకు రూ.5 లక్షలు అప్పు చేశాడు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు అప్పుల బాధ తాళలేక తీవ్ర మనస్తాపానికి గురై జీవితంపై విరక్తి చెంది శుక్రవారం తెల్లవారుజామున బైరవకుంట గ్రామ సమీపంలో వేపచెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వంశీనాథ్ తెలిపారు. క్రెడిట్ కార్డు లావాదేవీలపై విచారణ వెలుగోడు: స్నేహితులు, సమీప బంధువుల పేరిట క్రెడిట్ కార్డులు పొంది వాటి ద్వారా లావాదేవీలు జరిపిన యువకుడిని ఆత్మకూరు సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి విచారణ చేశారు. వెలుగోడుకు చెందిన తన్వీర్ అనే యువకుడు మొబైల్ దుకాణం, ప్రొక్లెయిన్ నడుపుతూ పలువురి పేర్లపై క్రెడిట్ కార్డు, లోన్ యాప్‌ల నుంచి దాదాపు రూ. 50 లక్షల వరకు లావాదేవీలు జరిపినట్లు సమాచా రం. కాగా ఈఎంఐలు సరిగా చెల్లించకపోవడంతో బ్యాంక్ ఉద్యోగులు ఆరా తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే బాధితులకు సమాచారం ఇచ్చారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో శుక్రవారం ఆత్మకూరు సీఐ సురేష్ కుమార్‌రెడ్డి వెలుగోడుకు చేరుకుని తన్వీర్‌ను విచారించారు. అయితే యువకుడు అక్రమాలకు పాల్పడలేదని వారి బంధువులు, మిత్రుల సహకారంతో క్రెడిట్ కార్డులతో రుణాలు తీసు కుని లావాదేవీలు జరుపుతున్నాడన్నారు. ప్రస్తుతానికి రూ 11,50,000 చెల్లించాల్సి ఉందన్నారు. వారం రోజుల్లో రుణాలు చెల్లించి క్రెడిట్ కార్డులను ఇచ్చేస్తానని తన్వీర్ పోలీసుల ఎదుట ఒప్పుకోవడంతో బాధితులు సైతం సరైన అంటూ వెళ్లిపోయారు. పట్టపగలే చోరీ ఆదోని అర్బన్: స్థానిక రాజీవ్‌గాంధీ కాలనీ సమీపంలోని జంగాల కాలనీలో నివాసముంటున్న గోపాల్, రాధ దంపతుల ఇంట్లో శుక్రవారం పట్టపగలే చోరీ జరిగింది. దంపతులిద్దరూ ఉదయం పనుల కోసం ఇంటికి తాళాలు వేసి వెళ్లారు. మధ్యాహ్నం భోజనానికి తిరిగి ఇంటికి వచ్చేలోగా చోరీ జరిగింది. బీరువాలో ఉన్న తులం బంగారం, రూ.7 వేలు నగదు, 30 తులాల వెండి చోరీకి గురైందని బాధితులు తెలిపారు. వెంటనే టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తుంగభద్రలో మహిళ మృతదేహం కర్నూలు: స్థానిక రోజా వీధి శివారులో తుంగభద్ర నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటపడింది. సమాచారం మేరకు రెండో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని నీటిలో నుంచి వెలికితీశారు. ఆమె చేతిపై సూరయ్య రేణుక అనే పచ్చబొట్టు ఉంది. మొహం ఉబ్బిపోయి గుర్తు పట్టలేని విధంగా ఉంది. ఎర్రటి పూల డిజైన్ గల పంజాబీ డ్రస్సు, నల్లటి లోయర్ (ప్యాంటు) ధరించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. ఆచూకీ తెలిసినవారు 9121101060కు సమాచారమివ్వాలని రెండో పట్టణ సీఐ నాగరాజరావు సూచించారు. -
సివిల్ పోలీసుల సహకారం తీసుకోండి
● ఎకై ్సజ్ అధికారులకు నోడల్ అధికారి శ్రీదేవి ఆదేశం కర్నూలు: జిల్లాలో నాటుసారాను సమూలంగా నిర్మూలించడానికి నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా సివిల్ పోలీసుల సహకారం కూడా తీసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ అధికారి పి.శ్రీదేవి ఆ శాఖ క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. స్థానిక డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లతో ఆమె నెలవారీ సమీక్ష నిర్వహించారు. నాటుసారాను సమూలంగా నిర్మూలించడానికి నవోదయం 2.0 రెండవ దశ అయిన ఎన్ఫోర్స్మెంట్ అమలులో భాగంగా సారా అమ్మకం, తయారీ, రవాణాదారులతో పాటు బెల్లం సరఫరాదారులపై కూడా కేసులు నమోదు చేసి బైండోవర్ చేయాలని సూచించారు. నవోదయంను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి కానిస్టేబుల్‌కు పరిధిని నిర్ణయించి వారు బీట్లు సరిగా నిర్వర్తించే విధంగా చూడాలన్నారు. కర్ణాటక, తెలంగాణ నుంచి వస్తున్న సుంకం చెల్లించని మద్యాన్ని అరికట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, కర్నూలు, నంద్యాల జిల్లాల ఎకై ్సజ్ అధికారులు మచ్చా సుధీర్ బాబు, రవికుమార్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రామకృష్ణారెడ్డి, రాముడు, రాజశేఖర్ గౌడ్‌తో పాటు ఉమ్మడి జిల్లాల సీఐలు పాల్గొన్నారు. -
ఇరు కుటుంబాల ఘర్షణ
● అస్వస్థతకు గురైన వ్యక్తి మృతి ఓర్వకల్లు: ఇళ్ల ముందు మురుగు కాల్వ విషయంలో జరిగిన ఘర్షణలో అస్వస్థతకు గురైన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నన్నూరు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ అల్లినగరం నా గరాజు (48) అనే వ్యక్తి తన ఇంటి ముందు వున్న మురుగు కాల్వ నుంచి దుర్వాసన రావడంతో బండతో మూసేశాడు. దీంతో పై వైపు వున్న బోయ బట్టి వెంకటరాముడు బండ ఎందుకు వేశావని .. నాగరాజును నిలదీశాడు. ఈ విషయంలో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోంది. ఆ తర్వాత బయటి నుంచి వచ్చిన నాగరాజు కొడుకు మహేంద్ర విషయం తెలుసుకుని వెంకటరాముడిని నిలదీయడంతో వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. స్థానికులు ఇరు కుటుంబాలకు నచ్చచెప్పారు. అయితే మానసిక ఒత్తిడికిలోనైన నాగరాజు అస్వస్థతకు గురై ఒక్కసారిగా సృహకోల్పోయి కింద పడ్డాడు. దీంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఇరు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. -
కూటమి ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటోంది. పప్పులు, బెల్లాలు పంచుతూ.. కీలక ప్రయోజనాల విషయంలో మౌనం వహిస్తోంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పిల్లల వివాహాలు, ఇంటి నిర్మాణం.. భవిష్యత్ అవసరాలకు దిక్కులు చూడాల్సి వస్తోంది. రెండేళ్లు గడుస్తున్నా వీరి విషయం
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎలాంటి డీఏలు పెండింగ్‌లో పెట్టకుండా విడుదల చేసింది. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు కూడా చెల్లించింది.అరచేతిలో వైకుంఠం చూపుతున్న ప్రభుత్వం ● 2024 జనవరి నుంచి వెయ్యి మందికి పైగా పదవీ విరమణ ● ఇప్పటి వరకు ఒక్కరికీ అందని ఆర్థిక ప్రయోజనాలు ● ప్రతి ఉద్యోగికి రూ.40 లక్షలకు పైగా బకాయి ● రెగ్యులర్ ఉద్యోగులకు అందని మూడు సరండర్ లీవ్‌లు ● 11వ పీఆర్సీ లేదు.. ఐఆర్ ఊసే లేదు ● ప్రభుత్వం ఏర్పాటయ్యాక మూడు డీఏలు పెండింగ్ త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల ఆర్థిక ప్రయోజనాలను చెల్లించడంలో కూటమి ప్రభుత్వం చొరవ చూపడం లేదు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ అందక ఇబ్బంది పడుతున్నారు. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల్లో ఒక్కటీ చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసం. ఉద్యోగులకు వెంటనే మధ్యంతర భృతి ఇవ్వాలి. పెండింగ్ ఆర్థిక ప్రయోజనాలను రాబట్టుకునేందుకు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. – హృదయరాజు, రాష్ట్ర అధ్యక్షులు, ఏపీటీఎఫ్ కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వ తీరు పట్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తమకు ఏదో జరిగిపోతుందని భావించినా.. పది నెలల్లోనే అనుకున్న స్థాయిలో ప్రయోజనాలు లేకపోవడంతో గుర్రుమంటున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు 1వ తేదీ వేతనాలు, పెన్షన్ ఇవ్వడం మినహా ఆర్థిక ప్రయోజనాలకు మోక్షం లభించని పరిస్థితి. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ.30 వేల కోట్లు ఉండగా.. రెండు నెలల క్రితం రాష్ట్రం మొత్తానికి రూ.1,300 కోట్లు, ఇటీవల రూ.6,200 కోట్లు మాత్రమే విడుదల చేసింది. రూ.6,200 కోట్లలో రూ.2,300 కోట్లు సీపీఎస్ ఉద్యోగుల మ్యాచింగ్ గ్రాంటుకే సరిపోవడం గమనార్హం. ఉమ్మడి జిల్లా విషయానికొస్తే రూ.2వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో రూ.300 కోట్లను మాత్రమే ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఏమైన చేసిందా అంటే ఆరేడు నెలలు పట్టించుకున్న దాఖలాల్లేవు. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి అధికమవుతుండటంతో సంక్రాంతి సమయంలో రూ.1,300 కోట్లు విడుదల చేసింది. అరకొరగా నిధులు విడుదల చేయడం, బకాయిలు పేరుకపోతుండటంతో ఉద్యోగుల్లో అసంతృప్తి జ్వాల రగులుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ రూ.6,200 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఏపీజీఎల్ఐ బకాయిలకు రూ.1,000 కోట్లు, జీపీఎస్ బకాయిలకు రూ.2,500 కోట్లు, సీపీఎస్ ఉద్యోగుల మ్యాచింగ్ గ్రాంటు కోసం రూ.2,300 కోట్లు సర్దుబాటు చేశారు. కొండలా విశ్రాంత ఉద్యోగుల బకాయిలు ● ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024 జనవరి నుంచి దాదాపు 1000 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. ● 2024 జనవరి నుంచి జూన్ వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ ప్రపోజల్స్ సిద్ధం కావడంలో ఆలస్యం, ఆలోపే ఎన్నికల కోడ్ రావడంతో ఆర్థిక ప్రయోజనాలు చెల్లించలేదు. ● చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తయినప్పటికీ ఆర్థిక ప్రయోజనాల విషయంలో నోరెత్తని పరిస్థితి. ● పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ ఇస్తున్నారు తప్ప మిగిలిన ప్రయోజనాలైన గ్రాట్యూటీ, కమిటేషన్, ఎన్క్యాష్మెంటు ఎర్న్డ్ లీవ్‌లు(10 నెలల వేతనం) పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ● ప్రతి ఉద్యోగికి గ్రాట్యూటీ రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షలు, కమిటేషన్ రూ.15 లక్షలు, 10 నెలల వేతం క్యాడర్‌ను బట్టి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు చెల్లించాల్సి ఉంది. మూడు సరండర్ లీవ్‌లు బకాయిలే... ఇటీవల విడుదల చేసిన నిధుల నుంచి ఉద్యోగులకు లభించిన ప్రయోజనం నామమాత్రమే. పోలీసులకు ఐదు సరండర్ లీవ్‌లు పెండింగ్‌లో ఉంటే రెండు మాత్రమే చెల్లించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు మూడు సరండర్ లీవ్‌లు బకాయిలుగా ఉండిపోయాయి. డీఏ అరియర్స్, 10వ పీఆర్సీ అరియర్స్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగుల టీఏ బిల్లులకు మోక్షం ఎప్పుడు లభిస్తుందో తెలియని పరిస్థితి. ఐఆర్ ఎప్పుడిస్తారో! కూటమి ప్రభుత్వం వస్తే ఐఆర్ ఇస్తుందని ఆశించిన ఉద్యోగులకు 10 నెలల్లో వాస్తవం అర్థమైంది. 11వ వేతన సవరణకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ ప్రభుత్వం పడిపోవడంతో దాని ఉనికి కోల్పోయింది. 11వ పీఆర్సీ కమిషన్ ఆలస్యమయ్యే అవకాశం ఉంటే మధ్యంతర భృతి(ఐఆర్) ఇస్తారు. పీఆర్సీ కమిషన్ లేకపోతే.. ఐఆర్ ఊసే కరువైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మూడు డీఏలు పెండింగ్‌లో ఉండిపోయాయి. వీటిని ఎప్పటీకి ఇస్తారనేది ప్రశ్నార్థకం. -
సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే
నంద్యాల(అర్బన్): సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. బొమ్మలసత్రం సమీపంలో సమీకృత ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలు చదువుకుంటే అసమానతలు తొలగిపోతాయని భావించి మొదట తన సతీమణి సావిత్రీబాయిని విద్యావంతురాలిని చేసిన గొప్ప ఆచరణ వాది జ్యోతిరావు పూలే అన్నారు. సమాజ పునర్నిర్మాణానికి పూలే చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ.. కుల, మత, వర్గ విభేదాలు లేని సమాజం కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ల ద్వారా 514 మంది లబ్ధిదారులకు స్వయం ఉపాధి పథకం కింద రూ.12.37 కోట్ల మెగా చెక్కును అందజేశారు. అనంతరం సమీకృత ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో మరమ్మతులు చేసిన టాయిలెట్స్‌ను మంత్రి, జిల్లా కలెక్టర్ పరిశీలించారు. యాదవ, కురవ కార్పొరేషన్ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, రామకృష్ణ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఓబులేసు, బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్, పలు సంఘాల నాయకులు నాగ శేషుయాదవ్, గోవిందనాయుడు, గుర్రం లక్ష్మి, గౌరి, బోయ రామకృష్ణ పాల్గొన్నారు. -
‘సాక్షి’పై ప్రభుత్వ కక్ష సాధింపు సిగ్గు చేటు
నంద్యాల: సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వార్తపై నిజానిజాలు నిర్ధారించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డితో పాటు ఆరుగురు విలేకరులపై కేసులు నమోదు చేయడం సిగ్గు చేటని జర్నలిస్టులు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే, ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం జర్నలిస్టులు నిరసన తెలిపారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డి, మరో ఆరుగురు విలేకరులపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మౌలాలి మాట్లాడుతూ.. జర్నలిస్టులపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడాన్ని నిరశిస్తున్నామన్నారు. ఈ నెల 3వ తేదీ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పశువేముల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త హరిశ్చంద్ర టీడీపీ మూకల చేతిలో దారుణ హత్యకు గురయ్యారని, ఇందుకు సంబంధించిన వార్త సాక్షి దిన పత్రికలో ప్రచురితం అయ్యిందన్నారు. దీనిపై నిజానిజాలు నిర్ధారించుకోకుండా సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డితో పాటు ఆరుగురు విలేకరులపై ప్రభుత్వం కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతూ కేసులు నమోదు చేయడం సిగ్గు చేటన్నారు. ఈ ఘటనను జర్నలిస్టులంతా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని తప్పుడు కేసులను రద్దు చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమవకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. నిరసనలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు బాలమద్దిలేటి, జర్నలిస్టులు హరినాథరెడ్డి, ఎస్కే బాలునాయక్, గిరిబాబుసాగర్, దస్తగిరి, చంద్రవరప్రసాద్, అబ్దుల్కరీం, మోహన్, హుసేన్‌బాషా, రాము తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన -
పారదర్శకంగా బదిలీలు చేస్తాం
బొమ్మలసత్రం: వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసులు బదిలీల కోసం వినతిపత్రాలు ఇచ్చారని, వారిని పారదర్శకంగా స్థానచలనం చేస్తామని ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్‌డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను, అలాగే మ్యూచువల్, రిక్వెస్ట్ బదిలీలను, పదోన్నతులను త్వరగా పరిష్కరిస్తామన్నారు. ఎస్బీ సీఐలు మోహన్‌రెడ్డి, సూర్యమౌళి తదితరులు పాల్గొన్నారు. సబ్సిడీతో వేరుశనగ విత్తన కాయలు కర్నూలు(అగ్రికల్చర్): వేసవిలో నీటి సదుపాయం కింద వేరుశనగ సాగుకు 50 శాతం సబ్సిడీతో విత్తనం వేరుశనగ కాయలను పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 2000 హెక్టార్లకు విత్తనాలు పంపిణీ చేస్తారని వ్యవసాయ అధికారులు తెలిపారు. కే–6, టీసీజీఎస్ 1694 రకం వేరుశనగ కిలో పూర్తి ధర రూ.96 ఉండగా సబ్సిడీ రూ.48 ఉంటుంది. కదిరి లేపాక్షి రకం కిలో ధర రూ.85 ఉండగా సబ్సిడీ రూ.42.50 ఉంటుంది. ఇవి 30 కిలోల ప్యాకెట్లలో లభిస్తాయి. గరిష్టంగా రెండు హెక్టార్లకు 10 ప్యాకెట్లు పంపిణీ చేస్తారు. వేసవిలో వేరుశనగ సాగు చేసే రైతులు సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. నేడు కూడా రిజిస్ట్రేషన్లు కర్నూలు(సెంట్రల్): రెండో శనివారం సెలవు అయినా స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ పీజీ కల్యాణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అన్ని పనిచేస్తాయని, అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ట్రెజరీల్లో హెల్ప్‌లైన్ నంబర్లు కర్నూలు(సెంట్రల్): పెన్షన్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ట్రెజరీల్లో హెల్ప్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. కర్నూలు జిల్లా ట్రెజరీకి సంబంధించి 6300968380, నంద్యాల జిల్లా ట్రెజరీకి 9849388295 నంబర్లను కేటాయించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో పెన్షన్ మంజూరు కోసం కొందరు అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారని, రిటైర్డ్ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ‘సాక్షి’లో వచ్చిన కథనంపై లోకాయుక్త 2025 ఫిబ్రవరి 7న సుమోటోగా కేసు నమోదు చేసింది. అవినీతి, అక్రమాలను అరికట్టడం, కాలయాపన నిరోధానికి చర్యలు తీసుకోవా లని ఏపీ ట్రెజరీస్ అకౌంట్స్ డైరక్టర్‌కు నోటీసులు పంపింది. అందులో భాగంగా ఏపీ ట్రెజరీస్ అకౌంట్స్ డైరక్టర్ పలు పెన్షనర్ సంఘాలతో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ట్రెజరీల్లో హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఉపలోకాయుక్తకు నివేదిక సమర్పించారు. ఈ నివేదక శుక్రవారం ఉప లోకాయుక్త జస్టిస్ పి.రజనీకి అందడంతో కేసును మూసి వేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. హెల్ప్‌లైన్ నంబర్లతో రిటైర్డ్ ఉద్యోగులు త్వరగా సేవలను పొందేందుకు వీలు ఉంటుందని ఆమె తెలిపారు. -
అన్ని వేళలా.. అంతటా గ‘మ్మత్తు’
బొమ్మలసత్రం: జిల్లాలో ఊరూరా మద్యం ఏరులై పారుతోంది. పాఠశాలలు ఉన్న ప్రాంతాలను, ప్రముఖ పుణ్య క్షేత్రాలు ఉన్న పట్టణాలను సైతం ‘కూటమి’ నేతలు వదలడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసుకుని మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ప్రతి రోజూ తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు వ్యాపారాలు సాగిస్తున్నారు. ఆహోబిలం క్షేత్రంలో ఏకంగా మూడు బెల్టు దుకాణాలను ‘కూటమి’ నేతలు నడుపుతున్నారు. ఈ దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారు పాలకులకు నేరుగా రూ. 6 లక్షలు ముట్టచెప్పినట్లు స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. మహానంది దేవాలయానికి వెళ్లే మార్గంలో ఒక కూల్‌డ్రింక్ దుకాణంలో మద్యం విక్రయాలు బాహాటంగా సాగుతున్నాయి. హిందూ దేవాలయాల పవిత్రతను దెబ్బ తీసేలా ‘కూటమి’ నేతలు వ్యవహరించటంపై విమర్శలు వస్తున్నాయి. నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర వసతి గృహం సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇలా చేసింది.. ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఎవరైనా మద్యం సేవించాలంటే భయపడిపోయేవారు. నిత్యం సెబ్, పోలీస్ అధికారులు పర్యవేక్షణ ఉండేది. ● ఎక్కడా బెల్టుషాపులు కనిపించేవి కాదు. ● నాటుసారా వ్యాపారులపై పోలీసులు పీడియాక్ట్ నమోదు చేసేవారు. ● జనావాసాలకు దూరంగా మద్యం దుకాణాలు ఉండేవి. ● ఆలయాలు ఉండే ప్రాంతాల్లో, పాఠశాలల సమీపంలో మద్యం విక్రయాలు కనిపించేవి కాదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలా.. ● ఎక్కడ చూసినా ‘కూటమి’ నేతల మద్యం దుకాణాలే కనిపిస్తున్నాయి. వైన్‌షాప్‌ల వద్దే మద్యం తాగేందుకు వీలుగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ● ఆదాయం కోసం ఎక్కడ పడితే అక్కడ వైన్‌షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం లైసెన్స్ జారీ చేసింది. ● జిల్లాలో ప్రస్తుతం కల్లుగీత కార్మికులకు కేటాయించిన 11 మద్యం దుకాణాలతో కలుపుకొని 116 వైన్‌షాపులు, 22 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ● నంద్యాల పట్టణంలో ఒక హోటల్ పక్కనే ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ మొదలుకొని పద్మావతి నగర్లో ప్రముఖ దేవాతామూర్తి పేరుమీద ఉన్న వైన్షాప్లలో వేకువజామున నుంచి విక్రయాలు మొదలవుతాయి. రాత్రి 12 దాటిన తర్వాత కూడా అక్కడ మద్యం దొరుకుతుందంటే యజమానుల ధనదాహం ఏరీతిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. ● కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామంలో కొందరు ‘కూటమి’ నేతలు బెల్టు దుకాణాలను ఏర్పాటు చేశారు. ఫోన్ కాల్ చేస్తే చాలు అక్కడికే మద్యం, వాటర్ పాకెట్లు, స్నాక్స్ తీసుకుని వెళ్తారు. ఈ వింతను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. పోటాపోటీగా బెల్టు దుకాణాలు జిల్లాలో మొత్తం 29 మండలాల్లో 449 గ్రామాలు ఉన్నాయి. రాష్ట్రంలో ‘కూటమి’ ప్రభుత్వం రాగానే గతంలో మూతపడిన బెల్టు దుకాణాలు, నాటుసారా స్థావరాలు గ్రామాల్లో తిరిగి తెరుచుకున్నాయి. స్థానిక టీడీపీ నేతకు రూ. 2 లక్షల వరకు ఇచ్చి బెల్టు దుకాణాలను నడిపిస్తున్నారు. పోలీసులు దాడి చేయకుండా టీడీపీ నాయకులే అడ్డుతున్నారు. నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలంలో ఇద్దరు టీడీపీ నాయకులు పోటాపోటీగా బెల్టు దుకాణాలు నడుపుతున్నారు. జిల్లాలో ఏరులై పారుతున్న మద్యం ప్రతి రోజూ 24 గంటల పాటు విక్రయాలు నిబంధనలకు విరుద్ధంగా బెల్టు దుకాణాల ఏర్పాటు బడి, గుడి ఉన్న ప్రాంతాల్లోనూ మద్యం విక్రయాలు మహానంది, ఆహోబిల క్షేత్రాల పరిధిలోనూ ‘బెల్టు’ భూతం డోన్, గోస్పాడు మండల కేంద్రాల్లో మద్యం డోర్ డెలివరీ మద్యం బేరంపై ‘కూటమి’ నేతల మధ్య నిత్యం రగడ -
కుందూ నుంచి అక్రమంగా ఇసుక తరలింపు
బండి ఆత్మకూరు: కుందూ నది నుంచి ఇసుకను అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమార్కులు జేసీబీలతో కుందూ నది నుంచి ఇసుక తవ్వడం ప్రారంభించారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బండిఆత్మకూరు సమీపంలోని కుందూ నది నుంచి జేసీబీతో ట్రాక్టర్ల ద్వారా గురువారం ఇసుక తరలించారు. అలాగే పరమటూరు వద్ద కుందూ నది నుంచి పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. -
రైతుల కష్టం బూడిదపాలు
దొర్నిపాడు: అన్నదాతలు ఆరుగాలం కష్టించి పండించిన మిరప పంట దగ్ధమైంది. మొత్తంగా రూ. 6 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. దొర్నిపాడు మండలం డబ్యూ. గోవిందిన్నె గ్రామానికి చెందిన మద్దుబాయిగారి నసీమ, వెంకటేశ్వర్లు 3.56 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఇటీవలే పంటను కోసి గ్రామ శివారులోని ఓ పొలంలో ఆరబోశారు. నిప్పు రవ్వలు వచ్చి మిర్చిపై పడటంతో కాలిపోయింది. ఈ ఘటనపై వ్యవసాయ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి పరిశీలించారు. పంట నష్ట పరిహారం అందించి, తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(న్యూటౌన్): జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న (ఏఎల్‌ఎస్‌సీఓ) సెక్టోరల్–01 పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష జిల్లా కో ఆర్డినేటర్ ప్రేమాంతకుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలలో పని చేస్తున్న పాఠశాల సహాయకులు అర్హులని తెలిపారు. ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. వివరాలు deonandyal.blogspot.comలో పొందాలని సూచించారు. ఎస్సార్బీసీకి నీటి విడుదల బంద్ బనగానపల్లె: ఎస్సార్బీసీ ప్రధాన కాల్వకు నీటి సరఫరా నిలిచిపోయింది. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి గత రెండు రోజులుగా నీటి విడుదల నిలిపివేశారు. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎస్సార్బీసీ ప్రధాన కాల్వ పరిధిలో పాణ్యం, గడివేముల, నంద్యాల మండలాల్లో 1.62 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. రబీలో వరి, మొక్కజొన్న, మిరప తదితర పంటలు 70 వేల ఎకరాల్లో సాగు చేశారు. వరి సాగు ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుతం వరి పంట పాలదశ గింజదశలో ఉన్నందున ఈ నెల చివరి వరకు నీటిని విడుదల చేయలని రైతులు కోరుతున్నారు. మొక్కజొన్న, మిరప పంటలకు రెండు తడుల నీరు అందాల్సి ఉంది. 21న ‘మోడల్’ ప్రవేశ పరీక్ష నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని 20 మోడల్(ఆదర్శ) పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో విద్యార్థులను చేర్చుకునేందుకు ఈ నెల 21వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి గురువారం ఒక ప్రటకనలో తెలిపారు. గతంలో 20వ తేదీన ప్రవేశ పరీక్ష ప్రకటించడంతో ఈస్టర్ పండుగ సందర్భంగా 21వ తేదీకి మార్చినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను www.csc.ap.gov.in లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. -
విద్యార్థి.. తీరని దాహార్తి
● పాఠశాలల్లో అందని మంచినీరు ● పనిచేయని మినరల్ వాటర్ ప్లాంట్లు ● పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం గోస్పాడు: ప్రభుత్వ పాశాలల్లో విద్యార్థులకు సకాలంలో మంచినీరు అందడం లేదు. దీంతో చిన్నారులు తాము తెచ్చుకున్న బాటిళ్లలోని నీటిని తాగుతున్నారు. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గొంతులు ఎండి విద్యార్థులకు ఎక్కిళ్లు వస్తున్నా.. చుక్క నీరు ఇచ్చేవారు కరువయ్యారు. గతంలో ఇలా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘మన బడి–నాడు నేడు’ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలకు అన్ని సౌకర్యాలు కల్పించింది. విద్యార్థులు సురక్షిత మంచినీరు తాగేలా నీటిశుద్ధి యంత్రాలను సరఫరా చేసింది. అలాగే వేసవి కాలంలో పాఠశాలల్లో నీటి గంట కొట్టి మధ్యాహ్నం లోపు విద్యార్థులు మూడుసార్లు మంచినీరు తాగేలా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు నిర్దేశించింది. విద్యార్థులందరికీ సురక్షిత నీరు అందుబాటులో ఉంచాలని, వాటర్ ప్లాంట్లు పనిచేయకపోతే తక్షణం మరమ్మతులు చేయించాలని ఆదేశించింది. అప్పట్లో విద్యార్థులు సురక్షిత మంచినీరు తాగి దాహార్తికి దూరంగా ఉండేవారు. ఆరోగ్యంగా విద్యాభ్యాసం చేసేవారు. ప్రస్తుత దుస్థితి ఇదీ.. గోస్పాడు మండలంలో 14 పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయగా..ప్రస్తుతం 5 చోట్ల మాత్రమే పనిచేస్తున్నాయి. విద్యాశాఖ పాఠశాలల్లో వాటర్ బెల్స్‌ను అమలు చేస్తోంది. అయితే పాఠశాలల్లో మంచినీరు లేక అందుబాటులో ఉన్న నీటినే విద్యార్థులు తాగాల్సి వస్తోంది. వేసవి ఎండల తీవ్రత ఈ ఏడాది ఎక్కువగా ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతూ మధ్యాహ్నానికి తారాస్థాయికి చేరుతోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మూడు సార్లు వాటర్ బెల్ (నీటి గంట) కొట్టాలని ఆదేశాలు వచ్చాయి. అయితే అందుబాటులో ఉన్న నీటినే విద్యార్థులు తాగాల్సి వస్తోంది. ఉన్నతాధికారులకు తెలిపాం ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మూడు సార్లు వాటర్ బెల్ విధానం పటిష్టంగా అమలు చేస్తున్నాం. ఉదయం 10, 11, 12 గంటలకు తప్పనిసరిగా వాటర్ బెల్స్ కొట్టి విద్యార్థులందరూ మంచినీరు తాగేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు. వాటర్ ప్లాంట్లు పనిచేయకపోతే తక్షణం మరమ్మతులు చేయించాలని ఆదేశించాం. పని చేయని వాటర్ ప్లాంట్లపై ఆన్లైన్లో నమోదు చేసి ఉన్నతాధికారులకు తెలిపాం. –అబ్దుల్కరీం, ఎంఈఓ, గోస్పాడు -
విత్తనశుద్ధి కేంద్రాలపై దాడులు
నంద్యాల(అర్బన్): పట్టణ శివారులో ఉన్న పత్తి విత్తన శుద్ధి కేంద్రాల్లో వ్యవసాయాధికారులు గురువారం ఆకస్మిక దాడులు చేశారు. జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీనివాసాచార్యులు, వ్యవసాయాధికారి శివరామకృష్ణ, ఏడీఏ రాజశేఖర్ తదితరులు శ్రావణలక్ష్మి సీడ్స్, వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్, హరినాథ్ క్రాఫ్ జెనిసీస్, భవ్యసీడ్స్, బబ్బూరి ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీవెంకటేశ్వర సీడ్స్, భారతి సీడ్స్, న్యూవెంకటేశ్వర సీడ్స్ విత్తన శుద్ధి కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. ఆయా విత్తనశుద్ధి కేంద్రాల్లో హెచ్‌టీ కాటన్(హెర్బిసైడ్ టోలరెంట్) స్ట్రిప్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అనుమతులు పొందిన కంపెనీల విత్తనాలు మాత్రమే ప్రాసెసింగ్ చేయాలన్నారు. -
శనగ సాగు చేసి నష్టపోయాం
మాకున్న నాలుగు ఎకరాల్లో రబీ సీజన్లో శనగ సాగు చేశాం. ఎకరాకు రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టాం. వర్షాలు లేక భూమిలో తేమ లేకపోవడంతో దిగుబడి తగ్గింది. ఎకరాకు సగటున 6 క్వింటాళ్ల దిగుబడి రావాలి. కానీ 3 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. క్వింటాకు రూ.5వేల ధర మాత్రమే లభించింది. పూర్తిగా నష్టపోయాం. మా మండలాన్ని ప్రభుత్వం ఎందుకు కరువు ప్రాంతంగా గుర్తించలేదో తెలియడం లేదు. – పూజారి బీరప్ప, రాతన, తుగ్గలి మండలం భూగర్భ జలాలు అడుగంటి పంట నష్టం పశ్చిమ ప్రాంతంలోని కోసిగి మండలం అత్యంత వెనుకబడిన ప్రాంతమని అందరికీ తెలుసు. అయితే 2024–25 కరువు మండలాల జాబితాలో మా మండలం లేకపోవడం దారుణం. వందగళ్లు గ్రామంలో భూగర్భ జలాలు 40 మీటర్ల అడుక్కు వెళ్లాయి. మేము రబీలో ఐదు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాం. భూగర్భ జలాలు అడుగంటి పంట పూర్తిగా దెబ్బతినింది. పెట్టుబడి ఎకరాకు రూ.25 వేల వరకు వచ్చింది. నాలుగు బస్తాల పంట కూడా రాలేదు. – ఈరన్న, వందగళ్లు, కోసిగి మండలం జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా గుర్తించాలి ఖరీఫ్ కరువు మండలాలను ప్రకటించడంలో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. రబీలో అన్ని మండలాల్లో మరింత తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. కానీ జిల్లాలో కర్నూలు జిల్లాలో 10 మండలాలు, నంద్యాల జిల్లాలో 4 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా గుర్తించడం అన్యాయం. ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి. – జి.రామకృష్ణ, జిల్లా కార్యదర్శి, ఏపీ రైతుసంఘం -
బాబు, పవన్‌లను నమ్మి మోసపోయాం
కర్నూలు(సెంట్రల్): సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను నమ్మి మోసపోయామని డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అదిగో.. ఇదిగో అంటూ డీఎస్సీ నోటిఫికేషన్ కాలయాపన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్‌ను ముట్టడించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో గేట్లు ఎక్కి దూకేందుకు ప్రయత్నించగా తోపులాట చోటు చేసుకుంది. చివరకు కేసులుపెట్టి జైలుకు పంపుతామని త్రీటౌన్ సీఐ శేషయ్య హెచ్చరించడం.. కలెక్టర్ తరపున స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగ ప్రసన్న లక్ష్మీ వచ్చి వివరణ ఇవ్వడంతో నిరుద్యోగులు కాస్తా వెనక్కి తగ్గారు. ప్రతి నెలా రూ.10వేల పైనే ఖర్చు డీఎస్సీ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాం. ఎలాగైనా టీచర్ కావాలన్నదే నా లక్ష్యం. డీఎస్సీ కోచింగ్, ప్రిపరేషన్ కోసం హాస్టల్లో ఉండటంతో ప్రతినెలా రూ.10వేల పైనే ఖర్చు అవుతోంది. ప్రభుత్వం మా బాధలను పట్టించుకోవాలి. – దేవిబాయి, ఎల్బండతండా, వెల్దుర్తి మండలండీఎస్సీ అభ్యర్థుల్లో కట్టలు తెంచుకున్న ఆక్రోశం కర్నూలు కలెక్టరేట్ ముట్టడి పోలీసులు, నిరుద్యోగ అభ్యర్థుల మధ్య తోపులాట -
సీఎం మొదటి సంతకానికే దిక్కులేకపోతే ఎలా?
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మార్చిలోపు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినా మాట నిలుపుకోలేదన్నారు. చంద్రబాబునాయుడు కలుగజేసుకొని ఏప్రిల్‌లో ఇస్తామని చెప్పినా మళ్లీ శిక్షణ అంటూ కాలయాపన చేస్తున్నారు. సీఎం చేసిన మొదటి సంతకానికే దిక్కులేకపోతే ఎలా. వారం రోజుల్లో నోటిఫికేషన్‌ను విడుదల చేయకపోతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల కాన్వాయ్‌లను అడ్డుకుంటాం. – నగేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి, డీవైఎఫ్ఐ కాలయాపన దేనికి సంకేతం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి మెగా డీఎస్సీ అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ను పది రోజుల్లో విడుదల చేస్తామని చెప్పి మొదటి సంతకం చేశారు. పది నెలలు గడిచినా అతీగతీ లేదు. కాలయాపన దేనికి సంకేతం. – సులోచన, శివవరం, నంద్యాల జిల్లా -
రేపటి నుంచి ఫోరెన్సిక్ వైద్యుల రాష్ట్ర సదస్సు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో ఈ నెల 12, 13వ తేదీల్లో ఫోరెన్సిక్ అండ్ టాక్సికాలజీ వైద్యుల 6వ రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ టి. సాయిసుధీర్ చెప్పారు. గురువారం ఫోరెన్సిక్ విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ ఆధ్వర్యంలో కర్నూలులో మొదటిసారిగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ‘ఫోరెన్సిక్ ఫిజీషియన్ ఏ క్లినికల్ ఫోరెన్సిక్ మెడిసిన్ ఎక్స్పర్ట్’ అనే థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ నరసింహం, డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 65 మంది పోలీస్ అధికారులతో పాటు మొత్తం 394 మంది వైద్యులు ఏపీ, తెలంగాణా, కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. త్వరలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఫోరెన్సిక్ మెడిసిన్ ఓపీ ప్రారంభిస్తామన్నారు. అత్యవసర కేసులకు(ఎంఎల్సీ) కాల్ డ్యూటీ ద్వారా హాజరై డ్యూటీ డాక్టర్లకు సలహాలు, సూచనలు ఇస్తామన్నారు. సమావేశంలో ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డాక్టర్ పి. బ్రహ్మాజీమాస్టర్, వైద్యులు వైకేసీ రంగయ్య, కె.నాగార్జున, వి.కోటేశ్వరరావు, పి. హరీ ష్‌కుమార్, సురేఖ, మహ్మద్ సాహిద్ పాల్గొన్నారు. -
ఉపాధి కూలీల హాజరు పెంచాలి
● ఏపీడీ, ఏపీవోలకు డ్వామా పీడీ ఆదేశాలు కర్నూలు(అగ్రికల్చర్): ఉపాధి పనులకు కూలీల హాజరు పెంచడంపై వెంటనే దృష్టి సారించాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య ఏపీడీ, ఏపీవోలను ఆదేశించారు. పశువుల షెడ్ల నిర్మాణపు పనులను కూడా వేగవంతం చేయాలన్నారు. గురువారం కలెక్టరేట్లోని డ్వామా సమావేశ మందిరంలో ఏపీడీలు, ఏపీవోలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనులకు ప్రతి రోజు 1.50 లక్షల మందికి పనులు కల్పించాలనేది లక్ష్యమని, ప్రస్తుతం 80 వేల మంది వరకు హాజరవుతున్నారన్నారు. అన్ని గ్రామాల్లో పనులు పెద్ద ఎత్తున చేపట్టి వలసలను పూర్తిగా నియంత్రించాలని తెలిపారు. ఫాంపాండ్స్ పనులు వేగవంతం చేసి మే నెల చివరి నాటికి పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ జవాబుదారి తనంతో పని చేసి లక్ష్యాలను అందుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు పీడీ మాధవీలత,ఏపీడీలు పద్మావతి, లక్ష్మన్న, పక్కీరప్ప, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీలకు రూ.40.73 కోట్ల రుణాలు ● ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.తులసీదేవి నంద్యాల(అర్బన్): జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో అర్హులైన ఎస్సీలకు రూ.40.73 కోట్ల రుణాలను అందించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.తులసీదేవి తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ స్వయం ఉపాధి, రవాణా, వ్యవసాయం తదితర రంగాల ద్వారా ఉపాధి పొందేందుకు మొత్తం 973 మందికి లబ్ధి చేకూర్చేందుకు రూపొందించిన వార్షిక ప్రణాళికకు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆమోదం తెలిపారన్నారు. అర్హులు ఈనెల 14 నుంచి మే 10వ తేదిలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ● రూ.3లక్షల వరకు రుణాలను 176 మందికి అందిస్తామని, ఇందులో సబ్సిడీ 60 శాతం, బ్యాంకు లోన్ 35 శాతం, లబ్ధిదారుని వాటా 5 శాతం ఉంటుందన్నారు. ● రూ.3లక్షలకు పైబడి రుణాలను 493 మందికి అందిస్తామని, ఇందులో సబ్సిడీ 40 శాతం, బ్యాంకు లోన్ 55 శాతం, లబ్ధిదారుని వాటా 5 శాతం ఉంటుందన్నారు. ● రూ.10 లక్షలకు పైగా విలువ చేసే ఒక్క యూనిట్ ( ఈవీ బ్యాటరీ చార్జింగ్ యూనిట్ ) మాత్రమే ఉందని, ఇందులో సబ్సిడీ 40 శాతం, బ్యాంకు లోన్ 55 శాతం, లబ్ధిదారుని వాటా 5 శాతం ఉంటుందన్నారు. ● ట్రాన్స్‌పోర్టు సెక్టార్లో 294 యూనిట్లు ఉన్నాయని, ఇందులో రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే వాహనాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఐదుగురు సభ్యులుగా ఉన్న గ్రూపులకు రుణాలు అందిస్తామని, ఇందులో 9 యూనిట్లు ఉన్నాయన్నారు. -
కుక్కల దాడిలో రెండు దుప్పులు మృతి
ఆత్మకూరురూరల్: నల్లకాల్వ గ్రామ శివార్లలో ఉన్న వైఎస్సార్ స్మృతివనం వెనక వైపు ఉన్న పొలాల్లో ఊరకుక్కల దాడిలో రెండు దుప్పులు మృత్యువాత పడ్డాయి. వెలుగోడు నార్త్‌బీట్ ఫారెస్ట్‌లైన్ పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావి వద్ద ఉన్న నీటి తొట్టిలో నీరు తాగేందుకు వచ్చిన దుప్పుల మందపై అక్కడ ఉన్న కుక్కల గుంపు దాడికి పాల్పడింది. దుప్పులు అడవిలోకి పారి పోగా రెండు కుక్కల బారిన పడి తీవ్ర గాయాలై మృతి చెందాయి. సమాచారం అందుకున్న వెలుగోడు రేంజ్ అధికారి ఖాన్ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దుప్పులకు స్థానిక వన్యప్రాణి వైద్యనిపుణులతో పోస్ట్ మార్టం చేసి కళేబరాలను దహనం చేయించారు. నెలలో దుప్పులపై కుక్కలు దాడి చేయడం ఇది రెండో సారి. గత వారంలో ఇదే ప్రదేశంలో మూడు దుప్పులు కుక్కల దాడిలో మృత్యువాత పడ్డాయి. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి కర్నూలు: కర్నూలు శివారులోని ఇ.తాండ్రపాడు గ్రామ సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గురువారం ఉదయం కర్నూలు రైల్వే హెడ్ కానిస్టేబుల్ టి.సి.మాధవస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బ్లూ కలర్ రౌండ్ నెక్ ఫుల్ హ్యాండ్ టీషర్టు, బూడిద కలర్ లోయర్ ప్యాంటు, ధరించాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9908889696, 9030481295 ఫోన్ చేసి సమాచారమివ్వాలని సీఐ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ సక్రమంగా అమలు చేయాలికర్నూలు (అర్బన్): రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను సక్రమంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మాల గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు కోరారు. గురువారం రాత్రి స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని ఎంపీపీ హాల్లో మాల గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం గౌరవ సలహాదారు గోన నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి అసోసియేషన్ చైర్మన్ సోమన్న, కో–చైర్మన్ భాస్కర్, కోశాధికారి డాక్టర్ వై.రాజశేఖర్, కన్వీనర్ చంద్రశేఖర్, కో–కన్వీనర్ మల్లికార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రమంతా పర్యటించి మాలల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై భవిష్యత్తు ప్రణాళికలను రూపొందిస్తామని చెప్పారు. ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా బాధ్యతలు స్వీకరించిన గోన నాగరాజును ఘనంగా సన్మానించారు. ఈ నేపథ్యంలోనే పాస్టర్ ప్రవీణ్ మృతికి రెండు నిముషాలు మౌనం పాటించారు. -
పోకిరీల భరతం పడుతూ..
నిర్భయంగా ఫిర్యాదు చేయాలి బాలికలు, యువతులు, మహిళలు ధైర్యంగా ఉండాలి. ఎవరైనా వేధింపులకు పాల్పడటం, ఉద్దేశ్యపూర్వకంగా వెంటపడటం, అవహేళనగా మాట్లాడితే నిర్భయంగా పోలీసులకు సమాచారమివ్వాలి. ఆపదలో ఉన్నా, వేధింపులకు గురైనా డయల్ 100 సేవలను వినియోగించుకోవచ్చు. – విక్రాంత్ పాటిల్, ఎస్పీ కర్నూలు: బాలికలు, యువతులు, మహిళల భద్రతకు జిల్లా పోలీసులు పెద్దపీట వేస్తున్నారు. వేధింపులకు పాల్పడుతున్న పోకిరీల భరతం పడుతున్నారు. మఫ్టీలో ఉంటూ రద్దీ ప్రాంతాల్లో నిఘా సారించే రక్షకులు ఆకతాయిల్లో మార్పు తెచ్చేందుకు వివిధ దశల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలో యాంటీ ఈవ్ టీజింగ్ బృందాలు కీలకంగా మారాయి. అధికారులు, సిబ్బంది ప్రత్యేక తనిఖీలతో విద్యార్థులు, మహిళలకు తామున్నామనే భరోసా కల్పిస్తున్నారు. పోకిరీల కట్టడికి డ్రోన్ కెమెరాలతో నిఘా... పాశ్చాత్య పోకడలు, సామాజిక మాధ్యమాల ప్రభావంతో కొందరు బాలురు, యువకులు తప్పుడు మార్గాలను అనుసరిస్తున్నారు. తమ కుటుంబ నేపథ్యాన్ని మరచి కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు. వారిని కట్టడి చేసేందుకు జిల్లాలోని కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో యాంటీ ఈవ్ టీజింగ్ బృందాలు పనిచేస్తున్నాయి. విద్యాసంస్థల ఆవరణాలు, ప్రయాణ ప్రాంగణాలు, రద్దీ కూడళ్లు ఇతర ప్రాంతాల్లో గస్తీ తిరుగుతున్నారు. తరచూ వేధింపులు జరిగే ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తిస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షణ కొనసాగుతోంది. విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు... విద్యా సంస్థల్లో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వినియోగం, సైబర్ నేరాల కట్టడి, పోలీసు సేవలు, మహిళా చట్టాల వినియోగం తీరును వివరిస్తున్నారు. జిల్లాలో 39 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వాటి పరిధిలోని విద్యాసంస్థల వద్ద ప్రత్యేకంగా ప్రతిరోజూ 36 ఈవ్ టీజింగ్ బీట్స్ విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆకతాయిలను పట్టుకుని కౌన్సెలింగ్ చేస్తున్నారు. డ్రోన్లతో నిఘా.. డ్రోన్లు జిల్లా పోలీసుల అమ్ముల పొదిలో సరికొత్త ఆయుధాలుగా మారాయి. ఇప్పటి వరకు పోలీస్ పెట్రోలింగ్ అంటే వాహనాల సైరన్లు, బూట్ల చప్పుళ్లు వినిపించేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. తమ ప్రతినిధులుగా డ్రోన్లను పంపుతున్నారు. ఆకాశంలో చక్కర్లు కొట్టిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ల రాకతో నిర్మాణుష్య ప్రదేశాల్లో మద్యపానంతో పాటు విద్యాసంస్థల వద్ద నిఘా పెరిగింది. ఈవ్ టీజింగ్ నిరోధానికి పోలీసులు డ్రోన్ కెమెరాల సేవలను వాడుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు మొదలయ్యే, ముగిసే సమయాల్లో కీలక ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగించి ఆకతాయిల ఆగడాలకు ముకుతాడు వేసే లా ప్రణాళిక రచించి అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని ముఖ్య పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కూడా డ్రోన్ సేవలను వినియోగించనున్నట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. రెండు నెలల వ్యవధిలో 700 మంది పోకిరీలకు కౌన్సెలింగ్... జిల్లా ఎస్పీగా విక్రాంత్ ఫిబ్రవరి 1వ తేదీన బాధ్యతలు చేపట్టారు. యాంటీ ఈవ్ టీజింగ్‌ను అరికట్టాలనే ఉద్దేశ్యంతో జిల్లా వ్యాప్తంగా ఈవ్ టీజింగ్ బీట్స్‌ను ఆయన కొత్తగా అమలులోకి తెచ్చారు. కళాశాలలు, పాఠశాలల వద్ద ఈవ్ టీజింగ్‌ను అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ 36 ఈవ్ టీజింగ్ బీట్స్ విధులు నిర్వహిస్తున్నారు. ఈవ్ టీజింగ్‌కు పాల్పడేవారిపై నిఘా ఉంచి రెండు నెలల వ్యవధిలో సుమారు 7 వేల మంది పోకిరీలకు ఈవ్ టీజింగ్ బీట్స్ పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. పద్ధతి మార్చుకోకుండా పదేపదే మహిళలను వేధించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందడంతో క్షేత్రస్థాయిలో పోలీసులు పోకిరీల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో కీలకంగా యాంటీ ఈవ్ టీజింగ్ బృందాలు ఈవ్ టీజింగ్ నిరోధానికి డ్రోన్ సేవలు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ 36 ఈవ్ టీజింగ్ బీట్స్ విధులు రెండు మాసాల్లో 700 మంది పోకిరీలకు స్టేషన్లో కౌన్సెలింగ్ -
పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలి
నంద్యాల(న్యూటౌన్): పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని సీపీఎం నాయకులు అన్నారు. నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్ సెంటర్లో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వంట గ్యాస్ ధర దశల వారీగా పెంచుతూ పోవడంతో సామాన్యుడికి కొనే పరిస్థితిలో లేదన్నారు. కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకొనే దుస్థితి చేరిందన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు కొనలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు, వెంకటలింగం, తోట మద్దులు, నరసింహలు, నాయకులు నాగన్న, శివన్న ,జయాలాన్ పాల్గొన్నారు. -
సామాన్యుడిపై గ్యాస్ ‘బండ’
కోవెలకుంట్ల: నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఆందోళన చెందుతున్న పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరింత భారం మోపింది. ఒక్కో సిలిండర్‌పై రూ. 50 పెంచడం, ఇప్పటికే డోర్ డెలవరీ పేరుతో మరో రూ. 50 వసూలు చేస్తుండటంతో వినియోగదారులకు భారంగా మారింది. జిల్లాలో దాదాపు 5.77 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కో కుటుంబానికి రెండు నెలలకొక సిలిండర్ చొప్పున ఏడాదికి సగటున ఆరు గ్యాస్ సిలిండర్లు అవసరమవుతాయి. సిలిండర్ బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు సంబంధిత ఏజెన్సీలు రూ.10లతో డోర్ డెలవరీ చేయాల్సి ఉంది. ఈ నెల ఏడో తేదీ వరకు సిలిండర్ ధర రూ. 860 కాగా డెలవరీ పేరుతో రూ. 50 కలిపి వినియోగదారులకు రూ. 910 ప్రకారం సరఫరా చేశారు. మంగళవారం నుంచి గ్యాస్ సిలిండర్‌పై కేంద్రం రూ. 50 పెంచడంతో సిలిండర్ ధర రూ. 960కి చేరింది. మారిన కాలానికనుగుణంగా ఇళ్లలో గ్యాస్ వినియోగం తప్పని సరి అయింది. కూలి పనులకు వెళ్లే కుటుంబాలు సైతం గ్యాస్‌ను వినియోగిస్తూ వంటలు తయారు చేసుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్ ధర పెంపు, డెలివరీ చార్జీలు ప్రజలకు మరింత భారంగా మారాయి. గ్యాస్ కొనుగోలుకు రెండు నెలలకొకసారి రూ. వె య్యి వరకు వెచ్చించాల్సి రావడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం సిలిండర్‌పై రూ. 44.62 మాత్రమే సబ్సిడీ ఇస్తోంది. గ్యాస్ సిలిండర్‌కు పూర్తి ధర చెల్లిస్తే రెండు, మూడు రోజుల్లో సబ్సిడీ మొత్తం వినియోగదారుల ఖాతాల్లో జమ అవుతోంది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా తర్వాత గోదాము వద్దకు వెళ్లినా, డోర్ డెలివరీ ఇచ్చినా రూ. 960 వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే రూ. 50 అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పేదల కష్టం గ్యాస్ సిలిండర్ల కొనుగోలు, అదనపు వసూలుకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్‌పై రూ. 50 పెంపు డెలివరీ చార్జీపేరుతో మరో రూ. 50 బాదుడు సామాన్య, మధ్యతరగతి వర్గాలపై ఆర్థిక భారం ఆందోళన చెందుతున్న వినియోగదారులు -
ముఖంపై తలుపులేసి.. ఏడడుగుల బంధాన్ని గెంటేసి!
సంతానం కలుగలేదని కర్కశత్వం ● నిత్యం భర్త, అతని తల్లిదండ్రుల వేధింపులు ● కట్నకానుకలుగా రూ.3.50 లక్షల నగదు, 5 తులాల బంగారం ● న్యాయం కోసం మెట్టినింటి మెట్లపై ఎల్ఎల్బీ విద్యార్థిని ● పోలీసుస్టేషన్‌కు చేరిన పంచాయితీ కర్నూలు: కర్నూలు శివారు జొహరాపురం దారిలోని లక్ష్మీ గార్డెన్ కాలనీలో నివాసముంటున్న మధుగోపాల్ సంతానం కలుగలేదని భార్య రమాదేవిని ఇంటి నుంచి గెంటేశాడు. ఇందిరాగాంధీ నగర్లో నివాసముంటున్న తెలుగు మన్యం, నాగలక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు, కూతురు సంతానం. రెండవ సంతానమైన రమాదేవికి మధుగోపాల్తో 2018 మార్చి 30న వివాహమైంది. కట్నకానుకలుగా రూ.3.50 లక్షల నగదు, 5 తులాల బంగారాన్ని ఇచ్చారు. రమాదేవి ఓ ప్రయివేట్ సంస్థలో టెలికాలర్‌గా పనిచేస్తుండగా.. మధుగోపాల్ ఓ ప్రయివేట్ హైస్కూల్లో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్నాడు. వీరి సంసారం కొంతకాలం అన్యోన్యంగా సాగినా సంతానం కలుగలేదన్న సాకుతో భర్త, తల్లిదండ్రులు వేధించడం మొదలుపెట్టారు. వైద్యుల సూచన మేరకు రమాదేవి టెలికాలర్ ఉద్యోగాన్ని మానేసి రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటూ ఎల్ఎల్బీ చదువుతున్నారు. అయితే సంతానం కలుగలేదన్న కారణంతో కొంతకాలంగా భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగి కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆమె కొంతకాలంగా పుట్టింట్లో ఉంటోంది. తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో బుధవారం భర్త ఇంటికి చేరుకుంది. భర్త బయటకు గెంటేసి తలుపులు మూసుకున్నాడు. దీంతో దాదాపు 3 గంటల పాటు ఆమె ఇంటి ముందే బైఠాయించింది. మూడో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఆమెను స్టేషన్‌ను తరలించి విచారిస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడు సొంత భార్యనే వీధిన నిలిపాడు. పిల్లలు కలుగలేదనే సాకుతో ఆమెను వదిలించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఏడుడుగులు నడిచి.. ఏడేళ్లు సంసారం చేసినప్పటికీ ఓ ఆడపిల్లకు అన్యాయం చేస్తూ ముఖంపైనే తలుపులు వేశాడు. కట్నకానుకలు ఇచ్చినా.. భర్త మాటకు కట్టుబడి ప్రయివేటు ఉద్యోగం మానుకున్నా.. సంసారం చేసేది లేదంటూ తెగేసి చెప్పాడు. పుట్టింట్లో ఉండలేక.. మెట్టినింట్లో అడుగు పెట్టలేక ఎల్ఎల్బీ చదువుతున్న ఈమె ‘న్యాయం’ కోసం నిరీక్షిస్తోంది. -
బాధిత రైతులకు న్యాయం చేయాలి
పాణ్యం: గత కొంత కాలంగా నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించి బాధిత రైతులకు న్యాయం చేయాలని అధికారులకు వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి సూచించారు. పాణ్యంలోని పార్టీ కార్యాలయం వద్ద పిన్నాపురం, తమ్మరాజుపల్లె గ్రామాల రైతులతో బుధవారం చర్చించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. సోలార్ పరిశ్రమ వచ్చిన తర్వాత కొత్త ము ఖాలు ఆన్లోన్కి వచ్చాయని, ఈ విషయంపై అధికారులు క్షేత్ర స్థాయిలో రికార్డులను పరిశీలించాలన్నారు. ఇప్పటికే భూ సమస్యలపై అనేక సార్లు రెవెన్యూ అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చామన్నారు. ఇటీవల చాలా మంది పేర్లను రైతులుగా ఆన్లైన్లో చేర్చారని, క్షుణ్ణంగా విచారణ జరిపి నిజమైన అన్నదాతలను అధికారులు గుర్తించాలన్నారు. కోర్టుకు వెళితే బెదిరింపులా? పిన్నాపురంలో భూ సమస్యలపై రైతులు కోర్టుకు వెళితే వారిని అధికారులు, పోలీసులు బెదిరించడం ఏమిటని కాటసాని మండిపడ్డారు. కోర్టులో సమస్యలు పరిష్కారమవుతాయని, అంత వరకు అధికారులు సమన్వయం పాటించకుండా రైతులను బెదిరించే ధోరణితో మాట్లాడడం సరికాదన్నారు. కోర్టు తీర్పు ఆధారంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారుల ఉత్సాహం ఎవరికి లాభం చేకూర్చడానికి అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని త్వరలోనే బాధిత రైతులతో కలసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. సాగునీటిపై ఆరా ఎస్సార్బీసీ ఆయకట్టులో సాగు చేస్తున్న పంటలకు నీరు ఎలా అందుతుందనే విషయంపై రైతులతో కాటసాని మాట్లాడారు. చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందుతుందా లేదా అనే విషయంపై అడిగి తెలుసుకున్నారు. సాగునీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎస్సార్బీసీ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి కాల్వల సమస్యలను గుర్తించి మరమ్మతులు చేయాలన్నారు. మిరప, వరి తదితర పంటలకు మార్కెట్లో వస్తున్న ధర గురించి అడిగి తెలుసుకున్నారు. మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు, కో–ఆప్షన్ సభ్యులు జాకీర్ ఉసేన్, ఆటోమాబు, చందమామ బాబు, తొడేటి సుబ్బయ్య, జయచంద్రారెడ్డి, క్రిష్ణారెడ్డి , మధురెడ్డి, చిన్న సుబ్బయ్య, బాలస్వామిరెడ్డి , పెద్ద ఎల్లసుబ్బయ్య, బాలిరెడ్డి, టైలర్బాషా తదితరులు పాల్గొన్నారు. పిన్నాపురం, తమ్మరాజుపల్లెలో భూ సమస్యలు పరిష్కరించాలి వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి -
అర్ధరాత్రి ఆదోని ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం
ఆదోని అర్బన్: పట్టణంలో బీజేపీ కార్యకర్తల ఆగడాలు మితిమీరిపోయాయి. అర్ధరాత్రి పూట ఎమ్మెల్యే పీఏ అని, అనుచరులమని దాదాపు 10 మంది ఇసుక టిప్పర్, ట్రాక్టర్లను ఆపి దౌర్జన్య చేస్తున్నారు. లోడింగ్ రశీదులను చింపేసి ఎమ్మెల్యేను కలవాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ట్రాక్టర్ ఓనర్ కృష్ణ, టిప్పర్ డ్రైవర్ మహమ్మద్‌హుసేన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటల సమయంలో డస్ట్ తీసుకెళ్తున్న లారీని ఆపి దౌర్జన్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. అదే రోజు రాత్రి 11 గంటలకు ఎమ్మెల్యే అనుచరులు సాయి, తాయన్న, రమాకాంత్, విజయ్‌లతోపాటు మరో ఆరుగురు టిప్పర్లను, ట్రాక్టర్లను ఆపి నెలకు ట్రాక్టర్‌కు రూ.15 వేలు, టిప్పర్‌కు రూ.40 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలాఉంటే అక్రమ రవాణా, ఇసుక మాఫియాను నియంత్రించేందుకే బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తున్నారని బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజుగౌడ్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి విజయ్‌కృష్ణ జరిగిన ఘటనలను సమర్థించుకోవడం గమనార్హం. ఈ మేరకు బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారిపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. టిప్పర్‌కు రూ.40 వేలు, ట్రాక్టర్‌కు రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ -
మంత్రి అనుచరుడా మజాకా!
నంద్యాల(అర్బన్): అడిగేవారు లేరని.. అడ్డుకునే వారు రారని నంద్యాల మండల టీడీపీ నాయకులు సీలింగ్ భూములపై కన్నేశారు. నకిలీ పత్రాలతో అక్రమ లేఅవుట్ల వేసి సొమ్ము చేసుకుంటున్నారు. సీలింగ్ భూములను అమ్మడం, కొనుగోలు చేయకూడదనే నిబంధనలకు రెవెన్యూ అధికారులు తూట్లు పొడుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చాబోలు గ్రామం కర్నూలు – కడప జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎకరా రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు మాత్రమే ఉన్న భూముల విలువ జాతీయ రహదారి ఏర్పాటుతో ఎకరా రూ.5 కోట్ల రూ.7 కోట్ల వరకు చేరింది. సెంటు స్థలం కూడా పట్టణ ధరలను మించి పోవడంతో స్థలాలు, పొలాలకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఈ క్రమంలో గ్రామ పరిసరాల్లోని సీలింగ్, అసైన్డ్, పోరంబోకు స్థలాలపై కూటమి నాయకుల కన్ను పడింది. అధికారంలోకి వచ్చాక ఎక్కడ కాస్త జాగా కనపడినా కబ్జా చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఆక్రమించేసి అమ్మేస్తున్నారు. గ్రామంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఐదు దశాబ్దాల క్రితం పలువురు రైతుల నుంచి ప్రభుత్వం సర్వే నెం.109/ఏలో 4.50 ఎకరాల భూమిని సీలింగ్ చేసింది. కాల క్రమేణ గ్రామంలోని మూడు పేద కుటుంబాలకు 2.50 ఎకరాల సీలింగ్ భూములను పంపిణీ చేసింది. మిగిలిన 2 ఎకరాల భూమిలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ పేద లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించే క్రమంలో పట్టాలు ఇచ్చింది. ఊరి చివర కావడంతో ఆ ప్రాంతంలో నివాసం ఉండేందుకు స్థానికులు సుముఖత చూపలేదు. దీంతో అప్పట్లో ఇచ్చిన పట్టాలను కొంత కాలానికి రద్దు చేసింది. కాగా గ్రామ సమీపాన బైపాస్ రోడ్డు రావడం, గ్రామాభివృద్ధి జరుగుతుండటంతో 2021 లో ఆ రెండు ఎకరాల భూముల్లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న కాలనీ ఏర్పాటు చేస్తూ 67 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. అయితే కోర్టులో కేసు ఉండటంతో ఇళ్ల నిర్మా ణం జాప్యమైంది. కొన్నాళ్ల తర్వాత లబ్ధిదారులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు సిద్ధమవుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. వివాదాల్లో నలుగుతున్న 4.50 ఎకరాల సీలింగ్ భూ ములపై స్థానిక టీడీపీ నాయకుడు కన్నేశాడు. మొదట కొంత భాగాన్ని ఆక్రమించుకోవాలని వేసిన స్కెచ్ పారింది. ప్రస్తుతం ఆ భూమిని సాగు చేసుకుంటున్న ముత్తయ్య కుటుంబం నుంచి కొనుగోలు చేసి ఆ పక్కనే ఉన్న జగనన్న కాలనీకి కేటాయించిన 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా ఎకరా భూమిలో వెంచర్ వేసి ప్లాట్లు అమ్మకానికి పెట్టాడు. స్థానిక మంత్రికి ఈ నాయకుడు ముఖ్య అనుచరుడు కావడంతో రెవెన్యూ అధికారులు సైతం అభ్యంతరాలు తెలపలేదు. సీలింగ్ భూములను అమ్మకాలు, కొనుగోలు చేసేందుకు వీలుండదని తెలిసినా ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. నోటీసులు ఇచ్చాం డొంక, శ్మశాన, పోరంబోకు సీలింగ్ భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వదు. సీలింగ్ భూముల్లో వంశపారపర్యంగా సాగు చేసుకొని జీవించాలే తప్ప అమ్మకాలు జరపకూడదు. ఆ భూములను ఎవరూ కొనడానికి వీలు లేదు. భూముల్లో వెంచర్లు వేసిన వారికి నోటీసులు ఇచ్చాం. వారి నుంచి సమాధానం రాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసులు, నంద్యాల రూరల్ తహసీల్దార్ చాబోలు గ్రామంలో 4.50 ఎకరాల సీలింగ్ ల్యాండ్ కబ్జాకు యత్నం ముందుగా ఎకరా స్థలంలో వెంచర్ వేసి ప్లాట్ల అమ్మకాలు చోద్యం చూస్తున్న అధికారులు -
రసాయన ఎరువుల వినియోగం ఇలా..
● మళ్లీ పెరిగిన రసాయన ఎరువుల వినియోగం ● రైతులకు భారంగా మారిన పెట్టుబడి వ్యయం ● ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహకాలు అరకొరే! ● గాడి తప్పిన గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ విధానం ● స్పందించని రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాల వారీగా (టన్నుల్లో).. ఎరువు పేరు 2023–24 2024–25 యూరియా 56,468 63,178 డీఏపీ 16,130 18,081 ఎంవోపీ 1,722 2,731 కాంప్లెక్స్ 1,27,452 1,47,430 ఎస్ఎస్పీ 2,546 2,717 కంపోస్ట్ --- 4 ఎఫ్‌వోఎం --- 3 మొత్తం 2,04,318 2,34,144కర్నూలు(అగ్రికల్చర్): రసాయన ఎరువుల వినియోగంతో ఎన్నో అనర్థాలు ఉన్నాయనే విషయాన్ని చాలా మంది రైతులు గుర్తించలేకపోతున్నారు. వివిధ పంట ల్లో ఉత్పాదకతను పెంచుకునేందుకు విచ్చలవిడిగా వాడుతున్నారు. దీంతో భూమి స్వభావం దెబ్బతింటోంది. చాలా చోట్ల పొలాలు చౌడుబారుతున్నాయి. పర్యావరణం కూడా కలుషితం అవుతోంది. పంట ఉత్పత్తుల్లో కెమికల్స్ అవశేషాలు ఉండటంతో మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 2023–24లో 2,04,318 టన్నుల రసాయన ఎరువులు వాడగా.. 2024–25లో 2,34,144 టన్నులు వినియోగించారు. మొత్తం 29,826 టన్నుల వినియోగం పెరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. రైతులకు అవగాహన కల్పించడం.. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహకాలు పెంచడం... తదితర విషయాలపై దృష్టిసారించడం లేదు. ఎకరాకు 185 కిలోల రసాయన ఎరువులు రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 96 వేల ఎకరాల్లో మిర్చి సాగైంది. పత్తి కూడా జిల్లాలో అత్యధికంగా సాగు అవుతోంది. 2024 ఖరీఫ్‌లో 10,55,517 ఎకరాలు, రబీలో 2,14,692 ఎకరాలు ప్రకారం మొత్తంగా 12,70,209 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. నీటిపారుదల కింద సాగు చేసే పంటలకు విపరీతంగా రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు. సగటున ఎకరాకు 160 కిలోల వరకు రసాయన ఎరువులు వాడవచ్చు. అయితే 2024–25లో ఎకరాకు సగటున 185 కిలోల రసాయన ఎరువులు వినియోగించారు. 2024–25లో భూసార పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించి.. వాటి ఫలితాలను రైతులకు అందజేసినప్పటికీ రసాయన ఎరువుల వినియోగం పెరిగిపోయింది. ఖర్చు తడిసి మోపెడు రసాయన ఎరువుల వినియోగం భారీగా పెరుగుతుండటంతో వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. వివిధ కంపెనీలు రసాయన ఎరువుల ధరలు ఇష్టానుసారంగా పెంచుతున్నాయి. 10–26–26, 12–32–16 రసాయన ఎరువుల 50కిలోల బస్తా ధర రూ.1,720 ఉందంటే ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో తెలుస్తోంది. దీంతో రైతులకు ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. మిర్చి, వరి సాగులో అడ్డుగోలుగా రసాయన ఎరువులను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పండించిన పంటల్లో కూడా కెమికల్స్ అవశేషాలు ఉంటున్నట్లుగా శాసీ్త్రయంగా నిర్ధారణ అవుతోంది. ‘ప్రకృతి’ సాయం కరువే! రసాయన ఎరువుల వినియోగం లేకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తే ప్రజారోగ్యానికి పెద్దపీట వేసినట్లే. అయితే జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. కాగితాల్లో వేలాది ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం కనిపిస్తోంది. 2024–25లో 50 వేల ఎకరాలకుపైగా ప్రకృతి వ్యవసాయం చేసినట్లు లెక్కలు ఉన్నప్పటికీ వాస్తవం నామమాత్రమే. స్వచ్ఛందంగా ప్రకృతి వ్యవసాయం చేసేవారు జిల్లాలో 70 నుంచి 80 మంది వరకు ఉన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహించకపోవడం, విరివిరిగా సాయం అందక పోవడం.. తదితర కారణాలతో చాలా మంది రైతులు ముందుకు రావడం లేదు. గ్యాప్..తూచ్ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ (గ్యాప్) కింద ప్రతి మండలంలో పొంలబడి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చేసిన సిఫార్సుల మేరకే కెమికల్స్ వాడాలి. ప్రతి మండలంలోని 50 నుంచి 100 ఎకరాల వరకు ‘గ్యాప్’ కింద ఆహార పంటలు సాగు చేశారు. ప్రతి వారం పొలంబడి కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చినప్పటికీ రసాయన ఎరువులు వాడకం తగ్గలేదు. పలు పంటల శ్యాంపుల్స్‌లో కెమికల్స్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. చర్యలు తీసుకుంటున్నాం 2024–25 సంవత్సరంలో సాగు విస్తీర్ణం పెరిగినందున రసాయన ఎరువుల వినియోగం పెరిగింది. 2023–24 సంవత్సరంతో పోలిస్తే దాదాపు 30 వేల టన్నులు అదనంగా వినియోగించారు. కెమికల్స్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ కింద రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు పొలంబడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు దేశంలో నంద్యాల రెండో స్థానం రసాయన ఎరువుల వినియోగంలో నంద్యాల జిల్లా రికార్డుల్లోకి ఎక్కింది. 2024–25 వ్యవసాయ సంవత్సరంలో రాష్ట్రంలోనే ఎరువుల వినియోగంలో మొదటి స్థానంలో నిలిచింది. మరో విశేషమేమిటంటే దేశంలోనే ఎరువుల వినియోగంలో నంద్యాల జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. ఈ విషయా న్ని కేంద్ర వ్యవ సాయ, రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ మంత్రి జేపీ నడ్డా పార్లమెంటు వేదికగా ఇటీవల ప్రకటించారు. ఈ జిల్లాలో ప్రధానంగా వరి సాగు చేస్తా రు. కాగా యూరియా 3 బస్తాల వేయాల్సి ఉండ గా... 10 బస్తాల వరకు వినియోగించారు. రికార్డు స్థాయిలో నంద్యాల జిల్లాలో 3.75 లక్షల టన్నులు వినియోగించిట్లు సమాచారం. ఎరువులు ఈ స్థాయిలో వినియోగించారంటే ఆహార పంటల్లో కెమికల్స్ అవశేషాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇవీ నష్టాలు.. మిర్చి, పత్తి, వరి, మొక్కజొన్న, వివిధ కూరగాయల పంటలకు రసాయన ఎరువుల వాడకం ఎక్కువగా ఉంటోంది. దీంతో ఈ పంట ఉత్పత్తుల్లో కెమికల్స్ అవశేషాలు ఉంటున్నట్లు తెలుస్తోంది. కెమికల్స్‌తో పండించిన ఆహార ఉత్పత్తులు తీసుకుంటే ప్రజలు పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. గతంలో పశువుల ఎరువులు వాడేవారు. అలాగే పొలాల్లో నాలుగైదు రోజుల పాటు గొర్రెల మందను ఉంచేవారు. కెమికల్స్ లేని ఆహారం తీసుకోవడంతో అప్పటి వారు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటున్నారు. ప్రస్తుతం పలు రసాయన ఎరువులు, మందులతో పండించిన ఆహారం తీసుకుంటుండటంతో జబ్బులు పెరిగిపోతున్నాయి. -
మారుమోగిన ఎర్రమల కొండలు
అవుకు: ఎర్రమల కొండల్లో వెలసిన శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి తిరుకల్యాణ మహోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ఉప్పలపాడు గ్రామంలో స్వామివారిని ఆలయ పూజార్లు పట్టు వస్త్రాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పెళ్లి కుమారుడిలా ముస్తాబు చేసి గ్రామస్తులందరికీ స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ గ్రామోత్సవం నిర్వహించారు. మంగళవారం ఉదయం ఉత్సవమూర్తులను ఉప్పలపాడు గ్రామం నుంచి స్వామివారి సేవకులు దాదాపు 12 కిలోమీటర్లు కాలినడకన పల్లకీలో జక్కలేరు వాగు వద్ద ఉన్న కంబగిరి స్వామి ఆలయానికి చేర్చారు. కంబగిరయ్య కొండకు చేరిన ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం చైత్ర శుద్ధ ద్వాదశి సందర్భంగా స్వామివారు హనుమద్ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
మాజీ సీఎం జగన్ పర్యటనపై ‘డ్రోన్’ నిఘా
ప్యాపిలి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణాతో పాటు పలువురు సీఐలు, ఎస్ఐలు ఉమ్మడి కర్నూలు జిల్లా సరిహద్దు ప్రాంతమైన పోతుదొడ్డి వద్దకు చేరుకున్నారు. జగన్ పర్యటనకు జిల్లా నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్తారనే అనుమానంతో పోలీసులు ఇక్కడికి చేరుకున్నట్లు సమాచారం. డ్రోన్ కెమెరా ద్వారా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఎస్పీ ప్యాపిలి, డోన్ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలపై స్థానిక అధికారులతో ఆరా తీశారు. 13న గురుకులాల ప్రవేశ పరీక్ష నంద్యాల(న్యూటౌన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో(2025–26) 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 13న పరీక్ష నిర్వహిస్తున్నట్లు గురుకులాల సమన్వయకర్త డాక్టర్ ఐ.శ్రీదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లాలోని 8, నంద్యాల జిల్లాలోని 6 పరీక్షా కేంద్రాల్లో 5వ తరగతిలో 1,120 సీట్లకు 9,340 మంది, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 1,480 సీట్లకు 7,727 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. డోన్‌లోని బాలుర పాఠశాలను పరీక్షా కేంద్రంగా ఎంపిక చేసుకున్న విద్యార్థులు సమీపంలోని బాలికల పాఠశాలలో నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరు కావాలన్నారు. ప్రవేశ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు http://apqpcet. apcfss.in వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. నకిలీ నోట్లు ఇస్తామని చెప్పి టోకరా బొమ్మలసత్రం: అసలు నోటుకు నాలుగింతలు నకిలీ నోట్లు ఇస్తామని చెప్పి మోసం చేసిన సంఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బాధితుడి ఫిర్యాదుతో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా దర్శి పట్టణానికి చెందిన ఆంజనేయులు, శివప్రసాద్, వెంకటశివ నాగప్రసాద్‌లు తమ వద్ద రూ.5 లక్షలు నకిలీ నోట్లు ఉన్నాయని తమకు కేవలం రూ.50 వేలు ఇస్తే చాలని పట్టణంలో పలువురుని ఆశ్రయించారు. ఈ క్రమంలో నందమూరినగర్‌కు చెంది న సత్యరాజు వారి బుట్టలో పడ్డాడు. ఈ మేరకు ఆదివారం రూ. 50 వేలు తీసుకుని స్థానిక అయ్యలూరిమెట్ట సమీపంలో ఓ చోటుకు చేరుకున్నాడు. కాగా నకిలీ నోట్లు ఇవ్వకుండా సత్యరాజుపై దాడి చేసి రూ. 50 వేలతో నిందితులు పరారయ్యారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుదాం
నంద్యాల: ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన కింద జిల్లాలో ఎంపికై న 19 గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గ్రామ సర్పంచులు, ఎంపీడీఓలకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆదర్శ గ్రామాల అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జెడ్పీ డిప్యూ టీ సీఈఓ సుబ్బారెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, జిల్లా అధికారులు, గ్రామ సర్పంచులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన కింద పార్లమెంటు సభ్యులు వారి పదవి కాలంలో ఒక్కొ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసేవారన్నారు. ఇందుకు అనుబంధంగా ఈ పథకాన్ని ప్రధానంగా ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలను గుర్తించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ మేరకు చాగలమర్రి మండలం మద్దూరు, పెద్దబోదనం, పాణ్యం మండలం గోనవరం, కొండజూటూరు, జూపాడుబంగ్లా మండలం పి.గణపురం, నంద్యాల మండలం రాయమల్పురం, రుద్రవరం మండలం పెద్దకంబలూరు, వెలుగోడు మండలం అబ్దుల్లాపురం, గోస్పాడు మండలం సాంబవరం, పసురపాడు, బేతంచెర్ల మండలం గోర్లగుట్ట, కోవెలకుంట్ల మండలం సౌదరిదిన్నె, మహానంది మండలం తమ్మడపల్లి, మసీదుపురం, పాములపాడు మండలం వేంపెంట, మిడ్తూరు మండలం అలగనూరు, చెరుకు చెర్ల, ఆత్మకూరు మండలం వడ్లరామపురం, ఆళ్లగడ్డ మండలంలోని పాతకందూరు గ్రామాలను ఎంపిక చేసి అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతామన్నారు. ఏ టా రూ. 20 లక్షలు మంజూరు చేయడంతో పాటు అద నంగా అడ్మిన్ కాస్ట్ పరంగా లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ నిధులతో అధిక శాతం సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. -
అరాచక పాలనలో అభివృద్ధి ఏదీ
● పది నెలలకే కూటమి ప్రభుత్వ డొల్లతనం బయట పడింది ● ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి ● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి పాణ్యం: అరాచక పాలనలో ప్రతిపక్ష పార్టీ నేతలపై దౌర్జన్యాలు, దాడులు తప్ప అభివృద్ధి ఏదని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నెరవాడ గ్రామంలో జరుగుతున్న శ్రీరామ నవమి వేడుకల్లో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ముందుగా చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పది నెలలకే కూటమి ప్రభుత్వ డొల్లతనం బయట పడిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి కూటమి నేతల అక్రమార్జనే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారన్నారు. పాణ్యం నియోజకవర్గంలో యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి టిప్పర్లతో గ్రావెల్ తరలిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు. అక్రమ తవ్వకాలు, అధికారులపై త్వరలోనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్రంలో సామాన్యుడి జీవనం భారంగా మారుతోందన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. గ్రామాల్లో కక్షలు పెంచుతున్నారు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కూటమి నాయకులు కక్షలు పెంచుతున్నారని కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. ఇందుకు కొందరు అధికారులు తోడయ్యారన్నారు. అధికారులు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నేతల ఆగడాలు, దౌర్జన్యాలను ప్రోత్సహించే అధికారులను న్యాయస్థానం ఎదుట నిలబెడతామన్నారు. ఆయన వెంట మాజీ జెట్పీటీసీ సభ్యుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, ఎంపీపీ ఉసేన్‌బీ, వైస్ ఎంపీపీ పార్వతమ్మ, మాజీ సర్పంచ్‌లు శేషిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రమణారెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, నాగిరెడ్డి , వడ్డుగండ్ల రాముడు, రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, కో–ఆప్షన్ సభ్యులు జాకీర్ఉసేన్, నాయకులు ఎల్లగౌడ్, సుబ్రహ్మణ్యం, ఆటో మాబు, విష్ణు తదితరులు ఉన్నారు. -
వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడి హౌస్ అరెస్ట్
కల్లూరు: కూటమి నేతలు గ్రామాల్లోనూ రాజకీయ చిచ్చు రగులుస్తున్నారు. వైఎస్సార్సీపీకి అండగా నిలుస్తున్న గ్రామాలపై పగబడుతున్నారు. టీడీపీ నేతల నిర్ణయానికి పోలీసులు కూడా వంత పాడుతుండటం విమర్శలకు తావిస్తోంది. తాజాగా కొంగనపాడులో శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే రథోత్సవానికి వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పాల్గొనకుండా అడ్డుకున్నారు. పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేసి కనీసం దర్శనానికి కూడా వెళ్లకుండా చేశారు. శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని కల్లూరు మండలం కొంగనపాడు గ్రామంలో సీతారాముల రథోత్సవం నిర్వహిస్తారు. సోమవారం సాయంత్రం నిర్వహించనున్న ఈ రథోత్సవానికి కాటసాని రాంభూపాల్‌రెడ్డి హాజరయ్యేందుకు సిద్ధమవ్వగా కర్నూలు పోలీసులు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కల్లూరులోని ఆయన నివాసానికి భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కాటసాని మీడియాతో మాట్లాడారు. తాను 2009 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా ఉన్నా.. లేకున్నా ప్రతి ఏడాది జరిగే సీతారాముల రథోత్సవానికి హాజరవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు. 2014–2019 మధ్య టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ రథోత్సవంలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. పొరపాటున కూడా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. 2024 ఎన్నికల్లో కూడా గ్రామంలో మెజార్టీ వచ్చిందని, దీన్ని జీర్ణించుకోలేకనే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, పోలీసులు గ్రామంలో ఉన్నది ప్రభుత్వ దేవాలయం కాదని తెలుసుకోవాలన్నారు. పోలీసుల సహకారంతో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తనను అడ్డుకుంటున్నారన్నారు. రథానికి డబ్బులు ఇచ్చింది కూడా ఎక్కువ శాతం తన అనుచరులేనన్నారు. తమ ప్రభుత్వంలో ఇలాంటి దుశ్చర్యలకు ఎప్పుడూ పాల్పడలేదని, అందరికీ దర్శనాలకు అవకాశం కల్పించామన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ఆయన వెంట నాయకులు కాటసాని శివనరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ రేణుక, పలువురు కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు. రథోత్సవంలో పాల్గొనకుండా పోలీసుల నోటీసులు -
కక్ష కట్టి.. పంటను నీట ముంచి
పగిడ్యాల: పాత ముచ్చుమర్రిలో వైఎస్సార్సీపీ నాయకుడు, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గీయుడైన చల్లా శ్రీనివాసరెడ్డిపై రాజకీయ ప్రత్యర్థులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. చల్లా శ్రీనివాసరెడ్డి దాదాపు ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని రబీ సీజన్లో కంది సాగు చేశాడు. పంట కోత దశకు రాగా ఈనెల 4న కోత కోసి పొలంలోనే కుప్పలు వేసి సొంత పని మీద కడపకు వెళ్లాడు. ఆయన ఊర్లో లేని సమయం చూసి రాజకీయ ప్రత్యర్థులు ఆదివారం కోసిన కంది పంట కుప్పలపై నీరు పారించారు. సాయంత్రం గ్రామానికి రాగానే పొలానికి వెళ్లి చూడగా తన పొలమంతా నీరు పారి కంది కట్టె కుప్పలు కుళ్లిపోయి కనిపించింది. గింజలు ఉబ్బిపోయి మొలకలు రావడంతో కన్నీరుమున్నీర య్యాడు. ప్రస్తుతం ఎకరాకు 9 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా.. దాదాపు 40 క్వింటాళ్ల మేర నష్టం వాటిల్లింది. పెట్టుబడి ఖర్చులు, కౌలు రూ.2 లక్షలు చెల్లించి పంట దిగుబడి కోసం నిరీక్షించగా అంతా నీటిపాలు చేశారని బాధితుడు వాపోయాడు. జరిగిన ఘటనపై ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ శరత్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో పంటను పరిశీలించారు. కంది కుప్పలపై నీరు పారించిన రాజకీయ ప్రత్యర్థులు వైఎస్సార్సీపీ నేతకు చెందిన ఐదు ఎకరాల్లో పంట నష్టం -
పీజీఆర్ఎస్లో 80 వినతులు
బొమ్మలసత్రం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యాక్రమంలో 80 వినతులు అందాయి. జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా వినతులు అందుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ చట్టపరమైన ఫిర్యాదులపై వెంటనే విచారించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. పీజీఆర్ఎస్లో తమకు అందిన ఫిర్యాదులు తిరిగి పునరావృతం కాకుండా ఆయా స్టేషన్ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామన్నారు. ఎవరైనా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు రాలేని వారు సమీపంలోని స్టేషన్ అధికారులకు వినతులు సమర్పించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ సీఐలు సూర్యమౌళి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీ కాల్వలో తగ్గిన నీటి ప్రవాహం జూపాడుబంగ్లా: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ఓ పంపు ద్వారా మాత్రమే కేసీ కాల్వకు సాగునీటిని సరఫరా చేస్తుండటంతో కేసీ కాల్వలో నీటి ప్రవాహం తగ్గింది. ముచ్చుమర్రి నుంచి కేసికి 245 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తుండగా సుంకేసుల డ్యాం నుంచి 20 రోజుల క్రితమే నీటి విడుదల నిలిచిపోయింది. ప్రస్తుతం లాకిన్స్‌లా వద్దకు 150 క్యూసెక్కుల నీరు చేరుతుండగా తూడిచెర్ల సబ్ చానల్ కాల్వకు సరఫరా చేస్తున్నట్లు కేసీ కాల్వ అధికారులు తెలిపారు. మరో ఐదారు రోజుల్లో కేసీ కాల్వకు సాగునీటి సరఫరా నిలిచిపోయే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ బనగానపల్లె రూరల్: బనగానపల్లె సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాన్ని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) కళ్యాణమ్మ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న రికార్డు రూమ్‌తో పాటు సమస్యలను సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. రోజు ఎన్ని రిజిస్ట్రేషన్ల అవుతున్నాయి? ఆన్లైన్ సమస్యలు ఉన్నాయా? తదితర వివరాలను డీఐజీ ఆరా తీశారు. కార్యక్రమంలో స్థానిక సిబ్బంది తదితరులు ఉన్నారు. సర్వే ప్రక్రియ పూర్తి చేయండి నంద్యాల: గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో చేపట్టిన వర్క్ ఫ్రం హోం, మిస్సింగ్, ఎంప్లాయిస్, సిటిజన్స్ తదితర సర్వేలు వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంకా 1,27,813 మంది వర్క్ ఫ్రం హోం సంబంధించి పెండింగ్‌లో ఉందన్నారు. బేతంచెర్లలో 10 వేలు, నంద్యాల అర్బన్‌లో 11,960, డోన్‌లో 7,553, కొలిమిగుండ్లలో 6,981, కోవెలకుంట్లలో 5,684, ఆళ్లగడ్డ, జూపాడుబంగ్లా, నందికొట్కూరు, అవుకు, పాణ్యం, శిరివెళ్ల, బనగానపల్లె తదితర మండలాలలో వర్క్ ఫ్రం హోం సర్వే పెండింగ్ ఉందన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు. మరింత పడిపోయిన మిర్చి ధర కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి ధరలు మరింత పడిపోయాయి. మిర్చిలో తేజ, బ్యాడిగ, ఆర్మూర్ తదితర రకాల్లో ఏ ఒక్క రకం ధర రూ.10 వేలు దాటలేదు. ఎరుపు రకానికి గరిష్ట ధర రూ.9,999, బ్యాడిగ రకానికి రూ.9,411 వరకు ధర లభించింది. మిగిలిన రకాలకు ధరలు మరింత అధ్వానంగా లభించడం గమనార్హం. రెండు నెలల కిత్రం మిర్చి రైతులను ఆదుకుంటామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హంగామా చేశాయి. ధరలు పడిపోయి రైతులు అల్లాడుతున్నప్పటికీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. మిర్చితో పాటు వేరుశనగ, ఉల్లి, సజ్జలు, కందుల ధరలు మరింత పడిపోయాయి. -
దశాబ్దాలుగా ఉన్న శ్రీశైల దేవస్థానం సంబంధించిన భూ సమస్య పరిష్కారానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. అయితే కూటమి ప్రభుత్వం ఇంకా సమావేశాలతో సరిపెడుతూ శ్రీగిరి అభివృద్ధిని విస్మరిస్తోంది. ఇప్పటికే ఈ సమస్యపై కూటమి మంత్రులు, అధికారులు ఒక మార
● శ్రీశైల క్షేత్రాభివృద్ధికి అడ్డంకిగా మారిన భూ సమస్య ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దేవస్థానం భూమిని గుర్తించిన వైనం ● సరిహద్దులను గుర్తించాలని సర్వే ఆఫ్ ఇండియాకు లేఖ ● కూటమి ప్రభుత్వంలో సమావేశాలతో సరిపెడుతున్న పాలకులు ● రేపు డిప్యూటీ సీఎం పవన్ అధ్యక్షతన మళ్లీ సమావేశం ● ప్రభుత్వ గెజిట్ కోసం వేచిచూస్తున్న శ్రీశైల దేవస్థానం శ్రీశైలం ప్రాజెక్ట్ ముంపునకు గురైనది 900 ఎకరాలుదేవస్థానానికి కేటాయించిన భూమి 5,302 ఎకరాలుఅభయారణ్యంతోనే అడ్డంకులు శ్రీశైలంలో ప్రధాన ఆలయాలు విస్తరించిన ప్రదేశం ఎంత ఉంది, మల్లమ్మ కన్నీరు ప్రాంతం నుంచి ఎంత వరకు దేవస్థానానికి చెందిన భూమి ఉంది, ఈ రెండు కలిసే ఉన్నాయా.. లేక విడివిడిగా ఉన్నాయా అనే విషయాలపై చర్చించాల్సి ఉందని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా శ్రీశైలం ఎన్క్లోజ్డ్ ఏరియాలో ఉందని, శ్రీశైలం అటవీప్రాంతం అభయారణ్యంగా ప్రకటించిన నేపథ్యంలో ఎన్టీసీఏ నిబంధనలు పాటించాలి. అలాగే ఎకో సెన్సిటీవ్ జోన్ ఉన్న క్రమంలో ఎటువంటి చర్యలు చేపట్టాలనే విషయాలపై అటవీశాఖ ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేవస్థానం, అటవీశాఖ, ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ చేపట్టిన సర్వే ప్రకారం గుర్తించిన భూములను దేవస్థానానికి అప్పగించేందుకు ప్రభుత్వం నుంచి దేవదాయశాఖకు గెజిట్ రావాల్సి ఉంది. శ్రీశైలంటెంపుల్: ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలసి వెలసిన శ్రీశైల మహాక్షేత్రానికి ఏటేటా భక్తుల తాకిడి పెరుగుతోంది. శ్రీశైల క్షేత్రపరిధిలో ఏ అభివృద్ధి పనులు చేపట్టాలన్నా.. భక్తులకు సౌకర్యాలు కల్పించాలన్నా.. అటవీశాఖ నుంచి కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. మొన్నటి వరకు శ్రీశైల దేవస్థానానికి ఎంత స్థలం ఉంది అని విషయంలో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు శ్రీశైల క్షేత్రానికి సంబంధించి ఎంత స్థలం ఉంది అనే విషయాన్ని గుర్తించేందుకు దేవస్థాన అధికారులు పలుమార్లు అటవీశాఖ అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దేవస్థానం భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎక్కడున్నాయి, క్షేత్ర సరిహద్దులను గుర్తించేందుకు అప్పటి పాలకులు చొరవ చూపారు. అప్పటి శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవస్థాన చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి దేవదాయశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు క్షేత్రపరిధి సరిహద్దులను కచ్చితంగా గుర్తించేందుకు దేవదాయశాఖ, అటవీశాఖ, రెవెన్యూ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మూడు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి రికార్డుల ఆధారంగా ప్రాథమికంగా శ్రీశైల దేవస్థానానికి 5,302 ఎకరాల భూమి ఉందని నిర్ధారించారు. మూడు శాఖలు సంయుక్తంగా సర్వే చేపట్టాలని నిర్ణయించారు. శ్రీశైలంలో క్షేత్ర సరిహద్దులను గుర్తించేందుకు దేవదాయ, అటవీ, ల్యాండ్ అండ్ సర్వే శాఖలు సంయుక్తంగా సర్వే చేపట్టారు. సర్వే చేసి కచ్చితమైన సరిహద్దులను గుర్తించారు. శ్రీశైల దేవస్థానానికి 1967 నవంబర్ 30న జీఓ ఎంఎస్ నెం 2191 ఫుడ్ అండ్ అగ్రికల్చరేట్ డిపార్ట్మెంట్ ప్రకారం 5,302 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ మొత్తం భూమి 9 సర్వే నెంబర్లలో ఉంది. ఆ భూమిలో 900 ఎకరాలు శ్రీశైలంప్రాజెక్టు రిజర్వాయర్‌లో ముంపు అయింది. బ్రిటీష్‌కాలం నాటి జీవో, ఆనాటి గెజిట్ ఎంట్రీ ద్వారా సర్వే చేయించి క్షేత్ర సరిహద్దులను గుర్తించారు. 4,400 ఎకరాలు శ్రీశైల మల్లన్నకు చెందిన భూమిగా అటవీశాఖ అంగీకరించింది. దీంతో ఆ భూమిని దేవస్థానానికి అప్పగించేందుకు ఆ శాఖ అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్కు డీఎఫ్‌వో లేఖ శ్రీశైల దేవస్థానానికి చెందిన భూములు గుర్తించడంతో అటవీ శాఖ ఇచ్చేందుకు ఒప్పందం కూడా జరిగింది. 2023 ఫిబ్రవరి 22న సున్నిపెంటలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు కేంద్ర కార్యాలయంలో అప్పటి దేవస్థాన ఈఓ ఎస్.లవన్న, ఆత్మకూరు డివిజన్ అటవీశాఖ అధికారి అలెన్ చాంగ్ టెరాన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఆ కాపీని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌కు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున దేవదాయశాఖకు భూమిని అప్పగించేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే డిపార్ట్మెంట్కు డీఎఫ్‌వో లేఖ రాశారు. అనుమతులు లభించేనా.. శ్రీశైలంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి, శ్రీశైల క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ అధ్యక్షతన గత సంవత్సరం నవంబరు 25న మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధిపై దేవదాయ, టూరిజం, అర్అండ్బీ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా శ్రీశైల దేవస్థానానికి భూముల కేటాయింపుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఇవ్వాలని జిల్లా రెవెన్యూ, అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆ నివేదికలను ప్రభుత్వానికి చేరవేశారు. ఆ నివేదికల మేరకు బుధవారం వైజాగ్‌లో జరిగే సమావేశంలో శ్రీశైల దేవస్థానికి భూముల కేటాయింపుపై స్పష్టత రానుంది. సమావేశాలతోనే సరిపెట్టకుండా మల్లన్న క్షేత్ర భూ సమస్యపై ప్రత్యేక చొరవ చూపి శాశ్వత పరిష్కారం చూపాలని పలువురు భక్తులు కోరుతున్నారు. -
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
● నంద్యాలలో గరిష్టంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కర్నూలు (అగ్రికల్చర్): ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈ నెలలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరే అవకాశమున్నట్లు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కర్నూలులోని ప్రధాన కూడళ్లలో ఎట్టకేలకు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తుండటం విశేషం. సోమవారం నంద్యాలలో 41.5 డిగ్రీలు, రుద్రవరంలో 41.1, కౌతాళంలో 41.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా రానున్న రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. -
రాష్ట్రంలో రాక్షస పాలన
● మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కోవెలకుంట్ల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాటసాని రామిరెడ్డి విమర్శించారు. పట్టణ శివారులోని వీఆర్, ఎన్ఆర్ ఫంక్షన్‌హాలులో సోమవారం వైఎస్సార్సీపీ వివిధ అనుబంధ విభాగాల మండల అధ్యక్షులు, పార్టీ మండల నూతన కమిటీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాటసాని మాట్లాడుతూ హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు. పది నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఆకాశం వైపు చూస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చలేమని సిగ్గులేకుండా కూటమి నేతలు చెప్పుకుంటున్నారన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖమంత్రిగా ఉన్న బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి గ్రామాల్లో పేకాట క్లబ్‌లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మంత్రి అండదండలతోనే పేకాట, బెట్టింగ్‌లు జోరుగా కొనసాగుతున్నాయని వీటిని అరికట్టడంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్నారు. టీడీపీ నేతలు ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఇసుక అక్రమ రవాణా దందా కొనసాగిస్తున్నారన్నారు. -
వినతుల పరిష్కారంపై అభిప్రాయాలు సేకరించండి
నంద్యాల: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారంపై ప్రజల అభి ప్రాయాలు సేకరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను కలెక్టర్‌తో పాటు ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చి పరిష్కరించిన దరఖాస్తుల ఎండార్స్మెంట్లు సంబంధిత ఫిర్యాదుదారులకు వెళ్లడం లేదన్నారు. సమస్యలు పరిష్కారమైన ప్రజల అభిప్రాయ సేకరణ 44 శాతమే పూర్తయిందని మిగిలిన అర్జీదారుల అభిప్రాయాలను సేకరించాలన్నారు. వారి సెల్ఫీ ఫొటో, వీడియో క్లిప్పింగులను సంబంధిత యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు. గ్రామ, పట్టణ ప్రాంతాలలో చెత్తకుప్పలు పేరుకపోతున్నాయని పంచాయతీ సెక్రటరీలు, ఈవోఆర్డీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో 220 వినతులు వచ్చాయని, వీటన్నింటిని పరిష్కరించాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ రాజకుమారి -
పెళ్లి కుమారుడిగా రంగనాథుడు
జూపాడుబంగ్లా: తర్తూరు శ్రీ లక్ష్మీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆదివారం స్వామివారు పెళ్లికుమారునిగా ముస్తాబయ్యారు. ఉదయం స్వామివారికి అర్చకులు పంచామృత అభిషేకాలు, పుష్పార్చన, కుంకుమార్చన వంటి విశేషపూజలు చేపట్టారు. అనంతరం స్వామివారిని పట్టువస్త్రాలతో పెళ్లికుమారునిగా అర్చకులు అలంకరించారు. స్వామివారు తర్తూరులో పెళ్లికుమారునిగా ముస్తాబైన అనంతరం ఇక్కడ పదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అయితే తర్తూరులో స్వామివారికి కల్యాణం నిర్వహించరు. బ్రహ్మోత్సవాల అనంతరం స్వామి వారు నెల్లూరు జిల్లాల్లోని శ్రీరంగాపురంలో జరిగే కల్యాణ వేడుకలకు తరలివెళ్తారని, అక్కడ శ్రీలక్ష్మి సమేత రంగనాథ స్వామివార్లకు కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని పూజారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమ వారం స్వామివారికి సింహ వాహనసేవ నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి ఈశ్వరరెడ్డి, ఈఓ సాయికుమార్, ఫెస్టివల్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి తెలిపారు. శ్రీశైలంలో 15న కుంభోత్సవం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 15న భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. దేవస్థాన పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. కుంభోత్సవం నిర్వహించే రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అమ్మవారి ఆలయ మెట్ల మార్గంలో అదనపు క్యూలైన్లను ఏర్పాటు చేయాలన్నారు. దేవదాయ చట్టాన్ని అనుసరించి క్షేత్ర పరిధిలో జంతు, పక్షి బలులు, జీవహింస పూర్తిగా నిషేధించా మన్నారు. క్షేత్రంలోని ప్రధాన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో కూడా పోలీసు, రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో దేవస్థాన వైదిక సిబ్బంది, శాఖాధిపతులు, విభిన్న విభాగాల పర్యవేక్షకులు, తహసీల్దార్ కేవీ శ్రీనివాసులు, సీఐ ప్రసాదరావు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మధ్యాహ్నం వరకే నంద్యాల: ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే కార్యక్రమం మధ్యాహ్నం లోపు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలందరూ గమనించాలన్నారు. వారిది ఆత్మహత్యాయత్నం పాములపాడు: ఇస్కాల గ్రామంలో సోమేశ్వరుడు అనే రైతు నలుగురు కుటుంబ సభ్యులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటరమణ తెలిపారు. గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అతిసార లక్షణాలతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడంతో డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆదివారం ఇస్కాలను సందర్శించారు. అయితే గ్రామంలో డయేరియా కేసు లు లేవని నిర్ధారించారు. సోమేశ్వరుడు అప్పులబాధతో కుటుంబసభ్యులతో కలసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసిందన్నారు. విషయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారికి సమాచారం ఇచ్చామన్నారు. ఆయన వెంట డాక్టర్ నాగలక్ష్మి, సర్పంచు మౌలాలి, హెల్త్ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
‘చంద్రన్న బీమా’కు గ్రహణం
నంద్యాల: ఎన్నికల ముందు బీరాలు పలికిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకా లను అటకెక్కిస్తున్నారు. గత ప్రభుత్వంలో వైఎస్పార్ బీమా పేరుతో ఈ పథకం ఎంతో మంది పేదలకు మేలు జరిగింది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల సభల్లో గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చంద్రన్న బీమాను మళ్లీ అమలు చేస్తామని, రూ.5 లక్షల ఉన్న పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచి అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అయినప్పటికీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. అయిన వారిని కోల్పోయి ఆధారం లేక బీమా కోసం ఎదురు చూస్తున్న బాధితులకు కూడా మొండి చెయ్యి చూపించారు. పరిహారం పెంచడం మాట అటుంచితే గతంలో ఉన్నది ఇవ్వకపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 4,700 కై ్లమ్‌లు పెండింగ్‌లో ఉండగా ప్రస్తుతం కనీసం దరఖాస్తులు స్వీకరించడం లేదు. చంద్రన్న బీమా పథకంలో భాగంగా 18–50 ఏళ్ల లోపు వారు సహజ మరణం పొందితే రూ.లక్ష, ప్రమాదవశాత్తూ మృతి చెందినా శాశ్వత వైకల్యం పొందినా రూ.5 లక్షల చొప్పున వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పరి హారం అందజేశారు. 51–70 ఏళ్ల లోపు వారు ప్రమా దవశాత్తూ మరణిస్తే రూ.3 లక్షలు చొప్పున ప్రమాదంలో పాక్షిక వైకల్యం పొందిన వారికి రూ.2.50 లక్షలు అందజేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాదశవాత్తు ఎవరైనా మరణిస్తే రూ.5 లక్షలు ఇచ్చే పరిహారాన్ని రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారే కాని ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. వ్యక్తి మృతి చెందిన తరువాత బాధిత కుటుంబానికి 30 రోజుల్లోగా పరిహారం అందాల్సి ఉంది. సహజ మరణం పొందిన వ్యక్తి వివరాలను 7 రోజులు, ప్రమాదాలకు గురైతే 15 రోజుల్లోపు సచివాలయాల్లో నమోదు చేయించాలి. బీమా సభ్యుడిగా ఉన్న వ్యక్తి చనిపోతే వెంటనే రూ.10 వేలు మట్టి ఖర్చుల కింద అందజేయాలి. మిగిలిన మొత్తాన్ని నామినీ వ్యక్తి గత బ్యాంకు ఖాతాకు జమ చేయాలి. బాధిత కుటుంబాలు నిరీక్షణ నెలలు తరబడి కై ్లములు పరిష్కారం కాకపోవడంతో బాధిత కుటుంబాలకు నిరీక్షణ తప్పడం లేదు. వాస్తవానికి 30 రోజుల్లోపే బీమా పరిహారం సొమ్ము బాధిత కుటుంబాలకు అందాల్సి ఉంది. ఇంటి పెద్దను, ఆసరా అందించే వారిని కోల్పోయి కుటుంబాల పోషణ కష్టంగా మారిన పరిస్థితుల్లో ప్రభుత్వం అందిస్తున్న ఈ సొమ్ము వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాని కూటమి ప్రభుత్వం బాధితుల ఆర్తనాదాలు వినకుండా హామీని తుంగలో తొక్కి అంత చేస్తున్నాం.. ఇంత చేస్తున్నాం అంటూ ప్రచారాలు మాత్రం చేసుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మార్గదర్శకాలు రాలేదు చంద్రన్న బీమా పథకంపై ఇంకా ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందలేదు. ఎవరైనా సాధారణ, ప్రమాదానికి గురై మృతిచెందితే వెంటనే సచివాలయాల్లో నమోదు అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం పరిహారాన్ని పెంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంది. త్వరలోనే పెండింగ్ కై ్లమ్లతో పాటు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కై ్లములు కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. –శ్రీధర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ, నంద్యాల పేరు మార్పుతో సరిపెట్టిన కూటమి ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి పైసా కూడా ఇవ్వని వైనం పెండింగ్‌లో వేలాది కై ్లమ్‌లు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ బీమా సక్రమంగా అమలు -
ధాన్యం ఇంటికి చేరేనా?
● అకాల వర్షాలతో వరి రైతు కుదేలు ● దిగుబడిపై తీవ్ర ప్రభావం ● పంట నూర్పిడికి అదనపు భారం కోవెలకుంట్ల: ఖరీఫ్‌లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టాలు మూటగట్టుకున్న వరి రైతులకు రబీ సీజన్ కూడా కలిసి రావడం లేదు. నాట్లు వేసినప్పటి నుంచి ఒకవైపు సాగునీటి కష్టాలు, పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు వెంటాడుతుండటంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో ని 29 మండలాల్లో ఈ ఏడాది రబీలో 28 వేల హెక్టార్లలో వరి సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల పరిధిలో బోర్లు, బావులు, చెరువులు, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, కుందూనది, పాలేరు, కుందరవాగు పరివాహక ప్రాంతాల్లో 25 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. ఇందుల్లో స్థానిక సబ్ డివిజన్లోని కోవెలకుంట్ల మండలంలో 725 హెక్టార్లు, సంజామల మండలంలో 203 హెక్టార్లు, అవుకు మండలంలో 1,552 హెక్టార్లు, కొలిమిగుండ్ల మండలంలో 17 హెక్టార్లు, ఉయ్యాలవాడ మండలంలో 761 హెక్టార్లు, దొర్నిపాడు మండలంలో 296 హెక్టార్లలో సాగైంది. ప్రస్తుతం పైరు రెండున్నర నెలలకు చేరుకుని పొట్ట దశలో ఉంది. మరో నెల రోజుల్లో పంట దిగుబడులు చేతికందనున్నాయి. ఇటీవల కాలంలో పది రోజుల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా రెండు పర్యాయాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పంట చేతికందే తరుణంలో అకాల వర్షాలు కురవడంతో పొట్ట దశలో ఉన్న పైరు నేలవాలి వడ్లు రాలిపోయా యి. కొని ప్రాంతాల్లో వరి పూర్తిస్థాయిలో పంటంతా నీట మునిగింది. మరో నెలరోజుల్లో దిగుబడులు చేతికందుతాయనుకుంటే వరణుడు కోలుకోలేని దెబ్బతీయడంతో రైతులు కుదేలవుతున్నారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తాయనుకుంటే అకాల వర్షం నిలువునా ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌లోనూ నష్టాల దిగుబడి ఈ ఏడాది జిల్లా రైతాంగానికి ఖరీఫ్ సీజన్లో వరి సాగు కలిసిరాలేదు. జిల్లాలోని దాదాపు 66 వేల హెక్టార్లలో సాగు చేశారు. రసాయన ఎరువులు, వరినారు, క్రిమి సంహారక మందులు, కలుపు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 35 వేల నుంచి రూ. 40 వేలు వెచ్చించారు. కౌలు రైతులు ఎకరాకు ఖరీఫ్‌లో 10 బస్తాలు, రబీలో మూడు బస్తాల వడ్లు చెల్లించేలా వరిమడులను కౌలుకు తీసుకున్నా రు. పైరు వివిధ దశల్లో అధిక వర్షాలు కురవడంతో వరిని దోమపోటు, అగ్గి తెగులు ఆశించడంతో తెగుళ్ల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు పడరానిపాట్లు పడ్డారు. అక్టోబర్ నెలలో తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షాలు దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఎకరాకు 30 బస్తాలకు మించి దిగు బడులు రాలేదు. ఈ క్రమంలో గిట్టుబాటు ధర అంతంత మాత్రంగానే పలికింది. గతేడాది క్వింటా రూ. 2,200 ధర పలకగా ఈ ఏడాది బస్తా రూ. 1,490 అమ్ముకుని నష్టాలు మూటగట్టుకున్నారు. నేలవాలిన వరితో అదనపు భారం జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో ఇటీవల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షాల వల్ల వివిధ ప్రాంతాల్లో వరి నేలవాలి చేతి కందకుండా పోయింది. పైరు నేల వాలడంతో వడ్లు రాలిపోయి నష్టం చేకూరింది. ఎకరాకు రెండు బస్తాలకు పైగా వడ్లు వరిమడిలో రాలిపోయినట్లు తెలుస్తోంది. రాలిపోయిన వడ్లు చేతికందే పరిస్థితి లేకపోగా మిగిలిన దిగుబడులను దక్కించుకునేందుకు రైతులపై అదనపు భారం పడనుంది. కూలీల సాయంతో పడిపోయిన వరిని కట్టలు కట్టుకోవాల్సి ఉంది. నేలవాలిన వరిలో యంత్రం సాయంతో నూర్పిడి మరింత కష్టంగా ఉంటుంది. వరి కట్టలు కట్టుకోవడం, నూర్పిడి వంటి పనులతో ఎకరాకు అదనంగా రూ. 5 వేలు అదనపు భారం పడుతుందని రైతులు వాపోతున్నారు. పెట్టుబడులు, రెక్కలకష్టం పైరుపై పెట్టి దిగుబడులు దక్కించుకునేందుకు రైతులు అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. అకాల వర్షాలు భయపెడుతున్నాయి ఈ ఏడాది రబీ సీజన్లో సాగు చేసిన వరిపైరును వేసవికాలం అకాల వర్షాలు భయపెడుతున్నాయి. పది ఎకరాల సొంత పొలంతోపాటు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాను. పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 30 వేలకు పైగా వెచ్చించాను. మరో నెల రోజులపాటు వర్షాలు పడకుంటే దిగుబడులు చేతికందుతాయి. ఈ మధ్య కాలంలో మోస్తరు వర్షం పడినా దిగుబడులు చేతికందకుండా పోతాయి. – వేణుగోపాల్‌రెడ్డి, రైతు, భీమునిపాడు, కోవెలకుంట్ల మండలం పెట్టుబడి నేలపాలు.. గడివేముల మండలం కరిమద్దెలలో నేలవాలిన వరి పైరును చూపిస్తున్న రైతు పేరు రామకృష్ణ. ఎకరాకు 8 బస్తాలు కౌలు చెల్లించేలా 40 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని ఈ ఏడాది రబీ సీజన్ లో వరి సాగు చేశాడు. నారు, రసాయన ఎరువు లు, క్రిమి సంహారక మందులు, కలుపు నివా రణ, తదతర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 30 వేలు ఖర్చు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి పంట మొత్తం నేలవాలి తీవ్ర నష్టం వాటిల్లింది. దిగుబడి చేతికందే తరుణంలో అకాల వర్షం ఆ రైతు కొంపముంచింది. -
ఇక గృహ వినియోగదారుల దోపిడీ
డివిజన్ వారీగా ఉమ్మడి జిల్లాలో బిగించిన స్మార్ట్ మీటర్లు ఆదోని 17,950 డోన్ 13,570 కర్నూలు 21,864 ఆత్మకూరు 9,945 నంద్యాల 35,890 ఎమ్మిగనూరు 12,670 మొత్తం 1,11,889వ్యాపారులపై విద్యుత్ పిడుగు ● స్మార్ట్ మీటర్లతో ఇబ్బడిముబ్బడిగా బిల్లులు ● సంక్షోభంలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ● గతంలో నెలవారీ బిల్లు రూ.2వేల నుంచి రూ.10వేలలోపే ● రెండు నెలలుగా బిల్లులు రూ.30 వేలపైనే ● గగ్గోలు పెడుతున్న వ్యాపార, పారిశ్రామిక వేత్తలుకర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లతో వినియోగదారులను దోపిడీ చేస్తోంది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. గతంలో వీటిని వ్యతిరేకించిన టీడీపీ కూటమి నేతలు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్మార్ట్ మీటర్ల టెక్నాలజీలో మార్పులు తెచ్చి మొదటి దశలో కమర్షియల్ కనెక్షన్లు కేటగిరి–2, పరిశ్రమల కనెక్షన్లు కేటగిరి–3లకు స్మార్ట్ మీటర్లు బిగించింది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ఒక్కసారిగా నాలుగు అంకెల్లో ఉన్న బిల్లులు ఐదు అంకెల్లోకి వెళ్లిపోయాయి. దీంతో వ్యాపార, పారిశ్రామిక వేత్తల్లో ఆందోళన మొదలైంది. 2024 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని టీడీపీ అధినేత ప్రచారాన్ని ఊదరగొట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం మోపడం చూస్తుంటే సంపద సృష్టి అంటే ఇదా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అడ్డుగోలుగా వస్తున్న విద్యుత్ బిల్లులపై ఫిర్యాదు చేయడానికి వెళితే స్పందించే అధికారులు కూడా కరువయ్యారనే ఆందోళన వినియోగదారుల్లో వ్యక్తమవుతోంది. 1.07 లక్షల కేటగిరీ–2 కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 17,06,665 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 12,67,748 హౌస్‌హోల్డ్ కనెక్షన్లు. కమర్షియల్ కేటగిరీ–2 కింద 1,58,252, పరిశ్రమల కేటగిరీ–3 కింద 9,698 ఉన్నాయి. ఇప్పటి వరకు కేటగిరి–2, కేటగిరి–3 కనెక్షన్లకు 1.11 లక్షల స్మార్ట్ మీటర్లు బిగించారు. డిసెంబర్ నుంచి స్మార్ట్ మీటర్లను బిగించే కార్యక్రమం జరుగుతోంది. స్మార్ట్ మీటర్ల బిగింపుతో వ్యాపార, పారిశ్రామికవేత్తల్లో అలజడి మొదలైంది. స్మార్ట్ మీటర్లు బిగించక ముందు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు వస్తున్న విద్యుత్ బిల్లులు ఒక్కసారిగా రూ.30 వేలు దాటుతున్నాయి. దీంతో వ్యాపారులు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల యజమానులు బెంబేలెత్తుతున్నారు. స్మార్ట్ మీటర్లు వద్దని.. వెనక్కు తీసుకోవాలని విద్యుత్ అధికారుల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని, ఎంత బిల్లు వస్తే అంత గడువులోపు చెల్లించకపోతే కనెక్షన్ తొలగిస్తామని అధికారులు తేల్చి చెబుతుండటం గమనార్హం. నెపం కెపాసిటర్లపైకి.. ● విద్యుత్ బిల్లులు అధిక మొత్తంలో రావడానికి స్మార్ట్ మీటర్లు కారణం కాదని.. కెపాసిటర్ల వల్లే అలా వస్తున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ● సాధారణంగా రీడింగ్‌ను బట్టి బిల్లులు రావాల్సి ఉంది. ● సామర్థ్యం ఎక్కువగా ఉంటే స్మార్ట్ మీటర్లు రీడింగ్‌ను బట్టి కాకుండా కేపాసిటర్ సామర్థ్యాన్ని బట్టి బిల్లు ఇస్తుంది. ● కేపాసిటర్ల సామర్థ్యం ఎక్కువగా ఉన్న వారు దానిని తగ్గించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ● స్మార్ట్ మీటర్ల వల్ల మొదటి నెలలోనే సగటున వినియోగదారుడిపై రూ.50 వేలకుపైగా భారం పడింది. మీటరు రీడర్ల ఉపాధిపై దెబ్బ గ్రామ, పట్టణాల్లో కనెక్షన్లను బట్టి మీటర్లు రీడర్లు ఉపాధి పొందుతున్నారు. ప్రతి నెలా 1 నుంచి 6 తేదీల మధ్య వీరు ఇంటింటికీ వెళ్లి రీడింగ్‌ను బట్టి బిల్లులు ఇస్తున్నారు. స్మార్ట్ మీటర్లు బిగించడం ద్వారా మీటరు రీడర్లతో అవసరం ఉండదు. ప్రతి నెలా 1వ తేదీ రాత్రికే విద్యుత్ అధికారులు ఆఫీసుల నుంచే వినియోగదారుల సెల్ నెంబర్‌కు వాట్సాప్ ద్వారా బిల్లులు పంపుతారు. తద్వారా మీటరు రీడర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రకటించిన కూటమి నేతలు, ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను కూడా తొలగిస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కర్నూలు నగరంలోని సంతోషనగర్‌కు చెందిన జె.ఉస్మాన్‌కు కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ ఉంది. ఈయనకు గత ఏడాది నవంబర్‌లో రూ.3,380, డిసెంబర్లో రూ.7,223 బిల్లు వచ్చింది. అదే నెలలో విద్యుత్ అధికారులు స్మార్ట్ మీటరు బిగించారు. జనవరి 2న వచ్చిన బిల్లు చూసి ఉస్మాన్ షాక్‌కు లోనయ్యాడు. ఏకంగా రూ.30,758 బిల్లు వచ్చింది. ఫిబ్రవరిలో వచ్చిన బిల్లు కూడా రూ.29,524 ఉంది. అధికారులను సంప్రదిస్తే ఏమీ చేయలేమని చేతులు ఎత్తేశారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో కూటమి ప్రభుత్వం గృహ వినియోగదారులను సైతం దోపిడీ చేస్తోంది. మొదటి విడతలో 200 యూనిట్లు, ఆపైన వాడకం ఉన్న వినియోగదారుల నివాసాల్లో స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియ మొదలైంది. వినియోగదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ట్రూ అఫ్ చార్జీలు.. 2022, 2023, 2025 సర్దుబాటు చార్జీల పేరిట వినియోగదారులపై సగటున రూ.500 నుంచి రూ.1500 వరకు భారం మోపుతోంది. స్మార్ట్ మీటర్లు బిగిస్తే రానున్న రోజుల్లో విద్యుత్ బిల్లులు ఏ స్థాయిలో ఉంటాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
అడుగడుగునా అన్నదాతలు దోపిడీకి గురవుతున్నారు. విత్తనాల కొనుగోలు నుంచి దిగుబడి అమ్ముకునే వరకు మాటు వేసి దోచుకుంటున్నారు. ఆరుగాలం రెక్కల కష్టంతో పండించిన దిగుబడిని అమ్ముకుందామన్నా దళారులు, వ్యాపారులు నట్టేట ముంచుతున్నారు. దళారులు కందుల కొనుగోలు కేంద్రాల నిర్
కొనుగోలు కేంద్రాల వివరాలు జిల్లా కేంద్రాలు ఇప్పటి వరకు కొనుగోళ్లు (టన్నులు) కర్నూలు 25 4,289 నంద్యాల 12 2,800 ● కందుల కొనుగోలు కేంద్రాల్లో దళారీల హల్చల్ ● రైతుల నుంచి రూ.7,200 ధరతో కొనుగోలు ● కొనుగోలు కేంద్రాల్లో రూ.7,550 మద్దతు ధరతో అమ్మకం ● దళారీల నుంచి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న మార్క్‌ఫెడ్ అధికారులుకొనుగోలు కేంద్రాల్లో దోపిడీ.. కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరతో అమ్ముకుందామని వెళ్లిన రైతులను నిలువునా ముంచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కందులను 50 కిలోల ప్రకారం తూకం వేస్తారు. సంచి బరువుకు అదనంగా 650 గ్రాములు తీసుకోవాలి. అయితే కొన్ని మండలాల్లో క్వింటాకు 1500 గ్రాముల వరకు అదనంగా తీసుకుంటున్నారు. అంటే క్వింటాలుకు దాదాపు 3 కిలోల వరకు అదనంగా తీసుకుంటుండటం గమనార్హం. కర్నూలు జిల్లా పత్తికొండ, నంద్యాల జిల్లా ప్యాపిలి మండలాల్లో కొనుగోలు కేంద్రాలకు దళారీల బెడద ఎక్కువగా ఉంది. అధికారులకు తెలిసినప్పటికీ చూసిచూడనట్లు పోతుండటం గమనార్హం. ప్యాపిలి మండలం బోయిన్‌చెర్వుపల్లి గ్రామంలో బహిరంగంగానే దళారీల నుంచి కందులు కొనుగోలు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కర్నూలు(అగ్రికల్చర్): కందుల కొనుగోలు కేంద్రాలు అక్రమాలకు కేరాఫ్‌గా మారాయి. మార్క్‌ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా దళారీలు, వ్యాపారులే మద్దతు పొందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరందురూ టీడీపీ మద్దతుదారులు కావడం గమనార్హం. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కూడా దళారీల నుంచి కొనుగోలుకు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. క్వింటా ప్రకారం ఇచ్చే గుడ్‌విల్ కోసమేనని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కందుల ధర పడిపోయింది. ధరలు పడిపోయి రైతులు నష్టపోతున్నా.. ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టి...రేయింబవళ్లు కష్టించిన రైతుకు అంతంత మాత్రం ధర లభిస్తుండగా... దళారీలు మాత్రం ప్రయోజనం పొందుతున్నారు. 2023–24లో కందుల ధర రికార్డు స్థాయికి ఎక్కింది. 2024–25 సంవత్సరంలో కూడా ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉందని భావించిన రైతులు పెద్దఎత్తున సాగు చేశారు. 2024 డిసెంబరు నెల వరకు కూడా కందుల క్వింటాలుకు రూ.9,000 వరకు లభించింది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ధర పతనం అయింది. కాగా వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయంటే చాలు ప్రతి గ్రామంలో దళారీలు, వ్యాపారులకు మంచి సీజన్ వంటిది. ధరలు తగ్గడం మొదలైన వెంటనే దళారీలు రైతులను భయబ్రాంతులకు గురి చేశారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పడిపోతాయి.. ఇపుడు మంచి ధర ఉంది.. అమ్మకోవాలని నమ్మించారు. వారి మాటలు నమ్మిన రైతుల నుంచి క్వింటా రూ.6,800 నుంచి రూ.7,200 వరకు మేర కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. అలా కొనుగోలు చేసిన దళారీలు ఇపుడు మార్క్‌ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధర రూ.7,550 ప్రకారం అమ్ముకుంటున్నారు. కష్టించి పండించిన రైతుకు నష్టం రాగా.. దళారీలు మాత్రం రూపాయి పెట్టుబడి పెట్టకుండా క్వింటాపై సగటున రూ.200 నుంచి రూ.600 వరకు లాభం పొందుతున్నారు. దళారీలు నుంచి కొనుగోలు చేయడం వల్ల అధికారులకు కూడా ముడుపులు ముడుతుండటం గమనార్హం. అంతా రైతుల పేరు మీదనే.... దళారీలు/ వ్యాపారులు అంతా రైతుల పేర్ల మీదనే అమ్మకాలు సాగిస్తున్నారు. ఏఏ రైతు నుంచి కందులు కొనుగోలు చేశారో వారి నుంచి ముందు జాగ్రత్తగా ఆధార్, పట్టాదారు పాసుపుస్తకాల నకళ్లను కూడా సేకరించుకుంటున్నారు. రెండు, మూడు లారీలు సిద్ధం అయిన తర్వాత రైతుల పేరు మీదనే కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నాయి. రైతులకు తెలిసిన వారే కాబట్టి దళారీలకు సహకరిస్తున్నారు. అయితే కొనుగోలు కేంద్రానికి ఒరిజినల్ రైతులు రారు. దళారీలు వారి భూములకు సంబంధించిన వివరాలు ముందుగానే సిద్ధం చేసుకుంటున్నందున అమ్మకం ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. కందులు అమ్మిన తర్వాత నగదు రైతు ఖాతాకే జమ అవుతుంది. దళారీల నుంచే 40 శాతం కొనుగోలు కర్నూలు జిల్లాలో 25 మండలాల్లో కందుల కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. నంద్యాల జిల్లాలో 12 మండలాల్లో జరుగుతోంది. నంద్యాల జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో దళారీలే హవా నడిపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో పత్తికొండ, దేవనకొండ, చిప్పగిరి, ఆదోని, క్రిష్ణగిరి, సి.బెళగల్ తదితర మండలాల్లో దళారీలదే పెత్తనం నడుస్తోంది. 2024–25లో ఉమ్మడి జిల్లాలో 2,65,214 ఎకరాల్లో కంది సాగు అయింది. కర్నూలు జిల్లాలో 1,58,749 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 1,06,465 ఎకరాల్లో కంది సాగు అయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2022–23, 2023–24 సంవత్సరాల్లో కందుల ధర మురిపించింది. 2023–24లో రికార్డు స్థాయిలో క్వింటాలుకు రూ.13,500 వరకు వెళ్లింది. 2024–25లో పండించిన కందులు మార్కెట్లోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గుముఖం పట్టాయి. రానున్న రోజుల్లో జరిగే కొనుగోళ్లలో 60 శాతం దళారీల నుంచే కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 3,242 మంది రైతుల నుంచి 4,289 టన్నుల కందులు కొనుగోలు చేశారు.నంద్యాల జిల్లాలో దాదాపు 2,650 మంది రైతుల నుంచి 2,800 టన్నులు కొనుగోలు చేశారు. ఇందులో 40 శాతం వరకు దళారీల నుంచి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ● పత్తికొండ మండలానికి చెందిన ఒక వ్యాపారి ఆరేడు మంది రైతుల పాసు పుస్తకాలు తీసుకెళ్లి ఒకే రోజు 200 క్వింటాళ్లకు పైగా కందులను అమ్ముకున్నారు. ఈ వ్యాపారి ఇలా చాల రోజులుగా కొనుగోలు కేంద్రంలో హల్చల్ చేశారు. ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ చేతులు తడిపినట్లు తెలుస్తోంది. ఆయన టీడీపీ నేతల మద్దతు ఉన్నట్లు సమాచారం. -
ఆత్మకూరు, మహానందిలో భారీ వర్షం
ఆత్మకూరు/మహానంది: అకాలంగా శనివారం ఆత్మకూరు, మమహానందిలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వర్షపునీరు నిలిచి వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆత్మకూరులో డ్రెయినేజీ లేకపోవడంతో మరిన్ని కష్టాలు వచ్చాయి. మహానంది మహాద్వారం వద్ద వర్షపునీరు నిలవడంతో భక్తులు అవస్థలు పడ్డారు. అధికారులు స్పందించి ఆలయం ఎదుట వర్షపునీరు నిలవకుండా తగిన చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా మహానంది మండలంలో భారీ వర్షానికి విద్యుత్ సరఫరా నిలిపేశారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో గ్రామాల్లో అంధకారం నెలకొంది. తమ్మడపల్లె, బొల్లవరం, నందిపల్లె తదితర గ్రామాల పరిధిలో వరి పైరు నేలవాలినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
వైభవంగా వసంతోత్సవం
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో శ్రీ చౌడేశ్వరి దేవి రాయబారాది జ్యోతి మహోత్సవాలు వసంతోత్సవంతో శనివారం ముగిశాయి. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ.. ఉదయం శ్రీ చౌడేశ్వరిదేవి, శ్రీ చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి సమీపంలో ఉన్న కోనేరు వరకు వసంతోత్సవం నిర్వహిస్తూ తీసుకెళ్లారు. అనంతరం కోనేరులోని నీటితో విగ్రహాలను శుభ్రం చేసి మళ్లీ ఆలయానికి తీసుకొచ్చారు. భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ముగిసిన ఇంటర్ మూల్యాంకనం ● ఈ నెల 12న ఫలితాలు వెలువడే అవకాశం? నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం శనివారం ముగిసింది. మార్చి 7న ప్రారంభమైన ఈ ప్రక్రియ మొత్తం 29 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగింది. ప్రతి స్పాట్ కేంద్రానికి స్కానర్‌ను అందజేయడంతో మార్కుల నమోదు చేపట్టారు. దీంతో ఇంటర్ ఫలితాలు ఈ నెల 12న వచ్చే అవకాశముందని అధ్యాపకులు బెబుతున్నారు. వివిధ జిల్లాల నుంచి నంద్యాలకు చేరుకున్న 2,01,598 జవాబు పత్రాలను 432 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేశారు. పూర్తి పారదర్శకంగా నిర్దేశించిన సమయానికి మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసినట్లు డీఐఈఓ సునీత తెలిపారు. కుంగిన జాతీయ రహదారి డోన్: పట్టణ శివారులోని యు. కొత్తపల్లె క్రాస్ రోడ్డు వద్ద నూతనంగా నిర్మిస్తున్న 340బీ నేషనల్ హైవే ఒక వైపు కుంగిపోయింది. రాత్రివేళల్లో గమనించకుండా వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురై ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగి ఉండేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డోన్ నుంచి బేతంచెర్ల మీదుగా తమ్మరాజుపల్లె వరకు 38 కిలోమీటర్ల పొడవు గల రహదారిని నిర్మించేందుకు రూ.650 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు నాసిరకంగా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల వేసిన ఈ రోడ్డు కుంగిపోవడంపై ఎన్‌హెచ్ అధికారులను స్థానికులు అప్రమత్తం చేశారు. మద్దిలేటయ్య క్షేత్రంలో భక్తుల రద్దీ బేతంచెర్ల: శ్రీ మద్దిలేటి నరసింహస్వామి క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ కనిపించింది. చైత్ర మాసం కావడంతో నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లకు దర్శించుకున్నారు. పంచామృతాభిషేకం, కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు. స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ చేయడంతోపాటు మహా మంగళహారతి ఇచ్చారు. దాతలు సహకరించాలి శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో గదులు నిర్మించిన దాతలు భక్తుల రద్దీ దృష్ట్యా సహకరించాలని ఆలయ ఉపకమిషనర్, ఈఓ రామాంజనేయులు శనివారం తెలిపారు. గతంలో దాతలకు ఏడాదిలో ఐదుసార్లు ఉచితంగా గదులను ఇచ్చేవారమన్నారు. ప్రస్తుతం పెరిగిన భక్తుల రద్దీ దృష్ట్యా పాసులను నెల ముందు పంపాలని సూచించారు. ఒక్కసారి పాసు వాడిన తరువాత మరొక పాసుకు వ్యవధి 10 వారాలు ఉండాలన్నారు. రగ్బీ పోటీల్లో ప్రతిభ చాటండి కర్నూలు (టౌన్) : అనంతపురం పోలీసు ట్రైనింగ్ కళాశాల క్రీడా మైదానంలో ఈనెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో ప్రతిభ చాటాలని రగ్బీ అసోసియేషన్ కార్యదర్శి రామాంజనేయులు పిలుపు నిచ్చారు. శనివారం స్థానిక బి. క్యాంపు క్రీడా మైదానంలో జిల్లా స్థాయి జట్లకు క్రీడాకారుల ఎంపిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒలింపిక్ క్రీడగా గుర్తింపు పొందిన రగ్బీలో రాణిస్తే భవిష్యత్తులో విద్యా, ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. -
బేతంచెర్ల రైల్వేస్టేషన్ తనిఖీ
బేతంచెర్ల: స్థానిక రైల్వేస్టేషన్‌ను గుంతకల్ డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్త సిబ్బందితో కలిసి శనివారం సందర్శించారు. స్టేషన్‌లోని ప్లాట్‌ఫారాలు, ప్రయాణికుల సంఖ్య తదితర వివరాలను స్టేషన్‌మాస్టర్ రూప్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. కాగా రైల్వేస్టేషన్‌లోని రెండో ప్లాట్ఫారం కూర్చోవడానికి సౌకర్యంగా లేదని, గతంలో బేతంచెర్లలో ఆగే ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రస్తుతం ఆగకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు డీఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆర్ఎస్ రంగాపురం రైల్వేస్టేషన్‌ను పరిశీలించారు. నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు కర్నూలు(అగ్రికల్చర్): వేసవి ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత నేటి నుంచి పెరుగనున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఉమ్మడి జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడటంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. శనివారం కూడా ఎండల తీవ్రత, వడగాల్పులు పెరిగాయి. కోసిగి, కర్నూలు అర్బన్, కోడుమూరు, దొర్నిపాడు, గడివేముల, కొత్తపల్లిలలో 39 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 6 నుంచి ఉమ్మడి జిల్లాలో ఎండలు, వడగాల్పుల తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ అథారిటీ ప్రకటించింది. ఉపాధి పనులకు వెళ్లే కూలీలు, రైతులు, ఇతరులు వడగాల్పుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సాయంత్రం వేళల్లో అకాల వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. -
దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ విశేష కృషి
నంద్యాల(అర్బన్): దళితుల అభ్యున్నతికి డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ విశేష కృషి చేశారని, ఆయన సేవలు చిరస్మరణీయమైనవని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా అన్నారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి మంత్రి, ఎమ్మెల్సీతోపాటు జిల్లా కలెక్టర్ రాజకుమారి, మునిసిపల్ చైర్‌ర్సన్ మాబున్నిసా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, దళిత సంఘాల నాయకులు శనివారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విక్టోరియా రీడింగ్ రూమ్ ఆవరణలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్‌కు భారతరత్న అవార్డు ఇచ్చేందుకు అన్ని సంఘాల నాయకులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిపై ప్రతి పౌరునికి బాధ్యత ఉండాలన్నది జగ్జీవన్ రామ్ తపన అన్నారు. ఏప్రిల్ నెలలో బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ వంటి మహోన్నత వ్యక్తుల జయంతులను జరుపుకుంటున్నామని, వారి స్ఫూర్తిదాయమైన ఆశయాలను ఆచరణలో ఉంచి భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలన్నారు. దళిత సంఘల నాయకులు కొమ్ముపాలెం శ్రీనివాస్, బాలస్వామి, లింగన్న, చిన్న వెంకటస్వామి, ఒకటో వార్డు కౌన్సిలర్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతపై హత్యాయత్నం దారుణం
● నిందితులను కఠినంగా శిక్షించాలి ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డిబొమ్మలసత్రం: వైఎస్సార్సీపీ శిరివెళ్ల మండల కన్వీనర్ ఇందూరి ప్రతాప్‌రెడ్డిని హత్య చేసేందుకు టీడీపీ నాయకులు యత్నించడం దారుణమని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. రామాలయంలో పూజలు చేస్తున్న వ్యక్తిని హత్య చేయాలనే ఆలోచనలు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నంద్యాల ఎస్పీ అధిరాజ్సింగ్రాణాను కోరారు. నంద్యాల పట్టణంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో కాటసాని రాంభూపాల్‌రెడ్డితో పాటు ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి.. ఎస్పీ కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గోవిందపల్లె గ్రామంలోని రామాలయంలో ఇందూరి ప్రతాప్‌రెడ్డి పూజలు చేస్తుండగా దుండగులు హత్యాయత్నానికి పాల్పడటం దారుణమన్నారు. పోలీస్ పికెట్ ఉన్న కొంత దూరంలోనే దుండగులు ఇంతటి దారుణానికి ఒడిగట్టడం బాధాకరమన్నారు. కేసును నీరుగార్చేలా, కోర్టులో ప్రతాపరెడ్డి సాక్ష్యాలు చెప్పకుండా భయభ్రాంతులకు గురి చేసేలా హత్యాయత్నం చేశారన్నారు. జిల్లాలో ఇప్పటికే వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నేతలు తరచూ దాడులకు పాల్పడుతూనే ఉన్నారన్నారు. వీరిపై జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఐదుగురిపై కేసు నమోదు శిరివెళ్ల: మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ ఇందూరి ప్రతాపరెడ్డిపై హత్యాయత్నం ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్న పీరయ్య శనివారం తెలిపారు. గ్రామానికి చెందిన రవిచంద్రారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, లక్ష్మీరెడ్డి, రమణారెడ్డి, మరో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. ఘటనను ప్రత్యక్షంగా చూసిన కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. అండగా ఉంటాం గోస్పాడు: ఇందూరి ప్రతాపరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ శిరివెళ్ల మండల కన్వీనర్ ఇందూరి ప్రతాపరెడ్డిని నంద్యాల పట్టణంలోని ఉదయానంద ఆసుపత్రిలో శనివారం పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
స్వర్ణ రథోత్సవం.. దేదీప్యమానం
శ్రీశైలంటెంపుల్: రుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో శనివారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం దేదీప్యమానంగా నిర్వహించారు. హర..హర.. మహాదేవ, ఓం నమఃశివా య అంటూ శివనామస్మరణ చేస్తూ నీరాజనాలు సమర్పించారు. వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు చేశారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం స్వర్ణ రథంపై ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి విశేషపూజలు నిర్వహించారు. ఆలయ మహాద్వారం ముందుభాగం నుంచి నంది మండపం వరకు మాడవీధుల్లో రథోత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవంలో కోలాటం, చెక్కభజన.. తదితర జానపద కళారూపాలు అలరించాయి. శ్రీశైల దేవస్థాన సహాయ కమిషనర్ ఇ.చంద్రశేఖరరెడ్డి, పండితులు, అర్చకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
జూపాడుబంగ్లా పీహెచ్సీలో తొలి ప్రసవం
జూపాడుబంగ్లా: స్థానిక ప్రాథమిక వైద్యకేంద్రంలో శనివారం వైద్యురాలు డాక్టర్ సభా అధ్వర్యంలో వైద్యసిబ్బంది మొట్టమొదటి ప్రసవం చేశారు. జూపాడుబంగ్లాలో పీహెచ్సీ ఏర్పాటుచేసి 45 ఏళ్లు అవుతున్నా 2023 వరకు సొంత భవనాలు లేవు. అప్పటి ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్రెడ్డి నాడు–నేడులో భాగంగా 2023లో రూ.1.80కోట్లు నిధులు ఇవ్వడంతో నూతన వైద్యకేంద్రాన్ని నిర్మించారు. అవసరమైన వైద్యపరికరాలు మంజూరు చేశారు. జూపాడుబంగ్లాలోని కాసానగర్ కాలనీకి చెందిన మీనాక్షి అనే మహిళ శనివారం పీహెచ్సీలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డలకు ఆరోగ్యం బాగున్నట్లు డాక్టర్ సభా తెలిపారు. సాయంత్రం మరో ప్రసవం శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో తరిగోపుల గ్రామానికి చెందిన నసీమూన్ అనే గర్భవతి పురిటినొప్పులతో జూపాడుబంగ్లా పీహెచ్‌సీకి వచ్చారు. ఆమెను వైద్యసిబ్బంది పరీక్షించి సుఖ ప్రసవం చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన ‘నాడు– నేడు’ పనులే కారణం -
సున్నిపెంటలో భూముల సర్వేపై జేసీ సమీక్ష
శ్రీశైలం: శ్రీశైల మండల కేంద్రమైన సున్నిపెంటలో ప్రభుత్వ భూముల సర్వేపై జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీ జెన్కో అతిథి గృహంలో ఇరిగేషన్, పంచాయతీ రాజ్, రెవెన్యూ, అటవీశాఖ, ల్యాండ్ సర్వే, దేవస్థానం అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా.. ఏపీ టూరిజంకు 50 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపునకు సర్వే జరుగుతున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ స్థలాలలో అక్రమ నిర్మాణాలు, స్థలాల ఆక్రమణ, తదితర అంశాలపై కూడా ఆయన చర్చించి ఆక్రమణలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి బొమ్మలసత్రం: జిల్లాలో పని చేసే పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఇబ్బందులు ఉన్న సిబ్బంది పది మంది సిబ్బంది వినతులు అందజేశారన్నారు. విచారించి వారి సమస్యను పరిష్కరిస్తామన్నారు. నాణ్యతా లోపం.. వర్షానికి ఛిద్రం జూపాడుబంగ్లా: జాతీయరహదారి 340సీ రోడ్డు నిర్మాణంలో నాణ్యతా లోపంతో చిన్నపాటి వర్షానికే కోతకు గురైంది. గురువారం రాత్రి కురిసిన వర్షానికి నందికొట్కూరు సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నందికొట్కూరు పట్టణంలోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన సర్వీసు రోడ్డు పక్కన ఉన్న సైడ్‌బర్మ్ భారీగా కోతకు గురైంది. నందికొట్కూరు పట్టణం నుంచి ఆత్మకూరు వైపు వెళ్లే రోడ్డు వెంట తంగడంచ సమీపం వరకు సైడ్‌బర్మ్ అక్కడక్కడ కోతకు గురైంది. కోట్లాది రూపాయాలతో చేపట్టిన జాతీయ రహదారి నిర్మాణ పనులను అధికారులు పర్యవేక్షించాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. నిలిచిన విద్యార్థి బస్సు కొత్తపల్లి: కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో విద్యార్థులు, గ్రామీణ ప్రాంత ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆత్మకూరు నుంచి విద్యార్థులతో కొత్తపల్లి మీదుగా జడ్డువారిపల్లెకు బయలుదేరిన విద్యార్థి బస్సు మధ్యలోనే నిలిచిపోయింది. ఎదురుపాడు బస్టాండ్ సెంటర్‌కు చేరుకొనే సరికి ఇంజిన్‌లోని గేర్రాడ్డు సీల్ దెబ్బతిన ఆయిల్ పూర్తిగా కింద పోయింది. దీంతో బస్సు ఆగి పోయింది. కాగా బస్సులో ఉన్న 20 మంది విద్యార్థులు ఇంటికి చేరుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గతంలో ఇలాగే బస్సు మరమ్మతుకు గురై నిలిచిపోయింది. కండీషన్లో ఉన్న బస్సులను నడపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉర్దూ వర్సిటీకి పాత భవనాలు కర్నూలు కల్చరల్: డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీకి కర్నూలులోని ఫర్మెన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాత భవనాలు కేటాయించారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్, రూసా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త ఆదేశాలు జారీ చేశారు. ఉర్దూ వర్సిటీకి ప్రభుత్వ భవనాలను కేటాయించాలని వర్సిటీ ఇన్చార్జ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పి. ఎస్. షావలి ఖాన్ లేఖ రాశారు. దీంతో రూసా నిధులతో నిర్మించిన నూతన భవనాల్లోకి ఫర్మెన్ కళాశాలను మార్చుకొని పాత భవనాలను ఉర్దూ వర్సిటీకి అప్పగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే అందులో ఎప్పటి వరకు అనే సమయం లేకపోవడంతో వర్సిటీ ఇన్చార్జ్ వీసీ మరలా ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఈనెల చివరిలోగా ఉర్దూ వర్సిటీకి పాత బిల్డింగ్స్‌ను అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. -
అకాల వర్షం.. అపార నష్టం
కర్నూలు(అగ్రికల్చర్)/నంద్యాల (అర్బన్): పొలంలో చేతికొచ్చిన పంటలు నీటమునిగాయి. కల్లాల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కాయలతో కళకళలాడుతూ ఉండే అరటి, మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. పసుపు పంట పూర్తిగా పనికిరాకుండా పోయింది. అకాల వర్షంతో రైతుల రెక్కల కష్టం నేలపాలైంది. అన్నదాతల్లో ధైర్యం తొలగి దైన్యమే మిగిలింది. గురువారం మధ్యాహ్నం నుంచి మొదలైన అకాల వర్షాల ప్రభావం శుక్రవారం ఉదయం వరకు కొనసాగింది. ఉరుములు, మెరుపులు, పెనుగాలులతో కురిసిన అకాల వర్షాలతో మిర్చి, ఉల్లి, అరటి, వరి, మినుము పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఏ పంటలు ఎలా దెబ్బతిన్నాయంటే.. ● కర్నూలు జిల్లాలో కోడుమూరు, సి.బెళగల్, గోనెగండ్ల, చిప్పగిరి మంత్రాలయం తదితర ప్రాంతాల్లో మిర్చి చివరి దశలో ఉంది. పలు ప్రాంతాల్లో రైతులు మిర్చిని పొలాల్లోనే ఆరబెట్టుకున్నారు. ఊహించని విధంగా వర్షాలు పడటంతో మిర్చి పంట పూర్తిగా తడిచిపోయింది. ● ఇటీవలి వరకు ఉల్లి ధరలు ఆశాజనకంగా ఉండటంతో లేట్ రబీలో ఈ పంట ఎక్కువగా సాగు చేశారు. కోసి ఆరబెట్టిన ఉల్లిని వర్షాలు తడిపేశాయి. ● గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎమ్మిగనూరు మండలంలో అరటి భారీగా నేల కూలింది. అయితే ఉద్యాన అధికారులు 5 హెక్టార్లలోనే అరటి దెబ్బతిన్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ● సి.బెళగల్ మండలంలో మునగ, కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. అయితే అధికారులు మాత్రం మునగ ఒక హెక్టారు, కూరగాయల పంటలు ఒక హెక్టారులో దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. వ్యవసాయ పంటలకు ఎటువంటి నష్టం లేదని ప్రకటించారు. ● నంద్యాల జిల్లాలో రబీ సీజన్లో వరి ఎక్కువగా సాగైంది. ప్రస్తుతం పాల కంకి దశలో ఉంది. బండిఆత్మకూరు, గడివేముల, మహానంది, వెలుగోడు మండలాల్లో 5 వేల హెక్టార్లలో వరి దెబ్బతినింది. అయితే వ్యవసాయ అధికారులు మాత్రం 2,158 హెక్టార్లు అని గుర్తించారు. అలాగే మినుము 10 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. ● నంద్యాల జిల్లాలో అరటి కూడా భారీగా దెబ్బతినింది. సంజామల మండలంలోని నొస్సం, గిద్దలూరు, రామభద్రునిపల్లి గ్రామాల్లో అరటి తోటలు ఎక్కువగా ఉన్నాయి. వర్షాలు, గాలి తీవ్రతకు అరటి తోటలు నేల కూలాయి. ఉద్యాన అధికారులు 16.8 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. ● ఉమ్మడి కర్నూలు జిల్లాలో మామిడి ఈ సారి నిరాశాజనకంగా ఉంది. అంతంతమాత్రం ఉన్న కాపు గాలుల తీవ్రత, వర్షాలుకు నేల రాలిపోయింది. బేతంచెర్ల, ఓర్వకల్లు, ప్యాపిలి, డోన్, గోనెగండ్ల, సి.బెళగల్ తదితర మండలాల్లో పెనుగాలులకు మామిడి చెట్లు, కాయలు నేల రాలాయి. అయినా ఉద్యానశాఖ అధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి అధికార అంచనా 2,158 హెక్టార్లు మాత్రమే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నేలకొరిగిన అరటి తోటలు పాడైపోయిన మిర్చి, ఉల్లి పంటలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందేనా?వర్షపాతం వివరాలు (మి.మీ).. మండలం వర్షపాతం వెలుగోడు 56.8 కోడుమూరు 46.4 నందికొట్కూరు 46.2, సి.బెళగల్ 37.8 బండిఆత్మకూరు 37.0 సంజామల 30.6 మిడుతూరు 26.4 మహానంది 25.2 కొలిమిగుండ్ల 24.2 గోనెగండ్ల 24.2 కర్నూలు అర్బన్ 23.6 చిప్పగిరి 22.8 ప్యాపిలి 22.4 -
‘ఈ–శ్రమ్’తో అసంఘటిత కార్మికుల గుర్తింపు
కర్నూలు(అర్బన్): అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల పేర్లను ఈ– శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయించాలని ఏపీ ప్రభుత్వ కర్మాగార, బాయిలర్స్, బీమా, మెడికల్ సర్వీసెస్ అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన కార్మిక శాఖ ఉప కమిషనర్లు, సహాయ కమిషనర్లు, సహాయ కార్మిక శాఖ అధికారులు, ఫ్యాక్టరీల యజమానులు, సీఐటీయూ, ఏఐటీయూసీ కార్మిక సంఘాల నాయకులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గంధం చంద్రుడు మాట్లాడుతూ ఏదైనా సంస్థలో పది కంటే ఎక్కువ మంది కార్మికులు పని చేస్తుంటే, వారి నెల జీతం రూ.21 వేల లోపు ఉంటే ఈఎస్ఐ చట్టం కింద పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. కా ర్మిక, కర్మాగారాల, బీమా, మెడికల్ సర్వీసెస్ శాఖల సమన్వయంతో అర్హత ఉన్న కార్మికుల పేర్లను రాబోవు రెండు నెలల్లో పేర్లను నమోదు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా బాల కార్మికులు పని చేస్తుంటే వారికి చట్ట ప్రకారం రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమలు, కర్మాగారాల్లో పనిచేసే మహిళలకు కనీసం మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి కర్మాగారాలను గుర్తించి మరుగుదొడ్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కర్నూలు జోన్ సంయుక్త కార్మిక కమిషనర్ బాలునాయక్, విజయవాడ సంయుక్త కమిషనర్లు ఎస్ లక్ష్మినారాయణ, గణేషన్, సహాయ కార్మిక కమిషనర్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ కార్మిక శాఖ అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు -
ఏపీ అంటే అమరావతి, పోలవరమే కాదు
నంద్యాల(అర్బన్): ఏపీ అంటే అమరావతి.. పోలవరమే కాదు. ఇది అంధ్రప్రదేశ్‌గా గుర్తెరిగి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. మే 31న నిర్వహించే సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 9వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వ విధానాలు, వెనుకబడిన ప్రాంతాల భవిత అంశాలపై సమితి ఉపాధ్యక్షుడు వైఎన్‌రెడ్డి అధ్యక్షతన స్థానిక ఐఎంఏ హాల్లో ప్రజా సంఘాల సమావేశం నిర్వహించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు సీమ ఉమ్మడి జిల్లాలోని సంఘాల నాయకులు హాజరైన కార్యక్రమంలో బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. పాలకుల లోప బూయిష్ట విధానాలు నిర్లక్ష్యాల ధోరణి వల్ల సీమ సామాజికంగా, ఆర్థికంగా వెనక్కి నెట్టి వేయబడుతుందన్నారు. నాడు కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు నిర్మాణం జరిగి ఉంటే 150 టీఎంసీల నికర జలాలతో 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందేదన్నారు. కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా గోదావరి బానకచర్ల ప్రాజెక్టుల బదులుగా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా గోదావరి జలాలను నాగార్జున సాగర్ కుడికాల్వకు తరలించి శ్రీశైలం ప్రాజెక్టు నీటిని పూర్తిగా సీమ అవసరాలకే వినియోగించాలని కోరారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైకోర్టు, తదితరాలు సీమలో ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సమితి మహి ళా నాయకురాలు, న్యాయ వాది శ్రీదేవి, వెలుగోండ సాధన సమితి నాయకులు కొండారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రహీం, రామ్మోన్‌రెడ్డి, శేషాద్రిరెడ్డి, జాఫర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య యోజన సర్వే వంద శాతం పూర్తి చేయాలి
కోవెలకుంట్ల: ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని 60 సంవత్సరాలు దాటిన ఆర్హులైన పేదలకు వర్తింప చేసేందుకు చేపట్టిన సర్వేను వందశాతం పూర్తి చేయాలని జిల్లా మలేరియా అధికారి కామేశ్వరరావు సూచించారు. శుక్రవారం స్థానిక మేజర్ గ్రామ పంచాయతీలోని 4, 5వ గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమ రికార్డులను పరిశీలించారు. పాఠశాల విద్యార్థులకు నిర్వహించే ఆరోగ్య పరీక్షలపై ఏఎన్ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలను అడిగి తెలుసుకున్నారు. ప్రైడే డ్రైడేలో భాగంగా నీటి తొట్లను పరిశీలించి దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమలు వ్యాప్తి చెందటంతో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, తదితర విష జ్వరాలు ప్రబలే ఆస్కారం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని పేర్కొన్నారు. ఆయన వెంట మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ విశ్వనాథ్, ఎంపీహెచ్ఎస్, ఎంపీహెచ్ఏ మైమాన్ తదితరులు ఉన్నారు. జిల్లా మలేరియా అధికారి కామేశ్వరరావు -
ఆరోగ్య యోజన సర్వే వంద శాతం పూర్తి చేయాలి
కోవెలకుంట్ల: ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని 60 సంవత్సరాలు దాటిన ఆర్హులైన పేదలకు వర్తింప చేసేందుకు చేపట్టిన సర్వేను వందశాతం పూర్తి చేయాలని జిల్లా మలేరియా అధికారి కామేశ్వరరావు సూచించారు. శుక్రవారం స్థానిక మేజర్ గ్రామ పంచాయతీలోని 4, 5వ గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమ రికార్డులను పరిశీలించారు. పాఠశాల విద్యార్థులకు నిర్వహించే ఆరోగ్య పరీక్షలపై ఏఎన్ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలను అడిగి తెలుసుకున్నారు. ప్రైడే డ్రైడేలో భాగంగా నీటి తొట్లను పరిశీలించి దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమలు వ్యాప్తి చెందటంతో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, తదితర విష జ్వరాలు ప్రబలే ఆస్కారం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని పేర్కొన్నారు. ఆయన వెంట మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ విశ్వనాథ్, ఎంపీహెచ్ఎస్, ఎంపీహెచ్ఏ మైమాన్ తదితరులు ఉన్నారు. జిల్లా మలేరియా అధికారి కామేశ్వరరావు -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
కర్నూలు: పాతబస్తీలోని గడ్డా వీధిలో నివాసముంటున్న షేక్ అక్బర్ మియా (75) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈయన గతంలో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ప్రస్తుతం ఇంటి వద్ద ఖాళీగానే ఉంటున్నాడు. నలుగురు ఆడపిల్లలు, ఒక కొడుకు సంతానం. గురువారం కల్లూరు ఇందిరమ్మ కట్ట వద్ద సొహైల్ అనే వ్యక్తి బైక్ వెనుక కూర్చొని పాత ఈద్గా వైపు వెళ్తున్నాడు. బిస్మిల్లా హోటల్‌కు ఎదురుగా రోడ్డుకు అడ్డంగా కుక్క అడ్డు రావడంతో సొహైల్ కుక్కను తప్పించబోయి పక్కనున్న డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరూ కింద పడి గాయాలకు గురయ్యాడు. బైక్ నడుపుతున్న సొహైల్‌కి స్వల్ప గాయాలు కాగా వెనుక కూర్చున్న షేఏక్ అక్బర్ తలకు బలమైన గాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే స్థానికులు ఇద్దరినీ 108 అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీ వార్డులో చికిత్స పొందుతూ తెల్లవారుజామున షేక్ అక్బర్ మియా మృతిచెందారు. కుమారుడు మహబూబ్ బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు. ప్రమాద సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎకై ్సజ్‌లో 44 మందికి ఎస్ఐలుగా అడ్హాక్ పదోన్నతి
కర్నూలు: ఎకై ్సజ్ శాఖ ఫోర్త్ జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న ఎస్ఐ పోస్టులను భర్తీ చేస్తూ ఆ శాఖ నోడల్ అధికారి (డిప్యూటీ కమిషనర్) శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్న 29 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 15 మంది క్లర్కులకు అడ్హాక్ పద్ధతిలో పదోన్నతి కల్పించి బదిలీల్లో భాగంగా వారికి స్టేషన్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ మహిళా ఎస్ఐలకు సంబంధించి మరో నాలుగు పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీరి సీనియారిటీ జాబితా త్వరలోనే రూపొందించి ఆయా పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి తెలిపారు. పదోన్నతి పొందిన వారందరికీ శుక్రవారం మధ్యాహ్నం తన కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ప్రమోషన్‌తో పాటు పోస్టింగ్ కాపీ అందజేశారు. స్టేషన్లు కేటాయిస్తూ నోడల్ అధికారి ఉత్తర్వులు ఉమ్మడి జిల్లాలో 12 మందికి స్థానచలనం -
వారికి తీరిక లేదు.. వీరికి జీతాలు రావు
కర్నూలు సిటీ: హొళగుంద కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ టి.శ్రీనివాసులు గత నెలలో తనిఖీకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న కొందరు ఉద్యోగులు ‘సార్..మాకు ఐదు నెలలుగా జీతాలు రావడం లేదు. రోజు పని చేస్తున్నా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒక్క కేజీబీవీలోనే కాదు.. ఉమ్మడి జిల్లాలోని 55 కస్తూర్బాల్లో గతేడాది నవంబరులో నియమించిన 130 మంది టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు వేతనాలు రావడం లేదు. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి చిరుద్యోగులు తీసుకపోయినా కూడా అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. ఐదు నెలలుగా వారికి జీతాలు ఎందుకు రావడం లేదో తెలిసినా కూడా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వేతనాలు అందక పోవడంతో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. పండగలు సైతం చేసుకోలేక పోయామంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన నియామకాల్లో ఉద్యోగాలు పొందిన వారికి ఎక్కడా కూడా జాప్యం లేకుండా మొదటి నెల నుంచే వేతనాలు అందుతున్నాయి. కర్నూలు జిల్లాలో 26, నంద్యాల జిల్లాలో 27 కస్తూర్బాలు ఉన్నాయి. ఈ స్కూళ్లలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు గతేడాది అక్టోబరు నెలలో నోటిఫికేషన్ ఇచ్చి..అర్హుల జాబితాను కొంత ఆలస్యంగానే ప్రకటించారు. కర్నూలు జిల్లాలో 47 మంది, నంద్యాల జిల్లాలో 83 మందిని నియమించారు. అయితే ఆ సమయంలో ఎంపికై న వారి జాబితా కలెక్టర్ ఆమోదం తీసుకుని నియామక పత్రాలను అందజేశారు. ఆ తరువాత ఎంపికై న వారి బ్యాంకు, తదితర వివరాలను సేకరించి పూర్తి వివరాలతో ఈ ఏడాది జనవరి నెలలో ఆప్కాస్‌లో వారిని చేర్చేందుకు జాబితాను పంపించారు. అయితే ఆ జాబితాకు జిల్లా ఇన్‌చార్జ్‌ల మంత్రి ఆమోదం లేక వెనక్కి పంపించేశారు. అప్పటి నుంచి సుమారుగా రెండు నెలలుగా కర్నూలు జిల్లా ఇన్చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, నంద్యాల జిల్లా ఇన్చార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ చుట్టూ సంతకాలు కోసం అధికారులు తిరుగుతున్నారు. కానీ జాబితాలపై సంతకాలు చేసేందుకు వారికి తీరిక లేదని మంత్రుల పేషీ నుంచి సమాధానాలు వస్తున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇన్చార్జ్ మంత్రుల ఆమోదం లేదని వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వేతనాల కోసం కేజీబీవీల్లో ఉద్యోగుల నిరీక్షణ గతేడాది నవంబర్‌లో నియామకాలు ఆప్కాస్‌లో చేర్చేందుకు జాబితా పంపిన సమగ్ర శిక్ష అధికారులు ఇన్చార్జ్ మంత్రుల ఆమోదం లేదని వెనక్కి వచ్చిన ఫైల్ వైఎస్సార్సీపీ హయాంలో నియమించిన వారికి మొదటి నెల నుంచే వేతనాలు జమచర్యలు తీసుకుంటున్నాం కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో కొత్తగా నియమించిన టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు త్వరలో వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. వేతనాలు చేసేందుకు జాబితా ఆస్కాస్కి పంపగా, ఆ జాబితాకి జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆమోదం పొందిన తరువాత జీతాలు చెల్లిస్తామని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ఇన్చార్జ్ మంత్రి జిల్లాకు రానున్నారు. వచ్చిన తరువాత సంతకం చేయించిన వెంటనే వేతనాలు వచ్చే అవకాశం ఉంది. – టి.శ్రీనివాసులు, సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ -
కుంటలో విద్యుత్ తీగ పడి..
కొత్తపల్లి: కుంటలో నీళ్లు తాగేందుకు వెళ్లి ఓ గేదె, రెండు నక్కలు మృత్యువాత పడ్డాయి. బావాపురం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అనే రైతుకు చెందిన గేదె గురువారం సాయంత్రం ఇంటి నుంచి మేత మేసేందుకు పొలాల్లోకి వెళ్లి రాత్రి అయినా తిరిగి రాలేదు. శుక్రవారం ఉదయాన్నే రైతు గేదె కోసం గాలిస్తుండగా గ్రామ పొలిమేరలోని కురుకుంద చెరువు అలుగు వాగులో గేదె, పక్కనే మరో రెండు నక్కలు కూడా మృత్యువాత పడినట్లు గమనించాడు. వాగులో విద్యుత్ తీగ పడి ఉండటంతో విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు భావించాడు. గురువారం సాయంత్రం మండలంలో ఈదురుగాలులతో కూడిన చిన్నపాటి వర్షం కురిసింది. ఈ ఈదురుగాలులకు పొలాల్లోని విద్యుత్ తీగ తెగి వాగులోని నీటి కుంటలో పడింది. దీంతో నీరు తాగేందుకు వెళ్లిన గేదె, నక్కలు విద్యుత్ షాక్‌తో మృత్యువాతతో చనిపోయినట్లు తెలుస్తోంది. గేదె, రెండు నక్కలు మృత్యువాత -
స్కూటీపై దేశ పర్యటన
మహానంది: ఆయన వయసు 77 ఏళ్లు. ఇంటి పట్టున ఉండి విశ్రాంతి తీసుకోవాల్సిన వృద్ధుడు. కుటుంబ సభ్యులతో సరదాగా ఉంటూ కాలక్షేపం చేయాల్సిన ఆయనకు హిందూ ధర్మంపై ఉన్న గౌరవం ఇంటి దగ్గరకే పరిమితం కాలేదు. ఏ మాత్రం అలుపు లేకుండా సనాతన ధర్మం గొప్పదనాన్ని వివరిస్తూ స్కూటీపై దేశ వ్యాప్త పర్యటిస్తూ శుక్రవారం మహానంది చేరుకున్నారు. విజయనగరానికి చెందిన సంస్కృత ఉపాధ్యాయుడు నారాయణమ్ వెంకటరెడ్డి గత ఏడాది అక్టోబర్ నెల 13వ తేదీన మణికొండలోని గోల్డన్ టెంపుల్ నుంచి తన యాత్రను ప్రారంభించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, కర్టాటక రాష్ట్రాలు పర్యటించారు. సనాతన ధర్మం కోసం ప్రచారం చేస్తూ పాఠశాలల్లో సంస్కృత భాష ప్రాధాన్యత వివరిస్తూ భగవద్గీత బోధిస్తున్నారు. 800 రోజుల్లో లక్ష కిలోమీటర్ల లక్ష్యంగా దేశ పర్యటనలో భాగంగా ఇప్పటి వరకు 8వేల కిలోమీటర్లు తిరిగానని, మిగిలిన 92 వేల కిలోమీటర్లు పర్యటిస్తానని చెప్పారు. మహానందికి వచ్చిన ఆయనకు ఆలయ ప్రధానార్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ స్వాగతం పలికి పూజలు నిర్వహింప చేశారు. టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి, స్థానిక ఏజేన్సీ ఉద్యోగులు ఆయనకు స్వామి వారి ప్రసాదాలు అందించారు. -
రైల్వే సామగ్రి చోరీ కేసులో ఐదుగురు అరెస్ట్
● 1.5 టన్నుల బరువైన 240 ఇనుప రాడ్లు స్వాధీనం● పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపుమహానంది: గాజులపల్లె రైల్వేస్టేషన్ సమీపంలో ఇటీవల రైల్వే ఇనుప సామగ్రిని చోరీ చేసిన కేసులు శుక్రవారం ఐదుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహానంది ఎస్ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గత నెల 31న గాజులపల్లె ఆర్ఎస్ సమీపంలో కిలో మీటర్ మేరకు రైల్వేట్రాక్‌కు సపోర్టుగా ఏర్పాటు చేసిన ఇనుప బారికేడ్లను తొలగించి అపహరించారు. వీటి విలువ సుమారు రూ. 1.10 లక్షలు ఉంటుంది. సైట్ ఇంజనీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం సీతారామాపురం సమీపంలో కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద అనుమానాస్పదంగా ఉన్న గోపవరం గ్రామానికి చెందిన పిన్నాపురం తిరుమలేసు, నాగసరపు అశోక్, మాచర్ల ఆదికేశవ, షేక్ సద్దాంహుసేన్, శివను అదుపులోకి విచారించగా చోరీ వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి 1.5 టన్నుల బరువున్న 240 ఇనుపరాడ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. వారిని నంద్యాల జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారన్నారు. మరో నిందితుడు విక్రమ్‌ను పరారీలో ఉన్నాడని, త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. -
సిల్వర్ జూబ్లీ ప్రవేశాలకు 6 నుంచి దరఖాస్తులు
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు సిల్వర్‌సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.వి.ఎస్.కుమార్ శుక్ర వారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ ఏపీ విభజన తరువాత రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు మాత్రమే ఈ ఏడాది నుంచి కళాశాలలో ప్రవేశం కల్పిస్తున్నామన్నారు. ఈ నెల 6 నుంచి 30వ తేదిలోపు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. వచ్చే నెల 18న అర్హత పరీక్ష నిర్వహిస్తామన్నారు. 280 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆన్లైన్ ద్వారా అర్హత పరీక్ష నిర్వహిస్తామని, పూర్తి వివరాలకు https://cuklap.ac.in,https://www.sjgckurnool.edu.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. మరిన్ని వివరాలకు 9059305168ను సంప్రదించవచ్చన్నారు. విలేకరుల సమావేశంలో సిల్వర్ సెట్ కన్వీనర్ డాక్టర్ మహమ్మద్ వాహిద్, తదితరులు పాల్గొన్నారు. -
రైతు ఆత్మహత్యలకు ఎన్డీఏ సర్కారే కారణం
కర్నూలు(సెంట్రల్): దేశంలో రైతు ఆత్మహత్యలకు ఎన్డీఏ సర్కార్ విధానాలే కారణమని కేరళ వ్యవసాయ శాఖమంత్రి ప్రసాదు అన్నారు. శుక్రవారం కర్నూలులోని లక్ష్మీనరసింహ కల్యాణ మండపంలో ఏపీ రైతు సంఘం గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య అధ్యక్షతన జాతీయ రైతు సదస్సును నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా కేరళ వ్యవసాయ శాఖమంత్రితో పాటు ఏపీ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాదు మాట్లాడుతూ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ దొడ్డిదారిలో రైతు వ్యతిరేక చట్టాల అమలుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేరళ భూసంస్కరణల్లో సీపీఐ కీలకపాత్ర పోషించిందని, మార్కెటింగ్ విధానంతో రైతులకు కేరళ ప్రభుత్వ అండగా ఉందని చెప్పారు. ● మాజీ మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఏపీలో రైతుల స్థితిగతులు అగమ్యగోచరంగా ఉన్నాయన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. మిర్చి సాగుచేసిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. అన్నదాతలు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం అన్యాయమన్నారు. ● ఏపీ రైతు సంఘం గౌరవాధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం మాట్లాడుతూ ఏపీలో అమల్లో ఉన్న ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేస్తోందని విమర్శించారు. ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. ● సమావేశంలో మాజీ మంత్రి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు. -
చేతులెత్తి మొక్కుతూ.. మనసారా అభివాదం చేస్తూ.. చిరునవ్వులతో స్వాగతిస్తూ.. అభిమాన తరంగం ఉవ్వెత్తున ఎగిసింది. జగమంత కుటుంబం ఆత్మీయత పంచగా.. అడుగడుగునా ఆప్యాయత స్వాగత తోరణమైంది.
● మాజీ సీఎం వైఎస్ జగన్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు ● వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి ● అభిమానులతో కిటకిటలాడిన కన్వెన్షన్ హాలు ● పాల్గొన్న ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు, వైఎస్సార్సీపీ నేతలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు భారీగా తరలి వచ్చిన ప్రజలుకర్నూలు (టౌన్): మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ‘జై జగన్.. సీఎం..సీఎం’ అంటూ నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రితో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. భారీగా అభిమానులు రావడంతో రోడ్లు కిక్కిరిసి పోయాయి. కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక గురువారం కర్నూలు నగర శివారులోని జీఆర్సీ కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నూతన దంపతులు శ్రేయ, వివేకానంద విరూపాక్షిని ఆశీర్వదించా రు. వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రిని చూసేందుకు, సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ప్రజలు భారీగా తరలి రావడంతో కన్వెన్షన్ హాలు కిక్కిరిసిపోయింది. ఆప్యాయంగా పలకరించి.. తాడేపల్లి నుంచి కర్నూలు నగరంలోని మైపర్ మైదానం హెలిపాడ్‌కు చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాఅధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూల్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, బూసినె విరూపాక్షి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ స్వాగతం పలికారు. మాజీ ఎంపీలు బుట్టా రేణుక, పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, సాయి ప్రసాద్‌రెడ్డి, కంగాటి శ్రీదేవి, ఎర్రకోట చెన్న కేశవరెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రామిరెడ్డి, బిజేంద్రా రెడ్డి, శిల్పా రవికిషోర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మేయర్ బీవై రామయ్య, పార్టీ నేతలు ఆదిమూలపు సతీష్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, దార సుధీర్, పార్టీ రాష్ట్ర నాయకులు తెర్నేకల్ సురేంద్ర రెడ్డి, సుభాష్ చంద్రబోస్, విజయ మనోహారి, శశికళ, గాజుల శ్వేతారెడ్డి స్వాగతం పలికారు. పూలబోకేలు ఇచ్చి శాలువాలు కప్పారు. ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్యాయంగా పలకరించారు. ప్రతి ఒక్కరి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆత్మీయత.. అభిమానం హెలిపాడ్‌కు భారీగా చేరుకున్న ప్రజలు ‘సీఎం.. సీఎం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జొహరాపురం రోడ్డు జనంతో నిండిపోయింది. హెలిపాడు నుంచి అందరికీ అభివాదం చేసుకుంటూ కారులో జీఆర్సీ కన్వెన్షన్‌కు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలు దేరారు. అందరికీ అభివాదం చేశారు. జననేతను చూసేసరికి అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో ఆద్యంతం ఆత్మీయత, అభిమానం కనిపించింది. అభివాదం చేస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి -
విరుచుకుపడిన వరుణుడు!
కర్నూలు(అగ్రికల్చర్)/సాక్షినెట్‌వర్క్: జిల్లాలోని వి విధ ప్రాంతాల్లో అకాల వర్షాలు కురవడంతో అన్నదాతకు నష్టం వాటిల్లింది. దేవనకొండ, సి. బెళగల్, కోడుమూరు మండలాల్లో కోసి ఆరబెట్టిన ఉల్లి పూర్తిగా తడిచిపోయింది. కొన్ని చోట్ల టార్పాలిన్లు కప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయం నుంచి వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అలాగే రాత్రి 7 నుంచి 11 గంటల వరకు అకాల వర్షాలు కురిశాయి. దేవనకొండ మండలం ఈదులదేవరబండ గ్రామంలో 42.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. సి.బెళగల్ మండలంలో 21.5 మి.మీ., ఎమ్మిగనూరు మండలంలో 20.5 మి.మీ., గూడూరు మండలంలో 10 మి.మీ. ప్రకారం అకాల వర్షాలు కురిశాయి. కోడుమూరు, ఆదోని, గోనెగండ్ల, పత్తికొండ, కర్నూలు తదితర మండలాల్లో కూడా వర్షాలు కురిశాయి. నష్టాలు ఇలా.. ● సి.బెళగల్ మండలంలో గురువారం సాయంత్రం కురిసన గాలివానతో పొలాల్లో ఉన్న పైర్లు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఉన్న మిరప, పొగాకు దిగుబడులు తడిసిపోయాయి. తుంగభద్ర నదితీర గ్రామాల్లో రబీలో సాగు చేసిన వరి పైరు నేలకొరిగింది. ● దొర్నిపాడు, క్రిష్టిపాడు, డబ్ల్యూ గోవిందిన్నె గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. భారీ గాలులకు మిరప కాయలన్నీ రాలిపోయాయి. కల్లాల్లో ఉన్న మిరప పూర్తిగా తడిసి పోయింది. ● కొలిమిగుండ్ల, కల్వటాల, నందిపాడు, తిమ్మనాయినపేట, కమ్మవారిపల్లె, అబ్దులాపురం గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. పసుపు పంటను కోసిన రైతులు ఉడికించేందుకు తిమ్మనాయినపేట గ్రామం శివారులో ఆరబెట్టుకున్నారు. ఉన్నట్లుండి ఆకాల వర్షం కురవడంతో రైతులు పరుగులు పెట్టి తడవకుండా పట్టలు కప్పుకోవాల్సి వచ్చింది. ● మహానంది మండలంలో గురువారం సాయంత్రం అరగంట పాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. తిమ్మాపురం, బుక్కాపురం తదితర గ్రామాల్లోని పొలాల్లో ఆరబెట్టిన పసుపు తడిచిపోపోయింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ● బండిఆత్మకూరు మండలంలో ఊహించని విధంగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. కడమల కాలువ, వెంగళరెడ్డి పేట, ఈర్నపాడు, సింగవరం గ్రామాల్లో కొన్నిచోట్ల వరి నేల కొరిగింది. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ● కోవెలకుంట్ల వ్యవసాయ సబ్‌డివిజన్‌లోని పలు మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మొక్కజొన్న పంటలో కోత, నూర్పిడి పనులు కొనసాగుతున్నాయి. మిరపలో చివరి కోత పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. వర్షం కారణంగా కల్లాల్లో ఆరబోసిన మిరప, మొక్కజొన్న దిగుబడులు తడవకుండా పట్టలు కప్పుకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. పొట్టదశలో ఉన్న వరి నేలవాలడంతో వడ్లు రాలిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● నందవరం మండలంలో నాగలదిన్నె, పెద్దకొత్తిలి, జొహరాపురం, గంగవరం, రాయచోటి, నందవరం, నదికై రవాడి తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఽమొక్కజొన్న గింజలు, ఎండుమిర్చి తడిసిపోకుండా పట్టలు కప్పుకుంటూ అన్నదాతలు నానా అవస్థలు పడ్డారు. వరి, మొక్కజొన్న, మిరప పంటలు తిన్నాయి. ఆశలు వర్షార్పణం పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు -
ప్రారంభమైన ‘పది’ స్పాట్
నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి జవాబుపత్రాల స్పాట్ (మూల్యాంకనం) గురువారం ప్రారంభమైంది. నంద్యాల పట్టణ శివారులోని ఎస్డీఆర్ పాఠశాలలో చేపట్టిన స్పాట్‌కు దాదాపు 684 మంది ఉపాధ్యాయులు, 100 మంది సిబ్బంది హాజరయ్యారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన జవాబు పత్రాలను పకడ్బందీ ఏర్పాట్ల మధ్యన మూల్యంకనం చేస్తున్నారు. డీఈఓ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాకు ఇప్పటి వరకు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి 2 లక్షల వరకు జవాబు పత్రాలు వచ్చాయి. జనరల్ విద్యార్థుల సోషల్ సబ్జెక్ట్‌కు సంబంధించిన జవాబు పత్రాలు రావాల్సి ఉంది. ‘పీఎం సూర్య ఘర్’పై విస్తృత ప్రచారం నంద్యాల: పీఎం సూర్య ఘర్ పథకంపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని విద్యుత్ అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో పీఎం సూర్య ఘర్, కుసుమ్ పథక అమలుపై జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్‌తో కలిసి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 87,632 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు సూర్య ఘర్ సోలార్ ప్యానల్ కనెక్షన్ల కోసం పేర్లు నమోదు చేయించుకున్నారన్నారు. పీఎం సూర్య ఘర్ సంబంధించి ప్రతి నియోజకవర్గంలో పదివేల ఇళ్లపై సోలార్ ఫలకలు ఏర్పాటు చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించారన్నారు. పీఎం కుసుం పథకం కింద జిల్లాలో 130 విద్యుత్ సబ్ స్టేషన్లకు అవసరమైన స్థలాల సేకరణకు ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సుధాకర్ కుమార్, ఈఈలు, ఎల్డీఎం రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. మార్కెటింగ్ శాఖకు పెరిగిన ఆదాయం కర్నూలు(అగ్రికల్చర్): 2024–25 సంవత్సరంలో మార్కెటింగ్ శాఖకు ఆదాయం పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలపై వ్యాపారుల నుంచి సంబంధిత మార్కెట్ కమిటీలు 1 శాతం ఫీజు వసూలు చేస్తారు. ఆ ప్రకారం రూ.36.18 కోట్ల ఫీజు వసూలు లక్ష్యం కాగా, రూ.39.36 కోట్లు వసూలైంది. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ మార్కెట్ కమిటీలు లక్ష్యాలను అధిగమించగా.. మంత్రాలయం, కోడుమూరు, ఆలూరు మార్కెట్లు వెనుకబడినట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ నారాయణమూర్తి తెలిపారు. మెరిట్, ఎంపిక జాబితా విడుదల కర్నూలు(హాస్పిటల్): ఉద్యోగాల భర్తీకి ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ విడుదల చేసినట్లు కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్, జనరల్ హాస్పిటల్స్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి 2023 నవంబర్ 20న నోటిఫికేషన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మొత్తం 11 కేటగిరీల అభ్యర్థుల ఫైనల్ మెరిట్, సెలక్షన్ జాబితాను https:// kurnool. ap. gov. in, https:// nandyal. ap. gov. in, https:// kurnoolmedical. ac. inలల వెబ్సైట్లో అప్లోడ్ చేశామమని పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల నకలు సర్టిఫికెట్లతో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు ఉదయం 10.30 గంటలకు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కార్యాలయంలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు. హాజరుకాని అభ్యర్థుల ఎంపిక రద్దు చేస్తామన్నారు. రైతుసేవా కేంద్రాల్లో జొన్నల కొనుగోలు కర్నూలు(సెంట్రల్): రైతుసేవా కేంద్రాల్లో మహేంద్ర రకం జొన్నలు కొనుగోలు చేస్తున్నట్లు జేసీ డాక్టర్ బి.నవ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ–క్రాప్, ఈకేవైసీ చేయించుకున్న రైతులు తమ పేర్లను సచివాలయాల్లో నమోదు చేసుకుంటే క్వింటా జొన్నలు రూ.3,371 ప్రకారం కొనుగోలు చేస్తామన్నారు. నిర్దేశించిన మేరకు నాణ్యత ఉండే జొన్నలనే కొనుగోలు చేస్తామని.. హమాలీ, రవాణా ఖర్చులను పౌరసరఫరాల సంస్థ భరిస్తుందన్నారు. -
నందికొట్కూరులో చోరీ
నందికొట్కూరు: పట్టణంలోని సాయిబాబాపేటలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. స్థానికంగా నివాసముంటున్న షేక్ మహబూబ్‌బాషా ఇటీవల తన తమ్ముడు షేక్ రహంతుల్లా కుమారుడు అబ్దుల్లా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా ఆర్ఆర్ వెంచర్లో ఉన్న తమ్ముడి ఇంటికి మహబూబ్‌బాషా కుటుంబ సభ్యులందరూ ప్రతి రోజు రాత్రి తోడుగా వెళ్లి నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని 60 తులాల వెండి, రూ. 50 వేలు, విలువైన రెండు గడియారాలు, ముక్కుపుడక అపహరించారు. గురువారం ఉదయం ఇంటికి వచ్చి చూసుకునే సరికి తలుపు తెరిచి ఉండటంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ పరిశీలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. క్రీడా కేంద్రానికి ఇద్దరు ఎంపిక నంద్యాల(న్యూటౌన్): భారత క్రీడల శాఖ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కర్నూలులో ఉన్న తైక్వాండో కేంద్రానికి నంద్యాలకు చెందిన పవన్‌తేజ, జంషీద్ హుసేన్ ఎంపికై నట్లు నంద్యాల లయన్స్‌క్లబ్ కార్యదర్శి రమేష్, నంద్యాల జిల్లా పారా ఒలంపిక్ కార్యదర్శి రమణయ్యలు పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులను గురువారం ఐఎంఏ మాజీ అధ్యక్షుడు రవికృష్ణ తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణతో కూడిన పాఠశాలలో నిరంతర సాధన కృషి చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. కార్యక్రమంలో వెలుగోడు మాజీ జెడ్పీటీసీ లాలుస్వామి, కోచ్‌లు మహబూబ్‌బాషా, ఉదయ్‌కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి ఆత్మహత్య కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లెలోని చింతలాయిపల్లె రోడ్డులో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అవుకు మండలం రామాపురానికి చెందిన ఉమ్మడి వెంకట్రామిరెడ్డి(48) జీవనోపాధి నిమిత్తం దాదాపు పదిహేనేళ్ల క్రితం అంకిరెడ్డిపల్లెలో స్థిరపడ్డాడు. ఇతనికి దివ్యాంగురాలైన భార్య వసుంధరదేవి ఉంది. వీరికి సంతానం లేదు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవిస్తున్న ఇతను మద్యానికి బానిసై నిత్యం భార్యతో గొడవపడేవాడు. నెల రోజుల క్రితం భర్తతో గొడవపడి భార్య అనంతపురం జిల్లా యాడికి మండలంలోని చిక్కెపల్లెలోని పుట్టింటికి వెళ్లి పోయింది. అయితే రెండు రోజుల క్రితం ఓ ట్రాక్టర్ డ్రైవర్‌తో వెంకట్రామిరెడ్డి గొడవ పడ్డాడు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. కాగా సూసైడ్ నోట్లో గోపాల్ అనే వ్యక్తి పేరుతో పాటు, జీవితంపై విరక్తి చెంది తాను ఆత్మహత్య చేసుకున్నట్లు రాశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
కర్నూలు: కోడుమూరు మండలం లద్దగిరి హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న నరేష్ అలియాస్ నాని (15) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. వెల్దుర్తి మండలం నరసాపురం గ్రామానికి చెందిన బజారి, మహదేవి దంపతులకు ఇద్దరు కూతుర్లు, కుమారుడు నరేష్ ఉన్నారు. మహదేవి ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అప్పటి ఆమె పిల్లలు కృష్ణగిరి మండలం రామకృష్ణాపురంలో మేనమామ మధు సంరక్షణలో ఉంటున్నారు. కాగా బజారి కర్నూలు వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన లిల్లీని వివాహం చేసుకుని ఇక్కడే ఉంటున్నాడు. నరేష్ లద్దగిరి హాస్టల్లో చదువుకుంటూ తరచూ కర్నూలులో ఉన్న తండ్రి దగ్గరకు వచ్చేవాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం హాస్టల్ నుంచి పారిపోయి తండ్రి బజారి వద్దకు వచ్చాడు. గురువారం అనుమానాస్పద స్థితిలో ఇంట్లో చనిపోయాడు. కాగా మొదటి భార్య చనిపోయినప్పుడు పిల్లలకు బజారి 3 ఎకరాల పొలాన్ని రాసిచ్చాడు. అందుకు సంబంధించిన పత్రాలు తీసుకురావాలని కుమారుడు నరేష్‌పై తండ్రి బజారి ఒత్తిడి పెంచి కొట్టి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు మేనమామ మధు ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వీరభద్రా.. శరణు.. శరణు !
తుగ్గలి: ఎదులదొడ్డిలో వెలిసిన వీరభద్రస్వామి రథోత్సవం వైభవంగా సాగింది. గురువారం వేకువజామున వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీ కాళికామాతా సమేత శ్రీ వీరభద్రస్వామి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. స్థానికులతో పాటు వివిధ గ్రామాల పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించు కున్నారు. సాయంత్రం స్వామి ఉత్సవమూర్తులను పూలతో అలంకరించిన రథంలో ఉంచి భక్తులు రథాన్ని లాగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పత్తికొండ రూరల్ సీఐ పులిశేఖర్ పర్యవేక్షణలో తుగ్గలి ఎస్ఐ కృష్ణమూర్తి, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
కమనీయం.. రథోత్సవం
ఆస్పరి: కై రుప్పల గ్రామంలో గురువారం అశేష జనవాహని మధ్య వీరభద్రస్వామి రథోత్సవం కనుల పండవగా జరిగింది. వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందుగా ఆలయంలో వీరభద్రస్వామి, కాళికాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి ఉత్సవ విగ్రహలను మేళతాళాలతో ఊరేగించారు. రథం ముందు పురోహితుడు మల్లికార్జున స్వామి పూజలు నిర్వహించి రథంపై ఉత్సవ విగ్రహలను చేర్చారు. అనంతరం జయ జయ ధ్వానాల మధ్య స్వామి వారి రథోత్సవం ప్రారంభమైంది. బసవన్న దేవాలయం వరకు, తిరిగి రథశాల వద్దకు లాగారు. రథోత్సవాన్ని చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు కదిలి వచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ తిమ్మక్క, ఆలూరు ఎమ్మెల్యే తనయుడు చంద్రశేఖర్, వెంగళాయిదొడ్డి ఆయకట్టు చైర్మన్ బసవరాజు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాన్ని తరిమేలా.. ప్రాణాలు రక్షించేలా!
● కులుమాలలో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు ● అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం ● రూ. 2.50 లక్షల సొంత నిధులతో సమస్యను పరిష్కరించిన బుట్టా రేణుక గోనెగండ్ల: ‘సార్.. విద్యుత్ తీగలు ఇళ్ల ముందర వేలాడుతున్నాయి. మిద్దెలపైకి వెళ్లాంటే భయమేస్తోంది. విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి చనిపోయాడు’ అని అధికారులకు ప్రజలు మొరపెట్టుకున్నా స్పందించ లేదు. చివరకు సమస్య వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బుట్టా రేణుక దృష్టికి వెళ్లడంతో ఆమె సొంత నిధులతో పరిష్కరించారు. కులుమాల గ్రామంలోని బీసీ కాలనీలో గత 20 ఏళ్లుగా 11 కేవీ విద్యుత్ తీగలు ఇళ్లపై వెళ్లడం ద్వారా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటిపైకి వెళ్లాలంటే ఆ తీగలు తగిలి ప్రాణాలు పోతాయని భయపడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. ఆ తీగలు తగిలి ఓ వ్యక్తి ప్రాణాన్ని కోల్పోయాడు. మరికొందరు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. చివరకు గ్రామంలో నెలకొన్న విద్యుత్ తీగల సమస్యను పరిష్కరించాలని ఆ గ్రామస్తులు వైఎస్సార్సీపీ జిల్లా ఆక్టివిటి కార్యదర్శి నాగేష్ నాయుడు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బుట్టా రేణుక దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె సంబంధిత అధికారులతో మాట్లాడి సొంత నిధులు రూ.2.50 వెచ్చించి సమస్యను పరిష్కరించారు. రెండు రోజుల క్రితం కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి 11కేవీ విద్యుత్ తీగలను సురక్షిత మార్గంలో మార్పు చేసి సమస్యను పరిష్కరించడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ మేరకు బుట్టా రేణక, నాగేష్ నాయుడికి గ్రామస్తులతో పాటు వైఎస్సార్సీపీ మండల ఉపాధ్యక్షుడు పేట అల్లా బకాష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొల్ల నరసింహుడు, వీరేష్, మద్దిలేటి, మద్ది, రాజు, దుబ్బన్న, మల్లికార్జున, రామాంజిని తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. -
వడదెబ్బతో యాచకుడి మృతి
కోవెలకుంట్ల: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని యాచకుడు గురువారం వడదెబ్బతో మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. 60 సంవత్సరాలకు పైబడిన ఓ గుర్తు తెలియని యాచకుడు కొన్ని రోజుల క్రితం భిక్షాటనకు కోవెలకుంట్లకు వచ్చాడు. ప్రతి రోజు పట్టణంలో భిక్షాటన చేసుకుని రాత్రి సమయాల్లో బస్టాండ్ పరిసరాల్లో నిద్రించేవాడు. రోజులాగే గురువారం ఉదయం భిక్షాటన నిమిత్తం వెళ్లి ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురయ్యాడు. అనారోగ్యంతోనే బస్టాండ్ వద్దకు చేరుకుని కుప్పకూలిపోయి మృతి చెందాడు. ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ మల్లికార్జునరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని యాచకుడి చిరునామా వివరాలు ఆరా తీశారు. వివరాలు లభ్యం కాకపోవడంతో మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
చౌడేశ్వరిదేవికి ప్రణమిల్లి..
బనగానపల్లె: అర్ధరాత్రి భక్తి కెరటం ఎగిసింది. జ్యోతులు దేదీప్యమానంగా వెలుగొందాయి. ‘చల్లగా దీవించు తల్లీ’ అంటూ.. భక్తజనం చౌడేశ్వరి దేవి ముంగిట ప్రణమిల్లారు. నందవరంలో వెలిసిన చౌడేశ్వరిదేవి అమ్మవారి జ్యోతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గత నెల 30వ తేదీన ప్రారంభమైన ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన జ్యోతుల సమర్పణ కార్యక్రమానికి కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భక్తజనం తరలివచ్చారు. బుధవారం అర్ధరాత్రి నుంచి జ్యోతి మహోత్సవం కనులపండువగా సాగింది. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ, ఆలయ అర్చకులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సల్లో భాగంగా ముందుగా భాస్కరయ్య ఆచారి అమ్మవారికి దిష్టిచుక్క పెట్టు కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం ఒంటిగంట నుంచి గ్రామంలోని శ్రీ చెన్నకేశస్వామి దేవస్థానం తొగటవీర క్షత్రి యులు, భక్తులు జ్యోతులు తలపై పెట్టుకొని భక్తి గీతాలు పాడుకుంటూ మేళతాళాలతో బయల్దేరారు. మొదట సర్కార్ వారి జ్యోతి బయలుదేరగా.. మిగతా జ్యోతులు గ్రామ చావిడి, బస్టాండ్ మీదుగా చౌడేశ్వరిదేవి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నాయి. దేవస్థానం ముందు ఏర్పాటు చేసిన అగ్ని గుండంలో భక్తులు నడుచుకుంటూ వచ్చి ఆలయ గర్భగుడిలో కొలువైన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఉత్సవంలో తొగటవీర క్షత్రియులు ప్రదర్శించిన కత్తి సాము ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. సర్కార్ వారి జ్యోతి వద్ద భక్తుల రద్దీని నివారించేందుకు డోన్ డీఎస్పీ శ్రీనివాసులు, బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్‌రెడ్డి, ఎస్ఐ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సుమారు 750 జ్యోతులకుపైగా రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. జ్యోతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ అమ్మవారికి జ్యోతిని సమర్పించారు. గురువారం సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ముస్తాబు చేసి రఽథోత్సవాన్ని నిర్వహించారు. గ్రామ ముఖద్వారం వరకు భక్తులు రథాన్ని లాగారు. శుక్రవారం తిరుగు రథోత్సవం నిర్వహించన్నారు. ఈనెల 5వ తేదీన ఉత్సవాలు ముగియనున్నాయి. వైభవంగా జ్యోతి మహోత్సవం అబ్బుర పరిచిన తొగటవీర క్షత్రియుల విన్యాసాలు కిటకిటలాడిన నందవరం -
సచివాలయమే.. నమ్మండి!
ఇదేదో టీడీపీ కార్యాలయం అనుకుని పొరపాటు పడేరు. ముమ్మాటికీ సచివాలయమే..నమ్మండి. కాకపోతే కూటమి ప్రభుత్వంలోని అరాచకాలకు ఇక్కడ ఎగరేసిన పచ్చ జెండానే నిదర్శనం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేసుకన్న పాలకులు ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ కార్యాలయాలను సైతం ‘పచ్చ’పాతంగా మార్చేస్తున్నారు. వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి గ్రామంలోని సచివాలయం వద్ద ఇటీవల టీడీపీ నాయకులు తమ పార్టీ ఆవిర్భావ వేడుకలు చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఏకంగా అక్కడ శాశ్వత దిమ్మ ఏర్పాటు చేసి టీడీపీ జెండా ఆవిష్కరించడం చూసి ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. ఎంత బరితెగింపు పనికిరాదని ఈసడించుకుంటున్నారు. మరోవైపు సచివాలయ ఉద్యోగులు, సంబంధిత అధికారులు తమకెందుకొచ్చిందంటూ చూసీచూడనట్లు విధులకు వచ్చిపోతున్నారు. – వెల్దుర్తి -
అగ్ని వీర్లో మెరిసి.. ఆదర్శమై నిలిచి!
● సత్తా చాటిన ఆస్పరి యువకులు ● వీరంతా మోడల్ స్కూల్ పూర్వ విద్యార్థులే .. ● హర్షం వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు ఆస్పరి: వారి కుటుంబాలకు వ్యవసాయమే ఆధారం. తల్లిదండ్రులు పడే కష్టాలు కళ్లారా చూశారు. అయినా తమ పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో అప్పోసప్పో చేసి చదివించారు. వారి నమ్మకాన్ని ఆ పిల్లలు వమ్ము చేయలేదు. అగ్రివీర్లో ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. గత మార్చి 28న గుంటూరులో కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన అగ్నిపథ్ సెలక్షన్స్‌లో ఆస్పరి మండలానికి చెందిన ఐదుగురు యువకులు సత్తా చాటి జీడీ(జనరల్ డ్యూటీ) ఉద్యోగాలు సాధించారు. వీరంతా వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారు కావడంతోపాటు టెన్త్, ఇంటర్ మండలంలోని పుటకలమర్రి సమీపంలో ఉన్న ఆదర్శ పాఠశాలలోనే పూర్తి చేశారు. ఒకేసారి ఐదుగురు తమ పాఠశాల పూర్వ విద్యార్థులు ఇండియన్ ఆర్మీకి ఎంపికై తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవడంతో ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉద్యోగాలు సాధించిన యువకుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. -
విద్యార్థుల చేతికి ట్యాబ్‌లు
డోన్ టౌన్: విద్యార్థుల నుంచి తీసుకున్న ట్యాబ్‌లను ఎట్టకేలకు తిరిగిచ్చేశారు. గత వైఎస్సార్సీసీ ప్రభుత్వం హయాంలో విద్యార్థుల భవిష్యత్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను అందించిన సంగతి తెలిసినదే. ఈనెల 1న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగియడంతో విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేనప్పటికీ స్థానిక ఏపీ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాలలోని విద్యార్థినుల నుంచి ట్యాబ్‌లు లాగేసుకున్నారు. ఈ విషయమై కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్ద నరసనలు వ్యక్తం చేసినా ఎలాంటి స్పందన లేక పోవడంతో విషయం తెలుసుకున్న సాక్షి దినపత్రిక.. ‘ట్యాబ్‌లు లాగేసుకుంటున్నారు’ శీర్షికతో కథనం ప్రచురించింది. దీంతో అధికారులు స్పందించారు. ఇంటెలిజెన్స్, విద్యాశాఖ అధికారులు విచారణ చేసి ట్యాబ్‌లు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. దీంతో బుధవారం హెచ్ఎం సుస్మితతో పాటు ట్యాబ్‌లు తీసుకున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు ఫోన్ చేసి పాఠశాలకు పిలిపించి ట్యాబ్‌లు ఇచ్చేశారు. -
శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న తెలంగాణ మంత్రి
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, ఐఅండ్‌పీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. బుధవారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన మంత్రి పొంగులేటి దంపతులకు ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన కార్యనిర్వహనాధికారి ఎం.శ్రీనివాసరావు, అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పొంగులేటి దంపతులు మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న వివిధ పథకాలకు మంత్రి దంపతులు రూ.10,11,116 విరాళాన్ని ఈఓకు అందజేశారు. స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందించి దేవస్థానం మంత్రి దంపతులను సత్కరించారు.రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతిమద్దికెర: మద్దికెర – మల్లప్పగేట్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి గుర్తు తెలియని రైలు నుంచి జారి పడి మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. గుంతకల్లు రైల్వే ఎస్ఐ మహేంద్ర తెలిపిన వివరాలు.. దాదాపు 35 ఏళ్ల వయస్సున్న వ్యక్తి రైలు నుంచి జారిపడి తలకు బలమైన తీవ్రగాయం కావడంతో మృతి చెందాడని ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలలో ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఎవరైనా మృతుడిని గుర్తుపడితే 9866144616కు సమాచారం అందించాలన్నారు.కుందూనదిలో పడి ఆర్టీసీ ఉద్యోగి..కోవెలకుంట్ల: పట్టణంలోని ఎల్ఎం కాంపౌండ్‌కు చెందిన ఆర్టీసీ ఉద్యోగి ప్రమాదవశాత్తూ కందూనదిలో పడి మృతి చెందాడు. కోవెలకుంట్ల పోలీసులు అందించిన సమాచారం మేరకు కోవెలకుంట్లకు చెందిన గోగు చెన్నయ్య(52) స్థానిక ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం కాలికి పక్షవాతం సోకింది. అప్పటి నుంచి డిపో గ్యారేజిలో మెకానిక్‌గా ఉద్యోగాన్ని బదలాయించారు. చెన్నయ్యకు సోమవారం సెలవు కావడంతో పట్టణ శివారులోని కుందూనదిలో స్నానం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటిలో పడి మునిగిపోయాడు. రెండు రోజులు అయినా ఇంటికి రాక పోవడంతో డ్యూటీ నిమిత్తం ఎక్కడికై నా వెళ్లాడని కుటుంబ సభ్యలు భావించారు. అయితే బుధవారం ఉదయం కుందూలో శవమై కనిపించాడు. మృతుడి భార్య సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు హెడ్‌కానిస్టేబుల్ నాగూర్వలి తెలిపారు. -
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
పగిడ్యాల: భార్య కాపురానికి రావడంలేదనే మనస్తాపానికిలోనైన భర్త ఆత్మ హత్యకు పాల్పడిన ఘటన మండలంలోని పాతముచ్చుమర్రి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన శాలుబాషా కుమారుడు నరేంద్ర(28)కు సి.బెళగల్‌కు చెందిన పవిత్రతో వివాహమైంది. వీరికి ఏడాది కుమార్తె ఉంది. భార్యా, భర్తల మధ్య కుటుంబ కలహాలు నెలకొనడంతో పవిత్ర కొంతకాలం క్రితమే పుట్టినింటికి వెళ్లింది. పలుమార్లు పెద్దమనషులతో పంచాయితీ చేసినా ఆమె రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికిగురైన నరేంద్ర మంగళవారం రాత్రి అందరూ నిద్రిస్తుండగా ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్సనిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ముచ్చుమర్రి పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
తప్పిపోయిన పిల్లలు తల్లిదండ్రుల చెంతకు
కర్నూలు: ఏపీ పొల్యూషన్ బోర్డు వద్ద ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న పి.ప్రశాంతి (10), 3వ తరగతి చదువుతున్న పి.ప్రదీప్ తప్పిపోయినట్లు తెలుసుకున్న పోలీసులు గంట వ్యవధిలోనే వారి ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు. ఓర్వకల్లు మండలం లొద్దిపల్లె గ్రామానికి చెందిన ప్రభుదాస్ కర్నూలు వీనస్ కాలనీలో ఉన్న బాలాజీ నివాస్ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య మాధవి కూడా అక్కడే ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారిద్దరి పిల్లలు మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఆడుకుంటూ బయటకు వెళ్లి తప్పిపోయారు. సమీపంలోని సాయిసదన్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న బంధువుల ఇంటికి వెళ్లారు. అయితే వారు లేకపోవడం, కింద చీకటిగా ఉండటంతో భయపడి మూడో అంతస్థులోనే ఉండిపోయారు. తల్లిదండ్రులు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో వెంకటరమణ కాలనీలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్న సీఐ నాగరాజరావు తన సిబ్బందితో చిన్నారులను వెతికిపట్టుకుని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. సరదాగా ఆడుకుంటూ ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేని స్థితిలో ఉన్న పిల్లల ఆచూకీ కనుగొని తల్లిదండ్రుల చెంతకు చేర్చినందుకు సీఐతో పాటు గస్తీ సిబ్బందిని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. -
విజిలెన్స్ దాడులు
కర్నూలు(సెంట్రల్): కర్నూలు నగరంలో బియ్యం అక్రమ రవాణాపై విజిలెన్స్ పౌరసరఫరాల అధికారులు రెండో రోజు బుధవారం దాడులు కొనసాగించారు. ముగ్గురు ఎండీయూ ఆపరేటర్లు, రెండు రేషన్ షాపులపై దాడులు చేశారు. ఎండీయూ ఆపరేటర్ సాయి మహేష్ (11వ నంబర్)పై దాడి చేయగా ఉండాల్సిన బియ్యం కన్నా 593 కేజీలు తక్కువగా ఉండడంతోపాటు 164 ప్యాకెట్ల చక్కెర తక్కువగా ఉండడంతో 6ఏ కేసు నమోదు చేశారు. అలాగే రేషన్ షాపు నంబర్ 113పై దాడిచేయగా డీలర్ సుజిత్‌కుమార్ వద్ద ఉండాల్సిన బియ్యం కంటే 86 సంచులు తక్కువగా ఉండడంతో అతనిపై కూడా 6ఏ కేసు నమోదు చేశారు. ఆయా దాడుల్లో డీఎస్ఓ రాజారఘువీర్, ఏఎస్ఓ రామాంజనేయరెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. -
సూక్ష్మ సేద్యం పరికరాల్లో నాణ్యత ప్రధానం
కర్నూలు(అగ్రికల్చర్): సూక్ష్మ సేద్యం పరికరాల్లో నాణ్యత ప్రమాణాలు ఉండాలని, అప్పుడే డ్రిప్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ సేద్య లక్ష్యం 7,000 హెక్టార్లు ఉండగా ... 5,653 హెక్టార్లకు పరిపాలన అనుమతులు తీసుకున్నామన్నారు. బుధవారం కర్నూలులోని ఉద్యానభవన్‌లో ఉద్యాన అధికారులు, డ్రిప్ కంపెనీల ఇంజినీ ర్లు, జిల్లా కో–ఆర్డినేటర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఏపీఎంఐపీ పీడీ పాల్గొని ప్రసంగించారు. పరిపాలన అనుమతులు పొ ందిన వారందరికీ మే చివరిలోపు డ్రిప్ పరికరాలు సరఫరా చేసి, అమర్చాలని కంపెనీల కో–ఆర్డినేటర్లను ఆదేశించారు. ఏపీడీ రాజాకృష్ణారెడ్డి మాట్లాడుతూ సూక్ష్మ సేద్యం ప్రగతిలో కర్నూలు జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో ఉందన్నారు. ఇందుకు సహకరించిన కంపెనీల కో–ఆర్డినేటర్లను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి పి.రామాంజనేయులు, సూ క్ష్మనీటి అభివృద్ధి అధికారి జయరాంరెడ్డి పాల్గొన్నారు. -
రేపు కర్నూలులో జాతీయ రైతు సదస్సు
కర్నూలు(సెంట్రల్): ఈనెల 4న కర్నూలులో నిర్వహించే జాతీయ రైతు సదస్సును జయప్రదం చేయాలని ఏపీ రైతుసంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య కోరారు. నగరంలోని లక్ష్మీనరసింహ కల్యాణ మండపంలో జరిగే సదస్సుకు కేరళ, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రులు పి.ప్రసాదు, తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఉమ్మడి ఏపీ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, రఘువీరారెడ్డి, కిసాన్ సభ జాతీయ కార్యదర్శి రావుల వెంకయ్య హాజరవుతున్నట్లు తెలిపారు. బుధవారం సీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 15, 16, 17 తేదీల్లో తమిళనాడులోని నాగపట్నంలో ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ మహాసభలు జరగనున్న నేపథ్యంలో కర్నూలులో 4న జాతీయ రైతు సదస్సును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాతబస్టాండులోని శ్రీలక్ష్మీనరసింహ కల్యాణ మండపంలో జరిగే సదస్సులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి జాతీయ మహాసభల్లో తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా పంట రుణాలను మాఫీ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పంపన్న గౌడ్, ఎస్.మునెప్ప, పి.రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పట్టుదలతో సాధన చేశా
అమ్మ బోయ లక్ష్మి, నాన్న రామన్నకు వ్యవసాయమే జీవనాధారం. నేను మోడల్ స్కూల్లో 2021 – 2023 మధ్య ఇంటర్ ఎంఈసీ పూర్తి చేశాను. ప్రస్తుతం గుంతకల్లులోని బీసీ హాస్టల్లో ఉంటూ ఎస్కేపీ డిగ్రీ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాను. ప్రతి రోజు ఉదయం పరుగు, షాట్ పుట్ సాధన చేసేవాడిని. ఆర్మీకి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ట్రైనింగ్ నిమిత్తం ఈనెల 26న బెంగళూరుకు వెళ్తున్నా. – మహీంద్రా, చిన్నహోతూరు గ్రామం, ఆస్పరి మండలం -
భూమా వర్సెస్ ఇరిగెల
● పంచాయతీ స్థలంపై విషయంపై ఇరువర్గాల బాహాబాహీ ● జేసీబీని తీసుకెళ్లిన టీడీపీ నాయకులు ● అడ్డుకున్న జనసేన కార్యకర్తలు ● లింగందిన్నె గ్రామంలో ఉద్రిక్తత ఆళ్లగడ్డ: నియోజకవర్గంలో ‘కూటమి’ నేతల మధ్య కుంపటి రాజుకుంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గవిభేదాలు ఒక్కసారి భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే అఖిలప్రియ వర్గానికి చెందిన టీడీపీ నాయకులు పంచాయతీ స్థలాన్ని కబ్జా చేసేందుకు సిద్ధమవటంతో జనసేన నాయకుడు ఇరిగెల రాంపుల్లారెడ్డి వర్గానికి చెందిన వారు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. మంగళవారం లింగందిన్నె గ్రామంలో స్థలం ఆక్రమణ విషయమై ఎమ్మెల్యే, ఇరిగెల వర్గాలు ఏకంగా బాహాబాహీకి దిగడం చర్చనీయాంశమైంది. కబ్జాకు యత్నం.. ఆళ్లగడ్డ మండలం ఎస్ లింగందిన్నె గ్రామం ఎస్సీ కాలనీ సమీపంలో సుమారు 10 సెంట్ల ప్రభుత్వ ఖాళీ స్థలం ఉంది. ఇందులో సుమారు 40 సంవత్సరాల క్రితం పంచాయతీ నిధులతో రక్షిత మంచినీటి పథకం సామాన్లు భద్ర పరిచేందుకు, వాటర్మెన్లు సేదతీరేందుకు పంప్ భ భవనం నిర్మిచారు. బోరు, మోటార్ ఉన్న ఈ స్థలం విలువ సుమారు రూ. 30 లక్షల వరకు ఉంటుంది. ఈ స్థలాన్ని టీడీపీ నాయకులు కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ నిధులతో నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన పంప్ భవనం కూల్చేందుకు ఏకంగా జేసీబీనీ తీసుకుని మందీ మార్బలంతో అక్కడకు చేరుకున్నారు. పంచాయతీలో తీర్మానం చేయకుండా, గ్రామస్తులకు ఎవరికీ చెప్పకుండా ప్రభుత్వ స్థలంలో ఉన్న భవనా న్ని ఎలా కూలుస్తారంటూ టీడీపీ నాయకులను జనసేన కార్యకర్తలు నిలదీశారు. జేసీబీకి అడ్డుపడి నిరసన వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బెడిసికొట్టిన వ్యూహం టీడీపీ నాయకులను జనసేన కార్యకర్తలు, ప్రజలు వచ్చి నిలదీయడంతో వారి వ్యూహం బెడిసికొట్టింది. చేసేది లేక టీడీపీ నాయకులు వెనుదిరిగి ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లారు. స్థలాన్ని టీడీపీ నాయకులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం నియోజకవర్గంతో పాటు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్రమార్కులకు ఎమ్మెల్యే వత్తాసు పలుకుతుండటంతో స్థానికులు మండిపడుతున్నారు. -
‘ఉగాది’ ఆదాయం రూ. 47 లక్షలు
మహానంది: మహానందీశ్వరుడి దర్శనార్థం వేలాది సంఖ్యలో తరలివచ్చిన కన్నడిగులు కాసులు కురిపించారు. ఈ ఏడాది ఉగాది సందర్భంగా మహానంది దేవస్థానానికి రూ. 47,31,792 ఆదాయం వచ్చినట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024 ఉగాది సందర్భంగా రూ. 42,24,818 వచ్చిందని, ఈ ఏడాది అదనంగా రూ. 5,06,974 పెరిగిందన్నారు. హమ్మయ్యా.. పరీక్షలు ముగిశాయి నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి పరీక్షలు మంగళవారం ముగియడంతో విద్యార్థుల సంతోషానికి అవధుల్లేవు. హమ్మయ్యా.. అన్ని ప రీక్షలు ప్రశాంతంగా రాశామని చెప్పారు. గత నెల 17వ తేదీ నుంచి మంగళవారం వరకు జిల్లాలో 130 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మంగళవారం సోషల్ పరీక్షకు 24,855 మంది విద్యార్థులకు గాను 24,474 మంది హాజరు కాగా.. 381 మంది గైర్హాజరయ్యారు. రేపటి నుంచి మూల్యాంకనం జిల్లాకు 1.90 లక్షల పదోతరగతి జవాబు పత్రాలు వచ్చాయని, ఈనెల 3 నుంచి 9వ తేదీ వరకు ఎస్డీఆర్ ఉన్నత పాఠశాలలో మూ ల్యాంకనం నిర్వహిస్తున్నట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి తెలిపారు. రేపటి నుంచి అక్కడక్కడా వర్షాలు కర్నూలు(అగ్రికల్చర్): రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గే అవకాశం ఏర్పడింది. ఈ నెల 3, 4 తేదీల నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్త నారాయణస్వా మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని, అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సీపీఆర్‌కు గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శుల జాబితా కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈఓఆర్డీ పదోన్నతులకు అర్హులైన గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శుల జాబితాను కమిషన ర్ ఆఫ్ పంచాయతీరాజ్(సీపీఆర్)కు పంపారు. ఈ జాబితాలో బాల ఆంజనేయులు (నంద్యాల),ఎ.నాగరాజు(ఆదోని), జి.శ్రీనివాసులు (జెడ్పీ),కె.నాగరాజు(ఆదోని), వై.ప్రభాకర్ (ఆలూరు), హరిలీల(నంద్యాల), విజయలక్ష్మి (ఆదోని), జాకీర్‌హుసేన్(కర్నూలు), జేమ్స్ కృపావరం(డీపీఆర్సీ), మల్లీశ్వరి(డీపీఆర్సీ), అబ్దుల్ రహీం(దేవనకొండ) ఉన్నారు. సీపీఆర్ కోరిన నేపథ్యంలో అర్హులైన గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన ఏసీఆర్స్ను ఎంపీడీఓల ద్వారా సేకరించారు. -
విలవిల.. వెలవెల
● కళా విహీనంగా జూనియర్ కళాశాలలు ● మొదలైన ఇంటర్ సెకండియర్ తరగతులు ● తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులు ● మొదటి రోజు హాజరు 4.3 శాతం మాత్రమే కర్నూలు సిటీ/నంద్యాల(న్యూటౌన్): ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఇంటర్ సెకండియర్ తరగతులను మంగళవారం ప్రారంభించడంతో విద్యార్థులకు కష్టాలు తప్పలేదు. ‘పుస్తకాలు ఇవ్వలేదు..సారోళ్లు రాలేదు.. ఇలాగైతే ఎలా చదవాలి’’ అంటూ చాలా మంది విద్యార్థులు విలవిల ఏడ్చారు. చాలా జూనియర్ కాలేజీలకు విద్యార్థులు రాకపోవడంతో తరగతులు వెలవెల కనిపించాయి. ఇంటర్మీడియట్ విద్యలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి సంస్కరణలపై విద్యార్థులకు ఆసక్తి చూపడం లేదు. కొత్తగా 2025–26 విద్యా సంవత్సరం అకడమిక్ ఇయర్ క్యాలెండర్లో మార్పులు చేశారు. వేసవిలో కూడా తరగతులు నిర్వహించేలా ఉత్తర్వులు ఇచ్చారు. జూనియర్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు మంగళవారం సెకండియర్ తరగతులు ప్రారంభించారు. కాలేజీలు ప్రారంభించిన మొదటి రోజునే విద్యార్థుల చేతిలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, రికార్డులు అందజేస్తామని ప్రకటించారు. కానీ అసలు జిల్లాకు ఒక్క పుస్తకం కూడా రాలేదు. ఎలాంటి ముందస్తూ కసరత్తు లేకుండా, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా పబ్లిక్ పరీక్షలు ముగిసి రెండు వారాలకే తరగతులు ప్రారంభించడంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం మొదటి రోజు హాజరును బట్టి తెలుస్తుంది. ఇంటర్మీడియట్ విద్యలో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను అమలు చేసి, సిలబస్‌ను, పరీక్ష నమూనాలోను మార్పులు చేశారు. ఇదీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే. అయితే సెకండియర్ సిలబస్, పరీక్షల నమూనాలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ అకడమిక్ క్యాలెండర్లో చేసిన మార్పులకు అనుగుణంగా తరగతులను ప్రారంభించడం, గత నెల మొదటి వా రం జరిగిన పరీక్షల మూల్యాంకనం ఇంకా పూర్తి కాక ముందే విద్యా సంవత్సరం మొదలు కావడంపై అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు హాజరు 4.30 శాతమే! జిల్లాలో 23 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 16 ఏపీ మోడల్ స్కూల్ కాలేజీలు, కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలు 26, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు రెండు, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలు 8, మహత్మజ్యోతిరావు ఫూలే కాలేజీలు 01, ఎయిడెడ్ కాలేజీలు 04 మొత్తం 80 కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీలకు చెందిన సుమారు 7,769 మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాశారు. వీరిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 4,099 మందికిగాను కేవలం 175 మంది మాత్రమే హాజరయ్యారు. మిగిలిన కాలేజీలు ప్రారంభం అయినా విద్యార్థులు హాజరుకాలేదు. విద్యార్థులు హాజరైన కాలేజీల్లో కూడా రెండు, మూడు చోట్ల మాత్రమే మధ్యాహ్న భోజనాన్ని పెట్టారు. జీరో శాతం హాజరు ఉన్న జూనియర్ కళాశాలల వివరాలు.. జిల్లాకు చేరని పుస్తకాలు ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద ఉచితంగా కిట్లను పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ మేరకు జిల్లా పాఠ్యపుస్తకాలు 85,345, నోటు పుస్తకాలు 1,73,532, రికార్డులు 17,629 అవసరమని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారులు ఇండెంట్ పెట్టారు. వీటిలో ఒక్కటి కూడా జిల్లాకు చేరలేదు. ఎలా చదవాలి? పరీక్షలు ముగిశాయి. ఇంటర్ రెండో సంవత్సరం కళాశాలలో తరగతులు ప్రారంభమయ్యాయి. పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. ఎలా చదవాలి? ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 273 మంది విద్యార్థులకు గాను 16మంది మొదటి రోజు హాజరయ్యారు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు అందజేస్తామని ప్రభుత్వం చెప్పింది. ప్రారంభమైన రోజున పుస్తకాలు ఇవ్వలేదు. –యాకూబ్, వెంకటేశ్వరపురం, నంద్యాల పది రోజులకే తరగతులా? మొదటి సంవత్సరం ఇంటర్ ఫలితాలు వచ్చిన తర్వాత రెండో సంవత్సరం తరగతులు నిర్వహిస్తే మంచిది. మొదటి సంవత్సరం పరీక్షలు రాసి 10 రోజులు గడవకముందే రెండో సంవత్సరం తరగతులు నిర్వహించడంతో ఇబ్బంది. మొదటి రోజు కాలేజీలు ప్రారంభం రోజున 16 మంది విద్యార్థులు హాజరయ్యారు. ముగ్గురు లెక్చరర్లు, ప్రిన్సిపాల్ కాలేజీకి వచ్చారు. ఇంటర్ రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఏం చదవాలో, రాయాలో అర్థం కాలేదు. – లలిత, నంద్యాల -
కర్నూలు జిల్లాలో 3926 ఎకరాలు,నంద్యాల జిల్లాలో 8330 ఎకరాల ప్రకారం 12256 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఎకరాకు 70 వరకు చెట్లు ఉంటాయి. మామూలుగా అయితే ఎకరాకు 6 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 73 వేలకుపైగా టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఈ స
టన్ను కూడా రానట్లే.. మాకున్న పది ఎకరాల మామిడి తోటల్లో అధికంగా బేనీసా చెట్లు సాగు చేస్తున్నాం. గత డిసెంబర్లో పూత బాగా వచ్చింది. అప్పుడు చలి వాతావరణం ఎక్కువ ఉండటంతో తేనే మంచు తెగులుతో పూత మొత్తం రాలిపోయింది. 10 శాతం కూడా మిగల్లేదు. కనీసం ఎకరాకు 4–5 ట న్నుల వరకు దిగుబడి రావాల్సి ఉంది. పూత రాలిపోవడంతో టన్ను కూడా వచ్చే పరిస్థితి లేదు. ఖరీఫ్, రబీ పంటలు దెబ్బతీశాయి. ఇప్పుడు మామిడి కూడా నిరాశకు గురి చేయడం ఆందోళన కలిగిస్తోంది. – వెంకటసుబ్బారెడ్డి, పాలకొలను, ఓర్వకల్లు మండలం మామిడి ఆశలు గల్లంతే.. మాకు 3 ఎకరాల్లో మామిడి తోట ఉంది. పూత బాగా వచ్చిందని, ఈ సారి బాగా కలసి వస్తుందని ఆశించాం. ఎకరాకు కనీసం ఆరు టన్నుల వరకు దిగుబడి వస్తుందని ఆంచనా. వేసవి ఉష్ణోగ్రతలకు పూత దాదాపుగా రాలిపోయింది. 5 నుంచి 10 శాతం వరకే ఉంది. దిగుబడి ఎకరాకు టన్ను కూడా వచ్చే పరిస్థితి లేదు. గత ఏడాది టన్ను మామిడి ధర రూ.60వేల–రూ.80 వేల వరకు విక్రయించాం. ఈ ప్రకారం చూస్తే ఎకరాకు కనీసం రూ.3 లక్షల వరకు నష్టం వస్తోంది. – వెంకటేశ్వర్లు, సిద్ధ్దనగట్టు, వెల్దుర్తి మండలం మామిడిలో కనిపించని పిందె, కాయలుమామిడిని దెబ్బతీసిన వాతావరణ పరిస్థితులు ● ఈ సారి రెండు దఫాలుగా వచ్చిన పూత ● డిసెంబరులో పగబట్టిన పొగమంచు ● ఫిబ్రవరిలో ముంచిన అధిక ఉష్ణోగ్రతలు ● సాధారణంగా ఎకరాకు సగటున ఆరు టన్నుల దిగుబడి ● ఈసారి టన్ను దాటితే గగనంకర్నూలు జిల్లాలో మామిడి తోటలు ● ఓర్వకల్లు, కల్లూరు, వెల్దుర్తి, కృష్ణగిరి, తుగ్గలి, గూడూరు, దేవనకొండ, పత్తికొండ, సి.బెలగల్, హాలహర్వి తదితర మండలాలు. నంద్యాల జిల్లాలో మామిడి తోటలు ● ప్యాపిలి, డోన్, బేతంచెర్ల, బనగానపల్లి, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల, అవుకు తదితర మండలాలు.ఒక మోస్తరు దిగుబడులు వస్తాయి వాతావరణ పరిస్థితులు మామిడి ని కొంతవరకు దెబ్బతీశాయి. ఈ సారి డిసెంబర్ నుంచే పూత మొ దలైంది.ఫిబ్రవరి నెలలోనూ పూత వచ్చింది. అయితే డిసెంబర్లో వచ్చిన పూత అధిక చలి, పొగ మంచు బారిన పడింది. ఫిబ్రవరి పూత అధిక ఉష్ణోగ్రతలతో దెబ్బతినింది. ఎకరాకు రెండు నుంచి మూడు టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో బేనీ స ఎక్కువగా ఉంది. ఇవి ఒక ఏడాది బాగా పంటను ఇస్తే మరుసటి ఏడాది పంటను పూర్తిగా ఇవ్వలేవు. గత ఏడాది బాగా వచ్చింది.ఈ సారి కొంత తగ్గవచ్చు. – పి.రామాంజనేయులు, జిల్లా ఉద్యాన అధికారికర్నూలు(అగ్రికల్చర్): పళ్లలో మామిడి రారాజు. సామాన్యులు మొదలుకొని సంపన్నుల వరకు ఈ పండును ఇష్టపడని వారుండరు. వేసవి వచ్చిందంటే మామిడితో మార్కెట్లో కళకళలాడుతుంది. అతివృష్టి, అనావృష్టితో ఖరీఫ్ పంటలు దెబ్బతీసినా రైతులను మామిడి ఆదుకునేది. ఇలాంటి మామిడి కూడా ఈ ఏడాది గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఉమ్మడి జిల్లాలో 12,256 ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా.. గత ఏడాది ఎకరాకు సగటున 8 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. ఈ సారి మామిడి రైతులను తీవ్ర నిరాశకు గురి చేసింది. మామిడిపై పెట్టుకున్న ఆశలు గల్లంతు అయ్యాయి. వాతావరణ పరిస్థితులు తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ ఏడాది పూత ఆశాజనకంగా వచ్చినప్పటికీ వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పూత, పిందే రాలిపోయింది. దిగుబడులు 80 శాతంపైగా పడిపోతుండటంతో ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఏర్పడింది. రెండు దఫాలుగా వచ్చిన పూత మామూలుగా అయితే డిసెంబర్, జనవరి నెలల్లో పూత వస్తే ఎండల తీవ్రత పెరిగే సమయానికి కాయలు ఏర్పడుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగినా అంతగా నష్టం ఉండదు. ఈ సారి మామిడిలో పూత రెండు దఫాలుగా వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్లోనే పూత వచ్చింది. ఆ సమయంలో చలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో పాటు మంచుకూడా కురవడంతో తేనేమంచు పురుగులు, ఇతర తెగుళ్లు విజృంబించడంతో పూత మొత్తం రాలిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో ఫిబ్రవరిలో పూత వచ్చింది. అప్పుడు ఉష్ణోగ్రతలు పెరగడంతో పూత రాలిపోయింది. ఇదే సమయంలో నల్ల తామర కూడా మామిడి రైతును తీవ్రంగా దెబ్బ తీసింది. 2024–25లో వ్యవసాయం కలసి రాలేదు. అధిక వర్షాలు, అనావృష్టి పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. అంతంతమాత్రం వచ్చిన దిగుబడులకు గిట్టుబాటు ధరలు లభించని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మామిడి తోటలు అభివృద్ధి చేసుకున్న రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల మామిడిలో పూత, పిందె 80నుంచి 90 శాతం వరకు రాలిపోవడంతో రైతుల ఆశలు నీరుగారిపోయాయి. వాతావరణ బీమాపై అవగాహన కల్పించడంలో విఫలం ● ప్రకృతి వైపరీత్యాల వల్ల మామిడి పంట దెబ్బతింటే వాతావరణ బీమా కింద రైతులకు చేయూత లభిస్తుంది. ● కూటమి ప్రభుత్వం 2024–25 సంవత్సరానికి నంద్యాల జిల్లాలో మాత్రమే మామిడికి వాతావరణ బీమా అమలు చేసింది. ● కర్నూలు జిల్లాలో కూడా మామిడి తోటలు ఉన్నప్పటికీ ఇక్కడి రైతులను విస్మరించింది. ● నంద్యాల జిల్లా మామిడి రైతులు వాతావరణ బీమాను సద్వినయోగం చేసుకునే విధంగా అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ● నంద్యాల జిల్లాలో 8,330 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నప్పటికీ 150 మంది రైతులు మాత్రమే ప్రీమియం చెల్లించినట్లు తెలుస్తోంది. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ నాయకుల వేధింపులు
సాక్షి, నంద్యాల: జిల్లాలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాము చెప్పినట్లు వినకపోతే పోలీసుల సాయంతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎదురు మాట్లాడితే జైలుకు పంపిస్తాం.. నీ అంతు తేలుస్తామంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల వేధింపులతో పట్టణంలోని సలీంనగర్‌కు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఫయాజ్ ఎలుకల మందు తాగి మంగళవారం ఆత్మహత్యకు యత్నించారు. సలీంనగర్‌కు చెందిన ఫయాజ్‌కు అదే ప్రాంతానికి చెందిన జునైద్‌ల మధ్య రంజాన్ పండగ రోజు చిన్న వాగ్వాదం జరిగింది. దీంతో జునైద్ బంధువులు టీడీపీ నాయకులైన మైపూజ్, ఖాజాలు బాధితుడైన ఫ యాజ్ను తీవ్రంగా బెదిరించారు. అధికార పార్టీ తో పెట్టుకుంటున్నావ్.. నీ అంతు తేలుస్తాం.. నిన్ను జైలుకు పంపిస్తామంటూ హెచ్చరించారు. దీంతో భయపడిపోయిన ఫయాజ్ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అయినా టీడీపీ నాయకుల పగ చల్లారలేదు. రెండో పట్టణ సీఐ ఇస్మాయిల్ అండతో ఇద్దరు కానిస్టేబుళ్లను ఫయాజ్ ఇంటికి పంపి విచారణ పేరుతో బాధితుడి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించారు. దీంతో పరువుపోయిందంటూ, తనను మానసికంగా హింసిస్తున్నారనే ఆవేదనతో ఫయాజ్ మంగళవారం మధ్యాహ్నం ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఫయాజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తనను వేధింపులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నారు. ● భయంతో ఆత్మహత్యాయత్నం -
రమణీయం.. రాయబారాది మహోత్సవం
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో శ్రీ చౌడేశ్వరిదేవి రాయబారాది మహోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సా యంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథం(తేరుబండి)పై ముస్తాబు చేశారు. అనంతరం అష్టపుర గ్రామానికి చెందిన ప్రజలు ఎండ్ల బండ్ల ప్రదర్శనతో రాయబారాది కార్యక్రమానికి తరలి వెళ్లారు. గ్రామ సమీపంలోని గంగమ్మ గుడి వద్ద ఉన్న వేపచెట్టు వద్ద అమ్మవారికి రాయబారాది కార్యక్రమాన్ని నిర్వహించారు. మళ్లీ ఆలయం వద్దకు చేరుకోవడంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఉత్సవంలో పలుకూరుకు చెందిన అమ్మ వారి భక్తులు ఒక జత దున్నపోతు, తొమ్మిది జతల పొట్టేళ్లు, మేక పోతులతో ప్రదర్శించి తేరుబండి కార్యక్రమం ఆకట్టుకుంది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు, నందివర్గం ఎస్ఐ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
పిడకల సమరం.. ప్రేమదే విజయం
ఆస్పరి: ప్రేమికులను విడదీసే పెద్దలు చూసుంటాం.. విషాదాంతం అయిన ప్రేమ కథలను వింటూ ఉంటాం. ప్రేమను గెలిపించే పోరాటం అరుదుగా కనిపిస్తుంది. అలాంటి పోరాటమే ఒకటి ఆచారంగా ప్రతి ఏటా ఆస్పరి మండలంలోని కై రుప్పల గ్రామంలో కొనసాగుతోంది. వీరభద్రస్వామి, కాళికాదేవి బ్రహోత్సవాలు సందర్భంగా సోమవారం రెండు వర్గాల భక్తుల మధ్య ఉత్కంఠ భరితంగా పిడకల సమరం సాగింది. ఆచారం ప్రకారం కారుమంచి నుంచి పెద్దరెడ్డి వంశస్తుడైన నరసింహారెడ్డి గుర్రంపై మందీ మార్బలంతో ఊరేగింపుగా కై రుప్పల గ్రామానికి వచ్చారు. వీరభద్రస్వామి ఆలయంలోకి వెళ్లి పూజలు చేసి వెనుతిరిగారు. ఆతరువాత పిడకల సమరం మొదలైంది. రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామస్తులు పరస్పరం ఒకరిపై ఒకరు పిడకలతో దాడి చేసుకున్నారు. వందల సంఖ్యలో గాల్లోకి పిడకలు లేచి ప్రత్యర్థి వర్గంపై పడుతుంటే ఉత్సాహం రెట్టింపు అయ్యింది. పిడకల దుమ్ము అకాశాన్నంటింది. తమను తాము రక్షించుకుంటూ ఎదుటి వారిపై పిడకలు విసురుకుంటూ గుంపులు, గుంపులుగా కదిలారు. ఒక సారి ఒక వర్గం వారిది పైచేయి అయితే, మరో సారి మరో వర్గం వారిది పైచేయిగా నిలిచింది. దెబ్బలు తగిలిన వారు స్వామి వారి బండారు పూసుకున్నారు. ఈ సమరాన్ని జనం ఆసక్తిగా చూశారు. కేకలు, ఈలలతో హోరెత్తించారు. పిడకల సమరంలో రెండు వర్గాలకు చెందిన 30 మంది స్వల్పంగా గాయపడ్డారు. జనంతో కై రుప్పల కిట కిటలాడింది. సమరంలో గొరవయ్యల నృత్యం ఆకట్టుకుంది. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆలయ కార్యనిర్వహణాధికారి రాంప్రసాద్, సర్పంచ్ తిమ్మక్క గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, ఆస్పరి సీఐ మస్తాన్‌వలి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. పోరు ముగిసిన తర్వాత గ్రామ పెద్దలు.. ప్రేమికులైన వీరభద్రస్వామి, కాళికాదేవిలకు వివాహం చేసేందుకు నిశ్చయించారు. -
జిల్లాలో ఎంఎల్ఎస్ పాయింట్లు: 10 రేషన్‌షాపుల సంఖ్య: 1,204 రేషన్‌కార్డుల సంఖ్య: 15.77లక్షలు ఈకేవైసీ పెండింగ్ కార్డుల సంఖ్య: 1.71 లక్షలు ఎండీయూ వాహనాల సంఖ్య: 351
పేదల రేషన్ కార్డులను ఏరివేసేందుకు అంతా సిద్ధం అయ్యింది. తెరపైకి ఈకేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) వచ్చింది. ఏప్రిల్ నెలాఖరు వరకు గడువునూ రాష్ట్ర ప్రభుత్వం విధించింది. వ్యవసాయ కూలీలకు కష్టం వచ్చింది. బంగారు భవిష్యత్తు కోసం పాఠశాలకు వెళ్లే విద్యార్థులకూ అవస్థ ఎదురొచ్చింది. సరిగ్గా నడవలేని వృద్ధులు సైతం తడబడాల్సి వస్తోంది. వేలి ముద్రలు సరిగ్గా పడటం లేదు. ప్రభుత్వ చౌకదుకాణాల ద్వారా ఇక రేషన్ అందని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఇవీ కష్టాలు.. ● ఈకేవైసీ చేయించుకోకపోతే రేషన్, నిత్యావస సరుకులు అందుతాయో లేదోనని కార్డుదారులు సచివాలయాలు, డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు. సాంకేతిక సమస్య కారణంగా సర్వర్లు మొరాయిస్తుండటంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రేషన్ షాపులకు అనుసంధానంగా ఎండీయూ(మోబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్) ఏర్పాటు చేసింది. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సంబంధించి బియ్యం, కందిపప్పు, చక్కెరతోపాటు రా గులు, జొన్నలు, ఇతర నిత్యావసర సరుకులను ఇంటిముంగటకే అందజేసింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టి ఉంచుకుని మధ్యస్త సన్నరకం బియ్యాన్ని సార్టెక్స్ చేసి ప్లోరిఫైడ్ బి య్యంగా మార్చి సరఫరా చేసింది. కూటమి ప్ర భుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ సరుకు ల్లో కోత పెడుతూ పేదల కడుపుకొడుతోంది. ● జిల్లాలోని కోవెలకుంట్ల, బనగానపల్లె, ఆళ్లగడ్డ, డోన్, ఆత్మకూరు, శ్రీశైలం, రుద్రవరం, నందికొట్కూరు, నంద్యాల, ప్యాపిలి మండలాల్లో ఎంఎల్ఎస్ పాయింట్లు ఉన్నాయి. ఆయా ఎంఎల్ఎస్ పాయింట్ల పరిధిలో 1,204 రేషన్ షాపులు ఉండగా 351 ఎండీయూ వాహనాల ద్వారా ప్రతి నెలా ప్రజా పంపిణీ కొనసాగుతోంది. ఆయా స్టాక్ పాయింట్ల పరిధిలో 15.77 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎండీయూ వాహనాలను తగ్గించారు. ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల వర్తింపుకు రేషన్‌కార్డు ప్రామాణికం. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తకార్డులు ఇవ్వడం లేదు. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం లేకుండా పోయింది. ఈకేవైసీలో నెలకొన్న అడ్డంకులు తొలగించాలని, కొత్తరేషన్‌కార్డులు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ● ఈకేవైసీ కాక అవస్థల్లో పేదలు ● ఏప్రిల్ నెలాఖరు వరకు గడువు ● జిల్లాలో 15.77 లక్షల రేషన్‌కార్డులు ● 1.71 లక్షల కార్డుదారుల ఈకేవైసీ పెండింగ్ ● ఆందోళనలో లబ్ధిదారులు పేదల కడుపుకొట్టొద్దు రేషన్‌షాపుల ద్వారా బియ్యం, చక్కెర మాత్రమే ఇస్తున్నారు. కందిపప్పు, జొన్నలు, రాగులు, ఇతర నిత్యావసరాలు ఇవ్వడం లేదు. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వం ఇచ్చే రేషన్‌తో కడుపు నింపుకుంటున్నారు. ఈకేవైసీ పేరుతో రేషన్ కార్డులు తొలగించి పేదల కడుపుకొట్టొద్దు. – ఓబులేసు, కార్డుదారుడు, కోవెలకుంట్ల కూలీలకు మినహాయింపు ఇవ్వాలి రేషన్‌కార్డులకు ఏప్రిల్ 30వ తేదీలోగా ఈకేవైసీ చేయించుకోవా లని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ పనులు లేక కొందరు ఉపాధి పనులకు వెళుతున్నారు. మరికొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసు కుని ఈకేవైసీలో ఉపాధి, వ్యవసాయ కూలీలకు మిన హాయింపు ఇవ్వాలి. – సుధాకర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు, కోవెలకుంట్ల కోవెలకుంట్ల/నంద్యాల (అర్బన్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి పదినెలలు పూర్తయినా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. గతంలో ఉన్న పలు పథకాలను నిలిపివేశారు. కొత్తవి ఇవ్వకపోగా ఉన్న వాటికి ఎసరు పెట్టారు. తాజాగా ఈకేవైసీ పేరుతో పేదలకు రేషన్ అదించకుండా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో 1.71 లక్షల మంది కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. గతంలో వేలిముద్రలు లేకున్నా ఫొటోల ఆధారంగా రేషన్‌కార్డుల్లో ఐదు సంవత్సరాల్లోపు పిల్లలను చేర్పించారు. వీరందరూ ఆధార్‌కార్డులు అప్డేట్ చేయించుకుని ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. తొలుత మార్చి నెలాఖరులోపే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వర్లు మొరాయిస్తుండటంతో నమోదు గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడగించినట్లు అధికారులు ప్రకటించారు. ఇదీ దుస్థితి.. ● ఐదు సంవత్సరాల నుంచి పదేళ్ల పిల్లలకు ఆధార్ అప్డేట్ చేయించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం, అరకొరగా ఉన్న సర్వర్లు పనిచేయక పిల్లలతో కేంద్రాలకు వెళ్లిన తల్లిదండ్రులకు తిప్పలు తప్పడం లేదు. కొందరు వేసవికాలం పనులు మానుకుని కోవెలకుంట్ల, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, తదితర పట్టణాలకు వెళ్లి ఆధార్అప్డేట్ చేసుకుంటున్నారు. ● గతంలో 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు వేలిముద్రలు పడకపోతే ఐరిస్ తీసుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోగా రేషన్ తీసుకోవాలంటే తప్పని సరిగా వేలిముద్రలు వేయాల్సి ఉంది. వృద్ధులు కావడంతో ఈకేవైసీ నమోదు చేసుకున్నా పలు కారణాలతో వేలిముద్రలు పడని పరిస్థితి నెలకొంది. ఎక్కువశాతం మంది వృద్ధులు ఇప్పటి వరకు ఆధార్, మోబైల్నంబర్ అప్డేట్ చేయించుకోలేదు. కొందరికి సరైన మోబైల్ఫోన్లు కూడా లేవు. ఈ పరిస్థితుల్లో అధికారులు ఈకేవైసీ హడావిడి చేస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. ● జిల్లాలో చాలా మంది పనులు లేక వలసలు వెళ్లారు. చదువు నిమిత్తం కొందరు విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. వీరందరికి ఆధార్ అప్డేట్ అయితేకాని ఈకేవైసీ పూర్తయ్యే పరిస్థితి లేదు. ఎవరెవరికి ఈకేవైసీ నమోదు కాలేదో వారి జాబితాను రేషన్ డీలర్లకు అప్పగించారు. కేవలం పేర్లుమాత్రమే ఇవ్వడంతో వివరాలు తెలుసుకోవడం రేషన్ డీలర్లకు కష్టతరంగా మారింది. ● అద్దె ఇళ్లలో ఉండేవారు ఈకేవైసీ చేయించుకునేందుకు ఏ రేషన్‌షాపుకు వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఒక సచివాలయ పరిధిలో మ్యాపింగ్ అయి వేరే ప్రాంతానికి వెళ్లినవారి రేషన్‌షాపు నంబర్ మారిపోతుంది. ఇలా జాబితాలో కొందరి పేర్లు కనుక్కోవడం కష్టమైంది. ఈకేవైసీ చేయించుకోవాలనే విషయంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేదు. దీంతో ఈ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. -
15 మండలాల్లో కరువు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024–25 రబీ సీజన్‌కు సంబంధించి 15 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రబీలో వర్షాభావ ప్రభావం దాదాపు అన్ని మండలాలపై తీవ్రంగా ఉంది. సాగు విస్తీర్ణం తగ్గిపోగా దిగుబడులు కూడా పడిపోయాయి. అయితే కర్నూలు జిల్లాలో పది మండలాలు, నంద్యాల జిల్లాలో ఐదు మండలాల్లోనే కరువు ప్రభావం ఉందని ఆయా జిల్లా అధికారులు ఇటీవల ప్రభుత్వానికి నివేదిక పంపారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఆయా మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తిస్తూ విపత్తుల నిర్వహణ శాఖ జీవో ఎంఎస్ 3 జారీ చేసింది. డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి, డోన్ మండలాలు పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ మండలాలు కరువు ప్రాంతాల జాబితాలో చేర్చకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.కర్నూలు జిల్లాలో కరువు మండలాలు:ఆస్పరి, కల్లూరు, కర్నూలు రూరల్, కర్నూలు అర్బన్, మద్దికెర, ఓర్వకల్, గూడూరు, కోడుమూరు, వెల్దుర్తి, పత్తికొండ.నంద్యాల జిల్లాలో కరువు మండలాలు:కొలిమిగుండ్ల, సంజామల, బనగానపల్లి, ఉయ్యలవాడ, బేతంచెర్ల.నంద్యాల నుంచి ‘ఒంటిమిట్ట’కు తలంబ్రాలునంద్యాల(వ్యవసాయం): శ్రీరామనవమిని పురస్కరించుకొని ఒంటిమిట్ట రామాలయానికి గోటితో ఒలిచిన తలంబ్రాలను నంద్యాల నుంచి సోమవారం పంపించారు. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో తలంబ్రాలకు మనూరు, మనగుడి, మనబాధ్యత సభ్యులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గుంటూరు ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈర్నపాడు గ్రామంలో ఎటువంటి రసాయన పదార్థాలు వాడకుండా వడ్లను పండించామన్నారు. గత మూడు నెలల నుంచి గోటితో వడ్లను భక్తిశ్రద్ధలతో మనూరు, మనగుడి, మనబాధ్యత సభ్యులు ఒలిచి తలంబ్రాలను తయారు చేశారన్నారు. ఒంటిమిట్టలో జరిగే స్వామి వారి కల్యాణానికి ఆలయ ఈఓకు అందజేస్తామన్నారు. గురురాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ దస్తగిరి, భగవత్ సేవా సమాజ్ సభ్యులు సూరయ్య, శ్రీనివాసులు, భవనాశి వాసు, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.పండుగ రోజూ రిజిస్ట్రేషన్లుకర్నూలు(సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రంజాన్ పండుగ ఉన్నా ఆదివారం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 24 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేశాయి. మొత్తం 100 వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. కాగా.. కర్నూలు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో టైం స్లాట్ బుకింగ్‌ను పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు. గతం నుంచే ఈ విధానం అమల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మొట్ట మొదటిసారి ప్రవేశపెట్టారని ప్రచారం చేసుకోవడం గమనార్హం. -
ఆకుమల్ల ఎద్దుల జయకేతనం
కృష్ణగిరి: ఎర్రితాత స్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా అమకతాడు గ్రామంలో సోమవారం ఎద్దుల పోటీలు నిర్వహించారు. బండలాగుడు పోటీల్లో 12 జతల ఎద్దులు పాల్గొన్నాయి. సంజామల మండలం ఆకుమల్ల గ్రామానికి చెందిన కాకర్ల నాగజ్యోతి ఎద్దులు ప్రఽథమస్థానంలో నిలిచాయి. మిగిలిన స్థానాలను ప్యాపిలి మండలం వెంగళాంపల్లి దర్శిత్, అనంతపురం జిల్లా తుర్కపల్లి అంకాల యాదవ్ ఎద్దులు దక్కించుకున్నాయి. గెలుపొందిన వారికి దాతల సహకారంతో వరుసగా రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు, రూ.7వేలు, రూ.5 వేలు, రూ.4వేలు, రూ.3,500లు అందజేశారు. -
జీవితాల్లో చీకట్లు నింపారు
నంద్యాల(అర్బన్): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ జీవితాల్లో చీకట్లు నింపారని వలంటీర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ విమర్శించారు. అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగిస్తామని, ప్రతి ఒక్కరికీ రూ.10వేలు వేతనం ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఉగాది పండుగ నేపథ్యంలో వలంటీర్లు ఆదివారం బొమ్మలసత్రం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వలంటీర్లను రోడ్డున పడేసిందన్నారు. ఎంతో మంది వలంటీర్లు ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాజగోపాల్, కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, రఫీ, నాగన్న, సుధాకర్, అజ్మతుల్లా, హైమావతి, కల్యాణి, మాధవి, తదితరులు పాల్గొన్నారు.నేడు పీజీఆర్ఎస్ రద్దునంద్యాల: కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టమ్, పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31వ తేదీ సోమవారం రంజాన్ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో పీజీఆర్ఎస్ను రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా కేంద్రానికి రావద్దని విజ్ఞప్తి చేశారు.అల్లా ఆశీస్సులు అందాలినంద్యాల: జిల్లా ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు అందాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదివారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. పవిత్రత, క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల మేళవింపే రంజాన్ పండుగ ముఖ్య ఉద్దేశమన్నారు. పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ అన్నారు.విధుల్లో అప్రమత్తంగా ఉండాలిశ్రీశైలం: క్షేత్ర పరిధిలో విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండా లని జిల్లా ఎస్పీ అదిరాజ్‌సింగ్ రాణా అన్నారు. ఆదివారం శ్రీశైలం చేరుకున్న ఆయన భక్తులు వేచి ఉండే కంపార్ట్మెంట్లు, క్యూలను, లడ్డూ విక్రయ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. పోలీసు సిబ్బంది సమన్వయంతో ఉగాది ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను ఆయన దర్శించుకుని నంద్యాల జిల్లాల్లోని ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలన్నారు. ఆయన వెంట ఆత్మకూరు డీఎస్పీ రామంజి నాయక్, శ్రీశైలం వన్ టౌన్ సీఐ ప్రసాద్ రావు పాల్గొన్నారు. -
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దాం
నంద్యాల: జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుదామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ తదితర ఉన్నతాధికారులు ఉగాది ఉత్సవాలను పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజాది కార్యక్రమాలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం పంచాంగ కర్తలు ప్రవీణ్ కుమార్ శర్మ, శివకుమార్ శర్మ ఉగాది పంచాంగ పఠనాన్ని వారు శ్రద్ధగా ఆలకించారు. షడ్రుచుల ఉగాది పచ్చడిని ఆస్వాదించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులు, సిబ్బంది అంత కలసి ఒక కుటుంబంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం చూస్తే చాలా ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో సహజ వనరులకు కొదవలేదన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ విశ్వావసు నామ సంవత్సరం విశ్వాన్నే వశం చేసుకున్న శ్రీమన్నారాయణుడే అన్నారు. అంటే ధనం... యువత అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు జిల్లా సుసంపన్నంగా ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నారు. అనంతరం కవి సమ్మేళనం నిర్వహించిన గెలివి సహదేవుడు, గ్రందే నరేంద్ర, గంగుల నాగరాజు, ధోనిపూడి నరేష్, నీలం వెంకటేశ్వర్లు, కొప్పుల ప్రసాద్, నీలకంఠమాచారి, మహబూబ్ బాషా, అన్నం శ్రీనివాసరెడ్డి, శేషఫణి, కిశోర్ కుమార్, రత్నలక్ష్మి, మద్దిలేటి, తొగట సురేష్ బాబులను కలెక్టర్, మంత్రులు అభినందిస్తూ శాలువలు, వివిధ రకాల ఫలాలతో ఘనంగా సత్కరించారు. అలాగే విశిష్ట సేవలందించిన వ్యవసాయ రంగంలో పగిడాల వెంకటేశ్వర్లు, విద్యారంగంలో వైష్ణవ వెంకటరమణ, పరిశ్రమల రంగంలో గెలివి రామకృష్ణ, క్రీడారంగంలో ఎం.మల్లికార్జున, సామా జిక సేవా రంగంలో ఎస్.నాగశేషులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్ర మాలు ప్రదర్శించిన విద్యార్థులను పలువురిని అలరించాయి. బాలభవన్ విద్యార్థులను మంత్రి బీసీ నగదు బహుమతితో అభినందించారు. వేడుకల్లో డీఆర్ఓ రాము నాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రులు బీసీ, ఫరూక్ వైభవంగా ఉగాది వేడుకలు పలువురికి ఉగాది పురస్కారాలు అందజేత -
చివరికి మిగిలింది కన్నీరే!
ఎండిపోయిన ఆశలు ఈ రైతు పేరు దశరథరామిరెడ్డి. అమ్మిరెడ్డి నగరానికి చెందిన ఈయన గోవిందిన్నె పొలిమేరలోని కేసీ కెనాల్ ఆయకట్టు కింద 10 ఎకరాల్లో వరి సాగు చేశాడు. సుమారు రూ. 4 లక్షల వరకు ఖర్చు అయింది. వరి పొట్టకొచ్చే వరకు అడపాదడపా వచ్చే నీరు 20 రోజులుగా పూర్తిగా నిలిచి పోయింది. మరో 20 రోజుల్లో చేతికొచ్చే పైరు పూర్తిగా ఎండిపోయిందని, ఇప్పుడు నీరు వచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదని పెట్టుబడిలో ఒక్క పైసా కూడారాదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నష్టమే వచ్చింది ఈ చిత్రంలో నీరు లేక బీటలు వారిన వరి దుబ్బులను చూపుతున్న రైతు పేరు నన్నెసాహెబ్. దొర్నిపాడు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన ఈయన కోవెలకుంట్ల మండలం కంపమల్ల గ్రామంలోని హరివరం చానెల్ కింద ఎకరాకు రూ. 20 వేల చొప్పున రెండు ఎకరాలకు మును గుత్త (కౌలు) చెల్లించి కౌలుకు తీసుకున్నాడు. ఇప్పటికి కౌలుతో కలుపుకుని సుమారు రూ. లక్షవరకు ఖర్చు చేశాడు. ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న వరి పూర్తిగా ఎండిపోయింది. రూ. లక్ష అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టానని, పైరు పూర్తిగా ఎండి పోయిందని, నష్టమే వచ్చిందని బోరున విలపిస్తున్నాడు.● కేసీ ఆయకట్టుకు 20 రోజులుగా అరకొర నీరు ● ఈ నెల 31 వరకే నీటి సరఫరా అంటున్న అధికారులు ● ఎండిపోతున్న పొలాలు.. రైతులకు మిగిలింది కన్నీరే! ● చేష్టలుడిగి చూస్తున్న పాలకులు ఆళ్లగడ్డ: ‘‘ రైతుల సంక్షేమమే ధ్యేయం.. బంగారు పంటలు పండేలా చేసి కరువు సీమను సస్యశామలం చేస్తాం’’ అని టీడీపీ నేతలు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. కేసీ కెనాల్‌కు 10 నెలలు అయినా సక్రమంగా నీరు రావడం లేదు. అరకొర వస్తున్న నీరు చివరి ఆయకట్టు చేరక పోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ప్రజాప్రతినిధుల మాటలు నమ్మి వరి సాగుచేసిన రైతులకు నష్టమే మిగులుతోంది. కేసీ కెనాల్‌కు ఎన్ని రోజులు నీరు విడుదల చేస్తారో నేటికీ స్పష్టత ఇవ్వడం లేదు. రూ. లక్షకు పైగా అప్పు చేసి సాగు చేసిన పైర్లను కొన్ని చోట్ల పశువుల మేతగా వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది. పంట ఎండిపోతుండటంతో రైతులు విలవిల్లాడుతున్నారు. కళ్లముందే ఎండిపోతున్న పంటను చూడలేక అనేక మంది కిలోమీటర్ల మేర పైపులు వేసుకుని రోజు రూ. వేలు వెచ్చించి పంటను తడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటు‘కేసీ’ చూడండి! సుంకేసుల జలాశయం నుంచి ప్రారంభమయ్యే కేసీ కెనాల్ వైఎస్సార్ జిల్లా కృష్ణాపురం వరకు 304 కి.మీ పొడువునా ప్రవహిస్తుంది. తుంగభద్ర, కృష్ణా నీటిని కలిపి 31.9 టీఎంసీలు ఈ కాల్వకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ నీటితో 2,65,628 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలి. అయితే సుమారు 20 రోజులుగా నీరు సక్రమంగా అందడంలేదు. నీరు ఎప్పుడు వస్తుందో ఎన్నిరోజులు పారుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. బీటలు బారిన పొలాలు జిల్లాలో నంద్యాల నుంచి ఆళ్లగడ్డ చివరి (వైఎస్సార్ జిల్లా సరిహద్దు) ఆయకట్టు 27వ లాక్ నీరు చేరాలంటే 16వ లాక్ వద్ద కనీసం 5.6 అడుగుల మేర నీటి ప్రవాహం ఉండాలి. కానీ సుమారు 20 రోజుల నుంచి ఎగువ నుంచి నీటి ప్రవాహం నిర్దేశించిన స్థాయిలో రావడంలేదు. ఫలితంగా 23వ లాక్ నుంచి 27వ లాక్ వరకు ప్రవాహం పూర్తిగా నిలిచింది. దీంతో చేతికందే దశలో ఉన్న వరి, మొక్కజొన్న, మిరప, మినుము, కొర్ర తదితర పంటలు దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. చివరి ఆయకట్టులో ఇప్పటికే ఎండిపోయి బీటలు బారిన పొలాలు ఇప్పుడు నీరందిన ఏమాత్రం ఫలితం ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాటలు కోటలు.. నీళ్లల్లో కోతలు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు సమృద్ధిగా సాగునీరు అందిస్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ పదేపదే చెప్పారు. అయితే మాటలు నీటిమూటలయ్యాయి. ఫిబ్రవరి చివరి వారం నుంచే కేసీలో నీళ్లు అరకొర రావడం మొదలయ్యాయి. మార్చిలో పూర్తిగా చివరి ఆయకట్టుకు నీరందలేదు. అయితే ఎమ్మెల్యే మాటలు నీటిమూటలు అయ్యాయని రైతులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే.. ఈ నెపం అధికారులపై నెట్టేందుకు పూనుకున్నారు. ఎమ్మెల్యే సోదరుడు విఖ్యాత్‌రెడ్డి కేసీ కెనాల్ పై ధర్నా చేస్తానని హుకుం జారీచేశారు. అలాగే కాల్వపై వెళ్లి అధికారులను ప్రశ్నించారు. తాజాగా ఎమ్మెల్యే పొన్నాపురం శివారులో కాల్వను పరిశీలించి ఇక్కడ 5 అడుగుల నీటిని స్టోరేజ్ చేసి దిగువకు విడుదల చేయాలని అధికారులతో వాదించారు. నీటి విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ప్రభుత్వంతో మాట్లాడి నీటిని విడుదల చేయించాలి కానీ.. అధికారులమీద మండిపడితే ఏం వస్తుందని చర్చించుకుంటున్నారు. అదృష్టం బాగుంటే నీరు వస్తుంది నీళ్లు తక్కువగా ఉన్నాయి. ముందుగా కిందకు పారించి అక్కడి నుంచి ఆపుకుంటూ పైనున్న పొలాలకు అందించేలా ప్రణాళిక వేసుకున్నాం. ఈ మేరకు ఈ నెల 31వ తేదీ వరకు ఉన్న నీటిని అందరికీ పంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దీంతో పైనున్న కొందరు రైతులు ఆందోళన చేస్తున్నారు. వారికి నచ్చచెప్పాం. ఈ నెల 31 తరువాత కూడా నీళ్లు అందించేందుకు ప్రయత్నం చేస్తాం. అయితే కచ్చితంగా చెప్పలేం. అదృష్టం బాగుంటే నీరు వస్తుంది. – రవీంద్ర, డీఈఈ, కెసీ కెనాల్ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కేసీ కెనాల్ కింద ఆయకట్టు మండలం ఎకరాలు శిరివెళ్ల 16,304 ఆళ్లగడ్డ 23,580 దొర్నిపాడు 13,500 ఉయ్యాలవాడ 12,168 చాగలమర్రి 8,276 రుద్రవరం 284 -
బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
కర్నూలు(సెంట్రల్): కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం(బార్ అసోసియేషన్) నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా పి.హరినాథ్‌చౌదరి, వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 856 మంది ఓటర్లు ఉండగా 767 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష స్థానం కోసం పోటీ పడిన పి.హరినాథ్‌చౌదరి తన సమీప ప్రత్యర్థి బి.మురళీమోహన్‌పై 92 ఓట్లతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శి స్థానానికి జరిగిన పోటీలోఎం. వెంకటేశ్వర్లు తన ప్రత్యర్థి ఎం.ఆంజనేయులుపై 76 ఓట్లతో విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీ స్థానానికి పోటీ చేసిన ఎం. బాలసుబ్రమణ్యం తన ప్రత్యర్థి బీకే నాగారుజుపై 411 ఓట్లతో గెలిచారు. లైబ్రరీ సెక్రటరీ స్థానానికి పోటీలో ఉన్న పి.చంద్రశేఖర్ తన ప్రత్యర్థి సంపత్‌పై భారీ ఓట్లతో విజయం సాధించారు. ఉపాధ్యక్ష, కోశాధికారి, క్రీడా కార్యదర్శి మహిళాప్రతినిధి స్థానాలకు త్రివిక్రమ్, గౌతంమానె, బెస్త సుధాకర్, కె. అరుణలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గెలుపొందిన వారికి ఎన్నికల అధికారులు జి.విజయకుమార్, కె.రంగనాథ్,సి. ప్రభాకరరెడ్డి డిక్లరేషన్ పత్రాలను అందజేశారు. అధ్యక్ష, కార్యదర్శులుగా హరినాథ్, వెంకటేశ్వర్లు -
చెక్కుచెదరని ప్రజాభిమానం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి కర్నూలు (టౌన్): ఎన్ని కుయుక్తులకు పాల్పడినా వైఎస్సార్సీపీపై ప్రజాభిమానం చెక్కుచెదరలేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నా రు. జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడిగా ఏక గ్రీవంగా ఎన్నికై న మదర్థాన్ ఇలియాస్ ఖాన్, జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి కలిసి గురువారం సాయంత్రం కర్నూలు గిప్సన్ కాలనీలో ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డిని కలిశారు. శాలువా కప్పి సన్మానించారు. గెలుపొందిన జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యున్ని ఎస్వీ సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. ‘కూటమి’ నేతలు ఎన్ని కు ట్రలు చేయాలని చూసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారన్నారు. విజయంలో కీలకంగా వ్యవహరించిన పత్తికొండ మాజీ ఎ మ్మెల్యే కంగాటి శ్రీదేవి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. -
భృంగివాహనంపై మల్లన్న
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం ఉగాది మహోత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ నెల 31 వరకు ఐదు రోజుల పాటు ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని కన్నడ భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. శ్రీశైల భ్రామరి మహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి భృంగివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ నిర్వహణలో భాగంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, స్థానాచార్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయప్రాంగాణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు. లోకక్షేమాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు. ఈ సందర్భంగా చండీశ్వరునికి ప్రత్యేకంగా పూజాదికాలు నిర్వహించారు, అనంతరం కంకణాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అధికారులు, అర్చకస్వాములు ధరించారు. రుత్వికులకు దీక్షావస్త్రాలను అందజేశారు. అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చన పూజలను జరిపించారు. అనంతరం ఉగాది మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. మహాలక్ష్మీ అలంకారంలో భ్రామరి ఉగాది మహోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీశైల భ్రమరాంబాదేవి మహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్బుజాలు కలిగిన దేవి పై రెండు చేతులలో పద్మాలను, కింది చేతులలో కుడివైపున అభయహస్తం, ఎడమవైపున వరముద్రతో దర్శనం ఇచ్చారు. మహాలక్ష్మీ స్వరూపాన్ని దర్శించడం వల్ల శత్రుబాధలు నివారించబడి, సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కనుల పండువగా భృంగివాహన సేవ ఉగాది మహోత్సవాల్లో భాగంగా శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామికి భృంగివాహనసేవ నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనంపై ఆశీనులను చేసి అలంకార మండపంలో పూజాదికాలు నిర్వహించారు. భృంగీవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను దర్శిస్తే పాపాలు హరించబడుతాయని భక్తుల విశ్వాసం. అనంతరం ప్రత్యేక అలంకీకృతులైన అమ్మవారికి, వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు గ్రామ పురవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీశైలంలో నేడు ఉత్సవాల్లో రెండో రోజు శుక్రవారం భ్రమరాంబాదేవికి మహాదుర్గ అలంకారం, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివార్లకు కైలాసవాహనసేవ, అనంతరం గ్రామోత్సవం నిర్వహిస్తారు.శాస్త్రోక్తంగా ప్రారంభమైన ఉగాది మహోత్సవాలు ఐదు రోజుల పాటు నిర్వహణ మహాలక్ష్మీ అలంకారంలో శ్రీశైల భ్రామరి శ్రీగిరి క్షేత్రానికి పోటెత్తిన కన్నడ భక్తులు -
‘అవుకు’లో తగ్గిన నీటిమట్టం
అవుకు: రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. సామర్థ్యం 4.168 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.67 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎస్సార్బీసీ నుంచి అవుకు రిజార్వయర్కు 450 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. సాగునీటి కోసం ఎస్సార్బీసీ 13వ బ్లాక్ కాలువకు 380 క్యూసెక్కుల వదులుతున్నారు. పాలేరు, తిమ్మరాజు చెరువుల నుంచి 60 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో ఉంది. పంటల సాగుకు సరిపడా నీరు అందుతోందని ఎస్ఆర్బీసీ ఈఈ సురేష్ బాబు తెలిపారు. హుండీ ఆదాయం రూ. 39.23 లక్షలు మహానంది: హుండీల్లో కానుకలు లెక్కించగా మహానందీశ్వరస్వామికి రూ. 39.23లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక అభిషేక మండపంలో గురువారం శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లతో పాటు అన్నప్రసాదం, గోసంరక్షణ విభాగాల్లోని హుండీ కానుకలను లెక్కించారు. ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి, ఏఈఓ ఎరమల మధు, సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, దేవిక, ఇన్స్పెక్టర్లు నాగమల్లయ్య, సుబ్బారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఉచిత డీఎస్సీ శిక్షణకు రెండో జాబితా నంద్యాల(అర్బన్): మెగా డీఎస్సీ ఫ్రీ కోచింగ్‌కు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి రెండో జాబితా విడుదలైందని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారిణి చింతామణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల వివరాలు వెబ్‌పోర్టల్ https:// mdfc. apcfss. in లోతెలుసుకోవచ్చన్నారు. ఉచిత డీఎస్సీ కోసం శిక్షణ సంస్థలను అభ్యర్థులు తమ లాగిన్‌లో ఎంపిక చేసుకోవాలని పేర్కొన్నారు. మొదటి జాబితాలో ఎంపికై న అభ్యర్థుల శిక్షణ సంస్థలను మార్పు చేసుకునేందుకు అనుమతి లేదని తెలిపారు. ‘ప్రభుత్వ ఇఫ్తార్ విందును బహిష్కరిద్దాం’నంద్యాల(వ్యవసాయం): రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందును ముస్లింలు బహిష్కరించాలని నంద్యాల ముస్లిం జేఏసీ నాయకులు కన్వీనర్ అబ్దుల్లా మౌలానా, అబ్దుల్ సమాద్ అన్నారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గురువారం వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లుపై టీడీపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదని, నిరసనగా ఇఫ్తార్ విందును బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అబులైజ్, బాబాఫకృద్దీన్, ఇజస్ హుస్సేన్, మస్తానుఖాన్బాషా, మునీర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. 29న ఇఫ్తార్ విందు నంద్యాల(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నంద్యాల టౌన్హాల్లో ఈనెల 29న సాయంత్రం 6గంటలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి సబిహాపర్వీన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. జిల్లా పరిషత్, మండల పరిషత్ పరిధిలో ఖాళీగా ఉన్న అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. జెడ్పీ, కృష్ణగిరి కోఆప్షన్ సభ్యులుగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. నిత్యం ప్రజ
● ఎదురులేని ఫ్యాన్● నాలుగు స్థానాల్లోను వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం ● జెడ్పీ కోఆప్షన్ సభ్యునిగా ఎం. ఇలియాజ్‌ఖాన్ ● జెడ్పీ చైర్మన్‌తో పాటు 37 మంది జెడ్పీటీసీ సభ్యులు హాజరు ● వెల్దుర్తి, తుగ్గలి ఎంపీపీలుగా దేశాయి లక్ష్మిదేవమ్మ, రాచపాటి రామాంజినమ్మ ● కృష్ణగిరి కోఆప్షన్ సభ్యునిగా షేక్ చిన్న షాలు తుగ్గలిలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న నూతన ఎంపీపీ, వైఎస్సార్సీపీ నాయకులుకర్నూలు(అర్బన్): జిల్లాలోని స్థానిక సంస్థల్లో ఏర్పడిన నాలుగు ఖాళీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లా పరిషత్, కృష్ణగిరి కోఆప్షన్ సభ్యులతో పాటు తుగ్గలి, వెల్దుర్తి ఎంపీపీ స్థానాలకు, జిల్లాలోని ఐదు గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ స్థానాలకు ఎన్నికలను నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటలను చోటు చేసుకోకుండా, ఆయా ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తును నిర్వహించారు. జెడ్పీ, కృష్ణగిరి కోఆప్షన్ సభ్యులతో పాటు తుగ్గలి, వెల్దుర్తి మండల పరిషత్తుల్లో వైఎస్సార్సీపీకి విశేషమైన బలం ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించారు. జెడ్పీ కోఆప్షన్ సభ్యునిగా మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యునిగా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడుకు చెందిన మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన అభ్యర్థిత్వాన్ని వెలుగోడు జెడ్పీటీసీ అమీరున్‌బీ ప్రతిపాదించగా, మహానంది జెడ్పీటీసీ కేవీఆఆర్ మహేశ్వరరెడ్డి బలపరిచారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 10 గంటల్లోపు నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డితో కలిపి 37 మంది జెడ్పీటీసీ సభ్యులు హాజరై ఇలాయాజ్ఖాన్కు మద్దతు ప్రకటించారు. ఇలియాజ్‌ఖాన్ నామినేషన్‌ను స్క్రూటినీ చేసిన అనంతరం వాలీడ్ నామినేషన్‌గా డిక్లేర్ చేసి జిల్లా కలెక్టర్ పీ రంజిత్‌బాషా ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. జెడ్పీ కోఆప్షన్ సభ్యునిగా ఇలాయాజ్ఖాన్ను ప్రకటించి డిక్లరేషన్ ఫారం అందించి ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఏకగ్రీవంగా తుగ్గలి, వెల్దుర్తి ఎంపీపీలు తుగ్గలి మండల పరిషత్ అధ్యక్షురాలిగా మండలంలోని శభాష్‌పురం ఎంపీటీసీ సభ్యురాలుగా రాచపాటి రామాంజినమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో మొత్తం 17 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా, ఒకరు గైర్హాజరు కాగా మిగిలిన వారంతా రామాంజనమ్మ అభ్యర్థిత్వానికి మద్దతుగా చేతులెత్తి తమ అంగీకారాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, హెచ్ఎన్ఎస్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అజయ్‌కుమార్ ఆమెను ఎంపీపీగా డిక్లేర్ చేసి ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. అలాగే వెల్దుర్తి మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీటీసీలు ఎంపీపీ ఎన్నికకు గైర్హాజరయ్యారు. మిగిలిన 14 మంది వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎల్ నగరం ఎంపీటీసీ దేశాయి లక్ష్మిదేవమ్మను ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కే తులసీదేవి ఎంపీపీగా ఎన్నికై న లక్ష్మిదేవమ్మకు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. కృష్ణగిరి కోఆప్షన్ సభ్యునిగా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు చిన్నషాలును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి, సెట్కూరు సీఈఓ డా.కే వేణుగోపాల్ ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. ఐదు పంచాయతీల్లో ఉప సర్పంచుల ఎన్నిక... జిల్లాలోని ఐదు గ్రామ పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో సభ్యులు.. ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా లక్ష్మమ్మ, ఆలూరు మండలం మొలగవెళ్లి ఉప సర్పంచ్‌గా గరక షాకీరా, కర్నూలు మండలం సుంకేసుల ఉప సర్పంచ్‌గా వడ్డే నీలమ్మ, వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి ఉప సర్పంచ్‌గా ఎం రామాంజనేయులు, దేవనకొండ మండలం వెలమకూరు ఉప సర్పంచ్‌గా ఉప్పర సరస్వతిని ఎన్నుకున్నారు. -
మేలైన యాజమాన్య పద్ధతులతో నాణ్యమైన దిగుబడి
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి సాగులో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉందని.. రైతులు అధిక దిగుబడి, నాణ్యతను పెంపొందించుకోవడంతో పాటు నిల్వ పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్, ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి తెలిపారు. మంగళవారం ఉద్యానశాఖ ఉల్లి సాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు కర్నూలులోని ఉద్యానభవన్‌లో శిక్షణ, చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లా ఉద్యాన అధికారి పి.రామంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీఎంఐపీ పీడీ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఏటా 5.40 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతోందన్నారు. అవగాహనతో సాగు చేపడితే నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని, నాణ్యత బాగుంటే గిట్టుబాటు ధరలు లభిస్తాయన్నారు. ● జిల్లా ఉద్యాన అధికారి పి.రామాంజనేయులు మాట్లాడుతూ ఉల్లి సాగులో ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ● మార్కెటింగ్ శాఖ ఏడీ నారాయణమూర్తి మాట్లాడుతూ పండించిన పంటను బాటీ ఆరబెట్టి గ్రేడింగ్ చేసుకొని మార్కెట్‌కు తీసుకొస్తే గిటుబాటు ధర లభించే అవకాశం ఉంటుందన్నారు. ● ఏపీఎంఐపీ అదనపు పీడీ రాజాకృష్ణారెడ్డి మాట్లాడుతూ సూక్ష్మ సేద్యం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో ఉల్లి సాగు చేసుకోవచ్చని, ఎరువుల వినియోగం కూడా తక్కువగా ఉంటుందని తెలిపారు. ● మహానంది వైఎస్ఆర్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త ఠాగూర్‌నాయక్ మాట్లాడుతూ ఉల్లి సాగులో మేలైన యాజమాన్య పద్దతులను వివరించారు. -
పల్లె పుష్కరిణిలుగా చెరువుల అభివృద్ధి
కర్నూలు(అగ్రికల్చర్): ఉపాధి నిధులతో గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులను ‘పల్లె పుష్కరిణిలు’గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జిల్లాలో 31 పల్లె పుష్కరిణిలను గుర్తించారు. ఒక ఎకరా నుంచి ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులను.. కనీసం వెయ్యి జనాభా కలిగిన గ్రామాల్లో మాత్రమే ఈ పనులు చేపట్టాల్సి ఉంది. ప్రతి మండలంలో ఒకటి లేదా రెండు చెరువులను మొదటి విడతలో పైలెట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయనున్నారు. గ్రామ పంచాయతీలు, దేవాలయ కమిటీలు, గ్రామ ప్రజల సమ్మతితో మాత్రమే కోనేర్లను అభివృద్ధి చేయాలని గ్రామీణాభివృద్ది శాఖ ఆదేశించింది. జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారుల సత్తా కర్నూలు (టౌన్): జిల్లాకు చెందిన 51 మంది క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటారని జిల్లా వృత్తి విద్యా శాఖాధికారి పరమేశ్వర రెడ్డి తెలిపారు. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి పోటీల్లో రాణించిన జిల్లా క్రీడాకారులకు మంగళవారం ఆర్ఐఓ గురువయ్యశెట్టితో కలిసి ఆయన పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేసి, సత్కరించారు. కార్యక్రమంలో కేవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ సుంకన్న, లాలప్ప, అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హర్షవర్దన్ పాల్గొన్నారు. తేనెటీగల పెంపకంతో ఆర్థికాభివృద్ధి కొత్తపల్లి: తేనెటీగల పెంపకంతో ఆర్థికాభివృద్ధి చెందాలని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎం.జాన్సన్, ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేజీ నాయక్ గిరిజనులకు సూచించారు. మంగళవారం మండలంలోని పాలెంచెరువు గూడెంలో గిరిజనులకు తేనెటీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, నేషనల్ హానీ బీ బోర్డ్ సంయుక్తంగా పాలెంచెరువు గ్రామానికి చెందిన 25 మంది గిరిజన రైతులకు శాసీ్త్రయ పద్ధతిలో తేనెటీగలను పెంచి, తేనెను తయారు చేసుకునే విధానంపై ఏడు రోజుల శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ, సర్పంచు మశమ్మ, జెడ్పీటీసీ సోమల సుధాకర్ రెడ్డి, శాస్త్రవేత్తలు కె.అశోక్ కుమార్, కె.మోహన్, విష్ణువర్ధన్, ఎం.శివరామకృష్ణ పాల్గొన్నారు. -
‘బోసి నవ్వుల’ బంధం!
చిరునవ్వు చిందిస్తూ..ఆ మహాత్ముని బోసినవ్వు ఆ చిన్నారిని ఆకట్టుకుంది. విగ్రహంలోని అమాయకత్వంతో ఆ పసిహృదయం మాట కలిపింది. మచ్చలేని మహనీయుడికి అంటుకున్న మరకలను ఆ ‘తెల్లని’ మనసు తుడిచేసింది. ఆ చిక్కని చిరునవ్వుని తన చిట్టి చేతులతో తడమటం తాతా మనవడి బంధాన్ని గుర్తుచేసింది. ( మంగళవారం ఉదయం కర్నూలు పెద్దాసుపత్రిలోని చిన్నపిల్లల విభాగంలో మహాత్మాగాంధీ విగ్రహంతో ఓ బాలుడి ఆత్మీయత అక్కడున్న వారందరిలో నవ్వులు పూయించింది. ) – ఫొటోలు: డి.హుస్సేన్, సాక్షి ఫొటోగ్రాఫర్ -
నీటి ఎద్దడి తలెత్తకుండా ఎస్ఎస్ ట్యాంకులను నింపండి
కర్నూలు (అర్బన్): జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులకు ఏప్రిల్ 14వ తేదీ వరకు నీటి సరఫరా జరుగుతున్నందున ప్రస్తుత వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఎస్ఎస్ ట్యాంకులన్నిటినీ నింపుకోవాలని జిల్లాపరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కోరారు. మంగళవారం సాయంత్రం స్థానిక జెడ్పీ మినీ సమావేశ భవనంలో తాగునీటి ఎద్దడి, జెడ్పీ నిధులతో చేపట్టిన వివిధ పనుల పురోగతిపై ఆయన పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తాగునీటి సరఫరా పథకాలకు ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్‌ను సరఫరా చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో నీటి వృథాను అరికట్టేందుకు పైప్లైన్ల లీకేజీలను వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుత వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లను ఆదేశించారు. జిల్లాపరిషత్ నిధుల ద్వారా మంజూరైన ఎస్సీ, ఎస్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు మంజూరు చేసిన ఈఎంఎఫ్ పనులను వెంటనే చేపట్టి జూలై నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పనులకు సంబంధించి ఐసీడీఎస్ అధికారులను సమన్వయం చేసుకుని పంచాయతీరాజ్ ఇంజనీర్లు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ కర్నూలు, నంద్యాల ఎస్ఈలు బి.నాగేశ్వరరావు, సీహెచ్ మనోహర్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. జిల్లాపరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి -
మల్లన్న సేవలో కర్ణాటక రాష్ట్ర గవర్నర్
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మంగళవారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన కర్టాటక గవర్నర్‌కు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, వేదపండితులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో గవర్నర్‌కు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన ఈఓ స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూ ప్రసాదాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు. -
‘కూటమి’ తంత్రం.. అందని యంత్రం
కర్నూలు(అగ్రికల్చర్): రైతుల సంక్షేమానికి, వ్యవసాయ అభివృద్ధికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పలు పథకాలు అమలు చేయగా.. ప్రస్తుత ప్రభుత్వం ఉన్న పథకాలను నీరుగారుస్తోంది. గత ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా యాంత్రీకరణతో పాటు అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం సిఫారస్సులకు లోబడే యంత్రీకరణ అమలు చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. టీడీపీకి చెందిన వారికే ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారని ప్రజలే చెబుతున్నారు. టీడీపీ వారికే యంత్రాలు వ్యక్తిగత వ్యవసాయ యంత్రాల పంపిణీలో టీడీపీ నేతల సిఫార్సులకే వ్యవసాయ శాఖ అఽధికారులు పెద్దపీట వేస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో వ్యవసాయ శాఖ.. రైతులకు వ్యక్తిగతంగా వ్యవసాయ యంత్ర పరికరాలు సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. కేంద్రప్రభుత్వ నిధులు 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ నిధులు 40 శాతం నిధులు అందిస్తోంది. కర్నూలు జిల్లాలో రూ.రూ.2.87 కోట్లతో 1,660 యంత్రపరికరాలు, నంద్యాల జిల్లాలో రూ.2.85 కోట్లతో 1,635 యంత్రపరికరాలు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు బ్యాటరీ స్ప్రేయర్లు 250, థైవాన్ స్ప్రేయర్లు 600, ట్రాక్టర్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు 7, ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్ 740, రోటావేటర్లు 28, పవర్ వీడర్లు 17, బ్రస్కట్టర్లు 13, పవర్ టిల్లర్లు 5 ప్రకారం పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఒక్కటి కూడా ఇవ్వకుండా... నంద్యాల జిల్లాలో థైవాన్ స్ప్రేయర్లు 575 కేటాయించగా.. మిగిలినవన్నీ.. కర్నూలు జిల్లాతో సమానంగా కేటాయించారు. ఒక్కో మండలంలో 30 నుంచి 50 గ్రామాలు ఉంటాయి. బ్యాటరీ స్ప్రేయర్లు, థైవాన్ స్ప్రేయర్లు గ్రామానికి కనీసం ఒక్కటి కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. రోటా వేటర్లు మండలానికి ఒక్కటి ప్రకారమే కేటాయించారు. పవర్ టిల్లర్లు, బ్రస్కట్టర్లు, పవర్ వీడర్లు అతి తక్కువగా ఉండటంతో టీడీపీ నేతల ప్రాబల్యం ఉన్న మండలాలకే కేటాయించారు. వ్యక్తిగత యంత్ర పరికరాలు సరఫరా చేసేందుకు దాదాపు 50 కంపెనీలను గుర్తించింది. బ్యాటరీ స్ప్రేయర్లకు రూ.1000, థైవాన్ స్ప్రేయర్లకు రూ.8000 నుంచి 10 వేల వరకు, ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్కు కంపెనీని బట్టి గరిష్టంగా రూ,35 వేల వరకు, రోటావేటర్‌కు రూ.46 వేలు, పవర్ వీడర్లకు రూ.30 వేల నుంచి 40 వేల వరకు, బ్రస్కట్టర్లకు రూ.25 వేల నుంచి రూ.44 వేలు, పవర్ టిల్లరుకు లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. ఇంప్లిమెంట్స్ అతి తక్కువగా ఉండటంతో కూటమి నేతల సిఫార్సుల పర్వం జోరుగా సాగుతోంది. వారు ఎవ్వరికి చెబితే వారికే ఇస్తామని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ నేతలు చెప్పిన వారికే వ్యవసాయ యంత్ర పరికరాలు -
ఎస్డీఆర్ఎఫ్ సేవలకు కమాండెంట్ అభినందన
కర్నూలు: కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలను కమాండెంట్ దీపిక పాటిల్ అభినందించి సత్కరించారు. ఈనెల 16న విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన వెంకటరత్నం (80) వచ్చి ప్రమాదవశాత్తూ ప్రకాశం బ్యారేజీ సమీపంలో కెనాల్లో పడిపోయాడు. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న రెండో బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆర్ఎస్ఐ మహేంద్ర నాయక్, శివ, పద్మనాభం, సుదర్శన్ రెడ్డి, హుసేన్, నాగన్న, సత్యనారాయణ తదితరులు పడవ సాయంతో వృద్ధుడిని కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అందుకు గాను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలను అభినందిస్తూ మంగళవారం కమాండెంట్ దీపిక పాటిల్ తన కార్యాలయంలో ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కమాండెంట్ నాగేంద్ర రావు, ఎస్డీఆర్ఎఫ్ డీఎస్పీ సుధాకర్ రెడ్డి, ఆర్ఐ సాయికుమార్ పాల్గొన్నారు. -
శ్రీమద్దిలేటయ్య హుండీ ఆదాయం రూ.39.66 లక్షలు
బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 39.66 లక్షలు వచ్చింది. స్వామి, అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకలు, ముడుపుల హుండీ లెక్కింపు మంగళవారం దేవదాయశాఖ అధికారి జనార్దన, ఆలయ ఈఓ రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. 58 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు ద్వారా ఆలయానికి రూ. 39,66,066 నగదు, 47 గ్రాముల బంగారు, 1.300 కిలోల వెండి వచ్చింది. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ రామ్ మోహన్ రావు, మహిళా భక్తులు, వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు.30 నుంచి చౌడేశ్వరిదేవి జ్యోతి ఉత్సవాలుబనగానపల్లె: నందవరంలో వెలసిన చౌడేశ్వరిదేవి అమ్మవారు జ్యోతి మహోత్సవాలు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు ఏప్రిల్ 5వ తేదీ వరకు అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 30వ తేదీ సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ, పంచాంగ శ్రవనం, పన్నేరపు బండ్లు తిప్పుట, ప్రాకార రథోత్సవం, 31న శ్రీదేవి భూదేవి సమేత చేన్నకేశవస్వామి కల్యాణోత్సవం, ఏప్రిల్ 1న ఉదయం అమ్మవారికి కుంకుమార్చన, సాయంత్రం అమ్మవారి రాయబార మహోత్సవం, 2న అభయహస్త సేవా సమితి ధర్మవరం వారిచే అన్నమయ్య సంకీర్తన చౌడేశ్వరిదేవి జ్యోతి మహోత్సవం, అర్ధరాత్రి నుంచి భాస్కరయ్య ఆచారిచే అమ్మవారికి దిష్టి చుక్క పెట్టుట, 3న సాయంత్రం రథోత్సవం, 4న తిరుగు రథోత్సవం, 5న వసంతోత్సవం నిర్వహించనున్నారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆలయ ఉప కమిషనర్ కామేశ్వరమ్మ మంగళవారం తెలిపారు.తెల్లవారుజాము నుంచే మహానందీశ్వరుడి దర్శనంమహానంది: ఉగాది ఉత్సవాల సందర్భంగా మహానందీశ్వరుడి దర్శనానికి వచ్చే కన్నడ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచే దర్శనం కల్పిస్తున్నట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆలయ తలుపులు తెల్లవారుజామున 3.30 గంటలకే తెరిచి స్వామి వారికి అభిషేకం, పూజల అనంతరం 4.10 గంటలకు హారతులు ప్రారంభించి 4.30 గంటల నుంచి భక్తులకు ద ర్శనం కల్పిస్తామన్నారు. అర్చకులతో పాటు ప్రధాన కౌంటర్ల సిబ్బంది అందరూ నిర్ణీత సమయానికి హాజరు కావాలని ఆదేశించారు.ఏప్రిల్ 1 వరకు ఎండుమిర్చి, వాము క్రయవిక్రయాలు బంద్కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 1 వరకు ఎండుమిర్చి, వాము క్రయవిక్రయాలు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున అకౌంట్స్‌ను క్లోజ్ చేసుకోవాల్సి ఉందని.. వాము, ఎండుమిర్చి క్రయవిక్రయాలు చేపట్టలేమని వ్యాపారస్తుల అసోషియేషన్ చెప్పినందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని, కమీషన్ ఏజెంట్లు కూడా ఆయా సరుకులను తెప్పించరాదని సూచించారు. -
ఎన్నికలకు ముందు సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండేవిధంగా ఇసుక పాలసీ తీసుకొస్తామన్న పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక అంటూ ఆర్భాటం చేశారు. ఉచితం అటుంచితే అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. టీడీపీ నేతలు ఇసుక వ్యాపారులుగా అవతారమెత్తి ప్
● ఇసుక వ్యాపారులుగా టీడీపీ నేతలు ● ఆళ్లగడ్డలో పేరుకే స్టాక్ పాయింట్ ● జమ్మలమడుగు నుంచి పెద్దముడియం మీదుగా అక్రమంగా తరలింపు ● ట్రాక్టర్‌కు రూ. 2 వేలు అదనం ● ఓ ప్రజాప్రతినిధి భర్త కనుసన్నల్లో దందారోజుకు రూ. లక్షల్లో అక్రమ ఆదాయం నియోజకవర్గ వ్యాప్తంగా ఇసుక కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక కావాలంటే తప్పనిసరిగా టీడీపీ నాయకులను ఆశ్రయించాల్సిందే. ట్రాక్టర్ ఇసుకకు అదనంగా రూ.2 వేలు ఇస్తేనే సరఫరా చేస్తున్నారు. చాగలమర్రి, రుద్రవరం, ఆళ్లగడ్డ, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, శిరివెళ్ల మండలాలకు ప్రతి రోజు 120 నుంచి 150 ట్రాక్టర్ల ఇసుక సరఫరా అవుతోంది. రోజుకు కేవలం ఇసుక ద్వారానే అక్రమంగా రూ.3 లక్షలు సంపాదిస్తున్నారు. ఈ మొత్తం అంతా స్థానిక ప్రజాప్రతినిధి భర్త జేబులోకి వెళ్తోందని ప్రచారం జరుగుతోంది. ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతున్నా పోలీసు, రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడకపోవడం గమనార్హం. సాక్షి, నంద్యాల: కూటమి నేతలకు ఇసుక కాసులు కురిపిస్తోంది. పేరుకే ఉచిత ఇసుక.. కానీ, కాసులిస్తే కానీ టన్ను ఇసుక దొరకని పరిస్థితి. ప్రభుత్వం ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఇసుక స్టాక్ పాయింట్లను మూసేసి అక్రమార్జనకు తెరలేపారు. అక్రమ మార్గంలో ఇసుకను తరలిస్తూ రూ. కోట్లు కూడబెడుతున్నారు. ఇప్పటికే పెరిగిన ఖర్చులతో నిర్మాణ రంగం కుదేలయింది. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కో ట్రాక్టర్ మీద రూ.2 వేలు వసూలు చేస్తూ మరింత భారం మోపుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నుంచి ఇసుకను తరలిస్తున్నారు. పెద్దముడియం మీదుగా ఆళ్లగడ్డకు... ఇక్కడి నుంచి రుద్రవరం, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, శిరివెళ్ల, చాగలమర్రి మండలాలకు వెళ్తోంది. ప్రతి రోజు రాత్రి మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య అక్రమ రవాణా సాగుతోంది. ఇసుక కావాలనుకున్న వారు టీడీపీ నాయకులను సంప్రదిస్తే వారే ఇసుక తెప్పిస్తున్నారు. నాలుగు టన్నుల ఇసుక ట్రాక్టర్ రవాణా ఖర్చులతో కలిపి రూ.3500కు విక్రయించాల్సి ఉండగా.. టీడీపీ నాయకుల అక్రమ వసూళ్లతో ఇసుక ట్రాక్టర్ రూ.6 వేల వరకు పలుకుతోంది. అక్రమ దందాతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నా జిల్లా ఇసుక కమిటీ చైర్ పర్సన్‌గా ఉన్న కలెక్టర్ రాజకుమారి గణియా ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్టాక్ పాయింట్ తెరిస్తే ఒట్టు.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులోనే ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేశారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్‌లో ఇసుక నిల్వ ఉంచి కావాల్సిన వారు సులువుగా బుక్ చేసుకుని తీసుకుని వెళ్లే సౌలభ్యం ఉండేది. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుకను ప్రధాన ఆదాయ వనరుగా మలుచుకున్నారు. స్థానికంగా ఇసుక లభ్యత లేకపోవడం వీరికి కలిసొచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్‌ను ఇప్పటి వరకు తెరవలేదు. గత నవంబర్‌లో ఇసుక స్టాక్ యార్డ్‌లకు టెండర్లు పిలిచి అదే నెలలో డీలర్ లైసెన్స్‌లను ఖరారు చేశారు. ప్రభుత్వం నిర్ణయించింది రూ.719 మాత్రమే... రాష్ట్ర ప్రభుత్వం టన్ను ఇసుక ధర రూ.719 చొప్పున నిర్ణయించింది. ఇసుక ఎవరికి కావాలన్నా అధికారికంగా ఈ ధర చెల్లించి తీసుకెళ్లవచ్చు. కానీ, ఆళ్లగడ్డలో మాత్రం పేరుకే ఇసుక స్టాక్ పాయింట్ ఉంది. అక్కడికి వెళ్లి చూస్తే ఇసుక ఉండదు.. ఇసుక స్టాక్ పాయింట్ ఎప్పుడూ మూత వేసి ఉంచుతున్నారు. పట్టణానికి 4 కిలో మీటర్ల దూరంలో పాలసాగరం వద్ద ఏర్పాటు చేశారు. స్టాక్ యార్డ్ ఏర్పాటై నాలుగు నెలలవుతున్నా ప్రజలకు స్టాక్ యార్డ్ ఎక్కడ ఉందో తెలియదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
నీళ్లిచ్చి పంటలను కాపాడండి
శిరివెళ్ల: రబీలో సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ఆందోళన బాట పట్టారు. ఎండిపోతున్న పంటలకు నీళ్లిచ్చి ఆదుకోవాలంటూ మంగళవారం శిరివెళ్ల, యర్రగుంట్ల, కోటపాడు, గోవిందపల్లె, కామినేనిపల్లె, వెంకటాపురం రైతులు కేసీ కెనాల్ వద్ద ధర్నా చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు కేసీలో నీరు పుష్కలంగా ఉన్నా మార్చి మొదటి వారం నుంచి నీటి ప్రవాహం తగ్గిపోయింది. ఈ క్రమంలో వారబందీ క్రమంలో పొలాలకు నీటిని విడుదల చేసేలా అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 16వ లాక్ కింద పొలాలకు ఐదు రోజులు, 17, 18, 19 లాక్ కింది పొలాలకు ఐదు రోజుల మేర వంతులను నిర్ణయించి నీటిని వదిలారు. 16వ లాక్ కింద పొలాలకు ఈ నెల 18వ తేదీ వరకు నీరు ఇచ్చారు. తర్వాత 23వ తేదీ వరకు కింది లాక్‌ల పొలాలకు వంతుల మేరకు నీరు ఇచ్చారు. అయితే 24వ తేదీ నుంచి 16 లాక్ పొలాలలకు నీరు ఇవ్వాల్సి ఉండగా మంగళవారం మధ్నాహ్నం ఒంటి గంట తర్వాత శిరివెళ్ల, యర్రగుంట్ల, గోవిందపల్లె సబ్ చానళ్లకు అధికారులు నీటిని నిలుపుదల చేశారు. దీంతో రైతులు ఆగ్రహంతో ప్రధాన కాల్వ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. ఒప్పందం ప్రకారం ఈనెల 30వ తేదీ వరకు నీటిని ఇవ్వక పోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో వెంకటాపురానికి చెందిన రైతులు తిరుపతిరెడ్డి, గోవిందపల్లెకు చెందిన శ్రీనివాసులు, నాగరాజు, సుబ్బారెడ్డి, నరసింహులు, వీరారెడ్డిపల్లెకు చెందిన రాజశేఖరరెడ్డి, వజ్రాల వేణుగోపాలరెడ్డి, మహేశ్వరరెడ్డి, కోటపాడుకు చెందిన చిలకల బిజ్జి తిమ్మయ్య, వెంకట సుబ్బయ్య, సూర్య నారాయణరెడ్డి, కామినేపల్లెకు చెందిన ఈశ్వర్, లక్కా పౌల్, సాలరాజు పాల్గొన్నారు. కేసీ కెనాల్ 16వ లాక్ వద్ద రైతుల ఆందోళన అధికారులు మాట తప్పారని మండిపాటు -
ఉగాది ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఉగాది మహోత్సవాల నేపథ్యంలో దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు సేదతీరేందుకు పలుచోట్ల చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. బసవవనం, బాలగణేశవనం, శివదీక్షా శిబిరాలు, రుద్రాక్షవనం, ఆలయ మాడవీధులు, మల్లమ్మ కన్నీరు, పలు ఆరుబయలు ప్రదేశాల్లో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. అలాగే కాలినడకన వచ్చే మార్గంలో నాగలూటి, దామర్లగుంట, పెచ్చెర్వు, కై లాసద్వారం, హఠకేశ్వరం పలుచోట్ల చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. కాలిబాటలోని నాగలూటి, పెద్దచెరువు, కై లాసద్వారం మొదలైనచోట్ల జనరేటర్లను ఏర్పాటు చేసి తాత్కాలిక విద్యుద్దీకరణ ఏర్పాటు చేశారు. రోజు రోజుకు పెరుగుతున్న కన్నడ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నీటిసరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టారు. రోజుకు 1.36 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. భీమునికొలను–కై లాసద్వారం వద్ద 1000 లీటర్ల సామర్థ్యం కలిగిన 6 సింటెక్స్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు ఇలా.. ● దేవస్థానం అన్నదాన భవనంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. క్యూలైన్లలో వేచిఉన్న భక్తులకు నిరంతరం అల్పాహారాన్ని అందిస్తున్నారు. అలాగే కై లాసద్వారం, సాక్షిగణపతి, హఠకేశ్వరం, క్షేత్రపరిధిలోని పలుచోట్ల కన్నడ భక్తబృందాలు చేస్తున్న అన్నదాన కార్యక్రమాలకు దేవస్థానం సహకారం అందిస్తోంది. ● జిల్లా వైద్యశాఖ సహకారంతో దేవస్థాన వైద్యశాల, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ద్వారా నిరంతరం వైద్యసేవలు అందిస్తున్నారు. కై లాసద్వారం, హఠకేశ్వరం, క్యూకాంప్లెక్స్, ఆలయ మహాద్వారం మొదలైనచోట్ల తాత్కాలిక వైద్యశిబిరాలు. ● ఆర్టీసీ బస్టాండ్ వెనుకభాగం, యజ్ఞవాటిక, ఔటర్‌రింగ్‌రోడ్డు, గణేశ సదనం ఎదురుగా, హెలిప్యాడ్ వద్ద, దేవస్థానం ఆగమ పాఠశాల పలుచోట్ల వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. ● పారిశుద్ధ్య పనులకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మాదిరిగానే సిబ్బందిని నియమించారు. క్షేత్రపరిధిలోని 500 శాశ్వత మరుగుదొడ్లు, పలుచోట్ల తాత్కాలిక మరుగుదొడ్లు అందు బాటులో ఉంచారు. శ్రీగిరికి భారీగా చేరుకుంటున్న కన్నడ భక్తులు ఆరుబయలు ప్రదేశాల్లో తాత్కాలిక వసతి పాదయాత్ర భక్తుల కోసం భీమునికొలను వరకు తాగునీటి సరఫరా -
దేవుడా ఇవేమి తిప్పలు
గోస్పాడు: పింఛన్‌దారుల్లో అనర్హుల ఏరివేత అంటూ దివ్యాంగ లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం కష్టాల పాలుజేసింది. ఎన్నో ఏళ్లుగా పింఛన్ పొందుతున్న వారికి వైద్య పరీక్షలు అంటూ ఆందోళనకు గురి చేస్తోంది. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రత్యేక సదరం క్యాంప్ నిర్వహణ దారి తప్పుతోంది. బేతంచెర్ల మండలం హెచ్. కొట్టాల, ముద్దవరం గ్రామాలకు చెందిన దివ్యాంగులకు ఈనెల 25వ తేదీన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే సదరం క్యాంపుకు వెళ్లాలని సంబంధిత సచివాలయ సిబ్బంది ఈనెల 7వ తేదీన నోటీసులు ఇచ్చారు. వారి సూచన మేరకు దివ్యాంగులు మంగళవాం నంద్యాల ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఎవరిని అడిగినా క్యాంపు నిర్వహణపై సమాధానం లేకపోగా ఒక్కొ క్కరూ ఒకలా చెబుతుండటంతో ఆందోళన చెందారు. చివరకు తేదీ మార్చారని తెలుసుకుని అధికారుల తీరుపై మండిపడ్డారు. సచివాలయ సిబ్బంది క్యాంపులు నిర్వహిస్తున్న విషయాన్ని కూడా పూర్తిస్థాయిలో తెలియకుండానే తమ లాంటి వారికి నోటీసులు ఇచ్చి పంపడం ఏమిటని బాధపడ్డారు. దివ్యాంగులమైన తాము ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలతో ఇక్కడికి వచ్చాక క్యాంపు నిర్వహించకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ విషయంపై డీఆర్డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డిని వివరణ కోరగా సదరం క్యాంపు మొదట్లో ప్రతి వారం మంగళ, బుధ, గురువారాల్లో నిర్వహించే వార మని, ఇటీవల షెడ్యూల్ మార్పు చేసి బుధ, గురు, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నా రు. కాగా మంగళవారం నంద్యాలకు చేరుకునన్న దివ్యాంగులకు మళ్లీ ఎప్పుడు రావాలో తెలియక పోవడంతో అయోమయంలో పడ్డారు. ప్రత్యేక సదరం శిబిరానికి హాజరు కావాలంటే సచివాలయ సిబ్బంది ఇచ్చే నోటీసులతో వస్తేనే ఇక్కడి వైద్యులు వికలత్వ ధ్రువీకణ పత్రాలు ఇస్తారు. దీంతో దివ్యాంగులు దిక్కుతోచక తిరుగు ప్రయాణమయ్యారు. దివ్యాంగ పింఛన్‌దారులకు కష్టాలు 25న వైద్య పరీక్షలకు హాజరు కావాలని నోటీసులు తీరా వచ్చాక తేదీ మార్చామంటున్న అధికారులు -
వైఎస్సార్సీపీ నాయకులపై దాడి
జూపాడుబంగ్లా: టీడీపీ నాయకుల దాడిలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, పి.లింగాపురం సర్పంచ్ నాగార్జునరెడ్డి, అతని తండ్రి, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని లింగాపురంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాలు.. 80బన్నూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 769ఐ, 769జే లలో ఉన్న 21.50 ఎకరాల పొలాన్ని మంగళవారం అధికారులు సర్వే చేసేందుకు ఉపక్రమించారు. నాగార్జునరెడ్డి అతని తండ్రి రాజ్‌కుమార్‌రెడ్డి, చిన్నాన్న తిరుమలేశ్వరరెడ్డి, పి.లింగాపురం గ్రామానికి చెందిన కొంత మంది గ్రామస్తులు అక్కడికి చేరుకుని పొలం తమ పూర్వీకులని, సర్వే నిలిపివేయాలని కోరారు. విషయం తెలుసుకున్న జూపాడుబంగ్లాకు చెందిన టీడీపీ నాయకుడు జంగాల పెద్దన్న, అతని కుమారుడు మోతె వెంకటయ్య, సోదరుడు శేఖర్, మరికొంత మంది పొలం వద్దకు చేరుకుని 17 ఏళ్లుగా పొలాన్ని తాము సాగుచేసుకుంటూ ఉన్నామని, ఇప్పుడొచ్చి పొలం తమదంటే ఎలాగంటూ నాగార్జునరెడ్డిని నిలదీశారు. ఈక్రమంలో మాటామాటా పెరగడంతో టీడీపీ నాయకులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నాగార్జునరెడ్డి, రాజ్‌కుమార్‌రెడ్డి, తిరుమలేశ్వరరెడ్డి, రవి తలలకు రక్త గాయాలయ్యాయి. బాధితులు పోలీసుస్టేషన్‌కు చేరుకోవటంతో పోలీసులు వారిని చికిత్సనిమిత్తం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈసందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ జంగాల పెద్దన్న, మోతె వెంకటయ్య, జంగాల శేఖర్, శంకరయ్య, వెంకటమ్మ మరికొంత మంది కర్రలు, కొడవళ్లు, కత్తులతో తమపై దాడిచేరన్నారు. కాగా వైఎస్సార్సీపీ నాయకులపై దాడిచేసిన టీడీపీ నాయకులు కూడా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయటం గమనార్హం. పొలం విషయంలో ఘర్షణ నలుగురికి రక్త గాయాలు -
అదుపు తప్పితే కాలువలోకే!
పిల్లిగుండ్ల, నెరుడుప్పల రహదారిలోని జీడీపీ కూడి కాలువ కల్వర్టు పూర్తిగా కుంగిపోయింది. దీంతో పాటు రక్షణ గోడ కూడా లేదు. వాహనదారులు ఏ మాత్రం ఆదమరిచినా కాలువలో పడిపోయే అవకాశం ఉంది. ఈ రహదారి మీదుగా పిల్లిగుండ్ల, ఒంటెడుదిన్నె, నెరుడుప్పల, ఎర్రబాడు, దేవనకొండ మండలం కేంద్రంతో పాటు ఆయా గ్రామాలకు వెళ్తుంటారు. అయితే ఆ కాలువ దగ్గర రోడ్డు మలుపు ఉండడం, కల్వర్టుకు రక్షణ గోడ లేకపోవడంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. పైగా కల్వర్టు పూర్తిగా కుంగిపోయింది. అలాగే కల్వర్టు కింద, పక్కన గట్టు పూర్తిగా దెబ్బతినడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని వాహనదారులు భయందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో అయితే వాహనదారులు భయపడుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి కుడి కాలువకు నూతన కల్వర్టుతో పాటు రక్షణ గోడ నిర్మించాలని, దెబ్బతిన్న కాలువ గట్టుకు మరమ్మతులు చేయించాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు. – గోనెగండ్ల -
ముగిసిన మంగళ మహోత్సవం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీమన్ న్యాయసుధా మంగళ మహోత్సవం సోమవారం ముగిసింది. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల నేతృత్వంలో రెండు రోజుల పాటు ఈ ఉత్సవం నిర్వహించారు. వివిధ మఠాధిపతులు సమక్షంలో శ్రీమన్ న్యాయసుధా గ్రంఽథంపై తర్క , సారాంశ ఘోష్టి జరిపారు. మహోత్సవంలో ఉత్తమ ప్రతిభ చాటిన ఎనిమిది మంది విద్యార్థులకు ప్రశంసా పత్రం, అవార్డులు ప్రదానం చేశారు. అంతకు ముందు ఊంజల మంటపంలో రాఘవేంద్రుల విరాట్‌కు పీఠాధిపతులు విశేష పూజలు చేపట్టారు. వేడుకలో వ్యాసరాజ మఠం పీఠాధిపతి విద్యాశ్రీషా తీర్థులు, శ్రీపాదరాజ మఠం పీఠాధిపతి సుజయనిధి తీర్థులు, కృష్ణాపుర మఠం పీఠాధిపతి విద్యాసాగర తీర్థులు, కనియూరు మఠం పీఠాధిపతి విద్యావల్లభతీర్థులు, శిరూర్ మఠం పీఠాధిపతి వేదవర్ధన తీర్థులు, అధమారు మఠం పీఠాధిపతి ఈషాప్రియ తీర్థులు, బందరకెరె మఠం పీఠాధిపతి విద్ద్యేశ తీర్థులు , కన్వమఠం పీఠాదిపతి విద్యాకన్వ విరాజ తీర్థులు, బాలఘర్ మఠం పీఠాధిపతి అక్షోభ్య రామ ప్రియ తీర్థులు , చిత్తాపూర్ మఠం పీఠాధిపతి విద్ద్యేంద్ర తీర్థులు, ఉడిపి మఠం పీఠాధిపతులు బన్నంజే రాఘవేంద్ర తీర్థులు, వామన తీర్థులు పాల్గొన్నారు. -
పదో తరగతి విద్యార్థికి బ్రెయిన్ స్ట్రోక్
● ఇప్పటికే ఒక ఆపరేషన్ చేసిన వైద్యులు ● వర్తించని ఎన్టీఆర్ వైద్యసేవ ● ఆదుకోవాలంటున్నతల్లిదండ్రులు కర్నూలు(హాస్పిటల్): ఆ విద్యార్థి ఎన్నో ఆశలతో పదో తరగతి పరీక్షలకు సిద్ధమయ్యాడు. కొన్ని పరీక్షలు కూడా రాశాడు. సోమవారం జరగాల్సిన పరీక్ష కోసం పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చి ఇంట్లో కుప్పకూలిపోయాడు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది వెంటనే కుమారుడిని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. విద్యార్థికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, రూ.10లక్షల దాకా ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో దాతల కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. వివరాలు.. పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామానికి చెందిన వెంకట నాగయ్య, జి.పరిమళలు తమ కుమారుడైన జి. రిషికేష్ చదువు కోసం కర్నూలు నగరంలోని టెలికాంనగర్‌లో నివాసం ఉంటున్నారు. నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతంలోని ఒక స్కూల్లో జి. రిషికేష్,, 10వ తరగతి చదువుతున్నాడు. కర్నూలు నగరంలోని ఒక సెంటర్లో ఈ నెల 17వ తేదీ నుంచి పరీక్షలు రాస్తున్నాడు. మధ్యాహ్నం భోజనం చేసి సోమవారం పరీక్షకు సిద్ధం కావాల్సి ఉందని చదువుతున్న పాఠశాలకు వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు అక్కడే చదువుకుని ఏడు గంటలకు ఇంటికి వస్తూనే తనకు విపరీతమైన తలనొప్పి వస్తోందని తల్లిదండ్రులకు చెబుతూ అలాగే మంచంపై వాలిపోయాడు. కొద్దిసేపటికి చూసే సరికి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే తల్లిదండ్రులు కుమారున్ని కర్నూలు నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆ బాలుని మెదడులో నరం వాచి చిట్లిపోయినట్లు గుర్తించారు. వెంటనే అదేరోజు రాత్రి ఆపరేషన్ చేసి మెదడులో లీకై న రక్తాన్ని తొలగించారు. త్వరలో మరో ఆపరేషన్‌కు సిద్ధంగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. అయినా ఇప్పుడే ఏమీ చెప్పలేమని, ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. చికిత్సకు ఎన్టీఆర్ వైద్యసేవ వర్తించదని, ఇందుకోసం రూ.10లక్షల దాకా ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో పేదలైన తాము అంత డబ్బు ఎక్కడ నుంచి తీసుకురావాలని, దాతలు స్పందించి తన కుమారున్ని ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కోర్టు స్టేను అమలు చేయాలి
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కల్లూరు: మండలంలోని కె. మార్కాపురం, తడకనపల్లె గ్రామాలకు సంబంధించిన రేషన్ షాపులకు సంబంధించి కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ అమలు చేయాలని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కోరారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ అమలు చేయకుండా కొందరు అధికారులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. కాటసాని వెంట రేషన్ డీలర్లు, గ్రామ నాయకులు ఉన్నారు. -
క్యాంపస్ సెలక్షన్లో ఎంపిక కాలేదని..
● ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య ప్యాపిలి: తన కలలు నెరవేరడం లేదనే బెంగతో ఓ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్యాపిలి మండలం ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన సుధాకర్, సుధారాణి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు మరమేసి అరుణ్ కుమార్ (23) పంజాబ్‌లోని రోపర్ యూనివర్సిటీలో ఐఐటీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సెమిస్టర్ పరీక్షల్లో ఒక్క సబ్జెక్టు బ్యాక్‌లాగ్‌లో ఉండటంతో ఇటీవల జరిగిన క్యాంపస్ సెలక్షన్లో ఎంపిక కాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అరుణ్ కుమార్ తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తన ముఖం ఎలా చూపించాలని తరచూ స్నేహితులతో చెప్పి బాధపడేవాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఈ నెల 15న పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో చేరుకున్నాడు. గమనించిన తోటి మిత్రులు పంజాబ్‌లో ఓ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కాగా పరిస్థితి విషమించడంతో ఆరుణ్ కుమార్ శనివారం రాత్రి మృతి చెందాడు. దీంతో అతడి మృతదేహాన్ని సోమవారం స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. చెట్టంత కొడుకు విగతజీవిగా మారడంతో ఆ యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
● రిమాండుకు ఆదేశించిన కోర్టు బండిఆత్మకూరు: వైఎస్సార్సీపీ కార్యకర్త నంద్యాల సుధాకర్‌రెడ్డి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఏఎస్పీ కార్యాలయంలో సోమ వారం నిందితులను చూపించారు. ఈ సందర్భంగా నంద్యాల ఏఎస్పీ మంద జావళి మాట్లాడుతూ.. లింగాపురం గ్రామంలో కొన్నేళ్ల నుంచి నంద్యాల సుధాకర్‌రెడ్డికి, అదే గ్రామానికి చెందిన మాల గుర్రాల రామస్వామికి స్థలం విషయంలో గొడవ ఉండేదన్నారు. స్థలాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో రామస్వామి అతని కుమారులు.. నంద్యాల సుధాకర్‌రెడ్డిని కిరాతంగా హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులతో తేలిందన్నారు. నిందితులైన గుర్రాల రామస్వామి, అతని కుమారులు గుర్రాల శివన్న, గుర్రాల తిరుపాలు, గుర్రాల లక్ష్మన్నలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండుకు ఆదేశించినట్లు ఏఎస్పీ తెలిపారు. నిందుతులను అరెస్ట్ చేసిన సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ జగన్మోహన్, మహానంది ఎస్ఐ రామ్మోహన్‌రెడ్డితో పోలీస్ సిబ్బందిని అభినందించారు. ప్రజలకు సదుపాయాలు కల్పించరా? కర్నూలు (టౌన్): చిన్నపాటి సమస్యలపై నెలల తరబడి తిరగాల్సి వస్తోంది. అయినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. పన్నులు చెల్లించే ప్రజలకు సదుపాయాలు కల్పించరా? అని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకుడు పుల్లారెడ్డి ప్రశ్నించారు. సోమవారం స్థానిక నగరపాలక సంస్థ ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో వివిధ కాలనీలకు చెందిన ప్రజలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ కాలనీ, రిచ్మండ్ కాలనీ, శాంతినగర్ కాలనీలలో సదుపాయాలు కల్పించాలన్నారు. టెలికాం నగర్, బాలాజీనగర్ పార్కు, సుందరయ్య పార్కులను అభివృద్ధి చేయాలన్నారు. ఖాళీ స్థలాలను సంరక్షించి అభివృద్ధి చేయాలని, శివారు కాలనీలలో 100 మినీ వాహనాలను ఏర్పాటు చేసి ఇంటింటి చెత్త సేకరించాలని డిమాండ్ చేశారు. అనంతరం మేయర్ బీవై రామయ్యకు, కమిషనర్ రవీంద్రబాబుకు వినతిపత్రాలు అందజేశారు. -
మహానందిలో కన్నడిగుల అవస్థలు
మహానంది: ఉగాది ఉత్సవాలకు శ్రీగిరికి చేరుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో మహానందీశ్వరుడిని దర్శించుకునేందుకు మహానందికి తరలివస్తున్నా రు. స్థానిక రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుంటున్నారు. కాగా ఆలయ ప్రాంగణంలో సరైన వసతులు లేకపోగా, గదులు తీసుకోవడానికి ఆర్థిక స్థోమత లేని భక్తులు చేసేదేమిలేక ఆలయం ముందు భాగంలో, సుపథ మండపాల్లో సేద తీరుతున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వచ్చే పేద భక్తులకు అధికారులు వసతి కల్పించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు. -
అర్జీలు పరిష్కరించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలాల నుంచి 203 మంది అర్జీలు వచ్చా యి. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించడంతో పాటు ఫిర్యాదుదారుల నుంచి అభిప్రాయా లు సేకరించాలన్నారు. ఉపాధి పనులు కల్పించండి ఉపాధి కూలీలకు పనులు కల్పించడంలో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేతన దారులకు పను లు కల్పించడంలో ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పట్టణాలలో ఉన్న ప్రధాన కూడళ్ల వద్ద చలువ పందిళ్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. -
శ్రీగిరి మల్లన్నా.. శరణు..శరణు!
శ్రీగిరికి చేరువైన పాదయాత్ర భక్తులుకన్నడ భక్తుల శివనామస్మరణతో శ్రీశైల క్షేత్రం మారుమోగుతోంది. ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తండోపతండాలుగా శ్రీగిరి చేరుకుంటున్నారు. నల్లమల మీదుగా పాదయాత్ర చేసుకుంటూ కై లాస ద్వారం చేరుకుని మల్లన్న చెంతకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. వేలాది మంది భక్తులు పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనానికి బారులుదీరుతున్నారు. కన్నడ భక్తులు మల్లన్న ను స్పర్శ దర్శనం చేసుకునేందుకు ఎంతో ఆరాట పడతారు. అందులో స్వామి వారి స్పర్శ దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో కన్నడ భక్తుల సౌకర్యార్థం ఈ నెల 26వ తేదీ వరకు మల్లన్న స్పర్శ దర్శనానికి అనుమతి కల్పించారు. అయితే మరో రెండు రోజుల్లో ముగిస్తుండడంతో కన్నడ భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అంతేకాకుండా క్షేత్రంలో భక్తులు పెరగడంతో మొబైల్ ఫోన్ సిగ్నల్స్ పని చేయడం లేదు. దీంతో భక్తులు సమాచారంతెలుసుకోక అవస్థలు పడుతున్నారు. – శ్రీశైలంటెంపుల్ -
పాల సేకరణ ధర పెంపు
నంద్యాల(అర్బన్): పాల సేకరణ ధరను పెంచి నట్లు విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయ సహకార సమితి ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కేజీ వెన్న శాతం ప్రకారం గేదె పాలు లీటరుపై రూ.1.20 నుంచి రూ.2, ఆవు పాలు లీటరుపై రూపాయి పెంచామన్నారు. మార్చి 16వ తేదీ నుంచే ఈ ధర అమల్లోకి వచ్చిందన్నారు. పాడి రైతులకు పశు పోషణకు సంబంధించి అన్ని ధరలు పెరిగినందున పాల సేకరణ ధరను పెంచుతూ నిర్ణ యం తీసుకున్నామన్నారు. ఈ అవకాశాన్ని పాల ఉత్పత్తి దారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ధరలు కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో పాలు పోస్తున్న రైతులంద రికీ వర్తిస్తాయన్నారు. టోల్గేట్ల టెండర్లో రూ. 1.68 కోట్ల ఆదాయం మహానంది: మహానంది క్షేత్రంలో టోల్గేట్ల నిర్వహణకు ఏర్పాటు చేసిన టెండర్ల ద్వారా దేవస్థానానికి రూ. 1.68 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహానందిలోని పోచా బ్రహ్మానందరెడ్డి డార్మెటరీ భవనంలో సోమవారం బహిరంగ, సీల్డు టెండర్లు నిర్వహించారు. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ బి.నాగభూపాల్‌రెడ్డి రూ. 1,68,00,003తో నిర్వహణ బాధ్యతలను దక్కించుకున్నారు. ఇదే టోల్గేట్లకు గత ఏడాది రూ. 1.71 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది పోటీ అంతగా లేకపోవడంతో ఆశించిన మేరకు ఆదాయం లభించలేదు. టోల్గేట్ల నిర్వహణతో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న ఎనిమిది ఖాళీ ప్లాట్లకు జరిగిన బహిరంగ వేలాల్లో నెలకు రూ. 44,300 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. మరుగుదొడ్ల నిర్వహణ, ఇతర అంశాలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదా పడ్డాయి. కార్యక్రమంలో ఏఈఓ ఎరమ ల మధు, ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్‌రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు నాగమల్లయ్య, సుబ్బారెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. క్షయవ్యాధిపై అవగాహన కల్పించాలి గోస్పాడు: క్షయవ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటరమణ అన్నారు. నంద్యాల పట్టణంలోని సర్వజ న ఆసుపత్రి ఆవరణంలోని మీటింగ్ హాల్లో సోమవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా క్షయ నివారణ అధికారి శార దాబాయి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జ్వరం, దగ్గు రెండు వారాలకు మించి ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. టీబీ నియంత్ర ణను, నివారణ చర్యలు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో విద్యార్థులకు ఎస్ఏ, క్విజ్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఫర్మార్మేషన్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. 15 మంది టీబీ బాధితులకు రెడ్‌క్రాస్, మదర్సొసైటీ సహకారంతో ఫుడ్ బాక్సెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ కాంతరావునాయక్, డీసీహెచ్ఎస్ డాక్టర్ జఫరుల్లా, వైద్యాధికారులు తేజశ్వని, పీటర్ వినయ్, సిబ్బంది పాల్గొన్నారు. ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ శ్రీశైలం: నల్లమల ఘాట్ రోడ్డులో సోమవారం ట్రాఫిక్ జామ్ ఏర్పడి భక్తులు అవస్థలు పడ్డారు. శ్రీశైలం–దోర్నాల మధ్యలో ఉన్న తుమ్మల బయలు సమీపంలో రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోవడంతో సుమారు 5 కిలోమీటర్ల వరకు అటు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో భక్తు లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘన స్థలానికి చేరుకుని కూలిన చెట్టును పక్కకు తొలగించడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. -
క్రికెట్ బెట్టింగ్ జోలికెళితే కఠిన చర్యలు
బొమ్మలసత్రం: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ అమాయకులను మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సోమవారం హెచ్చరించారు. ఈ సందర్బంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐపీఎల్ క్రికెట్ 2025 నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలతో నిఘా పెంచామన్నారు. అమాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఎవరైనా డబ్బు ఆశ చూపించి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించబోమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గమనిస్తూ ఉండాలన్నారు. బెట్టింగులకు పాల్పడుతున్నట్లు గుర్తిస్తే వారికి నచ్చచెప్పి ఆ ఊబిలో నుండి బయటకు తీసుకురావాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే డయల్ 100/112కు సమాచారమివ్వాలన్నారు. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. పీజీఆర్ఎస్లో 62 ఫిర్యాదులు స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అదిరాజ్‌సింగ్‌రాణా ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 62 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో సమస్యలు తెలిపేందుకు జిల్లాలోని నలుమూలల నుంచి వినతులు అందాయన్నారు. వారి సమస్యలకు స్పందించి ఆయా స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి కొన్ని సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపామన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా అందిన ఫిర్యాదులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వాటిని పునరావృతం కాకుండా చూ డాలని అధికారులను ఆదేశించామన్నారు. జిల్లా పోలీ స్ కార్యాలయంలో ఫిర్యాదులు ఇచ్చే వారు సుదూర ప్రాంతాల నుంచి రానవసరం లేకుండా స్థానిక పోలీస్టేషన్లలో వినతులు ఇచ్చి పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ మందా జావళి, అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తూ విద్యార్థి మృతి
కొలిమిగుండ్ల: గొర్విమానుపల్లె గ్రామంలో సోమవారం ప్రమాదవశాత్తూ ఓ విద్యార్థి మృతి చెందాడు. సీఐ రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఆవుల బ్రహ్మయ్య, పార్వతి దంపతులు కుమారుడు విరాట్ యాదవ్ (13) గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఇంటి వద్ద ఉన్న కుళాయికి నీళ్లు వస్తుండటంతో మోటర్ సాయంతో పట్టుకున్నారు. ఆ తర్వాత విరాట్ విద్యుత్ బోర్డులో నుంచి మోటర్‌కు చెందిన ప్లగ్ బయటకు తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇంటి ముందున్న సీసీ రోడ్డుపై పడ్డాడు. ఈ క్రమంలో బాలుడి తలకు తీవ్ర గాయమైంది. చికిత్స కోసం కుటుంబ సభ్యులు తుమ్మలపెంట సమీపంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరికి చెందిన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
గత ప్రభుత్వంలో రూ.50 వేలు అందింది
జగనన్న పాలనలో వాహన మిత్ర పథకం ద్వారా ఏడాదికి రూ.10 వేలు చొప్పున సాయం అందించారు. అయిదేళ్లలో రూ.50 వేలు అందుకున్నాను. ఈ డబ్బులు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, మరమ్మతులకు ఉపయోగపడేవి. ప్రస్తుత ప్రభుత్వంలో మాకు ఎలాంటి సాయం అందలేదు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు హామీలన్నీ సీఎం చంద్రబాబు అమలు చేసి పేదలకు న్యాయం చేయాలి. – ప్రవీణ్, దేవనగర్, నంద్యాల చెప్పిన తేదీకి ఇచ్చేవారు గత ప్రభుత్వంలో వాహన మిత్ర పథకం ద్వారా చెప్పిన తేదీకి రూ.10 వేలు అందించారు. కేవలం ఆటో నడుపుకుంటూ వచ్చే ఆదాయం ద్వారానే కుటుంబాన్ని పోషించుకుంటున్న మాకు ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడేవి. కూటమి అధికారంలోకా వస్తే రూ.15 వేలు ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంఏడాదవుతున్నా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదు. – లోకేష్, హరిజనవాడ, నంద్యాల● -
27 నుంచి ఉగాది ఉత్సవాలు
● శ్రీశైలానికి భారీగా చేరుకుంటున్న కన్నడ భక్తులు ● భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేపట్టిన దేవస్ధానం శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం మహా క్షేత్రంలో ఈనెల 27వ తేదీ నుంచి ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొనేందుకు కన్నడిగులు వేలాది మంది తరలివస్తున్నారు. ఈనెల 31వ తేదీ వరకు జరిగే మహోత్సవాల్లో ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు విశేష వాహన సేవ నిర్వహిస్తారు. అలాగే కన్నుల పండువగా గ్రామోత్స వం సైతం నిర్వహించనున్నారు. ఉగాది మహోత్సవాల్లో వీరాచారా విన్యాసాలు, పంచాంగ శ్రవణం, స్వామి అమ్మవార్లకు రథోత్సవం తదితర కార్యక్రమాలు ప్రధానమైనవి. కన్నడ భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం ఈనెల 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనానికి అనుమతించారు. విడతల వారీగా నిర్దిష్ట వేళలలో, 10 రోజులపాటు కన్నడ భక్తులు మల్లన్నను స్పర్శ దర్శనం చేసుకునేందుకు దేవస్ధానం అధికారులు ఏర్పాట్లు చేశారు. మహోత్సవాల ను పురస్కరించుకుని కన్నడిగుల సౌకర్యార్థం, శ్రీశైల దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలను యథావిధిగా ఉగాది మహోత్సవాలకు అమలు చేస్తోంది. భక్తులకు ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనంతో పాటు మల్లన్న స్పర్శ రూ.500 టికెట్ కౌంటర్ సైతం ఏర్పాటు చేసింది. భక్తులకు సౌకర్యవంతమైన స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామని ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. కన్నడ భక్తులు దేవస్థానానికి సహకరించేలా శ్రీశైల జగద్గురు పీఠాధిపతి వారి ప్రసంగ వీడియోని ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రసారం చేస్తున్నామన్నారు. -
సాయం నిలిచి.. కష్టాలు రయ్ రయ్!
● రవాణా రంగం కార్మికులకు కూటమి మొండి చేయి ● ఎన్నికల ముందు ఏటా రూ.15 వేల హామీ ● పది నెలలు అవుతున్నా ఊసే లేదు ● గత వైఎస్సార్సీపీ హయాంలో వాహనమిత్ర ద్వారా ఏటా రూ. 10 వేల సాయం నంద్యాల(న్యూటౌన్): ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం, అధికారం వచ్చిన తర్వాత వాటిని అటకెక్కించడం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుకి పరిపాటిగా మారింది. ప్రజలను పదేపదే మోసం చేయడంలో తనకు తానే సాటి అని ప్రతీసారి నిరూపించుకుంటు న్నారు. 2014లో ఆరు వందలకు పైచిలుకు హామీలు ఇచ్చి, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలకు మోసం చేశారు. 2024లోనూ అదే రీతిలో హామీలు ఇచ్చి తనదైన తీరులో ఎగనామం పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, హెవీ లైసెన్స్ కలిగిన లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు, ప్రమాద బీమా, ఆరోగ్యబీమా, డ్రైవర్ల పిల్లలకు విద్యా రుణాలు, తదితర హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి పదినెలలు గడిచిపోతున్నా వీటిలో ఏ హామీ కార్య రూపం దాల్చలేదు. తాజా గా ప్రవేశపెట్టిన 2025–26. వార్షిక బడ్జెట్లో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం పథకానికి రూపాయి కూడా కేటాయించ లేదు. సంక్షేమ బోర్డు, ఇతర హామీలను పరిగణనలోకి తీసుకోలేదు. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం ఇవ్వాల్సిందేనని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సాయం అందించక పోగా అధికారంలోకి వచ్చిన రోజు నుంచే రకరకాల పేర్లతో ఆపరాధ రుసుములు విధిస్తూ తమపై బాదుడు మొదలు పెట్టారని ఆటో కార్మికులు మండిపడుతున్నారు. ఐదేళ్లలో రూ. 8.89 కోట్లు 2019MýS$ Ð]l¬…§ýl$ {糆{糄ýS ¯ól™èlV> OÐðlG‹Ü fVýS¯ŒS-Ððl*-çß毌SÆð‡yìlz ´ë§ýlĶæ*{™èl ^ólçÜ$¢¯]l² çÜÐ]l$Ķæ$…ÌZ BĶæ$°² BsZ {OyðlÐ]lÆý‡$Ï MýSÍíÜ çÜÐ]l$çÜÅ-ÌS¯]l$ ^ðl糚-MýS$-¯é²Æý‡$. A«¨-M>-Æý‡…-ÌZMìS Ð]lõÜ¢ Ý÷…™èl…V> BsZ E¯]l²-Ðé-Ç™ø ´ër$ sêÅMîSÞ {OyðlÐ]l-Æý‡ÏMýS$ Hyé-¨MìS Æý‡*.10 ÐólË$ CÝë¢Ð]l$° B çÜÐ]l$Ķæ$…ÌZ fVýS¯]l¯]l² Ð]l*r C^éaÆý‡$. 2019ÌZ A«¨M>-Æý‡…-ÌZMìS Ð]l_a¯]l Ððl…r¯ól Ðéçßæ-¯]l-Ñ${™èl ç³£ýlMýS… õ³Æý‡$™ø Æý‡*.10 ÐólÌS BÇ-®MýS ÝëĶæ$… A…¨…-^éÆý‡$. AƇ$$-§ólâýæÏ ´ër$ Hsê D BǦMýS ÝëĶæ$… A…¨çÜ*¢ Ð]l^éaÆý‡$. D yýlº$¾-ÌS¯]l$ BsZ Ð]l$Æý‡-Ð]l$Ã-™èl$Ë$, C¯]l*ÞÆð‡¯ŒæÞ,-ె¯ŒSÞ, íœsñæ²‹Ü çÜÇtíœ-MðSsŒæ Ð]l…sìæ Ðésìæ MøçÜ… Eç³-Äñæ*-W…-^èl$-MýS$¯ól ÐéÆý‡$. ¯]l…§éÅÌS hÌêÏÌZ Ðéçßæ¯]l Ñ${™èl ç³£ýlMýS… §éÓÆ> 2019 ¯]l$…_ 2023 Ð]lÆý‡MýS$ §é§éç³# 8,892 Ð]l$…¨ ÌS¼-®-§é-Æý‡$-ÌSMýS$ Æý‡*.8.89 Mør$Ï ÝëĶæ*°² A…¨…-^éÆý‡$. కూటమి మేనిఫెస్టోలో ఇలా.. బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా రూ. 15 వేలు ఆర్థిక సాయం. డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు, డ్రైవర్లను ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్లకు రూ. 4 లక్షల వరకు పొందే రుణాలపై 5 శాతం పైబడిన వడ్డీ సబ్సిడీ. -
తూతూమంత్రంగా ట్రాన్స్ఫార్మర్లు, ఇతర మెటీరియల్
గత తొమ్మిది నెలల్లో ఇదీ పరిస్థితి.. విడుదల డివిజన్ ఏడాది చేసిన కాలంగా విద్యుత్ నిరీక్షిస్తున్న కనెక్షన్లు రైతుల సంఖ్య 341 ఆదోని 3,766 310 కర్నూలు టౌన్ 1,220 351 ఎమ్మిగనూరు 2,656 179 నంద్యాల 2,427 164 ఆత్మకూరు 867 129 డోన్ 1,357 1,474 మొత్తం 12,293విద్యుత్ కనెక్షన్లకు గ్రహణం ● తొమ్మిది నెలలు గడుస్తున్నా మంజూరులో జాప్యం ● ఇప్పటి వరకు ఇచ్చిన కనెక్షన్లు 1,474 ● ఉమ్మడి జిల్లాలో 12,293 రైతుల నిరీక్షణ ● ఏడాది క్రితం డబ్బు చెల్లించినా నోరు మెదపని అధికారులు మాకు ఐదెకరాల భూమి ఉంది. రెండు బోర్లు ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం ఏడాది క్రితం విద్యుత్ మా వాటా కింద రూ.18,600 చెల్లించాం. ఇప్పటి వరకు కనెక్షన్ ఇవ్వలేదు. పోల్స్, మెటీరియల్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. అదిగో ఇదిగో అని తిప్పిపంపుతున్నారు. బోర్లలో నీళ్లున్నా ఉపయోగించుకోలేకపోతున్నాం. – కమ్మరి చిన్న రంగస్వామి, జిల్లేడుబుడకల గ్రామం, దేవనకొండ మండలం మాకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. రెండు బోర్లు వేయించాం. 2023 డిసెంబర్లో విద్యుత్ కనెక్షన్ కోసం రైతు వాటాగా రూ.80 వేలు చెల్లించాం. ఇప్పటికి ఏడాది గడిచిపోయినా కనీసం పోల్స్ కూడా ఇవ్వలేదు. నీళ్లు ఉన్నా కనెక్షన్ ఇవ్వకపోవడంతో భూములను ఖాళీగా ఉంచుకున్నాం. డోన్‌లోని డీఇ, ఏడీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. – ధర్మవరం సుబ్బరాయుడు, ఓబులదేవరపల్లి గ్రామం, ప్యాపిలి మండలం కర్నూలు(అగ్రికల్చర్): వర్షాధారం కింద పంటల సాగు గాలిలో దీపంగా మారింది. బావులు, బోర్లలోని అంతంతమాత్రం నీటితో పంటలు పండించుకోవాలని ఆశించిన రైతులకు నిరాశే మిగులుతోంది. వ్యవసాయ విద్యుత్ పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. కొత్త విద్యుత్ కనెక్షన్ల కోసం వేలాది మంది రైతులు డబ్బు చెల్లించి కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు. విద్యుత్ కనెక్షన్ ఇస్తే బోర్ల కింద కూరగాయల పంటలు, ఆరుతడి పంటలు సాగు చేసుకోవచ్చనే ఉద్దేశంతో రైతులు ఉన్నారు. అయితే కనెక్షన్ల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. విద్యుత్ అధికారులు వేసిన ఎస్టిమేట్ల ప్రకారం డబ్బులు చెల్లించినప్పటికీ 12,293 మంది రైతులు కనెక్షన్ ఎప్పుడిస్తారో తెలియక విద్యుత్ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. తొమ్మిది నెలల్లో 1,474 కనెక్షన్లు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు తొమ్మిది నెలలు పూర్తవుతోంది. ఈ మధ్య కాలంలో ఇచ్చిన కనెక్షన్లు 1,474 మాత్రమే. కర్నూలు జిల్లాలో 1,002, నంద్యాల జిల్లాలో 472 మాత్రమే విడుదలయ్యాయి. నిబంధనల ప్రకారం సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా.. టీడీపీ నేతల జోక్యంతో అర్హులకు అన్యాయం జరుగుతోందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఎలాంటి పనులు చేయరాదని బహిరంగంగా చెప్పడంతో కిందిస్థాయి టీడీపీ నేతలు మరింత చెలరేగిపోతున్నారు. పేరుకుపోతున్న దరఖాస్తులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు వేలాది రూపాయలు చెల్లించారు. ఉమ్మడి జిల్లాలో 12,293 మంది రైతులు తమ వాటా మొత్తం చెల్లించి కనెక్షన్ల కోసం నిరీక్షిస్తున్నారు. కర్నూలు జిల్లాలో 7,642, నంద్యాల జిల్లాలో 4,651 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు మరో 6వేల మంది ఉన్నారు. ఈ రైతులకు సంబంధించి విద్యుత్ అధికారులు ఎస్టిమేట్లు వేసి డిమాండ్ నోటీసులు ఇస్తే తమ వాటా సొమ్ము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వ్యవసాయ విద్యుత్‌పై అలసత్వం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ట్రాన్స్పార్మర్లు కాలిపోతే దక్కులేదు కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు మెటీరియల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇదే సమయంలో పాత కనెక్షన్లకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే వెంటనే ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవసాయానికి అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. నాటి ప్రభుత్వ ఆదేశాల మేరకు దళారీల ప్రమేయం లేకుండా.. రైతుల నుంచి ఒక్క రూపాయి వసూలు చేయకుండా ట్రాన్స్ఫార్మర్లను సరఫరా చేసి ఏర్పాటు చేయడం విశేషం. నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినప్పుడు కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు 24 గంటల సమయం ఉంటుంది. ఇప్పుడు వారం రోజులు దాటినా ట్రాన్స్ఫార్మర్లు సరఫరా చేయలేని పరిస్థితి. మే చివరికి పూర్తి చేస్తాం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 1,474 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు విడుదల చేశాం. ఇంకా 12,293 కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. మే నెల చివరికి పూర్తి చేస్తాం. సీనియారిటీ ప్రకారం కనెక్షన్లు ఇస్తాం. – ఉమాపతి, ఎస్ఇ, విద్యుత్ శాఖ, కర్నూలు జిల్లా ఈ చిత్రం మద్దికెర మండలం బసినేపల్లి గ్రామంలోనిది. బోర్లలో నీళ్లు పడినా రైతులుపంటలు పండించుకోలేని పరిస్థితి. ఆరేడుగురు రైతులు 14–15 నెలల క్రితం బోర్లు వేయించుకున్నారు. బోర్లలో ఆశాజనకంగా నీళ్లు పడ్డాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్నారు. విద్యుత్ అధికారులు ఎస్టిమేట్లు వేశారు. రైతులు తమ వాటా మొత్తాన్ని డీడీ తీశారు. ఆ మేరకు పోల్ సరఫరా చేసి నాటారు. ఇతర మెటీరియల్ ఇవ్వకపోవడంతో నీళ్లున్నా విద్యుత్ కనెక్షన్ లేక భూములను ఖాళీగా ఉంచుకున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి ట్రాన్స్ఫార్మర్లతో పాటు కండక్టర్, కేబుల్ కొరత ఉంది. 2024 జూలై 25 నాటి వరకు పెండింగ్‌లో ఉన్న వాటికి ట్రాన్స్ఫార్మర్లు సరఫరా అయ్యాయి. పెండింగ్‌లో ఉన్న మొత్తం కనెక్షన్లకు ఇంకా 1,900 ట్రాన్స్ఫార్మర్లు అవసరం. ఈ ట్రాన్స్ఫార్మర్లు ఎప్పటికి వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. 2వేల కిలోమీటర్లకు కండక్టర్, కేబుల్ అవసరం కాగా.. ఇందుకోసం రైతులు తగిన మొత్తాన్ని చెల్లించారు. అయితే సరఫరా చేయడంలో ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. -
వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
జూపాడుబంగ్లా: శ్రీశైలం క్షేత్రానికి పాదయాత్రతో వెళ్లే భక్తులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ వెంకటరమణ అన్నారు. మండ్లెంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆదివారం ఆయన తనిఖీ చేశారు. వైద్య శిబిరాలకు కేటాయించిన సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సూచించారు. తీవ్ర అస్వస్థతకు గురైన భక్తులు వస్తే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. పాదయాత్ర భక్తులు వైద్య శిబిరాలను సద్విని యోగం చేసుకోవాలన్నారు. మధ్యాహ్న సమయంలో పాదయాత్రకు విరామం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం జిల్లాలో బ్రాహ్మణకొట్కూరు, మండ్లెం, నందికొట్కూరు, ఆత్మకూరు, వెంకటాపురం, గూడెం, పెద్ద చెరువు ప్రాంతాలతో పాటు పలుచోట్ల 13 వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం జూపాడుబంగ్లా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. ఆయన వెంట డాక్టర్ యశశ్విని తదితరులు ఉన్నారు. శ్రీశైలానికి పోటెత్తిన కన్నడిగులు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల క్షేత్రానికి కన్నడ భక్తులు పోటెత్తారు. కర్ణాటక, మహారాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. కన్నడ భక్తులతో శ్రీగిరి క్షేత్రం నిండిపోయింది. ఆదివారం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి బారులు తీరారు. కన్నడ భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. కన్నడ భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగాణం మారుమోగుతుంది. ఈ నెల 27వ తేదీ నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని కన్నడ భక్తుల సౌకర్యార్థం ఈ నెల 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు విడతల వారీగా మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు. దీంతో కన్నడ భక్తులు మల్లన్న స్పర్శదర్శనం చేసుకునేందుకు బారులు తీరుతున్నారు. అయితే స్పర్శదర్శనం టికెట్టు ఇచ్చేందుకు కౌంటర్లు పెంచా లని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
పరీక్షల నిర్వహణ భారమాయె!
● ‘పది’ పరీక్షలకు అరకొర బడ్జెట్ ● ఒక్కో విద్యార్థికి ఇస్తున్నది రూ.10 మాత్రమే ● ఆవేదనలో పరీక్షల నిర్వహణ యంత్రాంగం ● పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లపై భారం నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి పరీక్షల నిర్వహణకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఎందుకూ సరిపోవడం లేదు. అదనపు నిధుల కోసం ఉపాధ్యాయ సంఘాలు చేసిన వినతిపై ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. దీంతో పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ల (సీఎస్) జేబులకు చిల్లు పడుతోంది. పదో తరగతి పరీక్షల నిర్వహణకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. 2018లో ఒక్కో విద్యార్థికి కంటింజెంట్ చార్జ్ కింద రూ.5.50లు మాత్రమే ప్రభుత్వం చెల్లించేది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెరిగిన ధరలను అప్పటి సీఎం వైఎస్ జగన్ దృష్టిలో ఉంచుకుని కరోనా విపత్కర పరిస్థితిలోనూ 2020, 2021, 2023లో కంటింజెంట్ చార్జీ రూ.5.50 నుంచి రూ.8కు పెంచారు. 2024లో రూ.10కు పెంచారు. ప్రస్తుతం అదే చార్జీలనే కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణకు ఈ నిధులు సరిపోక అదనపు మొత్తాన్ని సీఎస్‌లు భరిస్తున్నారు. అరకొర నిధులతో సతమతం పోలీసు స్టేషన్లల్లో భద్రపరిచిన ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు, పరీక్షల అనంతరం జవాబు పత్రాలను తపాలా కార్యాలయానికి తరలించేందుకు రవాణా ఖర్చులు, కొవ్వొత్తులు, దారం, లక్క, స్టాప్లర్లు, స్కెచ్ పెన్నులు, గమ్, వైట్నర్ తదితర స్టేషనరీ కొనుగోలు తడిసి మోపెడవుతోంది. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంల జవాబు పత్రాల కోసం వేర్వేరు సంచులను వాడుతున్నారు. ఒక్కో సంచి కోసం రెండు నుంచి మూడు మీటర్ల వరకు వస్త్రాన్ని వాడాల్సి వస్తోంది. దీంతో పరీక్షల నిర్వహణకు సంబంధించి కంటింజెంట్ చార్జీలను పెంచాలని కూటమి ప్రభుత్వానికి పలుమార్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. సాధారణంగా ఒక పరీక్ష కేంద్రంలో 100 మంది విద్యార్థులుంటే ప్రస్తుతం పరీక్ష నిర్వహణ కింద ఇస్తున్న ఒక్కొ విద్యార్థికి రూ.10 చొప్పున ఇస్తుండటంతో కేవలం రూ.వెయ్యి మాత్రమే అందుతుంది. ప్రస్తుత ధరలతో పోల్చుకుంటే అన్ని ఖర్చులు కలిపితే రూ.5వేలకు పైగా అవుతుంది. దీంతో ప్రభుత్వం చెల్లించిన రూ.వెయ్యి పోను మిగిలిన రూ.4 వేలను సీఎస్‌లే భరించాల్సి వస్తోంది. సీఎస్, డీఓలకు అరకొర భృతి... ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారిని నియమించారు. 240 మంది విద్యార్థులకు మించి ఉన్న కేంద్రానికి అదనంగా డీఓలు ఉంటున్నారు. సీఎస్‌లు, డీఓలు, కస్టోడియన్లు, ఇన్విజిలేటర్లకు రూ.150 నుంచి రూ.200ల భృతి కేటాయించాలన్న డిమాండ్‌ను సైతం ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణకు పెద్దగా తేడా లేకపోయినప్పటికీ ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఇన్విజిలేటర్లకు రూ.150 చెల్లిస్తుండగా పదో తరగతి పరీక్షల ఇన్విజిలేటర్లకు కేవలం రూ.33 మాత్రమే చెల్లిస్తున్నారు. వాటర్ బాయ్‌కి రూ.17లు, అటెండర్‌కు రూ.20లు చొప్పున భృతి చెల్లిస్తున్నారు. అరకొర భృతి చెల్లింపులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ముమ్మరంగా ఇంటర్ మూల్యాంకనం
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. నంద్యాల ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల పరీక్షలు ముగియడంతో అధ్యాపకులు పూర్తి స్థాయిలో మూల్యాంకనం ప్రక్రియకు హాజరవుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నంద్యాల జిల్లాకు సుమారుగా 2,01,066 జవాబు పత్రాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ముందుగా ఈ నెల 7వ తేదీ నాటికి సంస్కృతం పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. అప్పుడే మూల్యాంకనాన్ని ప్రారంభించినా ఈ నెల 22వ తేదీకి పూర్తిస్థాయిలో పేపర్లు చేరుకోవటంతో శనివారం నుంచి ఊపందుకుంది. ప్రస్తుతం ఇంగ్లిష్, మ్యాథ్స్, సంస్కృతం, హిందీ, ఫిజికల్స్, తెలుగు, సివిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. మరో ఒకటి, రెండు రోజుల్లో కామర్స్, బాటనీ, జువాలజీ, పేపర్లు రానున్నాయి. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 432 మంది అధ్యాపకులు అధికారులకు రిపోర్ట్ చేశారు. అందులో భాగంగా సంస్కృతం 12, తెలుగు–57, ఇంగ్లిష్–86, హిందీ–6, మ్యాథ్స్–84, సివిక్స్–32 చొప్పున బోర్డులను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బోర్డులో ఒక చీఫ్ ఎగ్జామినార్, ఐదుగురు అసిస్టెంట్ ఎగ్జామినర్లతో పాటుగా ఒక స్కూట్నీజర్ ఉంటారు. అదేవిధంగా ఈ నెలలో మరో మూడు దఫాల్లో మరి కొంతమంది అధ్యాపకులు ఈ మూల్యాంకనంలో పాల్గొననున్నారు. అధ్యాపకులను స్పాటుకు పంపించాలి స్పాట్ వాల్యూయేషన్ విధులకు నియమించిన అధ్యాపకులను కళాశాల ప్రిన్సిపాళ్లు రిలీవ్ చేసి పంపించాలి. ఇప్పటికే స్పాట్ పూర్తిస్థాయిలో ప్రారంభమైంది. ఏప్రిల్ మొదటి వారం వరకూ ఈ మూల్యాంకనం ప్రక్రియ కొనసాగనుంది. కళాశాల ప్రాంగణంలో ఉన్న సదుపాయాలు, పేపర్ల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకులను రెండు మూడు దఫాలుగా హాజరయ్యే విధంగా ఏర్పాటు చేశాం. – సునీత, డీఐఈఓ, నంద్యాల జిల్లాకు చేరుకున్న 2,01,066 జవాబు పత్రాలు రిపోర్ట్ చేసిన 432 మంది అధ్యాపకులు -
ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలవారికి పింఛన్లు ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. పదినెలలు గడస్తున్నా ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదు. ఇప్పటి వరకు 50 ఏళ్ల పింఛన్ రాకపోగా నాకు 60 ఏళ్ల వయస్సు వచ్చింది. కనీసం వృద్ధాప్య పింఛన్‌కు దరఖాస్తు చేసుకుందామనుకున్నా కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు. – నాగయ్య, కోవెలకుంట్ల ఇంకెన్నాళ్లు కాలయాపన వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని దాదాపు రెండేళ్లు కావస్తోంది. నా భర్త నాగరాజుకు ప్రతి నెల వృద్ధాప్య పింఛన్ వచ్చేది. అనారోగ్యంతో మృతి చెందగా భర్త పింఛన్ భార్యకు వస్తుందన్నారు. గత ఏడాది జనవరి నెలలోనే పింఛన్ రావాల్సి ఉంది. వివిధ కారణాలతో ఆ నెలలో రాకపోగా తర్వాత ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చినా ఇప్పటి వరకు పింఛన్ అందలేదు. పింఛన్ మంజూరు చేసి అధికారులు ఆదుకోవాలి. – లీలావతమ్మ, కోవెలకుంట్ల పేదలకు ఆసరాగా నిలవాలి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 50 ఏళ్ల నుంచి 59 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్లు మంజూరు చేయాలి. ఈ వయస్సులో వివిధ రోగాలతో బాధపడుతూ ఎంతో మంది వ్యవసాయ, ఉపాధి పనులు చేయలేకపోతున్నారు. అలాంటి వారికి ప్రతినెలా వచ్చే 4 వేల రూపాయలు ఎంతో ఆసరాగా ఉంటుంది. 50 ఏళ్లు వయస్సు నిండి పింఛన్ వస్తుందని ఎదురు చూస్తున్నాను. – దేవరత్నం, అవుకు -
ఎన్నికల ముందు ఎన్నో అమలు కాని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ పథకాల విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. పది నెలలు కావస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను దగా చేస్తోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి
కోవెలకుంట్ల: అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు 20 లక్షల ఉద్యోగాలు/ నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాది కూ. 15 వేలు, అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 20 వేలు పెట్టుబడి సాయం, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల సరఫరా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ కూటమి నేతలు హామీ ఇచ్చారు. వీటిలో ఉచిత గ్యాస్ సిలిండర్ హామీని అరకొరగా అమలు చేసి చేతులు దులుపుకుంది. సూపర్‌సిక్స్ హామీలు అటుంచితే 50 ఏళ్లకు పింఛన్ అందుతుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆశపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి జిల్లాలోని 29 మండలాల పరిధిలో 2.22 లక్షల మంది పింఛన్ దారులున్నారు. పింఛన్లకు అర్హత ఉండి మరో 4,500 మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గడిచిన పది నెలల కాలంలో వివిధ కారణాలు సాకు చూపి దాదాపు 7 వేల పింఛన్లు తొలగించారు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో 50 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దాదాపు 2 లక్షల మంది ఉన్నట్లు ప్రాథమిక అంచనా. వీరంతా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆహార అలవాట్ల కారణంగా 50 ఏళ్లకే ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. బీపీ, షుగర్, కాళ్లనొప్పులు, తదితర దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో వ్యవసాయ, ఉపాధి పనులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నెలకు రూ. 4 వేలు పింఛన్ వస్తే కుటుంబ పోషణ, మందులకు ఆసరాగా ఉంటుందని భావించిన వారికి నిరాశే మిగిలింది. ఒకవైపు పనులు చేతకాక, మరోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. 50 ఏళ్ల వారికి పింఛన్లు ఎప్పుడిస్తారని అర్హత ఉన్న వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కొత్త పింఛన్ల ఊసే లేదు 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల ప్రస్తావననే పక్కన పెట్టింది. గత ఏడాది జనవరి నెల నుంచి ఎన్నికల కోడ్ వచ్చే నాటికి జిల్లాలో 4,500 మంది వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, చేనేత, తదితర పింఛన్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి గత ఏడాది జూన్ నెలలో కొత్త పింఛన్లు అందాల్సి ఉంది. వీరందరూ 14 నెలల నుంచి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. పింఛన్ వస్తుందని ఆశగా గత పది నెలల నుంచి సచివాలయాల వద్ద వెళ్లి అడిగితే కొత్త పింఛన్లు విడుదల కాలేదని సిబ్బంది చెబుతుండటంతో ఉసురుమంటూ వెనుదిరుగుతున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారే కాకుండా గత ఏడాది జూన్ నెల నుంచి పింఛన ్లకోసం అర్హత ఉండి దరఖాస్తు చేసుకునేందుకు వందల మంది ఉన్నారు. డిసెంబర్ నెల నుంచి కొత్త పింఛన్‌దారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు సచివాలయల్లో పింఛన్ దరఖాస్తు వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం గమనార్హం. ప్రస్తుతం పింఛన్ పొందుతూ అనారోగ్యం, వివిధ కారణాలతో పింఛన్ లబ్ధిదారుడు మృతి చెందితే అలాంటి పింఛన్లు మాత్రమే ఆ మరుసటి నెల ఇస్తున్నారు. గత జనవరి నుంచి మార్చి నెల వరకు ఇలాంటి పింఛన్ల కోసం వందల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నా వాటిని పరిగణలోకి తీసుకోకపోవడం విచారకరం. జగనన్న పాలనలో ఇలా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న విప్లవాత్మక మార్పులు చేపట్టారు. గ్రామ సచివాలయ, వలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు ఠంచన్‌గా అందాయి. మొదట్లో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఒకటి, రెండు నెలల్లో పింఛన్ చేతికందేది. తర్వాత ఏటా జూలై నుంచి డిసెంబర్ వరకు పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి జనవరి నెలలో, జనవరి నుంచి జూన్ నెల వరకు దరఖాస్తు చేసుకున్న వారికి జూలై నెలలో కొత్త పింఛన్లు మంజూరు చేసి పేదలను ఆదుకుంది. 50 ఏళ్లకే పింఛన్ అమలులో కూటమి ప్రభుత్వం కాలయాపన పది నెలలు అవుతున్నా కార్యాచరణ అంటూ జాప్యం జిల్లాలో 2 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఎదురుచూపు వృద్ధాప్య, వితంతు కొత్త పింఛన్ల ఊసేలేదుసూపర్ సిక్స్‌కు నిధుల్లేవ్జిల్లాలో ఇదీ పరిస్థితి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి పింఛన్ల సంఖ్య: 2.22 లక్షలు ఇప్పటి వరకు కోత పెట్టినవి: 7 వేలు కొత్త పింఛన్ల దరఖాస్తుల సంఖ్య: 4,500 జిల్లాలో 50 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న వారు: 2 లక్షల మంది -
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి.రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు అందజేయాలన్నారు. ఉదయం 9.30 గంటల ప్రారంభమయ్యే కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ హాజరు కావాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయి లో నిర్వహించే కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వెలుగోడు ఎస్ఐపై బదిలీ వేటు వెలుగోడు: పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెలుగోడు ఎస్ఐ విష్ణు నారాయణపై బదిలీ వేటు పడింది. ఆయనను తిరుపతికి బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల వేల్పనూరు – పెసరవాయి పంట పొలాల్లో పేకాట స్థావరంపై దాడి చేసిన సమయంలో రూ. 5 లక్షలు స్వాధీనం కాగా.. రూ. 12 వేలు చూపించారని ఆరోపణలు వచ్చాయి. అలాగే రెండు నెలల క్రితం స్టేషన్‌కు వచ్చిన గిరిజన సంఘం నాయకుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసారు.ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ చేయడంతో అక్రమాలు వెలుగు చూడటంతో తిరుపతికి బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అక్షరం నేర్పకుండానే.. నంద్యాల(న్యూటౌన్): ఉల్లాస్ కార్యక్రమం కింద స్వయం సహాయక సంఘాల్లో నిరక్షరాస్యులకు అక్షరం నేర్పించకుండానే పరీక్ష నిర్వహించారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో అక్షర జ్ఞానాన్ని నేర్పించే కార్యక్రమాన్ని వయోజన విద్యకు చెందిన సూపర్వైజర్లు పర్యవేక్షణ చేయాలి. కానీ వారు జిల్లా కేంద్రానికి పరిమితమై పర్యవేక్షణ చేయలేకపోవడంతో మెజార్టీ కేంద్రాల్లో అక్షరాలు నేర్చుకోలేదు. కొన్ని కేంద్రాల్లో స్వచ్ఛందంగా పొదుపు సంఘాల్లోని చదువుకున్న వారు అక్షరాలను నేర్పించినా...అది సంతకాల వరకే పరిమితం అయ్యింది. జిల్లాలో 670 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 26,785 మందికి గాను 23,861 మంది హాజరయ్యారు. 2,924 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. మెజార్టీ కేంద్రాల్లో డీఆర్ డీఓ గుర్తించిన నిరక్షరాస్య మహిళలు కాకుండా వారి పిల్లలు, అప్పటికే చదువుకున్న వారితో పరీ క్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల పరీ క్షలు నిర్వహించకుండానే పరీక్షలు రాసినట్లు సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. పాణ్యంలో ఓ పరీక్ష కేంద్రాన్ని వయోజన విద్య ఉప సంచాలకులు చంద్రశేఖర్‌రెడ్డి పరిశీలించారు. పెండింగ్ ప్రాజెక్టుల కోసం పోరాటం ఉద్ధృతం నంద్యాల(అర్బన్): రాయలసీమ సాగునీటి పెండింగ్ ప్రాజెక్టుల కోసం పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆత్మకూరు రవీంద్రనాథ్ అధ్యక్షతన నూనెపల్లె అమ్మవారి శాలలో వైశ్య ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజలు, రైతుల ఆకాంక్షలను గౌరవించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గాలేరు నగరి, హంద్రీనీవా, కేఆర్ఎండీ ఏర్పాటు, సాగునీటి జలాల గురించి ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సిద్దేశ్వరం అలుగు 9వ వార్షికోత్సవానికి 2 లక్షల మందితో ర్యాలీగా వెళ్లి సీమ రైతులకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు వైఎన్‌రెడ్డి, వైశ్య ప్రముఖులు అయ్యపుశెట్టి సుబ్రమణ్యం, శేషయ్య, గెలివి రామకృష్ణ పాల్గొన్నారు.