
కర్నూలు జిల్లాలో 3926 ఎకరాలు,నంద్యాల జిల్లాలో 8330 ఎకరా
టన్ను కూడా రానట్లే..
మాకున్న పది ఎకరాల మామిడి తోటల్లో అధికంగా బేనీసా చెట్లు సాగు చేస్తున్నాం. గత డిసెంబర్‌లో పూత బాగా వచ్చింది. అప్పుడు చలి వాతావరణం ఎక్కువ ఉండటంతో తేనే మంచు తెగులుతో పూత మొత్తం రాలిపోయింది. 10 శాతం కూడా మిగల్లేదు. కనీసం ఎకరాకు 4–5 ట న్నుల వరకు దిగుబడి రావాల్సి ఉంది. పూత రాలిపోవడంతో టన్ను కూడా వచ్చే పరిస్థితి లేదు. ఖరీఫ్, రబీ పంటలు దెబ్బతీశాయి. ఇప్పుడు మామిడి కూడా నిరాశకు గురి చేయడం ఆందోళన కలిగిస్తోంది. – వెంకటసుబ్బారెడ్డి,
పాలకొలను, ఓర్వకల్లు మండలం
మామిడి ఆశలు గల్లంతే..
మాకు 3 ఎకరాల్లో మామిడి తోట ఉంది. పూత బాగా వచ్చిందని, ఈ సారి బాగా కలసి వస్తుందని ఆశించాం. ఎకరాకు కనీసం ఆరు టన్నుల వరకు దిగుబడి వస్తుందని ఆంచనా. వేసవి ఉష్ణోగ్రతలకు పూత దాదాపుగా రాలిపోయింది. 5 నుంచి 10 శాతం వరకే ఉంది. దిగుబడి ఎకరాకు టన్ను కూడా వచ్చే పరిస్థితి లేదు. గత ఏడాది టన్ను మామిడి ధర రూ.60వేల–రూ.80 వేల వరకు విక్రయించాం. ఈ ప్రకారం చూస్తే ఎకరాకు కనీసం రూ.3 లక్షల వరకు నష్టం వస్తోంది.
– వెంకటేశ్వర్లు, సిద్ధ్దనగట్టు, వెల్దుర్తి మండలం
మామిడిలో కనిపించని పిందె, కాయలు
మామిడిని దెబ్బతీసిన
వాతావరణ పరిస్థితులు
● ఈ సారి రెండు దఫాలుగా
వచ్చిన పూత
● డిసెంబరులో పగబట్టిన పొగమంచు
● ఫిబ్రవరిలో ముంచిన అధిక
ఉష్ణోగ్రతలు
● సాధారణంగా ఎకరాకు సగటున
ఆరు టన్నుల దిగుబడి
● ఈసారి టన్ను దాటితే గగనం
కర్నూలు జిల్లాలో మామిడి తోటలు
● ఓర్వకల్లు, కల్లూరు, వెల్దుర్తి, కృష్ణగిరి, తుగ్గలి, గూడూరు, దేవనకొండ, పత్తికొండ, సి.బెలగల్, హాలహర్వి తదితర మండలాలు.
నంద్యాల జిల్లాలో మామిడి తోటలు
● ప్యాపిలి, డోన్, బేతంచెర్ల, బనగానపల్లి, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల, అవుకు తదితర మండలాలు.
ఒక మోస్తరు దిగుబడులు వస్తాయి
వాతావరణ పరిస్థితులు మామిడి ని కొంతవరకు దెబ్బతీశాయి. ఈ సారి డిసెంబర్ నుంచే పూత మొ దలైంది.ఫిబ్రవరి నెలలోనూ పూత వచ్చింది. అయితే డిసెంబర్‌లో వచ్చిన పూత అధిక చలి, పొగ మంచు బారిన పడింది. ఫిబ్రవరి పూత అధిక ఉష్ణోగ్రతలతో దెబ్బతినింది. ఎకరాకు రెండు నుంచి మూడు టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో బేనీ స ఎక్కువగా ఉంది. ఇవి ఒక ఏడాది బాగా పంటను ఇస్తే మరుసటి ఏడాది పంటను పూర్తిగా ఇవ్వలేవు. గత ఏడాది బాగా వచ్చింది.ఈ సారి కొంత తగ్గవచ్చు.
– పి.రామాంజనేయులు, జిల్లా ఉద్యాన అధికారి
కర్నూలు(అగ్రికల్చర్): పళ్లలో మామిడి రారాజు. సామాన్యులు మొదలుకొని సంపన్నుల వరకు ఈ పండును ఇష్టపడని వారుండరు. వేసవి వచ్చిందంటే మామిడితో మార్కెట్‌లో కళకళలాడుతుంది. అతివృష్టి, అనావృష్టితో ఖరీఫ్ పంటలు దెబ్బతీసినా రైతులను మామిడి ఆదుకునేది. ఇలాంటి మామిడి కూడా ఈ ఏడాది గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఉమ్మడి జిల్లాలో 12,256 ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా.. గత ఏడాది ఎకరాకు సగటున 8 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. ఈ సారి మామిడి రైతులను తీవ్ర నిరాశకు గురి చేసింది. మామిడిపై పెట్టుకున్న ఆశలు గల్లంతు అయ్యాయి. వాతావరణ పరిస్థితులు తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ ఏడాది పూత ఆశాజనకంగా వచ్చినప్పటికీ వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పూత, పిందే రాలిపోయింది. దిగుబడులు 80 శాతంపైగా పడిపోతుండటంతో ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఏర్పడింది.
రెండు దఫాలుగా వచ్చిన పూత
మామూలుగా అయితే డిసెంబర్, జనవరి నెలల్లో పూత వస్తే ఎండల తీవ్రత పెరిగే సమయానికి కాయలు ఏర్పడుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగినా అంతగా నష్టం ఉండదు. ఈ సారి మామిడిలో పూత రెండు దఫాలుగా వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్‌లోనే పూత వచ్చింది. ఆ సమయంలో చలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో పాటు మంచుకూడా కురవడంతో తేనేమంచు పురుగులు, ఇతర తెగుళ్లు విజృంబించడంతో పూత మొత్తం రాలిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో ఫిబ్రవరిలో పూత వచ్చింది. అప్పుడు ఉష్ణోగ్రతలు పెరగడంతో పూత రాలిపోయింది. ఇదే సమయంలో నల్ల తామర కూడా మామిడి రైతును తీవ్రంగా దెబ్బ తీసింది. 2024–25లో వ్యవసాయం కలసి రాలేదు. అధిక వర్షాలు, అనావృష్టి పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. అంతంతమాత్రం వచ్చిన దిగుబడులకు గిట్టుబాటు ధరలు లభించని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మామిడి తోటలు అభివృద్ధి చేసుకున్న రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల మామిడిలో పూత, పిందె 80నుంచి 90 శాతం వరకు రాలిపోవడంతో రైతుల ఆశలు నీరుగారిపోయాయి.
వాతావరణ బీమాపై అవగాహన
కల్పించడంలో విఫలం
● ప్రకృతి వైపరీత్యాల వల్ల మామిడి పంట దెబ్బతింటే వాతావరణ బీమా కింద రైతులకు చేయూత లభిస్తుంది.
● కూటమి ప్రభుత్వం 2024–25 సంవత్సరానికి నంద్యాల జిల్లాలో మాత్రమే మామిడికి వాతావరణ బీమా అమలు చేసింది.
● కర్నూలు జిల్లాలో కూడా మామిడి తోటలు ఉన్నప్పటికీ ఇక్కడి రైతులను విస్మరించింది.
● నంద్యాల జిల్లా మామిడి రైతులు వాతావరణ బీమాను సద్వినయోగం చేసుకునే విధంగా అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు.
● నంద్యాల జిల్లాలో 8,330 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నప్పటికీ 150 మంది రైతులు మాత్రమే ప్రీమియం చెల్లించినట్లు తెలుస్తోంది.

కర్నూలు జిల్లాలో 3926 ఎకరాలు,నంద్యాల జిల్లాలో 8330 ఎకరా

కర్నూలు జిల్లాలో 3926 ఎకరాలు,నంద్యాల జిల్లాలో 8330 ఎకరా

కర్నూలు జిల్లాలో 3926 ఎకరాలు,నంద్యాల జిల్లాలో 8330 ఎకరా

కర్నూలు జిల్లాలో 3926 ఎకరాలు,నంద్యాల జిల్లాలో 8330 ఎకరా