కొత్తపల్లి: కుంటలో నీళ్లు తాగేందుకు వెళ్లి ఓ గేదె, రెండు నక్కలు మృత్యువాత పడ్డాయి. బావాపురం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అనే రైతుకు చెందిన గేదె గురువారం సాయంత్రం ఇంటి నుంచి మేత మేసేందుకు పొలాల్లోకి వెళ్లి రాత్రి అయినా తిరిగి రాలేదు. శుక్రవారం ఉదయాన్నే రైతు గేదె కోసం గాలిస్తుండగా గ్రామ పొలిమేరలోని కురుకుంద చెరువు అలుగు వాగులో గేదె, పక్కనే మరో రెండు నక్కలు కూడా మృత్యువాత పడినట్లు గమనించాడు. వాగులో విద్యుత్ తీగ పడి ఉండటంతో విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు భావించాడు. గురువారం సాయంత్రం మండలంలో ఈదురుగాలులతో కూడిన చిన్నపాటి వర్షం కురిసింది. ఈ ఈదురుగాలులకు పొలాల్లోని విద్యుత్ తీగ తెగి వాగులోని నీటి కుంటలో పడింది. దీంతో నీరు తాగేందుకు వెళ్లిన గేదె, నక్కలు విద్యుత్ షాక్‌తో మృత్యువాతతో చనిపోయినట్లు తెలుస్తోంది.
గేదె, రెండు నక్కలు మృత్యువాత