‘చంద్రన్న బీమా’కు గ్రహణం
నంద్యాల: ఎన్నికల ముందు బీరాలు పలికిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకా లను అటకెక్కిస్తున్నారు. గత ప్రభుత్వంలో వైఎస్పార్ బీమా పేరుతో ఈ పథకం ఎంతో మంది పేదలకు మేలు జరిగింది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల సభల్లో గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చంద్రన్న బీమాను మళ్లీ అమలు చేస్తామని, రూ.5 లక్షల ఉన్న పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచి అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అయినప్పటికీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. అయిన వారిని కోల్పోయి ఆధారం లేక బీమా కోసం ఎదురు చూస్తున్న బాధితులకు కూడా మొండి చెయ్యి చూపించారు. పరిహారం పెంచడం మాట అటుంచితే గతంలో ఉన్నది ఇవ్వకపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 4,700 కై ్లమ్‌లు పెండింగ్‌లో ఉండగా ప్రస్తుతం కనీసం దరఖాస్తులు స్వీకరించడం లేదు. చంద్రన్న బీమా పథకంలో భాగంగా 18–50 ఏళ్ల లోపు వారు సహజ మరణం పొందితే రూ.లక్ష, ప్రమాదవశాత్తూ మృతి చెందినా శాశ్వత వైకల్యం పొందినా రూ.5 లక్షల చొప్పున వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పరి హారం అందజేశారు. 51–70 ఏళ్ల లోపు వారు ప్రమా దవశాత్తూ మరణిస్తే రూ.3 లక్షలు చొప్పున ప్రమాదంలో పాక్షిక వైకల్యం పొందిన వారికి రూ.2.50 లక్షలు అందజేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాదశవాత్తు ఎవరైనా మరణిస్తే రూ.5 లక్షలు ఇచ్చే పరిహారాన్ని రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారే కాని ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. వ్యక్తి మృతి చెందిన తరువాత బాధిత కుటుంబానికి 30 రోజుల్లోగా పరిహారం అందాల్సి ఉంది. సహజ మరణం పొందిన వ్యక్తి వివరాలను 7 రోజులు, ప్రమాదాలకు గురైతే 15 రోజుల్లోపు సచివాలయాల్లో నమోదు చేయించాలి. బీమా సభ్యుడిగా ఉన్న వ్యక్తి చనిపోతే వెంటనే రూ.10 వేలు మట్టి ఖర్చుల కింద అందజేయాలి. మిగిలిన మొత్తాన్ని నామినీ వ్యక్తి గత బ్యాంకు ఖాతాకు జమ చేయాలి.
బాధిత కుటుంబాలు నిరీక్షణ
నెలలు తరబడి కై ్లములు పరిష్కారం కాకపోవడంతో బాధిత కుటుంబాలకు నిరీక్షణ తప్పడం లేదు. వాస్తవానికి 30 రోజుల్లోపే బీమా పరిహారం సొమ్ము బాధిత కుటుంబాలకు అందాల్సి ఉంది. ఇంటి పెద్దను, ఆసరా అందించే వారిని కోల్పోయి కుటుంబాల పోషణ కష్టంగా మారిన పరిస్థితుల్లో ప్రభుత్వం అందిస్తున్న ఈ సొమ్ము వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాని కూటమి ప్రభుత్వం బాధితుల ఆర్తనాదాలు వినకుండా హామీని తుంగలో తొక్కి అంత చేస్తున్నాం.. ఇంత చేస్తున్నాం అంటూ ప్రచారాలు మాత్రం చేసుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మార్గదర్శకాలు రాలేదు
చంద్రన్న బీమా పథకంపై ఇంకా ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందలేదు. ఎవరైనా సాధారణ, ప్రమాదానికి గురై మృతిచెందితే వెంటనే సచివాలయాల్లో నమోదు అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం పరిహారాన్ని పెంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంది. త్వరలోనే పెండింగ్ కై ్లమ్‌లతో పాటు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కై ్లములు కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
–శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ, నంద్యాల
పేరు మార్పుతో సరిపెట్టిన
కూటమి ప్రభుత్వం
రూ.10 లక్షలు ఇస్తామని
హామీ ఇచ్చి పైసా కూడా ఇవ్వని వైనం
పెండింగ్‌లో వేలాది కై ్లమ్‌లు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో
వైఎస్సార్ బీమా సక్రమంగా అమలు
‘చంద్రన్న బీమా’కు గ్రహణం


