పిల్లిగుండ్ల, నెరుడుప్పల రహదారిలోని జీడీపీ కూడి కాలువ కల్వర్టు పూర్తిగా కుంగిపోయింది. దీంతో పాటు రక్షణ గోడ కూడా లేదు. వాహనదారులు ఏ మాత్రం ఆదమరిచినా కాలువలో పడిపోయే అవకాశం ఉంది. ఈ రహదారి మీదుగా పిల్లిగుండ్ల, ఒంటెడుదిన్నె, నెరుడుప్పల, ఎర్రబాడు, దేవనకొండ మండలం కేంద్రంతో పాటు ఆయా గ్రామాలకు వెళ్తుంటారు. అయితే ఆ కాలువ దగ్గర రోడ్డు మలుపు ఉండడం, కల్వర్టుకు రక్షణ గోడ లేకపోవడంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. పైగా కల్వర్టు పూర్తిగా కుంగిపోయింది. అలాగే కల్వర్టు కింద, పక్కన గట్టు పూర్తిగా దెబ్బతినడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని వాహనదారులు భయందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో అయితే వాహనదారులు భయపడుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి కుడి కాలువకు నూతన కల్వర్టుతో పాటు రక్షణ గోడ నిర్మించాలని, దెబ్బతిన్న కాలువ గట్టుకు మరమ్మతులు చేయించాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
– గోనెగండ్ల


