
ఆత్మకూరు, మహానందిలో భారీ వర్షం
ఆత్మకూరు/మహానంది: అకాలంగా శనివారం ఆత్మకూరు, మమహానందిలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వర్షపునీరు నిలిచి వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆత్మకూరులో డ్రెయినేజీ లేకపోవడంతో మరిన్ని కష్టాలు వచ్చాయి. మహానంది మహాద్వారం వద్ద వర్షపునీరు నిలవడంతో భక్తులు అవస్థలు పడ్డారు. అధికారులు స్పందించి ఆలయం ఎదుట వర్షపునీరు నిలవకుండా తగిన చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా మహానంది మండలంలో భారీ వర్షానికి విద్యుత్ సరఫరా నిలిపేశారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో గ్రామాల్లో అంధకారం నెలకొంది. తమ్మడపల్లె, బొల్లవరం, నందిపల్లె తదితర గ్రామాల పరిధిలో వరి పైరు నేలవాలినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.