మదిరెలో సామూహిక వివాహాలు
కౌతాళం: మదిరె గ్రామంలోని ఉటగనూరు తాత మఠంలో శుక్రవారం 25 సామూహిక వివాహా లను మఠం ధర్మకర్త పంపారెడ్డి తాత, గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన హచ్చోళ్లి మఠం పీఠాధిపతి రుద్రమునిస్వామి మాట్లాడుతూ ఏటా సామూహిక వివాహలు నిర్వహించడంతో పాటు వధూవరులకు దుస్తులు, తాళిబొట్లతో పాటు ముక్కపుడకలు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఉటగనూరు మఠం ధర్మకర్త పంపారెడ్డి తాత మాట్లాడుతూ ఏటా దాతలు, గ్రామస్తుల సహకారంతో పేద జంటలకు వివాహలు జరపడం సంతోషంగా ఉందన్నారు.


