జీవితాల్లో చీకట్లు నింపారు | - | Sakshi
Sakshi News home page

జీవితాల్లో చీకట్లు నింపారు

Mar 31 2025 11:21 AM | Updated on Apr 1 2025 3:45 PM

నంద్యాల(అర్బన్‌): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ జీవితాల్లో చీకట్లు నింపారని వలంటీర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ విమర్శించారు. అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగిస్తామని, ప్రతి ఒక్కరికీ రూ.10వేలు వేతనం ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఉగాది పండుగ నేపథ్యంలో వలంటీర్లు ఆదివారం బొమ్మలసత్రం వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వలంటీర్లను రోడ్డున పడేసిందన్నారు. ఎంతో మంది వలంటీర్లు ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాజగోపాల్‌, కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, రఫీ, నాగన్న, సుధాకర్‌, అజ్మతుల్లా, హైమావతి, కల్యాణి, మాధవి, తదితరులు పాల్గొన్నారు.

నేడు పీజీఆర్‌ఎస్‌ రద్దు

నంద్యాల: కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రీడ్రసెల్‌ సిస్టమ్‌, పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31వ తేదీ సోమవారం రంజాన్‌ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా కేంద్రానికి రావద్దని విజ్ఞప్తి చేశారు.

అల్లా ఆశీస్సులు అందాలి

నంద్యాల: జిల్లా ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు అందాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి, జిల్లా ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా ఆదివారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్‌ పండుగను పురస్కరించుకొని ముస్లింలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. పవిత్రత, క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల మేళవింపే రంజాన్‌ పండుగ ముఖ్య ఉద్దేశమన్నారు. పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ విష్ణు చరణ్‌ అన్నారు.

విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

శ్రీశైలం: క్షేత్ర పరిధిలో విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండా లని జిల్లా ఎస్పీ అదిరాజ్‌సింగ్‌ రాణా అన్నారు. ఆదివారం శ్రీశైలం చేరుకున్న ఆయన భక్తులు వేచి ఉండే కంపార్ట్‌మెంట్లు, క్యూలను, లడ్డూ విక్రయ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. పోలీసు సిబ్బంది సమన్వయంతో ఉగాది ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను ఆయన దర్శించుకుని నంద్యాల జిల్లాల్లోని ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలన్నారు. ఆయన వెంట ఆత్మకూరు డీఎస్పీ రామంజి నాయక్‌, శ్రీశైలం వన్‌ టౌన్‌ సీఐ ప్రసాద్‌ రావు పాల్గొన్నారు.

జీవితాల్లో చీకట్లు నింపారు 1
1/1

జీవితాల్లో చీకట్లు నింపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement