పాల సేకరణ ధర పెంపు
నంద్యాల(అర్బన్): పాల సేకరణ ధరను పెంచి నట్లు విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయ సహకార సమితి ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కేజీ వెన్న శాతం ప్రకారం గేదె పాలు లీటరుపై రూ.1.20 నుంచి రూ.2, ఆవు పాలు లీటరుపై రూపాయి పెంచామన్నారు. మార్చి 16వ తేదీ నుంచే ఈ ధర అమల్లోకి వచ్చిందన్నారు. పాడి రైతులకు పశు పోషణకు సంబంధించి అన్ని ధరలు పెరిగినందున పాల సేకరణ ధరను పెంచుతూ నిర్ణ యం తీసుకున్నామన్నారు. ఈ అవకాశాన్ని పాల ఉత్పత్తి దారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ధరలు కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో పాలు పోస్తున్న రైతులంద రికీ వర్తిస్తాయన్నారు.
టోల్‌గేట్ల టెండర్‌లో
రూ. 1.68 కోట్ల ఆదాయం
మహానంది: మహానంది క్షేత్రంలో టోల్‌గేట్ల నిర్వహణకు ఏర్పాటు చేసిన టెండర్ల ద్వారా దేవస్థానానికి రూ. 1.68 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహానందిలోని పోచా బ్రహ్మానందరెడ్డి డార్మెటరీ భవనంలో సోమవారం బహిరంగ, సీల్డు టెండర్లు నిర్వహించారు. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ బి.నాగభూపాల్‌రెడ్డి రూ. 1,68,00,003తో నిర్వహణ బాధ్యతలను దక్కించుకున్నారు. ఇదే టోల్‌గేట్లకు గత ఏడాది రూ. 1.71 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది పోటీ అంతగా లేకపోవడంతో ఆశించిన మేరకు ఆదాయం లభించలేదు. టోల్‌గేట్ల నిర్వహణతో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న ఎనిమిది ఖాళీ ప్లాట్లకు జరిగిన బహిరంగ వేలాల్లో నెలకు రూ. 44,300 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. మరుగుదొడ్ల నిర్వహణ, ఇతర అంశాలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదా పడ్డాయి. కార్యక్రమంలో ఏఈఓ ఎరమ ల మధు, ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్‌రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు నాగమల్లయ్య, సుబ్బారెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
క్షయవ్యాధిపై అవగాహన కల్పించాలి
గోస్పాడు: క్షయవ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటరమణ అన్నారు. నంద్యాల పట్టణంలోని సర్వజ న ఆసుపత్రి ఆవరణంలోని మీటింగ్ హాల్‌లో సోమవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా క్షయ నివారణ అధికారి శార దాబాయి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జ్వరం, దగ్గు రెండు వారాలకు మించి ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. టీబీ నియంత్ర ణను, నివారణ చర్యలు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో విద్యార్థులకు ఎస్‌ఏ, క్విజ్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఫర్మార్మేషన్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. 15 మంది టీబీ బాధితులకు రెడ్‌క్రాస్, మదర్‌సొసైటీ సహకారంతో ఫుడ్ బాక్సెట్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ కాంతరావునాయక్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జఫరుల్లా, వైద్యాధికారులు తేజశ్వని, పీటర్ వినయ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్
శ్రీశైలం: నల్లమల ఘాట్ రోడ్డులో సోమవారం ట్రాఫిక్ జామ్ ఏర్పడి భక్తులు అవస్థలు పడ్డారు. శ్రీశైలం–దోర్నాల మధ్యలో ఉన్న తుమ్మల బయలు సమీపంలో రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోవడంతో సుమారు 5 కిలోమీటర్ల వరకు అటు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో భక్తు లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘన స్థలానికి చేరుకుని కూలిన చెట్టును పక్కకు తొలగించడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.