చివరికి మిగిలింది కన్నీరే! | - | Sakshi
Sakshi News home page

చివరికి మిగిలింది కన్నీరే!

Mar 31 2025 11:20 AM | Updated on Mar 31 2025 11:20 AM

చివరి

చివరికి మిగిలింది కన్నీరే!

ఎండిపోయిన ఆశలు

ఈ రైతు పేరు దశరథరామిరెడ్డి. అమ్మిరెడ్డి నగరానికి చెందిన ఈయన గోవిందిన్నె పొలిమేరలోని కేసీ కెనాల్‌ ఆయకట్టు కింద 10 ఎకరాల్లో వరి సాగు చేశాడు. సుమారు రూ. 4 లక్షల వరకు ఖర్చు అయింది. వరి పొట్టకొచ్చే వరకు అడపాదడపా వచ్చే నీరు 20 రోజులుగా పూర్తిగా నిలిచి పోయింది. మరో 20 రోజుల్లో చేతికొచ్చే పైరు పూర్తిగా ఎండిపోయిందని, ఇప్పుడు నీరు వచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదని పెట్టుబడిలో ఒక్క పైసా కూడారాదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

నష్టమే వచ్చింది

ఈ చిత్రంలో నీరు లేక బీటలు వారిన వరి దుబ్బులను చూపుతున్న రైతు పేరు నన్నెసాహెబ్‌. దొర్నిపాడు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన ఈయన కోవెలకుంట్ల మండలం కంపమల్ల గ్రామంలోని హరివరం చానెల్‌ కింద ఎకరాకు రూ. 20 వేల చొప్పున రెండు ఎకరాలకు మును గుత్త (కౌలు) చెల్లించి కౌలుకు తీసుకున్నాడు. ఇప్పటికి కౌలుతో కలుపుకుని సుమారు రూ. లక్షవరకు ఖర్చు చేశాడు. ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న వరి పూర్తిగా ఎండిపోయింది. రూ. లక్ష అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టానని, పైరు పూర్తిగా ఎండి పోయిందని, నష్టమే వచ్చిందని బోరున విలపిస్తున్నాడు.

కేసీ ఆయకట్టుకు 20 రోజులుగా

అరకొర నీరు

ఈ నెల 31 వరకే నీటి సరఫరా

అంటున్న అధికారులు

ఎండిపోతున్న పొలాలు..

రైతులకు మిగిలింది కన్నీరే!

చేష్టలుడిగి చూస్తున్న పాలకులు

ఆళ్లగడ్డ: ‘‘ రైతుల సంక్షేమమే ధ్యేయం.. బంగారు పంటలు పండేలా చేసి కరువు సీమను సస్యశామలం చేస్తాం’’ అని టీడీపీ నేతలు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. కేసీ కెనాల్‌కు 10 నెలలు అయినా సక్రమంగా నీరు రావడం లేదు. అరకొర వస్తున్న నీరు చివరి ఆయకట్టు చేరక పోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ప్రజాప్రతినిధుల మాటలు నమ్మి వరి సాగుచేసిన రైతులకు నష్టమే మిగులుతోంది. కేసీ కెనాల్‌కు ఎన్ని రోజులు నీరు విడుదల చేస్తారో నేటికీ స్పష్టత ఇవ్వడం లేదు. రూ. లక్షకు పైగా అప్పు చేసి సాగు చేసిన పైర్లను కొన్ని చోట్ల పశువుల మేతగా వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది. పంట ఎండిపోతుండటంతో రైతులు విలవిల్లాడుతున్నారు. కళ్లముందే ఎండిపోతున్న పంటను చూడలేక అనేక మంది కిలోమీటర్ల మేర పైపులు వేసుకుని రోజు రూ. వేలు వెచ్చించి పంటను తడిపేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇటు‘కేసీ’ చూడండి!

సుంకేసుల జలాశయం నుంచి ప్రారంభమయ్యే కేసీ కెనాల్‌ వైఎస్సార్‌ జిల్లా కృష్ణాపురం వరకు 304 కి.మీ పొడువునా ప్రవహిస్తుంది. తుంగభద్ర, కృష్ణా నీటిని కలిపి 31.9 టీఎంసీలు ఈ కాల్వకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ నీటితో 2,65,628 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలి. అయితే సుమారు 20 రోజులుగా నీరు సక్రమంగా అందడంలేదు. నీరు ఎప్పుడు వస్తుందో ఎన్నిరోజులు పారుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు.

బీటలు బారిన పొలాలు

జిల్లాలో నంద్యాల నుంచి ఆళ్లగడ్డ చివరి (వైఎస్సార్‌ జిల్లా సరిహద్దు) ఆయకట్టు 27వ లాక్‌ నీరు చేరాలంటే 16వ లాక్‌ వద్ద కనీసం 5.6 అడుగుల మేర నీటి ప్రవాహం ఉండాలి. కానీ సుమారు 20 రోజుల నుంచి ఎగువ నుంచి నీటి ప్రవాహం నిర్దేశించిన స్థాయిలో రావడంలేదు. ఫలితంగా 23వ లాక్‌ నుంచి 27వ లాక్‌ వరకు ప్రవాహం పూర్తిగా నిలిచింది. దీంతో చేతికందే దశలో ఉన్న వరి, మొక్కజొన్న, మిరప, మినుము, కొర్ర తదితర పంటలు దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. చివరి ఆయకట్టులో ఇప్పటికే ఎండిపోయి బీటలు బారిన పొలాలు ఇప్పుడు నీరందిన ఏమాత్రం ఫలితం ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మాటలు కోటలు.. నీళ్లల్లో కోతలు

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు సమృద్ధిగా సాగునీరు అందిస్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ పదేపదే చెప్పారు. అయితే మాటలు నీటిమూటలయ్యాయి. ఫిబ్రవరి చివరి వారం నుంచే కేసీలో నీళ్లు అరకొర రావడం మొదలయ్యాయి. మార్చిలో పూర్తిగా చివరి ఆయకట్టుకు నీరందలేదు. అయితే ఎమ్మెల్యే మాటలు నీటిమూటలు అయ్యాయని రైతులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే.. ఈ నెపం అధికారులపై నెట్టేందుకు పూనుకున్నారు. ఎమ్మెల్యే సోదరుడు విఖ్యాత్‌రెడ్డి కేసీ కెనాల్‌ పై ధర్నా చేస్తానని హుకుం జారీచేశారు. అలాగే కాల్వపై వెళ్లి అధికారులను ప్రశ్నించారు. తాజాగా ఎమ్మెల్యే పొన్నాపురం శివారులో కాల్వను పరిశీలించి ఇక్కడ 5 అడుగుల నీటిని స్టోరేజ్‌ చేసి దిగువకు విడుదల చేయాలని అధికారులతో వాదించారు. నీటి విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ప్రభుత్వంతో మాట్లాడి నీటిని విడుదల చేయించాలి కానీ.. అధికారులమీద మండిపడితే ఏం వస్తుందని చర్చించుకుంటున్నారు.

అదృష్టం బాగుంటే

నీరు వస్తుంది

నీళ్లు తక్కువగా ఉన్నాయి. ముందుగా కిందకు పారించి అక్కడి నుంచి ఆపుకుంటూ పైనున్న పొలాలకు అందించేలా ప్రణాళిక వేసుకున్నాం. ఈ మేరకు ఈ నెల 31వ తేదీ వరకు ఉన్న నీటిని అందరికీ పంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దీంతో పైనున్న కొందరు రైతులు ఆందోళన చేస్తున్నారు. వారికి నచ్చచెప్పాం. ఈ నెల 31 తరువాత కూడా నీళ్లు అందించేందుకు ప్రయత్నం చేస్తాం. అయితే కచ్చితంగా చెప్పలేం. అదృష్టం బాగుంటే నీరు వస్తుంది.

– రవీంద్ర, డీఈఈ, కెసీ కెనాల్‌

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కేసీ కెనాల్‌ కింద ఆయకట్టు

మండలం ఎకరాలు

శిరివెళ్ల 16,304

ఆళ్లగడ్డ 23,580

దొర్నిపాడు 13,500

ఉయ్యాలవాడ 12,168

చాగలమర్రి 8,276

రుద్రవరం 284

చివరికి మిగిలింది కన్నీరే!1
1/4

చివరికి మిగిలింది కన్నీరే!

చివరికి మిగిలింది కన్నీరే!2
2/4

చివరికి మిగిలింది కన్నీరే!

చివరికి మిగిలింది కన్నీరే!3
3/4

చివరికి మిగిలింది కన్నీరే!

చివరికి మిగిలింది కన్నీరే!4
4/4

చివరికి మిగిలింది కన్నీరే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement