
ఆకుమల్ల ఎద్దుల జయకేతనం
కృష్ణగిరి: ఎర్రితాత స్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా అమకతాడు గ్రామంలో సోమవారం ఎద్దుల పోటీలు నిర్వహించారు. బండలాగుడు పోటీల్లో 12 జతల ఎద్దులు పాల్గొన్నాయి. సంజామల మండలం ఆకుమల్ల గ్రామానికి చెందిన కాకర్ల నాగజ్యోతి ఎద్దులు ప్రఽథమస్థానంలో నిలిచాయి. మిగిలిన స్థానాలను ప్యాపిలి మండలం వెంగళాంపల్లి దర్శిత్, అనంతపురం జిల్లా తుర్కపల్లి అంకాల యాదవ్ ఎద్దులు దక్కించుకున్నాయి. గెలుపొందిన వారికి దాతల సహకారంతో వరుసగా రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు, రూ.7వేలు, రూ.5 వేలు, రూ.4వేలు, రూ.3,500లు అందజేశారు.