శ్రీగిరికి చేరువైన పాదయాత్ర భక్తులు
కన్నడ భక్తుల శివనామస్మరణతో శ్రీశైల క్షేత్రం మారుమోగుతోంది. ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తండోపతండాలుగా శ్రీగిరి చేరుకుంటున్నారు. నల్లమల మీదుగా పాదయాత్ర చేసుకుంటూ కై లాస ద్వారం చేరుకుని మల్లన్న చెంతకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. వేలాది మంది భక్తులు పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనానికి బారులుదీరుతున్నారు. కన్నడ భక్తులు మల్లన్న ను స్పర్శ దర్శనం చేసుకునేందుకు ఎంతో ఆరాట పడతారు. అందులో స్వామి వారి స్పర్శ దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో కన్నడ భక్తుల సౌకర్యార్థం ఈ నెల 26వ తేదీ వరకు మల్లన్న స్పర్శ దర్శనానికి అనుమతి కల్పించారు. అయితే మరో రెండు రోజుల్లో ముగిస్తుండడంతో కన్నడ భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అంతేకాకుండా క్షేత్రంలో భక్తులు పెరగడంతో మొబైల్ ఫోన్ సిగ్నల్స్ పని చేయడం లేదు. దీంతో భక్తులు సమాచారంతెలుసుకోక అవస్థలు పడుతున్నారు. – శ్రీశైలంటెంపుల్
శ్రీగిరి మల్లన్నా.. శరణు..శరణు!
శ్రీగిరి మల్లన్నా.. శరణు..శరణు!
శ్రీగిరి మల్లన్నా.. శరణు..శరణు!
శ్రీగిరి మల్లన్నా.. శరణు..శరణు!
శ్రీగిరి మల్లన్నా.. శరణు..శరణు!
శ్రీగిరి మల్లన్నా.. శరణు..శరణు!
శ్రీగిరి మల్లన్నా.. శరణు..శరణు!