క్రికెట్ బెట్టింగ్ జోలికెళితే కఠిన చర్యలు
బొమ్మలసత్రం: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ అమాయకులను మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సోమవారం హెచ్చరించారు. ఈ సందర్బంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐపీఎల్ క్రికెట్ 2025 నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలతో నిఘా పెంచామన్నారు. అమాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఎవరైనా డబ్బు ఆశ చూపించి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించబోమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గమనిస్తూ ఉండాలన్నారు. బెట్టింగులకు పాల్పడుతున్నట్లు గుర్తిస్తే వారికి నచ్చచెప్పి ఆ ఊబిలో నుండి బయటకు తీసుకురావాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే డయల్ 100/112కు సమాచారమివ్వాలన్నారు. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
పీజీఆర్‌ఎస్‌లో 62 ఫిర్యాదులు
స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అదిరాజ్‌సింగ్‌రాణా ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో 62 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో సమస్యలు తెలిపేందుకు జిల్లాలోని నలుమూలల నుంచి వినతులు అందాయన్నారు. వారి సమస్యలకు స్పందించి ఆయా స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి కొన్ని సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపామన్నారు. పీజీఆర్‌ఎస్ ద్వారా అందిన ఫిర్యాదులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వాటిని పునరావృతం కాకుండా చూ డాలని అధికారులను ఆదేశించామన్నారు. జిల్లా పోలీ స్ కార్యాలయంలో ఫిర్యాదులు ఇచ్చే వారు సుదూర ప్రాంతాల నుంచి రానవసరం లేకుండా స్థానిక పోలీస్టేషన్లలో వినతులు ఇచ్చి పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ మందా జావళి, అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు పాల్గొన్నారు.