‘అవుకు’లో తగ్గిన నీటిమట్టం
అవుకు: రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. సామర్థ్యం 4.168 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.67 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎస్సార్బీసీ నుంచి అవుకు రిజార్వయర్‌కు 450 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. సాగునీటి కోసం ఎస్సార్బీసీ 13వ బ్లాక్ కాలువకు 380 క్యూసెక్కుల వదులుతున్నారు. పాలేరు, తిమ్మరాజు చెరువుల నుంచి 60 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో ఉంది. పంటల సాగుకు సరిపడా నీరు అందుతోందని ఎస్‌ఆర్‌బీసీ ఈఈ సురేష్ బాబు తెలిపారు.
హుండీ ఆదాయం
రూ. 39.23 లక్షలు
మహానంది: హుండీల్లో కానుకలు లెక్కించగా మహానందీశ్వరస్వామికి రూ. 39.23లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక అభిషేక మండపంలో గురువారం శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లతో పాటు అన్నప్రసాదం, గోసంరక్షణ విభాగాల్లోని హుండీ కానుకలను లెక్కించారు. ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ హరిచంద్రారెడ్డి, ఏఈఓ ఎరమల మధు, సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, దేవిక, ఇన్‌స్పెక్టర్లు నాగమల్లయ్య, సుబ్బారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ఉచిత డీఎస్సీ శిక్షణకు రెండో జాబితా
నంద్యాల(అర్బన్): మెగా డీఎస్సీ ఫ్రీ కోచింగ్‌కు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి రెండో జాబితా విడుదలైందని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారిణి చింతామణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల వివరాలు వెబ్‌పోర్టల్ https:// mdfc. apcfss. in లోతెలుసుకోవచ్చన్నారు. ఉచిత డీఎస్సీ కోసం శిక్షణ సంస్థలను అభ్యర్థులు తమ లాగిన్‌లో ఎంపిక చేసుకోవాలని పేర్కొన్నారు. మొదటి జాబితాలో ఎంపికై న అభ్యర్థుల శిక్షణ సంస్థలను మార్పు చేసుకునేందుకు అనుమతి లేదని తెలిపారు.
‘ప్రభుత్వ ఇఫ్తార్ విందును బహిష్కరిద్దాం’
నంద్యాల(వ్యవసాయం): రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందును ముస్లింలు బహిష్కరించాలని నంద్యాల ముస్లిం జేఏసీ నాయకులు కన్వీనర్ అబ్దుల్లా మౌలానా, అబ్దుల్ సమాద్ అన్నారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గురువారం వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లుపై టీడీపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదని, నిరసనగా ఇఫ్తార్ విందును బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అబులైజ్, బాబాఫకృద్దీన్, ఇజస్ హుస్సేన్, మస్తానుఖాన్‌బాషా, మునీర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
29న ఇఫ్తార్ విందు
నంద్యాల(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నంద్యాల టౌన్‌హాల్‌లో ఈనెల 29న సాయంత్రం 6గంటలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి సబిహాపర్వీన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
‘అవుకు’లో తగ్గిన నీటిమట్టం
‘అవుకు’లో తగ్గిన నీటిమట్టం