గాలిబుడగ జీవితం.. బతుకు నిత్య పోరాటం! | - | Sakshi
Sakshi News home page

గాలిబుడగ జీవితం.. బతుకు నిత్య పోరాటం!

Apr 12 2025 2:46 AM | Updated on Apr 12 2025 2:46 AM

గాలిబ

గాలిబుడగ జీవితం.. బతుకు నిత్య పోరాటం!

చంకలో చిన్న పిల్లలు..చేతిలో నీటి బుడగల గన్స్‌.. ఒకవైపు పిల్లలను ఆడిస్తూ, ఓదారుస్తున్నారు. ఇదే సమయంలో చిరు వ్యాపారం చేస్తూ ఆత్మాభిమానం చాటుతున్నారు. రోజూ నగరంలో ఎంతో మంది అన్ని అవయవాలు బాగున్నా రోడ్లలో బిచ్చమెత్తుకుంటున్న దృశ్యాలు కోకొల్లలు. ఎలాగోలా బతికేస్తున్నామని కాకుండా, ఎంతోకొంత కష్టపడి సంపాదించిన సొమ్ముతో గంజినీళ్లు తాగినా ఆత్మసంతృప్తి ఉంటుందనేందుకు వీళ్లే ఉదాహరణ. రాజస్థాన్‌వాసులు కిలోమీటర్ల దూరం ప్రయాణించి నగరంలోని రద్దీ ప్రాంతాల్లో వాటర్‌ బబుల్‌ గన్స్‌ విక్రయిస్తున్నారు. పెద్ద దుకాణాల్లో జీఎస్టీలు చెల్లించి, నిర్ణయించిన ధరకు కొనుగోలు చేస్తున్న వాళ్లలో సగం మందైనా ఇలాంటి వాళ్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, కర్నూలు

కుమారుడితో కలిసి

విక్రయాలు

కుమార్తెను చంకనెత్తుకొని వాటర్‌ బబుల్‌ గన్స్‌ విక్రయిస్తున్న మహిళ

గొర్రెల కాపరి ఆత్మహత్య

దేవనకొండ: మండల కేంద్రమైన దేవనకొండకు చెందిన గొర్రెల కాపరి తలారి లక్ష్మన్న(41) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు.. రెండు నెలల నుంచి తలారి లక్ష్మన్న విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. అలాగే గొర్రె పిల్లలు కొనేందుకు రూ.5 లక్షలు అప్పు చేశాడు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు అప్పుల బాధ తాళలేక తీవ్ర మనస్తాపానికి గురై జీవితంపై విరక్తి చెంది శుక్రవారం తెల్లవారుజామున బైరవకుంట గ్రామ సమీపంలో వేపచెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వంశీనాథ్‌ తెలిపారు.

క్రెడిట్‌ కార్డు లావాదేవీలపై విచారణ

వెలుగోడు: స్నేహితులు, సమీప బంధువుల పేరిట క్రెడిట్‌ కార్డులు పొంది వాటి ద్వారా లావాదేవీలు జరిపిన యువకుడిని ఆత్మకూరు సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి విచారణ చేశారు. వెలుగోడుకు చెందిన తన్వీర్‌ అనే యువకుడు మొబైల్‌ దుకాణం, ప్రొక్లెయిన్‌ నడుపుతూ పలువురి పేర్లపై క్రెడిట్‌ కార్డు, లోన్‌ యాప్‌ల నుంచి దాదాపు రూ. 50 లక్షల వరకు లావాదేవీలు జరిపినట్లు సమాచా రం. కాగా ఈఎంఐలు సరిగా చెల్లించకపోవడంతో బ్యాంక్‌ ఉద్యోగులు ఆరా తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే బాధితులకు సమాచారం ఇచ్చారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో శుక్రవారం ఆత్మకూరు సీఐ సురేష్‌ కుమార్‌రెడ్డి వెలుగోడుకు చేరుకుని తన్వీర్‌ను విచారించారు. అయితే యువకుడు అక్రమాలకు పాల్పడలేదని వారి బంధువులు, మిత్రుల సహకారంతో క్రెడిట్‌ కార్డులతో రుణాలు తీసు కుని లావాదేవీలు జరుపుతున్నాడన్నారు. ప్రస్తుతానికి రూ 11,50,000 చెల్లించాల్సి ఉందన్నారు. వారం రోజుల్లో రుణాలు చెల్లించి క్రెడిట్‌ కార్డులను ఇచ్చేస్తానని తన్వీర్‌ పోలీసుల ఎదుట ఒప్పుకోవడంతో బాధితులు సైతం సరైన అంటూ వెళ్లిపోయారు.

పట్టపగలే చోరీ

ఆదోని అర్బన్‌: స్థానిక రాజీవ్‌గాంధీ కాలనీ సమీపంలోని జంగాల కాలనీలో నివాసముంటున్న గోపాల్‌, రాధ దంపతుల ఇంట్లో శుక్రవారం పట్టపగలే చోరీ జరిగింది. దంపతులిద్దరూ ఉదయం పనుల కోసం ఇంటికి తాళాలు వేసి వెళ్లారు. మధ్యాహ్నం భోజనానికి తిరిగి ఇంటికి వచ్చేలోగా చోరీ జరిగింది. బీరువాలో ఉన్న తులం బంగారం, రూ.7 వేలు నగదు, 30 తులాల వెండి చోరీకి గురైందని బాధితులు తెలిపారు. వెంటనే టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

తుంగభద్రలో మహిళ మృతదేహం

కర్నూలు: స్థానిక రోజా వీధి శివారులో తుంగభద్ర నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటపడింది. సమాచారం మేరకు రెండో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని నీటిలో నుంచి వెలికితీశారు. ఆమె చేతిపై సూరయ్య రేణుక అనే పచ్చబొట్టు ఉంది. మొహం ఉబ్బిపోయి గుర్తు పట్టలేని విధంగా ఉంది. ఎర్రటి పూల డిజైన్‌ గల పంజాబీ డ్రస్సు, నల్లటి లోయర్‌ (ప్యాంటు) ధరించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. ఆచూకీ తెలిసినవారు 9121101060కు సమాచారమివ్వాలని రెండో పట్టణ సీఐ నాగరాజరావు సూచించారు.

గాలిబుడగ జీవితం.. బతుకు నిత్య పోరాటం!1
1/3

గాలిబుడగ జీవితం.. బతుకు నిత్య పోరాటం!

గాలిబుడగ జీవితం.. బతుకు నిత్య పోరాటం!2
2/3

గాలిబుడగ జీవితం.. బతుకు నిత్య పోరాటం!

గాలిబుడగ జీవితం.. బతుకు నిత్య పోరాటం!3
3/3

గాలిబుడగ జీవితం.. బతుకు నిత్య పోరాటం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement